Aug 27, 2013

భారతీయ ఉత్సవం 2013

మొన్న శనివారం మా ఊళ్ళో భారతీయ ఉత్సవం జరిగింది. ఇది పదొవ వార్షికోత్సవం అన్నమాట.
ప్రతీఏటా భారతీయ ఉత్సవం జరిపి, భారతీయ భోజనం, గోరింటాకు, చీరలు, ఇలాంటి తతంగం నిర్వహించటం జరుగుతూ వస్తున్నది. ఇంతక మునుపు నేను పెద్దగా పాల్గొనకపోయినా ఈఏడు మిత్రుల ఆహ్వానం నెల ముందే అందింది. భాస్కర్/హరిత దోశలు పోసే లిస్టులోకి చేరుకున్నారు దోశాస్టాల్లో. దోశ స్టాల్, స్నాక్ స్టాల్, పూరి స్టాల్, స్వీట్స్ స్టాల్, డిజర్ట్ స్టాల్, మాంసాహర స్టాల్, ఛాట్ స్టాల్, బజ్జీల స్టాల్ ఇలా అనేక స్టాల్స్ పెట్టి కొనుగోలుదారులను ఆకర్షించినారన్న మాట.
నెలముందు దక్షిణభారత ఉత్సవం చేసినప్పుడు మా మేడంగారూ నేనూ వంటగదిలోకి దూరి వీరావేశంతో దోశలు పోస్తుంటే కొందరు పెద్ద తలకాయలు గమనించి ఓహ్! భాస్కర్/హరిత భారతీయ ఉత్సవంలో దోశలు పోయగలరు అనేస్కుని మన నెంబర్లు గట్రా తీస్కున్నారు. ఈ భారతీయ ఉత్సవానికి ఓ వారం ముందు మనకి కాల్. అయ్యా! ఓ నాలుగు యల్.బి ల గాజరగడ్డ హల్వా, ఓ పెద్ద ట్రే నిండా దోశల్లోకి పచ్చడి చేసి ఇవ్వండి, అలానే, ఉత్సవంరోజున పీక్ అవర్లో ఓ గంట శ్రమదానం చేయండి అని. సదరు దోశ స్టాల్ నిర్వాహకురాలు గారికి నా సలహా, అమ్మా! భాస్కర్/హరిత అని ఇద్దర్నీ ఒకే స్లాట్లో వేశారు. భాస్కర్ ఒక్కడే కూడా అట్లు వేయగలడు, దోశలు పోయగలడు అని. వారు ఓహో! అలాగయితే హరిత గారు పీక్ అవర్లో ఓ గంట వేస్తే, మీరు తర్వాత జాయిన్ అవ్వండి అన్నారు.
అదన్నమాట! అలా మొత్తానికి ఓ గంటా గంటన్నర దోశలు పోసి అట్లు వేసి సేవచేసి, అయ్యాక పందిళ్ళన్నీ పీకి సర్ది భారతీయ ఉత్సవాన్ని సుసంపన్నం చేశాం.
ఇలా భోజనాన్ని తదితర సేవలని అమ్మగా వచ్చిన ధనాన్ని ఒక్కోఏడు ఒక్కో చారిటబుల్ ట్రస్ట్ కి అందివ్వటం పరిపాటి. ఈ ఏడు రెండు ఛారిటబుల్ ట్రస్టులకు అందివ్వనున్నారు. మంచి విషయం కదూ?

Aug 13, 2013

కొషర్ జిలాటిన్

యొప్లైట్ లాంటి యోగర్ట్ కొనేప్పుడు కంటెంట్స్ చూసి కొనుక్కోటం మంచిది. యోప్లైట్ యోగర్ట్ లో కొషర్ జిలాటిన్ ఉంటుంది. యొప్లైట్ వాడి సైట్లో ఇలా ఉంది -
Why does Yoplait use gelatin?
Gelatin gives consistency and texture to yogurt and Yoplait uses kosher gelatin that's beef-derived. Yoplait yogurt carries KD (Kosher Dairy) Certification, certified by Rabbi Barnett Hasden.
అనగా! సదరు జిలాటిన్ అనేది ఆవు మాంసం నుండి రాబడినది.
యోప్లైట్ వాడిదగ్గరే ఈ కింది సమాచారం కూడా ఉన్నది -
Yoplait Greek 100 is a great option for those looking for a gelatin-free Yoplait option.

శాకాహారులకు ఇది చిన్న హెచ్చరిక! కొనుక్కునేప్పుడు గమనించి కొనుక్కుంటే మంచిది.

జై హింద్

Aug 8, 2013

రాహు త్యాగరాజు స్టేట్


_వంశపారంపర్య పాలనకు చెక్ చెప్పేందుకు రాహుల్ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారని ఏఐసిసి కార్యదర్శి జీవన్ వాల్మీకి చెప్పార #ట_

రాహు పేరు త్యాగరాజు అనిపెట్టుంటె ఎంత బాగుండేడ్చేదో

వాళ్ళ అమ్మ సాని'యా త్యాగాలు
వాళ్ళ సిస్టరు త్యాగాలు
వాళ్ళ నాన్న త్యాగాలు
వాళ్ళ బావ త్యాగాలు
బాబోయ్
సివరాకరికి వీడు *స్టేటు త్యాగాలు* లేక *త్యాగం అనే  స్టేట్* లో మునిగిపోయాడు.
వయసు గోలపెడుతున్నా
మనసు ప్రేమకోసం మూలుగుతున్నా
సాయంత్రం ఓద్కా గొంతులోకి గదిగుతూ  కోర్కిలను రేపుతున్నా
పక్కనోళ్ళు పెండ్లిళ్ళు సేస్కుని పిల్లల్ని కంటున్నా
సెదరకుంటా
బెదరకుంటా
ఆ  త్యాగం అనే  ఓ  స్టేట్లోకి ఎల్లిపోయి
దేశంకోసం
తన దేశం అనే స్టేట్ కోసం
తన ఎస్టేట్ కోసం
తన స్టేట్ అనే దేశంకోసం
పెండ్లికూడక చేస్కోకుంటా
జీవితాన్ని ధారపోసినాడంటే
అడ్డెడ్డెడ్డెడ్డే!!!!