సూరిగాడికి అనేక పిచ్చులు ఉన్నాయి. వాటిల్లో అత్యంత గొప్ప పిచ్చి పజిల్స్! చిన్నప్పుడు మూడేళ్ళ వయసప్పుడనుకుంటా, మికీ మౌస్ పజిల్ తెచ్చిచ్చాను. ఇరువదినాలుగు పీసులు ఉండే పజిల్ అన్నమాట. మొదలెట్టాడు ఏకాగ్రతతో! మొత్తానికి సాధించినాడు. వాడి ఇంటరెస్ట్ చూసి, వాడి ఇంటరెస్టుని ఉత్సాహపరుద్దాం అనిపించింది. ఓరోజు టాయిస్-స-రస్ కి వెళ్తే మెలీసా అండ్ డగ్ వాళ్ళ పజిల్స్ సేల్లో ఉంటే కొన్నా ఈ బొమ్మలో పజిల్. రెండడుగుల వెడల్పు, మూడడుగుల పొడవు ఉండే అండర్ వాటర్ పజిల్, వంద పీసులు ఉండేది. ఆరు డాలర్లకో ఏమో సేల్లో ఉంటే కొన్నాను.
ఈపజిల్ని ఏ వెయ్యిసార్లు పెట్టుంటాడో! భారత్ వెళ్ళేప్పుడు తీసుకెళ్ళి అక్కడా పెట్టినాడు. ఎంత పిచ్చి అంటే, అదే పని. ఇటు పెట్టను, పీకి మళ్ళీ మరోవైపు పెట్టను.Jun 25, 2013
సూరిగాడి పిచ్చి
Labels:
ఆలోచన,
పిల్లకాయలు,
సిత్రకళ,
సూరీడు,
సృజనాత్మకత
Subscribe to:
Posts (Atom)