Nov 1, 2011

సోనియాగాంధీకి భారతరత్న

సోనియాగాంధీకి భారతరత్న కోసం డిమాండు చేస్తా : శంకర్రావు

సోనియా గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబంట. నెహ్రూ నుంచి రాహు గాంధీ వరకు ప్రజల కోసమే ఆ కుటుంబం అంకితంట. సోనియా గాంధి దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసిందట. ఆమెకు భారతరత్న ఇవ్వాలని రిపబ్లిక్ దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తాట్ట.

Gandhisonia05052007.jpg

సోనియా అష్టోత్తరం ఎవరైనా వ్రాసి ఇస్తే నేనూ రోజూ జపం చేస్తాను. దయుంచి పుణ్యం కట్టుకోండి.
పాపం!! మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన కొడుకులు ఏవైయ్యారో ఎవరికీ తెలియదు. వాళ్ళ పేర్ల వెనుక గాంధీ ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఆ గాంధీ పోయి ఈ గాంధీలు మన నెత్తిన పడ్డారు. వీరు చేసే త్యాగాలు ఎన్నో!! అవును. ఏం? ఎందుకివ్వకూడదూ? భారత రత్న ఇచ్చి తీరాల్సిందే. సోనియా గాంధీకి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే.
కాంగ్రేస్ ప్రభుత్వం ఈమెకి భారతరత్న ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గుండేని రాయి చేస్కోండి భారతీయులారా.

జైహో కాంగ్రేస్
జైహో గాంధీలు
జైహో సోనియా
జైహో రాహు
జైహో శంకర్రావు

11 comments:

  1. భారత రత్న ఎందుకూ? వుందిగా .... కోటి రతనాల వీణ, అందులోంచి ముందు నాలుగు వూడగొట్టి ఇచ్చేద్దాం కావాలంటే :)) ;)

    ReplyDelete
  2. ఇందిరకూ, రాజీవుకూ, సోనియమ్మకూ, రాహుకూ, ప్రియాంకకూ, రాబర్టుకూ, రాబర్టు తల్లితండ్రులకూ, రాహు గాడు డేటింగు చేసిన గరలు ప్రెండు కుటుంబాలన్నిటికీ, ఈళ్ళని సపోర్టింగు జేస్తున్న అందరు కుటుంబాలకూ భారత రత్న ఇవ్వాలని నా అభిప్రాయం

    ReplyDelete
  3. రాబర్ట్ కుటుంబ స్థితి

    His brother Richard Vadra was found dead in September 2003 at his Vasant Vihar residence, and his sister Michelle died in a car accident in 2001. His father Rajinder Vadra committed suicide[2][3] on 2 April 2009

    ముందు, అర్జెంటుగా వీడికివ్వాలి భారతరత్న

    ReplyDelete
  4. రాబర్ట్ వాద్రా కుటుంబమరణాలవెనుక ఏదో దాగుంది

    ReplyDelete
  5. సోనియాగాంధీకి భారతరత్న ఇస్తే నాకభ్యంతరం లేదుగానీ..
    ఫొటో మాత్రం భలేగా ఉంది.
    ఎంతయినా దొరసానమ్మ దొరసానమ్మే!

    ReplyDelete
  6. భాస్కర్ రామరాజు గారు: కరష్టు. అందరికీ ఒకేసారిచ్చేస్తే ఒక్కదెబ్బతో వదిలిపోతుంది. మనమూ ఎద్రుచూడఖ్ఖర్లేదు, అన్నేసి డేట్లు గుర్తుంచుకోనఖ్ఖర్లేదు. పనిలోపనిగా వీళ్ళ ఒక్కొక్కరిపేర్లు ఒక్క్కొక్క నగరానికి పెట్టి ఆయా నగరాల్లో నివశిస్తున్నవారిని పావనం చెయ్యాలి.

    ReplyDelete
  7. " ఆమెకు భారతరత్న ఇవ్వాలని రిపబ్లిక్ దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తాట్ట."

    నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. వీలయితే ఆస్కార్ కూడా ఇవ్వాలి.ఇంకేమయినా ఉంటే గుర్తుచేయండి అవీ డిమాండ్ చేద్దాం

    ReplyDelete
  8. నాపాపము నన్ను తినేయుగాక
    వెర్రి గొర్రెని వేపచెట్టు ఎక్కించు గాక
    ఫిరోజ్ గాంధీ పేరు మర్చిపోయిన ఈ గొర్రెను ఏస్పాదం పన్నించుగాక
    కాంగ్రేసు వారు నన్ను సమించు గాక

    ReplyDelete
  9. ఫిరోజ్ గాంధీని వాళ్ళే వదిలేశారు లెండి. సోనియమ్మని ప్రసన్నం చేసుకోవాలంటే సోనియా, రాజీవ్ ఆ తరువాతి తరాల భజన చేయాలి. మళ్ళీ ఇందిర, నెహ్రూ అంటే అమ్మగారికి నచ్చదు. కావాలంటే ప్రియాంక కొడుకుని కూడా కీర్తించవచ్చు.

    ReplyDelete
  10. :) అవును. అలాగే రాహుల్ తర్వాత మన ప్రధాన మంత్రి గా ప్రియాంక పిల్లల్లో ఎవరు వస్తారో ముందుగానే మనకి ప్రకటిస్తే ఇప్పటినించే వారికి కూడా భజన మొదలు పెట్టచ్చు. అన్ని రకాల బహుమతులకీ ఇప్పటినుంచే డిమాండ్ చేయవచ్చు. లేదా.. రాహుల్ కొడుకో,కూతురో వారికే ఇస్తాం అంటే ఎదురు చూపులు మొదలు పెట్టచ్చు.

    ReplyDelete
  11. రాహుల్‌కి పెళ్లయ్యే రాత లేనట్లుంది లెండి.

    ReplyDelete