Mar 7, 2007

అంకితం

"రామరాజు రమాకాంతరావు" మా స్వర్గీయ నాన్న గారి పేరు. ఆయన ఒక టీచరు. యెందరికో మార్గదర్శకులు, యెందరికో విద్య అనే వెలుగుని ప్రసాదించినవారు. ఒక లెక్కల మాష్టారు (School Asst) గా చాలా ఖ్యాతి గడించారు.ఆయన మొట్టమొదట దాచేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో లెక్కల బి.ఇడి గా, అటుతర్వాత పిడుగురాళ్ళ, మోర్జంపాడు, సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో లెక్కల బి.ఇడి గా పని చేసారు.చివరిగా నిడమర్రు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల కి ప్రధానోపాధ్యాయుడు గా పని చేసి, 2000 లో స్వచ్ఛెంద పదవీవిరమణ చేసారు. 2005 ఆగష్టు లో పరమపదించారు.ఒక ఉపాధ్యాయుడుగానేకాకా ఒక విశాల ధృక్పదంగల వ్యక్తిగా ఆయన కమ్యునిజం వైపు మొగ్గుచూపి కమ్మ్యునిష్టు పార్టీ అనుభందసంస్థ ఐన United Teachers Fedaration లో చేరి ఉపాధ్యాయ కులానికి సేవలు చేసారు.యెన్నో ఉపాధ్యాయ పోరాటాల్లో పాల్గొన్నారు.ఆయన నాకు తండ్రి, గురువు, దైవం.
ఈ బ్లాగు మా నాన్నగారికి అంకితం

7 comments:

  1. స్వాగతం.ఒక బ్లాగరు తండ్రి గురించి రాస్తున్నారు.మీరు తండ్రికి అంకితమంటున్నారు.చాలా ఆనందం గా వుంది.మంచి మంచి టపాలు రాస్తూ మమ్మలిని అలరించండి.

    ReplyDelete
  2. Hi Bhaskar Gaaru,

    My Name is Indrasena Reddy Gangasani.I was the student of Ramaakaanth master in Siripuram high school.He is a very very good man and very very good teacher.I got school first rank in SSC exams.I had been to your house once in Guntur.I felt very sad when I heard about the death of our beloved Master.May his soul rest in peace.
    I am coming to USA next month.Thanks for starting a blog on our beloved sir.

    Best Regards,
    IndraSena

    ReplyDelete
  3. ఇంద్రసేనా రెడ్డి
    ఏ సమచ్చరం పదోతరగతి పాసయ్యారు మీరూ? అమర్ వాళ్ళ బ్యాచా లేక అట్లూరి కోటేశ్వరర్రావ్ (డ్రిల్లు మాష్టారు సుబ్బారావు గారి అబ్బాయి) వాళ్ళ బ్యాచా?

    ReplyDelete
  4. atluri Koteswara rao(Drill Maaster abbayi) batch andi..1993 ssc passed out.

    ReplyDelete
  5. Let me know once you land in US. You can mail me to admin.websphere@gmail.com

    ReplyDelete