నిజం చెప్పాలంటే కార్యాలయానికి వెళ్ళే రోజుల్లో కొన్ని విషయాలలో చెప్పలేనంత ప్రగతిని సాధించాను. కొన్ని ముఖ్యమైన సూక్తాలు నేర్చుకున్నాను. అతిముఖ్యమైన ఉపనిషత్తులు నేర్చుకున్నాను. తైత్తిరీయ ఆరణ్యకంలోని ప్రథమ ప్రశ్న - అరుణప్రశ్న నేర్చుకోగలిగాను. నిజం చెప్పాలంటే అరుణ ప్రశ్న చాలా పెద్ద పాఠం. తైత్తిరీయ అరణ్యకంలోని సప్తమ అష్టమ నవమ ప్రశ్నలను తైత్తిరీయ ఉపనిషత్ అంటారు. అవి శీక్షావల్లి బ్రహ్మానందవల్లి భృగువల్లి. తైత్తిర్రియ ఆరణ్యకంలోని పదవ ప్రశ్నని మహా నారాయణ ఉపనిషత్ అంటారు.
విషయంలోకొస్తే కోవిడ్ నా అభ్యాసాన్ని కూల్చివేసింది అని చెప్పక తప్పదు. కోవిడ్ అంతా యూట్యూబ్ చూట్టానికే సరిపోయింది. సగం కారణం సమాజంలో కోవిడ్ కంటే దారుణంగా ప్రబలిన అపోహలు. అమ్మ భారత్ లో చిక్కుకుపోయి ఉండటం. అమ్మ చెప్పే వార్తలు ఉదంతాలు, అవి నిజమా అని మన వెతుకులాట. కనీసం అమ్మకి చెప్పగలగాలి కదా పలానీ వార్త నిజం అనో నిజం కాదనో. ఇంటంచి పనిచెసే రోజుల్లో చేతినిండా గంటలు గంటలు ఖాళీ సమయం ఉన్నా నిమిషం పొల్లుపోకుండా టంచనుగా యూట్యూబ్ చూట్టం. జర్నలిస్టు సాయి జర్నలిస్టు YNR జర్నలిస్టు గొట్టంగాడు జర్నలిస్టు బొంగోడు ఇదే కథ. అలానే రిపబ్లిక్ న్యూస్ NDTV న్యూస్ గాడిద గుడ్డు న్యూస్ జీవితం సరిపోలేదు.
మొత్తానికి కోవిడ్ మొత్తం యూట్యూబ్ కి అలవాటుపట్టం కోవిడ అయ్యాక వ్యసనంగా మారటం ఒక వరుసలో జరిగిపోయాయి.
వీటితో నేర్చుకునే సమయాన్నంతా నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ అస్సలు సమయం లేదు అనే ఓ నెపంతో భజన.
నేర్చుకోవాల్సిన అనేక విలువైన పాఠాలు చాలా ఆగిపోయాయి నా వైపు ఆశగా చూస్తూ ఏమో కదిలిస్తాడేమో అని.
అలా ఆగిపోయినవాటిల్లో ముఖ్యమైనవి:
మహా నారయణ ఉపనిషత్తు మొదలు పెట్టాను, ఆగిపోయింది
అచ్ఛిద్రం మొదలు పెట్టాను, ఆగిపోయింది
అశ్వమేధం మొదలు పెట్టాను, ఆగిపోయింది
రుద్ర క్రమ పాఠం మధ్యలోకి వచ్చాను, ఆగిపోయింది
రుద్ర ఘన పాఠం మొదలు పెట్టాను ఆగిపోయింది
రుద్ర పాఠానికి పదం క్రమం ఘనం చక్కగా నోట్సు రాసుకుందాం అని మొదలుపెట్టాను.... అదీ ఆగిపోయింది...
రుద్ర యంత్రం గీయాలి అనుకున్నా... ముందుకు పడలేదు అడుగు.
కొన్ని పాజిటివ్ ఎనర్జీ యంత్రాలు గీయాలని అనుకున్నా రుద్ర యంత్రం శ్రీ యంత్రం వారాహీ యంత్రం రాజ శ్యామల యంత్రం..
2025లో, ఆగిపోయిన నా అభ్యాసాన్ని తిరిగి మొదలు పెట్టాలని యూట్యూబ్ చట్రంలో ఇరుక్కుపోయిన పుఱ్ఱెని పట్టుకుని ఒక ఊపు ఊపి నిద్ర లేపాలనీ ఒక ధృడమైన నిర్ణయం తీస్కున్నాను.
ఇలా నిర్ణయం తీస్కోటానికి కారణం కూడా ఉంది. పోయినవారం చదివిన సుభాషితంలోని శ్లోకం
శ్లో. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః
కేవలం కూర్చుని కలగంటే ఏమీ కాదు, లేచి చేస్తేనే ఏదైనా సాధించగలం.
सुखार्थिनः कुतो विद्या नास्ति विद्यार्थिनः सुखम्।
सुखार्थी वा त्यजेद्विद्यां विद्यार्थी वा त्यजेत्सुखम्॥
प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनम् ।
तृतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यसि ॥