నా పుట్టినరోజుకి మా అన్నయ్య యాపిల్ వాచ్ బహుమతిగా పంపించాడు
ఇంట్లో శ్రీమతి గారికి సూరిగాడికి యాపిల్ వాచ్ ఎప్పట్నుంచో ఉన్నాయి.2018లో నేను సాంసంగ్ గాలక్సీ కొన్నాను. ఎంటేలుకి వెళ్ళినా పెట్టుకుని వెళ్ళే స్తాయికి ఎదిగాను. 2022లో ఉన్నట్టుండి పాపం నిమిషానికి ఒకసారి క్రాష్ అవ్వటం మొదలైంది. ఇక ఆ వాచ్ కి అంత్యక్రియలు కొత్త వాచ్ ఏది కొందాం అని చూస్తే amezfit అనే వాచ్ నచ్చి కొనుక్కున్నా.
రెండేళ్ళయ్యింది దాన్ని ధరించటం మొదలుపెట్టి, నాకు నచ్చింది. స్యాంసంగ్ అంత వర్సటైల్ కాకపోయినా!
పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య ఏరా నీకు యాపిల్ వాచ్ లేదు కదా, యాపిల్ ఎకొ సిస్టంలోని వాచ్ అయితే బాగుంటుంది పింపిస్తా ఉండూ అని పంపించాడు.
శ్రీమతి గారితో యాపిల్ వాచ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అసలు మనం యాపిల్ ని ఎప్పట్నుంచి మొదలు పెట్టాం అనే దగ్గరకి వెళ్ళింది
2008 అక్టోబర్ లో అనఘ పుట్టిండి. నవంబర్లో iPhone 3 కొన్నాను. iPhone గమ్మత్తు ఏంటంటే రిలీజ్ అయిన ఏడాది ఫోన్ ధర $999. అప్పట్లో యాపిల్ వాడు ATT తో కలసి అమ్మేవాడు.
గత 16 ఏళ్ళలో ఇప్పటికి iPhone 3 4 5 6 6s 7 8 10 10s xs 11 12 12max 12 max pro 13 max 13 max pro 14 max 15 max pro 16 max అయ్యాయి. అవికూడా నాలుగు ఫోన్లు అయ్యాయి. నలుగురికి నాలుగు అన్నమాట. ఒక $25000 అయ్యుండచ్చు కేవలం ఫోన్లకి
iPhone మొదలైనప్పటినుండి గుండు కొట్టించుకోటంలో కొత్తరకం మొదలైంది డేటాప్లాన్ రూపంలో. నెలకి $30. ఇప్పటికి 16 ఏళ్ళు. 16*12*30=5760, కేవలం ఒక ఫోన్ కి. ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని గుండ్లు.
దీనెమ్మ జీవితం యాపిల్ వాడికి ఏ జన్మలో ఋణపడ్డామో ఏమో ATT వాడి దగ్గర ఏ జన్మలో అప్పులు కొట్టేశామో ఏమోగానీ.... ఇప్పటికి ఒక $30 $35 వేల డాలర్లు కట్టి ఉంటాం