Daniele బడి నుంచి ఇంటికొచ్చింది.
అమ్మా! నాన్న ఏడీ అని డెవిడ్ కోసం ఇల్లంతా వెతుకుతూ అడిగింది
నాన్సీ పిల్లకేసి నిర్లక్ష్యంగా చూస్తూ
వచ్చి పాలు తాగు
మీ నాయన ఇంకో ముఫై ఏళ్ళవరకూ రాడు
అంది కసి నిండిన గొంతుకతో
మసిబారిపోయిన ఆలోచనలతో
ఇద్దరు మూడేళ్ళ కవల పిల్లలు తండ్రి మైక్ కోసం తపిస్తూ వెతుకుతున్నారు మూడు గదుల అపార్టుమెంటులో. సదరు తండ్రి యొక్క మారుతల్లి కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ
మీనాయన ఇంకరాని తీరాలకి వెళ్ళిపోయాడని చెప్పలేక గొంతు పొడారబోయి
చెప్పినా ఆ చిన్నారులకు అర్థంగాక
మైక్ ని చంపిన కేసులో డేవిడ్ కి 35 ఏళ్ళ జైలు శిక్ష
చంపినోడికీ పిల్లలున్నారు
చచ్చినోడికీ పిల్లలున్నారు
First 48 అనే ప్రోగ్రాం చూస్తూ
నా మనసు బాధతో మూలిగింది
విధిచేయు వింతలన్నీ
మతిలేని చేష్టలేనని
అన్న ఓ కవి నా మనసులో మెదిలాడు కవిత సాక్షిగా