Apr 14, 2018

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

ఇళయరాజా స్వరంలో ఓ రకమైన మార్దవం ఉంటుందని నాకనిపిస్తుంది. ఈపాట ఓ ఉదాహరణ. రాంగోపాల్ వర్మ తీసిన గాయం అనే సినిమాని అనేకసార్లు చూసానిదివరలో. గాయం సినిమాకి సీక్వెల్ వచ్చిందని విన్నా కానీ చూట్టం పడలేదు. ఈరోజు యూట్యూబులో దొరికితే చూట్టం మొదలెట్టాను.

1993 గాయంలో జగపతి బాబుకీ గాయం 2 లో జగపతి బాబుకీ తేడా ఉంది. వయసులో!

సినిమా మధ్యలో ఈ పాట.

కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా
కలసిన గుండెల్లో కలతలే కన్నారా
నిన్న మొన్న నీడల్లేనీతో ఉన్న సందెల్లే
ఈ వెతలుగ చెలరేగేనా
నాతో సాగే స్నేహం... నాలో రేపే శోకం
శాపంలాంటి దూరం... చూపించేనా తీరం
కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

ఏనాటిదో అనురాగం ఈనాడిలా పెనవేసే
పాదం సాగే ప్రతిచోట పాశం తానే అడుగేసే
మనసే మురిసే మలుపులలోన
వెతలే రగిలే ఎద లయలోన
మదిని వీడని మమతిదియని
మరి మరి ముడిపడగా
కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా


గాయం మాన్పే చెలిమేదో కాలం ఇలా కలిపేనా
గమ్యం చేరే తరుణాన గాలి వాన ఉరిమేనా
ఒడిని వెతికే సమయములోన
ధరణి కనని మది కుమిలేనా
వలచిన కథ వరము అవ్వనీ
చెరగని గురుతులుగా
కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా
కలసిన గుండెల్లో కలతలే కన్నారా
నిన్న మొన్న నీడల్లే నీతో ఉన్న సందెల్లే
ఈ వెతలుగ చెలరేగేనా
నాతో సాగే స్నేహం... నాలో రేపే శోకం
శాపంలాంటి దూరం... చూపించేనా తీరం
కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా

ఈ పాట రచయిత *వనమాలి*.
ఎవరయ్యా ఈయన అని సోధిస్తే ఈయన రాసిన ఈ పాట తగిలింది - ఆర్య 2 నుంచి

కరిగేలోగ ఈ క్షణం
గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం
అలలై పొంగే జ్ఞ్యాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై
ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ


పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయిందా
నా సగమే ఓ ప్రశ్న గా మారిందా
నేడీ బంధానికి పేరుందా
ఉంటే విడదీసే వీలుందా

ఈ పాటలో ఈ రచయిత ఆలోచన నాకు బాగా నచ్చింది. గాయం 2 లో పై పాట నాకు బాగా నచ్చింది