యధాప్రకారం స్కూల్ బస్సు దగ్గరకి వెళ్ళిన సూరిగాడు, అయిదునిమిషాల్లోపే మెసేజ్ పెట్టాడు. వాడికీమధ్య ఫోన్ (ఫోన్ అనటం మోటు ఈరోజున తెలుగు అందునా ఈనాడు ప్రపంచంలో. చరవణి అనాలి ట. ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉవాచ. అదికూడ చఱవాణి కాద ట) కొనిపెట్టాను. అవసరం అనిపించింది. లేట్ ఈవెనింగ్ క్లాసులు గట్రా. ఫోన్ చేతిలో ఉంటం మంచిది అనిపించింది. life360 అని ఒక అప్లికేషన్. అది వేస్తే, ఫోన్ ట్రాక్ చేయొచ్చు. ఏవైనా, వీడు బస్ స్టాండుకి వెళ్ళగానే మెసేజ్. అమ్మా! ఇక్కడ ఒకడు సిగరెట్ తాగుతున్నాడు అని. బడికెళ్ళినాక టీచరుకి చెప్పనా అంటాడు. ఏంచెప్పాలో పాలుపోలేదు.
రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి మనసులో.
వద్దన్న పని చేయటం ఒక ఆనందం ఇవ్వచ్చు. ఆ పిల్లాడి తలితండ్రులు ఆ పిల్లాడు ఈక్వేషన్ అతన్ని ప్రేరేపించి ఉండచ్చు.
సిగరెట్టు తాగటం ఒక హీరోయిజం అని అతన్ని ఎవరో లేక అతను ఆరాధించే ఓ వ్యక్తి ప్రేరేపించి ఉండచ్చు.
తల్లో తండ్రో అతను తాగేలా ప్రేరేపించి ఉండచ్చు.
సూరిగాడు మెసేజ్ చూసినాక బడికి కాల్ చేసినాను. "మీకు ఇలా కంప్లైంట్ చేయొచ్చో లేదో తెలీదు, మీ దృష్టికి తేవటం నా కర్తవ్యం అని మీకు కాల్ చేస్తున్నాను. మా పిల్లాడు బస్సు ఎక్కే దగ్గర ఎవడో ఇలా స్మోక్ చేస్తున్నడట." అని చేబితే ఆమె ఒక పాయింట్ చెప్పింది "బడిలోగానీ, బడి పరిసరాల్లోగానీ, లేక బస్సులోగానీ స్మోక్ చేస్తే అప్పుడు మేమేమన్నా చేయగలుగుతాం."
కరెక్టే
బడివాళ్ళు చెప్పింది కరెక్టే!
ఒక్కసారి నా యంసియే రోజులు గుర్తుకొచ్చాయి. నిజాయితీగా చెప్తే బస్సులో సిగరెట్ తాగిన సందర్భాలు కోకొల్లలు. అవన్నీ హీరోయిజంకోసం అనుకుందాం. కాని ఇంత చిన్నవయసులో తాగటం - అనారోగ్యం అని నా భావన అలా ఉంచితే మిగతా పిల్లల మీద ఆ ప్రభావం పడుతుందేమో అని ఇంకో భయం.
Feb 11, 2018
Feb 9, 2018
స్లీపోవర్
పిల్లలీమధ్య పిల్లలున్న వాళ్ళు ఎవరు ఇంటికొచ్చినా స్లీపోవర్కి ఉంటారా అని అడుగుతున్నారు. ముఖ్యంగా అనఘ. తన మిత్రురాళ్ళ బృందంలో ఎవరొచ్చినా స్లీపోవర్కి ఉండండి, ఉండనివ్వండీ అని వచ్చిన తల్లితండ్రుల్ని, ఉండమని చెప్పండి అని మమ్మల్ని పోరుతున్నారు.
బాగనే ఉన్నా ఇది ఎక్కడన్నా వికటిస్తుందేమో ఎక్కడో ఓ భయం. ఆ భయానికి మూలం ఓ మితృడి ద్వారా విన్న ఒక సంఘటన!
ఒక దేశీ తెలుగు కుటుంబం
ఇద్దరే పిల్లలు
పన్నెండేళ్ళ అమ్మాయి
చిన్న పిల్లాడు
చిన్న పిల్లాడు
ఒకానొక రోజున అమ్మాయి తన స్నేహితురాలింటికి స్లీపోవర్కి వెళ్ళింది. సదరు స్నేహితురాలు తెల్ల వాళ్ళు.
ఎలా జరిగిందో తెలీదు
ఏమైందో తెలీదు
కొంతకాలానికి స్లీపోవర్కి వెళ్ళిన తెలుగమ్మాయి గర్భవతి అయ్యింది... ఎవరు అని ఆరాతీస్తే తెల్లమ్మాయి తండ్రి అని తెలిసింది
తర్వాత ఏవైంది అనేది అనవసరం....
Labels:
ఆలోచన,
నా దృష్టిలో,
పచ్చిమం,
పిల్లకాయలు,
పోకడ,
బాధ,
సమాజం
Subscribe to:
Posts (Atom)