Apr 4, 2013
పోతురాజు వెంకటశరత్‌కుమార్
ఈనాడు, గుంటూరు: గుంటూరు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు పోతురాజు వెంకటశరత్‌కుమార్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అదృశ్యమైన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. గుంటూరు నగరం ఎ.టి. అగ్రహారానికి చెందిన విశ్రాంత ఏసీటీఓ వెంకట కృష్ణమూర్తి కుమారుడు శరత్‌కుమార్ గత కొన్నేళ్లుగా అమెరికాలో టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే ప్రేమ వివాహం చేసుకొని స్థిరపడ్డారు. శరత్‌కుమార్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని ఆయన తండ్రి కృష్ణమూర్తి గుంటూరు ఎస్పీ ఆకే రవికృష్ణకు మంగళవారం ఫిర్యాదు చేయడంతో అదృశ్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల కిందట తన బాబాయి కుమార్తె వివాహానికి శరత్‌కుమార్ గుంటూరుకు వచ్చి వెళ్లారని తండ్రి వెంకట కృష్ణమూర్తి చెప్పారు. ఇటీవల అమెరికాలో గుంటూరు నుంచి వెళ్లిన బంధువులతో తనకుమారుడు ఆదివారం విహారయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత అతనితో పాటు వెళ్లిన వారంతా తిరిగి బస్సులోకి వచ్చినా, శరత్ రాకపోవడంతో బంధువులు, స్నేహితులు కంగారుపడ్డారు. ఆఖరిగా పర్యటించిన పార్కు వద్దకు వెళ్లి పరిశీలించారు. చుట్టుపక్కల గాలించారు. కానీ జాడలేక పోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Subscribe to:
Posts (Atom)