May 6, 2010

రాజన్ నాగేంద్ర


రెండు వారాల క్రితం, ఈనాడు టీవీలో పాడుతా తీయగా కార్యక్రమానికి రాజన్ ముఖ్యఅతిధిగా ఓ రెండు ఎపిసోళ్ళు ప్రసారం అయ్యయి. రెండో ఎపిసోడ్లో పార్టిసిపెంట్స్ పాడిన కొన్ని పాటలు ఇవి -

చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై
పోయి..కడలిగా పొంగు..

నీ ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...

నదివి
నీవు..కడలి నేను..
మరచిపోబోకుమా
..మమత నీవే సుమా...!


చినుకులా
రాలి..నదులుగా సాగి..
వరదలై
పోయి..కడలిగా పొంగు..
నీ
ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...!


ఆకులు రాలే వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే...
కుంకుమ
పూసే వేకువ నీవై.. తేవాలి ఓదార్పులే...
ప్రేమలు
కోరే జన్మలోనే నే వేచి ఉంటానులే...
జన్మలు
తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే.. వెల్లువౌతానులే...!

హిమములా
రాలి.. సుమముల పూసి...
ఋతు
వులై నవ్వి.. మధువులై పొంగి...
నీ
ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...
శిశిరమైనా
.. శిథిలమైనా.. విడిచిపోబోకుమా.. విరహమైపోకుమా...!


తొలకరి
కోసం తొడిమను నేనై.. అల్లాడుతున్నానులే...
పులకరమూదే
పువ్వుల కోసం.. వేసారుతున్నానులే...
నింగికి
నెల అంటిసలాడే.. ఆ పొద్దు రావాలిలే...
పున్నమి
నేడై.. రేపటి నీడై.. ఆ ముద్దు తీరాలిలే.. తీరాలు చేరాలిలే...
!

మౌనమై
వెలసి.. గానమై పిలిచి...
కలలతో
అలసి.. గగనమై ఎగసి...
ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ...
భువనమైనా
.. గగనమైనా.. ప్రేమమయమే సుమా.. ప్రేమ మనమే సుమా...!


చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై
పోయి..కడలిగా పొంగు..
నీ
ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...
నదివి
నీవు..కడలి నేను..

మరచిపోబోకుమా..మమత నీవే సుమా...!


-----------------------------------------------------
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులలో నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మోజులలో నీ విరజాజులై

మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలె
ఈ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా....హాహా.......ఆ.......
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
అందిన పొందులోనె అందలేని విందులీయవె

కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా


-------------------------------
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల
చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

ఊపిరి తగిలిన వేళ నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
చూపులు రగిలిన వేళ
ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున

వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా

ఎదలో అందం ఎదుట
ఎదుటే వలచిన వనిత
నీ రాకతో
నా తోటలో
వెలసే వన దేవతా
కదిలే అందం కవితా
అది కౌగిలికొస్తే యువతా

నవతా... నవ్య మమత ఆ ఆ
వీణ వేణువైన ||

తనువు తహతహలాడాల
చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
-----------------------
మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
యే రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతానా హృదయ పరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
శతవసంతాల దశ దిషాంతాల సుమ సుగంధాల బ్రహ్మార నాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

జాబిలి కన్నా నా చెలి మిన్నా పులకింతలకే పూచిన పొన్నా

కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను
పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చెరగలనో
మనసున మామతై కడతేరగలనూ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం

కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమనీ
కలిసే దాకా అనుకోలేదు తీయని స్నేహమనీ

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ సరిగమ స్వర పారిజాతం

మానసవీణా మధుగీతం
మన సంసారం సంగీతం
సంసారం సంగీతం
సంసారం సంగీతం


అంతక ముందు ఎపిసోడు, ఈ ఎపిసోడు రెంటిలో, పంతులమ్మ అనే సినిమానుండి రెండు పాటలు వచ్చాయి ముందుకి.
ఎడారిలో కోయిలా
మానసవీణా మధుగీతం

పంతులమ్మ సినిమాకి దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు.

ఈ సినిమలో పాటలన్నీ హిట్ అనుకుంటా. పై రెండు, మూడోపాట నాకు అత్యంత ఇష్టమైన పాట.
సిరిమల్లె నీవే

విరిజల్లు కావే
వరదల్లె రావే
వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే
ఎదమీటి పోవే

ఎక్కడన్నా దొరికితే చూడాలి ఈ సినిమా.

ఇంతవరకూ బాగనే ఉంది కానీ, ఈ క్రింది కధ చదివాక, మనసు వికలమైంది.
రాజన్ నాగేంద్ర, వీరిద్దరూ సోదరులు.
దాదాము మూడొందల డెబ్భై సినిమలకు సంగీతం అందించారు.
వీరిద్దరీ మరియూ డా॥ రాజకుమార్ ల కాంబినేషన్లో అనెక హిట్ సినిమాలు వచ్చాయి.
నాగేంద్ర చనిపోయిన సంఘటన వివరాలు ఇవీ -
ఎవరిసినిమలకైతే సంగీతం అందించారో, ఆయన [డా।। రాజకుమార్] కిడ్నాప్ అయినప్పుడు జరిగిన బందులో నాగేంద్రకి ఆహారం అందలేదట.
సోదరుడు రాజన్ మోసం చేసాట్ట.
చనిపోయే నాటికి Rs 141 ఉన్నాయట ఆయన అకౌంటులో.

Nagendra's death

Nagendra, who gave Kannada cinema some of its most memorable hits, died in Bowring hospital at Bangalore on November 4th 2000. The man who, with brother Rajan, gave us flowing, rich scores, died a near pauper, with a bank balance of Rs 141 (a little more than three dollars). Their songs get the maximum requests on All India Radio, bringing in more royalties for recording companies than other composers.

Nagendra was admitted to Bowring Hospital for treatment of hernia three months ago. He later developed complications because of his high blood pressure and diabetes. His wife, carrying lunch for him when he was recuperating, couldn't reach the hospital because of the September 28 bundh prompted by Rajkumar's kidnapping. His condition got worse and he suffered a stroke.

For someone who had composed hit music for 335 films, Nagendra was in deep financial distress. He reportedly told his wife that he preferred a general ward, and that she should not seek help from the government. Hai Bangalore, the mass circulation Kannada tabloid, alleged in an article two weeks ago that Rajan had cheated the fiercely self-respecting Nagendra of his share of whatever money they had earned together.

Some composers, playback singers and live band singers who make a living by singing Rajan-Nagendra songs visited him in hospital, but there were no signs that anyone had given him any money.

Nagendra leaves his wife, his mother and a 12-year-old son. When a reporter met her at hospital, she is quoted to have said that Rajan had always handled all the finances and cheated her husband of his fair share.


వాన-(క)నీళ్ళు

మబ్బులున్నంత సేపే వాన
కష్టాలున్నంతసేపే కన్నీళ్ళు
కలకాలం వానపడదు
కన్నీళ్ళు కలకాలం ఉండవు
మబ్బులు విడిపోతే/వెళ్ళిపోతే నిర్మలమైన ఆకాశం
కష్టాలు తీరిపోతే ఆనందకరమైన జివితం
మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి మబ్బులు
మళ్ళీమళ్ళీ వస్తుంటాయి కష్టాలు
అదే జీవితం

May 5, 2010

ప్రాణ్యములు/మాంసకృత్తులు/ప్రొటీనులు

శరీరంలోని ప్రతీ కణం మాంసకృత్తుల మీద ఆధారపడుతుంది. మాంసకృత్తులు కండరాలకు, ప్రతీ అంగానికి గ్లాండ్స్ కు అన్నీటికీ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. శారీరక నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకి.

తెవికిలో ఇలా ఉంది -

మనం తినే ఆహారంలో ప్రాణ్యములు ముఖ్యంగా ఉండవలసిన పోషక పదార్ధాలు. నాణ్యతని బట్టి ఈ ప్రాణ్యములని రెండు వర్గాలుగా విడగొడతారు. ప్రధమ శ్రేణి ప్రాణ్యాలు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరులనుండి లభిస్తాయి. వీటిని ప్రధమ శ్రేణి అని ఎందుకు అన్నారంటే వీటన్నిటిలోనూ అత్యవసర నవామ్లాలు (essential amino acids) తప్పకుండా ఉంటాయి. మాంసాహారులు ఏ ఒక్క మాంసం తిన్నా అది సంపూర్ణ ఆహారంగా చెలామణీ అయిపోతుంది. ద్వితీయ శ్రేణి ప్రాణ్యాలు పప్పులు, కాయగూరలు, మొదలైన వాటిలో దొరికేవి. వీటిలో, ఏ ఒక్క దాంట్లోనూ, అత్యవసర నవామ్లాలు అన్నీ లభించవు. కనుక శాకాహారులు నాలుగు రకాల వస్తువులు ఒకే భోజనంలో తింటే తప్ప నవామ్లాలన్నీ సరఫరా కావు. పక్కా శాకాహారులు (pure vegetarians or vegans) - అంటే జంతు సంతతికి చెందిన పాలు, వగైరాలు కూడ ముట్టని వారు - పోషణ విషయంలో అప్రమత్తత తో ఉండాలి. పప్పు, అందులో నెయ్యి, కూర, పచ్చడి, పులుసు, పాలు, పెరుగు, మజ్జిగ మొదలయిన హంగులన్నీ ఉంటే కాని శాకాహారం సంపూర్ణం కాదు.

మనం మాంసం తిన్నా, పప్పు, అన్నం తిన్నా అవి తిన్నగా రక్తంలో ప్రవేశించవు. మనం తిన్న పోషక పదార్ధాలలో ఉన్న సారాన్ని గ్రహించి, దాన్ని ముడి పదార్ధంగా వాడి శరీరం తనకి కావలసిన ప్రాణ్యములని తనే తయారు చేసికొంటుంది. చాలా వరకు సూక్ష్మజీవులు, మొక్కలు అన్ని నవామ్లాలని తయారుచేసుకోగలవు. కాని జంతువులు మాత్రం వీటిలో కొన్నింటిని ఆహారం ద్వారా తీసుకోవలసి ఉంటుంది. ఈ అత్యవసర నవామ్లాలు కొన్నింటిని, అవసరం వెంబడి, తినే ఆహారంతో తప్పకుండా తీసుకోవాలి.


మనిషి శరీరానికి 22 రకాల అమీనో ఆమ్లాల కలబోతతో తయ్యారైన ప్రొటీను అవసరమట.
రెండు రకాల అమీనో ఆంమ్లాలట - అవసరమైనవి, అవసరంలేనివి. అవసరమైనవి శరీరం తయ్యారు చేకోలేదట. వీటిని పౌష్టికాహారం ద్వారా పొందాల్సిందేనట. నాన్ ఎసన్షియల్ అమీనో ఆంమ్లాలు శరీరం తయ్యరు చేస్కుంటుందట.
ప్రొటీనుల్లో రెండు రకాలు -
పూర్తి ప్రొటీను అ.క.అ కంప్లీట్ ప్రొటీన్ - ఎసన్షియల్ అనగా అవసరమైన అమీనో ఆంమ్లాలు కలిగినవి. గుడ్లు, పాలు, చేపలు, మాంసం, ఇత్యాదివాటి నుండి పొందవచ్చు
అసంపూర్ణ ప్రొటీను - కావల్సిన అమీనో ఆంమ్లాలన్నీ లేనిది. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు లాంటివి.

ఇది గమనించండి - బరువు తగ్గే మార్గంలో ప్రొటీను ఎక్కువ కార్బ్ లో అని తింటుంటే అది మూత్రపిండాలపై తీవ్ర ప్రతాపం చూపుతుందట.

మంచి ప్రొటీన్ మూలాలు -
బందికానాలో పెరగని కోళ్ళు, వాటి గుడ్లు
హార్మోనులు గట్రా ఇవ్వకుండా, యాంటై బైయాటిక్స్ ఇవ్వకుండా, సాధారణ స్థితుల్లో గడ్డి గాదెం తింటూ పెరిగిన వాటినుండి వచ్చిన మాంసం
పాశ్చరైజ్ చేయని, ముడి పాల ఉత్పత్తులు
సముద్రంలో సహజమైన కండీషన్స్ లో పెరిగే, మెర్కురీ లేని చేపలు
మొలకెత్తిన విత్తనాలు
బీన్స్
ముడి ధాన్యాలు

మరి బ్యాడ్ ప్రొటీన్ అనగానేమీ?
వ్యవసాయాధారిత పారిశ్రమల ఉత్పత్తులు పై గుడ్ ప్రొటీన్ ని బ్యాడ్ ప్రొటీన్ గా మారుస్తాయి.

ఉదహరణ -
ఒక ఎకరాకి పది జీవాలని పెంచలైతే, వంద జీవాల్ని కట్టేసి హార్మోన్స్ ఇచ్చి, అసహజ పద్ధతుల ద్వరా ఉత్పత్తి చెసే మాంసాహారాలు తక్కువ క్వాలిటీ ప్రొటీనుతో ఉంటాయట

బంధికానాలో పెంచబడే కోళ్ళు, సహజసిద్ధమైన ఆహారం పెట్టకుండా పెంచినవి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పెంచితే అనారోగ్యాలతో ఉంటాయి అవి, కలుషిత ఆహారంగా మారతాయి.

మీరు చదివే ఉంటారు -
మ్యాక్ డోనాల్డ్స్, కేయఫ్సి లాంటి పెద్ద పెద్ద కంపెణీలు అత్యంత హేయమైన కండీషన్స్ లో మాంసాన్ని ఉత్పత్తి చెస్తాయి.

ఫాం రైజ్ద్ చేపలు అసహజ వతావరణంలో పెంచబడినవాటిల్లో ఒమెగా-3 ఎసన్షియల్ ఫ్యాటీ ఆంలం అతి తక్కువ లేక అస్సలు లేకపోవతం కూడా జరుగుతుందట

May 3, 2010

సమతౌల్యం

ఇందాక దేనికోసమో గెలుకుతుంటే కొన్ని అత్యంత ముఖ్యమైన సూత్రాలు వాక్యాలూ తగిలాయ్. పంచుకుందామని వాటి సారం ఇక్కడ పెడుతున్నా.

మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, తినే తిండిలో ప్రొటీన్ మాత్రమే ముఖ్యం అనుకుంటారు. మాంసాహారం తింటే, అందులో అంతా ప్రొటీనేకదా, కార్బ్స్ ఉండవు కదా, అందుకే అది బెస్ట్ అనుకుంటారు.

ఐతే, అది తప్పు. మనిషికి కావల్సింది కేవలం ప్రొటీనే కాదు, దాంతోపాటు కార్బోహైడ్రేటులు అనగా పిండిపదార్ధాలు కూడా అవసరం. లో కార్బ్ ఇజ్ నో గుడ్. ఓన్లీ ప్రొటీన్ నో గుడ్.

ప్రొటీన్లో కూడా గుడ్ ప్రొటీన్ బ్యాడ్ ప్రొటీన్ ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్ లోకూడా గుడ్ కార్బ్స్ బ్యాడ్ కార్బ్స్ ఉంటాయి.
కొవ్వులో కూడా మంచివి చెడ్డవీ ఉంటాయి.

ఏది ఆరోగ్యకరమైన సమతౌల్యతా? అని అడగవచ్చు.
ప్రతీమనిషికీ ప్రొటీన్, కొవ్వు, పిండి పదార్ధాలు అత్యంత అవసరం. శరీరాన్నిబట్టి నిష్పత్తిలో తేడాలు ఉండవచ్చు. సాధారణంగా, సరాసరి, 40-30-30 అనేది రూలట.
అంటే మనం తినే ఆహారంలోంచి
40% శక్తి, అనగా కేలరీసు గుడ్ కార్బోహైడ్రేటులనుండి లభించాలి
30% ప్రొటీన్ నుండి.
30% కొవ్వు నుండి.
పిల్లలకి కొవ్వు ఎక్కువ అవసరం. వారి మెదడు పెరిగే వయసులో కొవ్వుల అవసరం ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటినుండే లో ఫ్యాట్ అని ఇస్తే అది మెదడుపై ప్రభావం చుపే అవకాశాలు ఉన్నాయట.

వేగన్స్ - చాలామంది వేగన్స్ లో, విటమినుల లోపం, మినరల్స్ అనగా ధాతువుల లోపం లాంటివి ఉంటాయట. కారణం సంపూర్ణ ప్రొటీను తీసుకోకపోవటం అట. ఈ లోపల వల్ల ఆస్టెయోపొరోసిస్, అనీమియా లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయట. బి 12 విటమిను డెఫిసియన్సీ ఉండే అవకాశం కూడా ఉందట.

కాబట్టి చక్కటి ఆహార సమతౌల్యత అనేది చాలా ముఖ్యం

ప్రొటీన్ -
గుడ్ ఏది, బ్యాడ్ ఏది?
మాంసాహరమే శరణ్యమా ప్రోటీన్ పొందటానికి?
ఎలాంటి సమతౌల్యం పాటిస్తే సంపూర్ణ ప్రొటీన్ పొందవచ్చూ?
కార్బ్స్ -
గుడ్ కార్బ్స్ ఏవి, బ్యాడ్ కార్బ్స్ ఏవి?
కొవ్వు -
గుడ్ కొవ్వు బ్యాడ్ కొవ్వు ఏంటీ?

ఒక్కోసారి ఒక్కోటి!!

May 1, 2010

శ్రీ మహా సుదర్శన యజ్ఞం

కేన్సస్ లోని "కేన్సస్ హిందూ దేవాలయ సంఘం" వారు, మే 16, 2010 న శ్రీ మహా సుదర్శన యజ్ఞం చేయనున్నారు.



మే 7 నుండి కార్యక్రమాలు మొదలు. రోజువారీ కార్యక్రమాల వివరాలు ఇక్కడ చూడవచ్చు


పాల్గొనదలచిన వారు గుడి పాలకవర్గాన్ని సంప్రదించి వివరాలను పొందవచ్చును. గుడి వెబ్సైటు -
http://htccofkc.org

Apr 29, 2010

కాపీ మానేసా

ఔను. నిజం. లేవంగనే బెడ్దు కాపీ తాగే అలవాటుంది కదా. మానేసా. ఆపీస్కెళ్ళంగనే కాపీ తాగే అలవాటుంది కదా. మానేసా. పొద్దున పాలు తాగుతున్నా, సిన్నపిల్లాళ్ళా.
ఆపీస్ కి రాంగనే కాకన్డా, పదికి, ఇదిగో ఈ కిన్ద సూపిచ్చిన వాటిల్లోంచి ఏదోకటి తాగుతున్నా



ఇలా కూడా సేస్కోవచ్చు -

నల భీమ పాకం http://nalabhima.blogspot.com/2010/04/blog-post_29.html

Apr 24, 2010

నీ బాసుని ఇర్గ తీయాలని ఉందా?

ఇగిగో ఇలా సాధన చెయ్యి.

ఇవి వీడు చెప్పిన రేంజిలో సగం చేసేప్పటికి నాకు కొంచెంసేపు కూకోవాలని అనిపించింది.
యూ కన్ డూ ఇట్...
యూ కెన్ డూ ఇట్...
కమాన్ డూ ఇట్...

Apr 23, 2010

అతిరుద్ర యజ్ఞం


నాలుగు రకాల రుద్ర పారాయణలు ఉన్నాయట.
రుద్రం
ఏకాదశ రుద్రం
మహా రుద్రం
అతి రుద్రం
కృష్ణయజుర్వేదం లో 4.5 వ అధ్యాయం నమకం, 4.7 వ అధ్యాయం చమకం, ఈ రెంటినీ కలిపి శ్రీ రుద్రప్రశ్న,శతరుద్రీయం, లేక రుద్రధ్యాయం అని కూడా అంటారు.
ఒకసారి నమక,చమకాలను పారాయణ చేయటాన్ని రుద్ర పారాయణ అంటారు.
ఏకాదశ రుద్రం అంటే 11 సార్లు నమకం, ఒక్కో నమకం తో చమకంలోని ఒక్కో అనువాకం చదవటాన్ని ఏకాదశ రుద్రం అంటారు. అంటే పదకుండు సార్లు నమకం, ఒక సారి చమకం మొత్తంమ్మీద.
ఇక మహారుద్రం - 121 ఎకాదశ రుద్రాలను మహా రుద్రం అంటారు. అంతే 11 * 121 = 1331 సార్లు రుద్ర నమకం, 121 సార్లు చకమం చదివినట్టన్నమాట.
ఇక అతి రుద్రం అంటే 11 మహా రుద్రాలను అతి రుద్రం అంటారన్నమాట. అనగా 14641 సార్లు నమకం, 1331 సార్లు చమకం చెయ్యటమన్నమాట.
న్యూయార్క్ రాష్ట్రంలోని రాచెస్టర్ అనే ఊళ్ళో శ్రీ రాజరాజేశ్వరీ పీఠం వారు ఈ ఏడాది జూలై 1 నుండి జూలై 10 వరకూ కుంభాభిషేకం నిర్వహించనున్నారు. కుంభాభిషేకం సందర్భంగా అతిరుద్ర యజ్ఞం చేయనున్నారు. మీలో ఎవరైనా పాల్గొన దలచిన పీఠం వారిని సంప్రదించి వివరాలు కనుక్కుని పాల్గొనవచ్చును
పీఠం వివరాలు -
www.srividya.org
6980/6970 East River Road,
Rush(Rochester), New York, 14543 •USA
Telephone: 1-585-533-1970

Apr 22, 2010

ఈ కధ చూడండి. భలే రంజుగాయుండును

ఓనాటి కాలంలో, మడిసి, ఓ *త్తో గునపమో లేక ఓ ఆయుధమో పట్టుకుని వేటాడి ఆ జంతువు నుండి ప్రొటీన్ని పొందేవాడు. టెక్నాలజీ పెరిగింది. రోజులు మారాయి. జంతువుల్ని వేటాడ్డం కన్నా, పెంచి పెద్దజేసి, వాటికి బాగా పుష్టి రాంగనే ఏసేసి అమ్మేస్తే అదో పెద్ద వ్యాపారం అవుతుందని నిరూపించాడు. ఇవ్వాళ్ళా రేపట్లో ఏ సీజన్లో ఐనా మామిడి పళ్ళు దొరికినట్టే, ఏ సీజన్లోనైనా మాంసం దొరుకుతుంది. అంటే, డిశెంబరు లాంటి గడ్డకట్టే చలిలోకూడా మాంసం దొరుకుతుంది.
ఇవ్వాళ్ళ పావుకిలో స్టీక్ తయ్యారుచేయటానికి వాడే గ్రాసం నలభైమందికి ఒకపూట పొట్టనింపుతుందని మీకు తెలుసా? ఆరోజుల్లో ఇలా బజారుకెళ్ళి అలా ఓ నాలుగు కిల్లోల ఆవు, రెండుకిలోల పంది తెచ్చేసేవాళ్ళు కాదుగా. ఆటికోసం ఎళ్ళాల వేటాడాల సంపాల అప్పుడు ఎత్తుకొచ్చుకోవాల. ఆవేళ సహజ సిద్ధంగా పెరిగే జంతువులను వేటాడితే ఇవేళ వాటిని పెంచి వధించటం చేస్తున్నారు, ఐతే, ఈ పెంచటం వల్ల, జరిగే నష్టాలు సానా ఉన్నాయంట.
కత ఏందంటే - డెవలప్డ్ దేశాలు, డెవలపింగ్ దేశాలతో ఎలా ఆటలాడతాయో ఓ మచ్చుకి ఉదాహరణ -
అమెరికా లాంటి దేశల్లో, మాంసం ఓ శాతం లోపల్లోపలే ఆవుల్ని పందుల్ని పెంచుకుని వధించి పొందితే, ఇంకొంత శాతం మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలనుండి దిగ్స్ మతుల్స్ చేసుకుంటారట.
బ్రసిల్ అనగా బ్రెజిల్ లాంటి దేశాల్లో, ఇలాంటి ఎగుమతులు చెసే కంపెనీలు మహా లాభాలు గడించేస్తున్నాయట. ఈ ఎగుమతులకోసం వీళ్ళు ఎంచుకునే జీవాలకి మాంచి కండ పుష్టి రావటంకోసం మాంచి దాణా తయ్యారుజేసి మేపుతున్నారట. ఇంతవరకూ బానే ఉంది. ఈ దాణాల్లో మిల్లెట్స్ అంటే చిన్న ఇత్తనాల రకాలు, ఒకరకమైన కాయధాన్యాలు ఎక్కువగా వాడాతారు. ఉదాహరణకి పిల్లిపెసర జొన్న సజ్జ లాంటివి. ఐతే ఇంకో లెక్కల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మిల్లెట్స్ అనేవి పేదవాడికి ప్రొటీన్ని అందించే ముఖ్యమైన మూలాలు. ఓ వైపు పేదోడికి ఆడి పిల్లలకి మాల్న్యూట్రీషన్ అనగా సరైన పౌష్టికాహారం అందకపోతుంటే, ఇంకోవైపు వాళ్ళ నోటిదగ్గరి చీప్ ప్రొటీన్ ని ఇలా పశువలకేసి లాభాలు గడిస్తున్నారు, అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రిల్డ్ స్టీకులు చేస్కుని పక్కన సక్కటి సుక్కతో నోట్టో దాచ్చా సుక్కతో ఆనందడోలికల్లో ఇహారాలు సేస్తున్నారు.

దీనిగురించి చాలా డీప్ గా రాయాలి. అప్పుడప్పుడు కొంత రాస్తుంటా....
తమ్ముడు సత్యంతో నిన్న మాట్లాడుతుంటే ఇయ్యాల్టి గ్లోబల్ వార్మింగ్ కి అభివృద్ధి చెందిన దేశాలే కారణం అన్నాడు. నిజమే. ఎలా? పై తెల్పిన కధలు కొన్ని మన వాతావరణనాన్ని ఏమన్నా ఎపెక్టు చెస్తున్నాయా అని అలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంద్దెచ్చా.

ఈరోజు ఎర్త్ డే. భూమి దినం.
నిజంగానే దినం పెడుతున్నాం మనం.
కాదని అనగలవా నేస్తం.
చెట్టు చేమల్ని నరికేసాం.
పుట్టా పిట్టల్ని దులిపేసాం.
అభివృద్ధి పేరున సిమెంటుని భోంచేస్తున్నాం.
దిక్కు తెలీయని పయనంలో పరులుదీస్తున్నాం.
వేడివేడి అని ఏసీలు ఆన్ చేస్తున్నాం.
వేడి ఎందుకు పెరుగుతుందో ఆలోచింపకున్నాం.
ఒక్కరుండే దగ్గర వెయ్యిమందిమి ఉంటున్నాం.
స్టేటసు కోసం వనరుల్ని ఖర్చుచేస్తున్నాం.
భూమితల్లి గుండెని పీకేసి మనమే దినం పెడుతున్నాం.

Apr 20, 2010

బాలసుబ్రహ్మణ్యం కంట నీరు

ఈపూట ఈనాడు-టీవీ వారి పాడుతా తీయగాలో ఓ పిల్లకాయ ఈ క్రిందిపాట పాడాడు.


ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..రాగమొకటి లేక తెగిన తీగవంటిదే

ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే శిల అయితే మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూతరగిలింది ఈ రాలుపూతా
విధిరాతచేతా
నా స్వర్ణసీతా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ ! కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాటచేదైన ఒక తీపి పాటా
చెలిలేని పాటా
ఒక చేదుపాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పాట రాసిది వేటూరి గారు
సగీతం రాజన్-నాగేంద్ర

ఇవ్వాల్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజన్ గారు వచ్చారు. ఆయన్తో బాలసుబ్రహ్మణ్యం, కళ్ళు ఒత్తుకుంటూ, ఇలా అన్నారు "ఈ పాట వింటే నాకు దఃఖం ఆగదు, ఇలాంటి పాటలు నాతో పాడించినందుకు కన్నీటీతో మీకు పాదాభివందనం చేస్తున్నా".

ఇదే కార్యక్రమంలో ఒక పిల్లకాయ ఈ పాట పాడుతున్నాడు
నీలి మేఘమాలవో నీలాల తారవో
ఈ పాటని శ్రీ ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారు పాడారు. ఇది హిందీలో కీ।శే॥ రఫీ గారు పాడారు.
చౌదవీం కా చాఁద్ హొ, యా ఆఫతాబ్ హొ
జొ భీ హొ తుమ్ ఖుదా కి కసమ్, లాజవాబ్ హొ

ఏంపాటలు గురూ!! రాజన్ నాగేంద్ర గార్లకు ఓ సారి జైహో

Apr 17, 2010

తొంభై రోజుల్లో దుమ్ములేపొచ్చంట మిత్రమా

అమ్రికాలో P90X గురించి ఓ పెద్ద చెప్పాల్సిన పని ల్యా. ప్రతీతోజూ కాకపోయినా అప్పుడో ఇప్పుడో వీడి ప్రకటన వస్తూనే ఉంటుంది.
వీడేమంటాడంటే, ఇంట్లోనే రోజుకి ఓ గంట గనక కేటాయిస్తే, బఱువును శుబ్బణంగా తగ్గించేస్కుని, చక్కటి శరీరాకృతిని పొందొచ్చని.
మొదటి ముప్ఫైరోజులు ఒకరకంగా చేస్తే, శరీరం వాటికి అలవాటైయ్యేలోపు ఇంకో రకంగా మొదలుపెడతాడు.
అలా ముఫై రోజులకొకసారి ప్యాటర్న్ మారుస్తూ శరీరాన్ని సింపేసి సేట సేసేస్తాడన్నమాట.
వీడిలెక్క ప్రకారం ఇంట్లో కావాల్సిన వ్యాయామ సాధనాలు కూడా ఓ పెద్ద ఏమీలేవు, డంబెల్స్, యోగా సాప, పుల్ అప్ బార్ అంతే.
వీడివి మొత్తం పన్నెండు రకాల డీవీడీలు ఉన్నాయి.
P90X - 01 Chest & Back
Targeted strength and definition workout emphasizes two classic upper-body exercises.

P90X - 02 Plyometrics
02 Plyometrics
Explosive jumping cardio routine proven to dramatically improve athletic performance.

P90X - 03 Shoulders & Arms
03 Shoulders & Arms
Potent combination of pressing, curling, and fly movements, that will leave you stronger.

P90X - 04 Yoga X
04 Yoga X
Combines strength, balance, flexibility, and breath work to enhance your physique and calm your mind.

P90X - 05 Legs & Back
05 Legs & Back
Get ready to squat, lunge, and pull for a total-body workout like no other.

P90X - 06 Kenpo X
06 Kenpo X
Intense cardiovascular workout with punching and kicking for endurance, balance, and coordination.

P90X - 07 X Stretch
07 X Stretch
Achieve a higher level of athleticism over a longer period of time, plus prevent injuries and avoid plateaus.

P90X - 08 Core Synergistics
08 Core Synergistics
Build and support multiple muscle groups to build and support the core while conditioning your body.

P90X - 09 Chest, Shoulders & Triceps
09 Chest, Shoulders, & Triceps
Target both large and small upper body muscles to push you to the brink.

P90X - 10 Back & Biceps
10 Back & Biceps
Flex those powerful biceps and focus on toning and tightening these showcase arm muscles.

P90X - 11 Cardio X
11 Cardio X
Low-impact cardio routine that is a fun fat-burning workout that will leave you feeling lean and mean.

P90X - 12 Ab Ripper X
12 Ab Ripper X
Sculpt the six-pack abs of your dreams and benefit your health and physical performance.

మీలో ఎవరికన్నా ఈ వీడియోలు కావాలంటే మీరూ ఇక్కడ నొక్కి, ఈ టొరెంట్ ద్వారా దింపుకోవచ్చు. http://torrents.thepiratebay.org/5276898/P90X_Complete_Disk_Collection_-_www.DietingHub.com.5276898.TPB.torrent
అన్నీ డీవీడీల కలెక్షన్ ఉందీ ఈ టొరెంట్ లో. మొత్తం 7.8GB సైజు.

హా!! అలా కాదు, పైరసి, బొంగూ భోషాణం అనుకుంటే ఇక్కడ http://www.beachbody.com/product/fitness_programs/p90x.do నొక్కండి, కొనుక్కోండి. నూట ఇఱవై డాలర్లు ఈ మొత్తం పన్నెండు డీవీడీల విలువ.
మాక్ స్కెడ్యూల్ -


మనం ప్రస్తుతానికి ఇలా ఉన్నాం.
From essersije

మరియూ
From essersije

ఇదికూడా
From essersije

పిల్లలు దడుస్కుంటారయ్యా అన్నా ఇనట్లా జనాలు. ఐతే ఐందని పెట్టేస్తున్నా ఈ పుటోబులు.
ఇక పై ఎస్సర్సైజులు సేసి అనోసరమైన కొవ్వంతా తీసేసి అవతల్నూకుతా.
మరి నాతో సెయ్యి కలుపుతావా?

Apr 15, 2010

సెరిత్ర పుటల్లో సూరిగాడు

సెరిత్ర అడక్కు సెప్పింది ఇను.
ఇంతకీ కతేంటంటే సూరిబాబు సెరిత్రపుటల్లోకెక్కాడు, పుట మూడొందల ఇరవై ఐదంట.
సూస్కోండి ఈడ

అబ్బే మరేంలేదు, మా నాయన మీద *త్తి దూస్తావా *త్తి అని, రోంత కోపం సూపించాడని సెరిత్రపుటల్లోకెక్కాళ్ళే.
ఇషయం ఏంటంటే
ఫోటోఫనియ అని ఓ సైటు. దాంట్లో ఓ యాభై రకాలుగా ఫోటోని మార్చుకోవచ్చు.
ఐఫోన్ అప్లికేషన్ కూడా ఉంది, దింపా, నే మొన్న జిమ్మీలో తీసిన ఫోటోని పెన్సిల్ ఆర్ట్ లాగా మార్చా. బాగుందా?

ఇంకోటి

Apr 12, 2010

చిక్కుముళ్ళు

ఏంటీ ఈ చిక్కుముళ్ళు
ఒకటి విప్పితే ఇంకోటి బిగుస్తోంది
ఒకదారాన్ని లాగితే కనిపించనిచోట చిక్కులు పడిపోతోంది
ఒకదారాన్ని లాగితే అది కనిపించనిచోట చిక్కు వేస్తోంది
ఈ ముళ్ళు తీయటానికి ఎంత నేర్పరితనం కావాలో అర్ధమవ్వటంలేదు
ఈ ముళ్ళకు ముళ్ళులేవు కానీ
చేతులు తెగుతున్నాయ్
ముళ్ళు లేకుండా
ముళ్ళు దిగకుండా
కోతకు గురౌతున్నాయి వేళ్ళు
రక్తం స్రవిస్తోంది.......................మనసులో!!!

Apr 11, 2010

గడ్డకట్టుకున్న గాయాలు

దిబ్బలుదిబ్బలుగా పడిన మంచంతా
ఉన్నట్టుండి కరిగిపోయింది
నిన్నటిదాకా సచ్చినట్టు పడున్న పచ్చిక
పచ్చదనం నింపుకుని
తలారబోసుకున్న కన్నెపిల్లలా కళకళ్ళాడుతూ
ఆకాశంవైపు చూసి వీచే గాలికి తుళ్ళిపడుతుంటే
మనసులో నిన్నటి మంచుతో పూడుకుపోయిన
కాలం చేసిన గాయాలు
ఒక్కొటిగా బయటపడుతూ
మళ్ళీ పచ్చిగా అవుతుంటే
వేడితనం పుట్టించిన జీవంలోంచి వచ్చిన ఈగలు
గాయాల సలుపుని పెంచుతున్నాయ్
కష్టంగా ఉన్నా
*గడ్డకట్టుకునే* ఆ మగతే బగున్నట్టుంది
మనసు గాయాలకి

Apr 10, 2010

తాళము వే....గొళ్ళెము మ.....

ఏందీ, మళ్ళీయా? నీ ఎన్కమ్మ!! అనుకున్టన్నావా?
అనుకో!! ఏంపర్లేదు.
ఎరైటీ బాసూ....ఎరైటీ...
ఏంకత అన్టన్నావా??
ఇదీ కత -
ఆపీస్కొచ్చా
పనీ పాటా సేత్తన్నా
పన్నెండైంది గంట
ఆకలి రోకలైంది
జోలె లోంచి సద్ది మూట తీద్దాం అని సెయ్యిపెట్టా
శనగిత్తనాల కూర
డబ్బా పెరుగు
మరి రొట్టెలేవీ?
మరిసిపొయ్యా

Apr 7, 2010

మీకు తెలుసా?

ఇవ్వాళ్ళా రేపట్లో, ఐ.టీ మరియూ తదితర సంబంధ ఉద్యోగస్తుల్లో ప్రతీ ఐదుగ్గురిలో ఒకరు మధుమేహవ్యాధిగ్రస్తులు. నమ్మలేకపోతున్నారా? నిజం. ఐదుగ్గురిలో ఒకరు కాకపోయినా, ఎనిమిదిమందిలో ఖచ్చితంగా ఒకరు అని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయ్. ఐతే, మిగతా ఏడుగ్గురిలో ఎంతమంది ప్రొ-డయాబెటిక్ అంటే ఓ పెద్ద తడుముకోవాల్సిన పనిల్యా. ఎందుకంటే, ఆపీస్కి వెళ్ళి, ఏమాత్రం శారీరక శ్రమ లేకుండా కాలు కదపకుండా, ఏసీరూములో, ఏమాత్రం చెమటపట్టకుండా, హాయిగా కూర్చుని కాఫీలమీద కాఫీలు తాగే జాతికి అత్యంత ప్రియమైనది ఈ వ్యాధి.
సరే అక్షింతలు అటుంచి, కనీసం కళ్ళు తెరిచే కళ్ళు తెరుచుకుందాం ఇకనైనా అనుకునే జాతికి ఈ సమాచారం -
గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒకటుంటుంది. ఈ ఇండెక్స్ విలువ ఎక్కువ, మధ్యస్తం, తక్కువ అని మూడు రేంజులు.

ఎక్కువ, మధ్యస్త గ్లై.ఇం విలువ కలిగిన ఆహారమ్ తింటే ఏంటిటా?
గ్లై.ఇం ఎక్కువున్న ఆహారం తింటే అది నీ ఆరోగ్యం పై గమనించతగ్గ తేడాలను గమనించతగ్గ సమయంలో చూపుతుంది. గమనించతగ్గ = వారం రోజుల్లో.
ఉదాహరణకి - మ్యాక్ డోనాల్డ్స్. మనోళ్ళు ఆహ్, మ్యాక్ ఇండియాలో కూడానా, అబ్బో పొరుగింటి పిల్లకూర అత్భుతం అని, కుమ్ముతుండచ్చు. ఐటె, మీకో రహస్యం తెలుసా! మ్యాక్ లో ఒక నెల క్రమం తప్పకుండా ఆహారం భుజిస్తే, ఎన్నో నష్టాలు.
మోర్గన్ స్పుర్లాక్, అని ఓ లఘుచిత్రాల దర్శకుడు *సూపర్ సైజ్ మి* అని ఓ లఘుచిత్రాన్ని తీసాడు.

Super Size Me (http://en.wikipedia.org/wiki/Super_Size_Me) is a 2004 American documentary film directed by and starring Morgan Spurlock, an American independent filmmaker. Spurlock's film follows a 30-day time period (February to beginning of March 2003) during which he eats only McDonald's food. The film documents this lifestyle's drastic effects on Spurlock's physical and psychological well-being, and explores the fast food industry's corporate influence, including how it encourages poor nutrition for its own profit. Spurlock dined at McDonald's restaurants three times per day, eating every item on the chain's menu. He also always "super-sized" his meal—but only if it was offered. Spurlock consumed an average of 20.92 megajoules or 5,000 kcal (the equivalent of 9.26 Big Macs) per day during the experiment. As a result, the then-32-year-old Spurlock gained 24½ lbs. (11.1 kg), a 13% body mass increase, a cholesterol level of 230, and experienced mood swings, sexual dysfunction, and fat accumulation to his liver. It took Spurlock fourteen months to lose the weight gained from his experiment.

కాబట్టి, ఈ గ్లై.ఇం ఎక్కువ ఉన్న ఆహారం తీస్కుంటే ఒబేసిటి అనగా ఊబకాయం వచ్చే అవకాశాలు మేండుగా ఉన్నాయోయి.
అంతే కాకుండా రక్తంలో గ్లూకోజు శాతాన్ని పెంచుతాయి ఇవి. అంతే కాకుండా గ్లూకోజుని రక్తంలోకి తొందరగా శ్రవించేలా చేస్తాయి.

తక్కువ గ్లై.ఇం విలువలు ఉన్న అహారం వల్ల లాభాలేంటి?
Switching to eating mainly low GI carbs that slowly trickle glucose into your blood stream keeps your energy levels balanced and means you will feel fuller for longer between meals.

* Low GI diets help people lose and manage weight
* Low GI diets increase the body's sensitivity to insulin
* Low GI carbs improve diabetes management
* Low GI carbs reduce the risk of heart disease
* Low GI carbs improve blood cholesterol levels
* Low GI carbs can help you manage the symptoms of PCOS
* Low GI carbs reduce hunger and keep you fuller for longer
* Low GI carbs prolong physical endurance
* High GI carbs help re-fuel carbohydrate stores after exercise

ఎలా? ఎక్కడా?

* అల్పాహారంలో ఓట్లు, బార్లీ, లాంటివితినటం
* ముతక ధాన్యాలు (హోల్ గ్రైన్), దంపుడు బియ్యం, విసుఱ్ఱాయితో చేస్కున్న పిండి లాంటివి వాట్టం
* పిండి పదార్ధాలు తగ్గించుకోటం
* పండ్లు ఫలాలు ఎక్కువగా తినటం
* బాస్మతి మంచిందటయ్యా


గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి ఇంకా కావాలంటె ఇక్కడ చూడండి
http://www.glycemicindex.com/

మన పుల్లశనగలు చాలా మంచిదంటయ్యా. దీంట్లో గ్లై.ఇం విలువ చాలా తక్కువ, మరియూ, పీచు పదార్ధం ఎక్కువ. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన సూక్ష్మ ధాతువులు కూడా ఉన్నాయంట.

Chickpeas (http://en.wikipedia.org/wiki/Chickpeas)are a helpful source of zinc, folate and protein.They are also very high in dietary fiber and hence a healthy source of carbohydrates for persons with insulin sensitivity or diabetes. Chickpeas are low in fat and most of this is polyunsaturated. Nutrient profile of desi chana (the smaller variety)is different , especialy the fibre content which is much higher than the light coloured variety. One hundred grams of mature boiled chickpeas contains 164 calories, 2.6 grams of fat (of which only 0.27 grams is saturated), 7.6 grams of dietary fiber and 8.9 grams of protein. Chickpeas also provide dietary calcium (49–53 mg/100 g), with some sources citing the garbanzo's calcium content as about the same as yogurt and close to milk. According to the International Crops Research Institute for the Semi-Arid Tropics chickpea seeds contain on average:

* 23% protein
* 64% total carbohydrates (47% starch, 6% soluble sugar)
* 5% fat
* 6% crude fiber
* 3% ash

There is also a high reported mineral content:

* phosphorus (340 mg/100 g)
* calcium (190 mg/100 g)
* magnesium (140 mg/100g)
* iron (7 mg/100 g)
* zinc (3 mg/100 g)


ఇక, కొన్ని కొన్ని పరిశోధనల్లో తేలిందేంటంటే అపరాలు తినటం మంచిదట.
Pulses in Diabetes Diet Management - The Evidence

A diet that produces hyperglycemia and a greater demand for insulin increases the risk of Type 2 diabetes. Individuals with or at risk of Type 2 diabetes are advised to eat a diet in which about 50-60% of energy is supplied by carbohydrates obtained mainly from whole grains, fruit, vegetables and low-fat milk. Pulses make an important contribution to healthy eating because their effect on blood glucose is less than that of most other carbohydrate-containing foods.

In one study, nine adults with Type 2 diabetes ate dried peas as part of a mixed meal and then later ate a mixed meal made with potatoes. Their blood glucose and insulin levels were lower after eating the mixed meal made with dried peas than after eating the mixed meal made with potatoes. A different study looking at healthy people found that those eating a chickpea-based meal had lower blood glucose and insulin levels than those eating wheat-based meals (either a whole grain plus wheat bran or white bread). These findings and others show that pulses can be useful for diabetics because they cause less of a rise in blood glucose than potatoes or wheat-based foods.

ఇప్పుడర్ధమైందా, మన ఎనకటి తరాలు అంత గట్టిగా ఎలా ఉండేవాళ్ళో. దంపుడు సరుకు, చేత్తో తయ్యార్సేస్కున్న పిండి, కట్టెలపైన వంట.

మొన్నీమధ్య మి.మంతెన ఇలాచెప్పుకొచ్చాడు -
నేను రోడ్డెమ్మట పనిచేసే ఓ కుటుంబాన్ని గమనించాను. ఆ కుటుంబం గత కొన్ని నెలలు సమచ్చరాలుగా రోజువారీ కూలీ, రోడ్డు కాంట్రాక్టరు దగ్గర. వాళ్ళ దైనందిన పని ఏంటంటే రోడ్డువెయ్యటం లేక బాగుచెయ్యటం. నేను ఓ రోజు ఉండబట్టలేక వెళ్ళి అడిగా! ఇంత రద్దీ రోడ్డులో ఇంత పొగ కాలుష్యంలో పని సేస్తున్నారు కదా, మరి మీకు శ్వాసకోశ అంబంధ వ్యాధులు రావా అని. వాళ్ళంటారూ, నాలుగేళ్ళయ దవాఖానకుబొయ్యి. మాకేంరావు బాబు అని. ఎందుకా అని నేను వాళ్ళ జీవిత శైలిని గమనిస్తే ఇలా బోధపడింది. వాళ్ళు పొద్దస్తమానం రెక్కలతో పని చెస్తారు. రెక్కలు అనగా చేతులు. చేతులు ఎక్కువగా వాట్టంవల్ల డొక్కలు, ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి. దానివల్ల ఊపిరి తిత్తులు గట్టిగా ఉంటాయి, మరియూ ఆరోఘ్యంగా ఉంటాయి. ఎవడైతే చేతులు కదల్చకుండా ఉంటాడో వాడికి ఊపిరితిత్తుల సమస్యలు రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.

బ్లాగ్ లోకంలో మన బ్లాగ్ మితృలు కొందరు మీరు మరి ఎస్సర్సైజూ గట్రా అంటున్నరుకదా మరి చేసినాంక ఎట్టున్నరో పుటోబులు పెట్టుండ్రి అని.
ఇవి కేవలం స్పూర్తికోసమే సుమా
ఇదిగో ఈడ సూడండి.
ఇట్టున్నా -
From essersije


ఇంకా కొన్ని పుటోబులు ఉన్నాయి, అయి ఈడపెడితే సిన్నపిల్లలు దడుసుకుంటారని పెట్టాట్లా.

Apr 5, 2010

టెస్టింగ్ అనగా పరీక్షించుట - కొనసాగింపు - ౨

మొన్నటి టపాhttp://ramakantharao.blogspot.com/2010/04/blog-post.htmlలో ఏందేందో మాట్టాడుకున్నాం.
ఇయ్యాల్టినుండి ప్రతీ టపాలో ఒక్కో ఇషయాన్ని ఇవరంగా సూద్దాం, ఏటంటావ్?
ఈ టపాలో మృదూపకరణ అభివృద్ధి జీవిత చక్రం,మృ.అ.జీ.చ, అనగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి ఇవరంగా చూద్దాం
ఇది మృ.అ.జీ.చ ప్రవాహ పట్టిక అనగా ఫ్లో చార్ట్ అన్నమాట


పై ప్రవాహాన్ని రకరకాలుగా సాధించవచ్చు. వాటిల్లో అతి పురాతనమైన నమూనాల్లో ఒకటి నీటిప్రవాహ విధానం. ఈ పురాతనమైన విధానాలనే ట్రెడిషనల్ డెవలప్మెంట్ విధానాలు అని కూడా అంటుంటారు.
ఉదా||





ఈ విధానాల్లో, ప్రతీ ప్రక్రియ మధ్యనున్న అంతరాయం, ఒక ప్రక్రియ తనకి ఇటు అటు ఉన్నవాటిని మాత్రమే చూడగలగటం లాంటివి కొన్ని లోపాలు. దానివల్ల వెనక్కివెళ్ళి ఏమన్నా సవరణలు చెయ్యాలంటే క్షష్టం అని ఉద్దేశం.
అట్టానే, పరీచ్చాదశ ఎప్పటికో సివరాకరికి వస్తుందీ ఇధానంలో.
అసలు ఏంఏం తప్పులు ఏఏ దశలో జరగొచ్చూ? ఈ కింద సూడు



సరే ఈ సోది దేనికి, మనకి కావాల్సింది, ఇప్పుడు రాంసాఁవి. ఇవ్వాళ్ళా రేపట్లో - వీ అనేది బాగా ఖ్యాతి గడించిన విధానం. దాని గురించిన కధేంటో సూద్దాం.
ఈ విధానాంలో ప్రతీ దశ మిగతాదశలన్నిటికి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన సంగతి. అలానే పరీక్షావిధానం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రింద చూడండోసారి -



ఓ సారి దీన్ని తొవ్వి ఈ టపాని నుగిద్దాం
పై బొమ్మలో
ఎడంచేతివైపు పైనుండి మృదూపకరణ అభివృద్ధి మొదలౌతుంది.
మొదటి దశ - రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, దానితోపాటే మొదలయ్యే పరీక్షా ప్రక్రియ యాక్స్పెటెన్స్ పరీక్షా రూపకల్పన, ఈ రూపకల్పనని ఆదరువుగా తీస్కుని చేసే పరీక్షనే యాక్స్పెటెన్స్ పరీక్ష అంటాం.

తర్వాతి దశ - సిస్టం డిజైన్ లేక సిస్టం హై లెవల్ డిజాఇన్ అనగా సిస్టం రూపకల్పన. దీనికి సమాంతరంగా సిస్తం టెస్ట్ రూపకల్పన జరిగుతుంది. దీన్ని ఆదరువుగా చెసే పరీక్షనే సిస్టం టెస్టింగ్ అంటారు

ఆ తర్వాతి దశ - లోలెవల్ డిజైన్ లేక మాడ్యూల్ డిజైన్. ఈ దశలో జరిగే ప్రఈక్షా ప్రక్రియ ఇంటిగ్రాహన్ టెస్ట్ డిజైన్. దీన్ని ఆదరువుగా చెసుకుని జరిపే పరీక్షలనే ఇంటిగ్రేఅషన్ టెస్టింగ్ అంటారు

ఆ తర్వాద్ది - కోడింగ్. ఈ దశలో జరిగే పరీక్షా ప్రక్రియ యూనిట్ టెస్ట్ డిజైన్. ఈ డిజైన్ని ఆదరువుగా చేస్కుని, యూనిట్ టెస్టిం చేస్తారు.

ఇప్పటివరకూ ఎడమచేతివైపున్న దశలు అయ్యాయా. ఇక ఇప్పుడు కుడి చేతివైపుకి వెళ్ళటానికి సిద్ధం. ఐతే ఈ ఎడమ కుడి కలిసే చోట కోడింగ్ జరుగుతుందా. యూనిట్ పరీక్షల డిజైన్ కూడా జరిగిందా. మరి యూనిట్ పరీక్షలను ఎలా చేస్తారూ?
సాధారనంగా కోడ్ రాసినోడే యూనిట్ పరీక్షలను నిర్వహిస్తాడు. కాబట్టి ఈ రెండు దశలు అనగా కోడింగ్ మరియూ యూనిట్ టెస్టింగ్ తరెంటినీ ఒకే దశకింద జమ చేస్తాం.
అయ్యాక, కుడిసేతివైపు మొట్టమొదటి దశ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. దీనికి మూలం ఇంటిగ్రేషన్ టెస్ట్ డిజైన్.
ఇది అయ్యాక వచ్చే దశ సిస్టం టెస్టింగ్.
ఆ తర్వాద్ది యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్నమాట.

వచ్చే టపాలో అసలు టెస్టింగ్ అనగా ప్రఈస్ఖీంచటం అంటే ఏంటీ, ఈ యూనిట్, బీనిట్ బోయినిట్ ప్రఈచ్చలంటే ఏంటీ చూద్దాం.

గీతాంజలి

ఇవ్వాళ్ళ మనసేంబాగోలేక, వాతావరణంలో మార్పు కోసం, నా డీవీడీలను దులుపుతుంటే ఏం సినిమా చూద్దామా అని, నా చేయి గీతాంజలి డీవీడీని పట్టుకుని వదల్లా. హ్మ్!! డీవీడీ ప్లేయర్లో పెట్టాను........
కళ్ళముందు, ఆ సినిమాని మంగా థియేటర్ లో, మొట్టమొదటిసారి చూసిన జ్ఞాపకం గిర్రున తిరిగింది.
ఆతర్వాత, గీతాంజలిని థియేటర్లో ఎన్నిసార్లు చూసానో, జ్ఞాపకంలేదు. ఓ పాతికసార్లు చూసుంటానేమో.
నేను అత్యంత ఎక్కువసార్లు థియేటర్లో చూసిన సినిమాలు -
మొదటిది - గ్యాంగ్ లీడర్
రెండు - ఘరానామొగుడు
మూడు - గీతాంజలి
నాలుగు - జ.వీ.అ.సు
ఏముందీ ఈ సినిమాలో? అందమైన లోకేషన్స్, కమ్మని సంగీతం, గిరిజ, పాటలు ఆమనీ పాడవే హాయిగా..అంతకన్నా ఏంకావాలి సినిమాకి.
ఆశుపత్రిలో గీతాంజలి వాళ్ళ మామ్మకి ఇవాళ్ళ దేవదాసుని చూసాం అని చెప్తూ
ఆమనీ పాడవే హాయిగా అని పాడుతూ తల ఇటు తిప్పినపుడు, అక్కడ నాగార్జునని చూసి, చేతిలోని పూలగుత్తిని మొఖంమీద పెట్టుకుని అతనివైపు చూస్తుంది. ఎంత అత్భుతంగా చూపించాడా దర్శకుడు. అప్పుడు నాగ్ వచ్చి గీతాంజలి బుగ్గపై ముద్దుపెట్టుకుంటాడు. అప్పుడు గీతాంజలని దగ్గరగా చూపిస్తాడు. ఓహ్!! హ్మ్!!
ఇదంతా ఓ ఎత్తైతే, ఈ సినిమా పబ్లిసిటి ఒక ఎత్తు.
నాదగ్గర మా సీనియర్ ఇచ్చిన ఓ కెమిస్ట్రీ రికార్డ్ బుక్ ఉండేడి. దాంట్లో, పై అట్టలోపల, ఎడంచేతివైపు, గీతాంజలి చిన్న బొమ్మ, నాగార్జున గిరిజని వళ్ళోపెట్టుకుని ఉండేది. వెనక అట్టలోపల ఇంకో ఫోటో. ఇవి న్యూస్ పేపర్లో సేకరించినవో లేక ఈనాడు ఆదివారంలోవో.

జుట్టుకి కొబ్బరినూనె పూసి, తర్వాత, చేతులు ఓ సారి తడిపి జుట్టుకలోకి ఓ సారి ఆ తడివేళ్ళని పోనిచ్చి ఎనక్కిదువ్వి ఏంటో పిచ్చి. ఎంత క్రేజో ఆ స్టైల్.

మీకు తెలుసా గీతాంజలిగా వేసిన గిరిజ, అసలు పేరు గిరిజ షట్టర్. ఆమె భారత/కకేసీన్ సంతతి. క్రికెటర్ కృష్ణమాచారి శ్రీక్కాంత్ కి బంధువని అప్పట్లో అన్నారు. గిరిజ బ్లాగ్ రాస్తుంది. ఆమె బ్లాగ్ ఇదిగో - http://undercutandflourish.blogspot.com/

Apr 2, 2010

నిర్బంధ ఉచిత విద్య

ఈ రోజు నుండి కేంద్రం ఓ బృహత్తర చట్టాన్ని అమలు చేయబోతోంది.
అది, నిర్బంధ ఉచిత విద్య.
ఒకటి నుండి పదిదాక అనుకుంటా. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయని డా॥ మన్మోహన్ సింగ్ అన్నారు.
దీనికి కొన్నివేల కోట్లు ఖర్చు పెట్టబోతోందని సెలవిచ్చారు.
అలాచెప్పు అన్నాను, అది వేరే సంగతి, పాపం ఆయనకి వినపళ్ళా.

ఇంకోవార్త
పాతబస్తీలో కర్ఫ్యూ సడలించారట.
పాలు లీటరు వంద
కూరలు పావుకిలో పాతిక
గత కొన్ని రోజులుగా కర్ప్యూ వల్ల కొందరిళ్ళలో అనగా రోజువారీ కూలీల గుడిశెల్లో పిల్లులు పొయ్యిలోంచి కదలటంలేదట. అటు కూలీలేక, ఇటు ఇంట్లో బియ్యం గట్రా లేక పేదోడి బతుకు కర్ఫ్యూ అయిందని వార్త.

ఇంకోవార్త
భూగర్భ జలం విలవిల -
రాష్ట్రంలో భూగర్భ జలాల పరీస్థితి ఆందోళనకరంగా మారిందట. పరిమితికి మించి నీటివాడకం జరుగుతోందని ఈనాడు వాత్రా పుత్రిక రాసుకొచ్చింది.

దీనిగురించి ఎవరన్నా సలహా ఇవ్వాల్సొస్తే ఏం ఇస్తారూ? ఎలా నీటిని వ్యర్ధం చేయకుండా వాడుకోవాలని మీ ఉద్దేశం?
నా దృష్టిలో -
వ్యవాసాయ ఉత్పత్తులకి, నిత్యావసరాలకీ గ్రే వాటర్ ని వాడితే మంచిది అని.
బోర్లేసి, సర్రున నీళ్ళు లాగుతున్నారీరోజున అటు అపార్టుమెంట్ల వాళ్ళూ ఇటు రైతులు కూడా...అది తగ్గించి, నిత్యావసరాలకి అతి శులభంగా నీటిని రీసైకిల్ ఎలా చేసుకోవచ్చో ఇంజనీరింగు విద్యార్ధులు ఆలోచించాలని నా కోరిక.

Apr 1, 2010

టెస్టింగ్ - నాకు తెలిసినంతలో ఓ పరిచయం

ఇవ్వాళ్ళ రేపట్లో చాలామంది, ఉత్తినే, ఏంపెద్ద క్నాలడ్జీ లేకుండా ఐ.టీలోకి రావాల్నంటే, బెస్టు *టెస్టింగ్* అనుకుంటుంటారు.
ఆ ఏముంది, టెస్టింగ్ ఈజీనేగా అంటుంటారు.
ఏముందీ రిగ్రెషన్ టెస్టింగ్ చెయ్యటమేగా అంటుంటారు.

నా ఈ చిన్న ప్రయత్నం, టెస్టింగ్ గురించి నిజానిజాలు తెలియజెప్పటమే. నాకు తెలిసిన రెండు ముక్కలు పంచుకునే ప్రయత్నం.
ఇదొక సిరీస్ గా రాద్దామని నా ప్రయత్నం.

ముందుగా - అసలు టెస్టింగ్ అంటే ఏంటీ?
క్వాలిటీ అంటే ఏంటీ?
క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటీ?
క్వాలిటీ ఎస్స్యూరెన్స్ అంటే ఏంటీ?

క్వాలిటీ కంట్రోల్ కీ క్వాలిటీ ఎస్స్యూరెన్స్ కీ సంబంధం ఉందా?

క్వాలిటీ ప్రాసెస్ ఎప్పుడు మొదలౌతుంది?
టెస్ట్ సైకిల్ ఏంటీ?
టెస్ట్ ప్రాసెస్ ఏంటీ?
టెస్ట్ పాయింట్ ఎనాలిసిస్ అంటే ఏంటీ?
వి మరియూ వి అంటే ఏంటి?
వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తాం?
వేలిడేషన్ ఎప్పుడు చెస్తాం?
దేనిపై వెరిఫికేషన్ వర్తింప చేస్తాం?
దేనిపై వేలిడెషన్ వర్తింపచెస్తాం?
అన్నిటికన్నా ఒక టెస్టర్ కి ఉండాల్సిన లచ్చనాలేంటీ?
యాట
యాట
యాట

ఒక్కో టపాలో ఒక్కో సంగతి.

ముందుగా -
టెస్టింగ్ అనేది తెలుసుకునే ముందు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకోవాలి.
గతంలో, అనగా తెల్లోడు కంప్యూటర్ ని కనిపెట్టి బజ్జీకొట్టాక, పాతికేళ్ళ తర్వాత మన దేశంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చిన కొత్తల్లో పుస్తకాల్లో చదివిన సంగతి -
లైఫ్ సైకిల్ అంటే -

[మూలం - వికీపీడియ http://en.wikipedia.org/wiki/File:SDLC-Maintenance-Highlighted.png]

మొదలుపెట్టుట
ప్లాన్ చేయుట
డిజైన్ చేయుట
పరీక్షించుట
విడుదల చేయుట
మేయిన్టెనెన్స్ చేయుట
[మొత్తంగా ఇదే కాదు. ఇందులో ఇంకా చాలా ఫేజ్లు ఉండచ్చు, ఉన్నాయి కూడా. ఇది కేవలం బ్రీఫ్గా మాత్రమేసుమా]
అనే లాంటి అడుగులన్నిటినీ కలిపితే వచ్చేదే లైఫ్ సైకిల్.

వాటర్ఫాల్ మోడల్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చదువుకున్నాం.
దీని ప్రకారం నీళ్ళు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో అలా పై తెలిపిన అడుగులని ఊహించుకోవటం అన్నమాట.
అంటే
ఇదిగో ఇలా -

[మూలం: http://en.wikipedia.org/wiki/File:SDLC-Maintenance-Highlighted.png]
తర్వాత్తర్వాత పెద్దలు కుర్చుని అబ్బాయి ఇది కేవలం కొన్ని రకాల ప్రాజెక్టులకి మాత్రమే బాగుంటుంది అని సమాలోచన చేసి ఐటెరేటివ్ మాడల్ అని ఇంకొక విధానంతో ముందుకొచ్చారు. ఇంకొందరు పెద్దలు స్పైరల్ మాడల్ అనే ఒకదాన్ని లిఖించారు. కొందరు ఫౌన్టైన్ మాడల్ ముందుకి తెస్తే మరికొందరు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ విధానాన్ని వినిపించారు.

ఐతే ఇవన్నీ పాత చింతకాయ విధానాలు.
ఇవ్వాళ్ళా రేపట్లో ప్రఖ్యాతి చెందిన కొన్ని కొత్త పోకడలు ఇవి -
వి విధానం
డబ్ల్యూ విధానం
ఎజైల్ విధానం

మిగతా తర్వాతి టపాలో!!!

Mar 31, 2010

మిషిగన్ లో సూర్యాస్తమయం - జ్ఞాపకాల దొంతర

అన్నగారు కొత్తపాళి గారు, మిషిగన్ లో సూర్యాస్తమయాలు బాగుంటాయన్నారు.
వెంటనే నా జ్ఞాపకాలను ఓ సారి గిలక్కొట్టా. ఇది పైకి వచ్చింది.
అది మార్చ్ మాసాంతం. నేను స్థానిక ఫార్మింగుటన్ కొండల్లో ఉన్నా ఆకాలంలో. మా స్నేహితులు కొందరు నన్ను సూట్టానికి షికారుగా వచ్చి, పదహే, అలా వెళ్దాం అన్నారు. యాడికీ అన్నా. కెసీనోకి వెళ్దామా అన్నాడు మా నెల్లూరి పెద్దారెడ్డి. డీట్రాయిట్ సరే వాకే అన్నా. బువ్వ గివ్వా కానించి, బయల్దేరాం. బాచిబాబాయ్ నీకాడ ఐడీ ఏంలేదుగా పాసుపోర్టు తెచ్చుకో అని ముందుగానే సెప్పాడు మా నెల్లూరి పెద్దారెడ్డు. అన్నీ జోబిల్లో కుక్కుని బయల్దేరాం.
సమయం పది కావొస్తోంది.
పెద్దారెడ్డి కార్లో ముందు ప్యాసింజర్ సీట్లో కూకున్నా. ఉన్నట్టుండి మావాడు బాచిబాబాయ్ సూడు అని మూన్రూఫ్ తెరిసాడు.
ఆయాల పున్నమి అనుకుంటా.
ఓహ్! మ్యాన్....
సంద్రుణ్ణి అంత దగ్గరగా నా జివితంలో, నిజ జీవితంలో హెప్డూ చూళ్ళా!! అదో రకమైన రంగు, ఎరుపు గోధుమ కలిపినట్టుగా ఉందా ఆ రంగు, ఏమో అనుకుంటా. కారు ఆ సిమ్మెంటు రోడ్డుమీద సర్రున వెళ్తుంటే రోడ్డు కొసాన ఉన్నట్టున్నాడు. కొంచెంసేపు మూన్ రూఫ్ నుండి కొంచెంసేపు ఎదుటద్దంలోంచి, దోబూచులాడుతూ వెంటాడాడా వేళ సన్దమామ, సాన్ద్. అప్పుడనిపించింది, భవకవులు ఎందుకంతలా సన్దమాఁవంటే పడిసచ్చిపోతారో అని.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను అంటే ఏంటో అర్ధం అయ్యిందా పూట!! ఆ పసిమివెన్నలరాజు రాక కోసం నిజమే మరి ఎదురుచూడరా వేచి చూడరా ఎవరైనా అనిపించింది.
చల్లని రాజా ఓ చందమామా
నీ కధలన్ని తెలిసాయి ఓ చందమామా నా చందమామా అని కన్నెపిల్లలు చంద్రునితో ఎందుకు ప్రియుణ్ణి పోలుస్తారో అర్ధం అయ్యిందా రోజు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ చాలదు.....

ఆల్బని డిట్రాయిట్ రెండూ ఒకే స్కేల్ పై ఉన్నా, నిడుచందమామ అంత దగ్గరగ కనిపించలా ఎప్పుడూ ఆల్బనీలో..ఏంటో మరి ఆ మాయ.

Mar 30, 2010

సూరిగాడికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు

ఏరా నాన్నా
పార్టీకి నీ ఫ్రెండ్స్ ని పిలిచావా?
లేదు
కేకు కోస్తున్నావా
లేదు
చాక్లేట్లు తిన్నావా
లేదు
ఎందుకురా నాన్నా
నువ్వు లేవుగా, అక్కడకొచ్చాక కేక్ కొనుక్కుని, కట్ చేస్తా


గుండె పిండాడు సూరిగాడు. నేనీమధ్య మహా సెన్సిటివ్ ఐపోతున్నా!! వయసు పెరుగుతోంది కదా మరి. ఇవ్వాళ్ళ వాడి పుట్టినరోజు.
ఈ మధ్య వాళ్ళమ్మ ఏంపెట్టినా సగమే తీంటున్నాట్ట. కేకైనా మేకైనా చాక్లెట్టైనా ఏదైనా. మిగతాది తినరా అంటే నాన్న దగ్గరకి వెళ్ళినప్పుడు తింటా అంటున్నాట్టా. భార్యామణి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత, వాడి ఈప్మీదేస్కునే సంచిలోకి చీమల బారులు అదే పనిగా ఎక్కుతుంటే ఏందిరా బగమంతుడా అని చూసిందట. ఈ సగం తిన్నవన్నీ దాంట్లో దర్శనమిచ్చుకున్నాయట. అదీ సంగతి.
From chirsmas_party

Mar 29, 2010

తొలిసంధ్య వేళలో - జ్ఞాపకాల దొంతర

ఈనాడు టీవీలో ఇదేదో సినిమా చూస్తుంటే మధ్యలో ఈ పాట.
తొలిసంధ్య వేళలో. ఆర్నీ ఈ పాటి ఈ నిమ లోదా అని గూగుల్లో గెలికితే నే చూసేది సీతారాములు అనే సిత్రం అని తెలిసింది.
పాట ఇదీ -

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో........

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం


ఈ పాట అందరకీ తెలిసిందే. ఐతే ఈ పాట చిత్రీకరణ నన్ను మళ్ళీ కట్టిపడేసింది, చూసిన ప్రతీసారీ ఇలానే అనుకుంటా. సూర్యోదయం, తొలిపొద్దు వేళ, సూర్యుడు ప్రపంచాన్ని నిద్రలేపుతూ అలా పైకి వచ్చే అత్భుత దృశ్యం, అదీ కేప్ కమేరియన్ వద్ద. అల్లంత దూరంలో వివేకానందా మెమోరియల్. ఎంత సుందరమైన దృశ్యం.

నాకు భావుకత అనేది తెలిసినప్పటి నుండీ ఓ ప్రబలమైన కోరిక, సముద్ర ముఖంగ నిల్చొని, పచ్చిగాలి పీలుస్తూ, ఆకాశంలో మర్డరు జరిగినట్టుండే ఆ అరుణవర్ణాన్ని, ఆ నెత్తురుగడ్డలాంటి సూర్యుణ్ణి కళ్ళారా చూడాలని, ఆ పెత్తెచ్చ నారాయుడి సేవసేస్కోవాలని. మరే ముత్యలముగ్గు ప్రభావంలేని మడిసుంటాడా? ఉన్నాడంటేసెప్పు, డిక్కీ ఎక్కించేద్దాం ఏటంటావ్ సెగెట్రీ?

అలాంటి కోరిక మరి సూరీడు నా మనసుని సదివేసాడో ఏటోగాని, నేను యం.సీ.ఏ సదివే రోజుల్లో మానాయనా వాళ్ళు దచ్చిన భారద్దేశ యాత్రకి శ్రీకారం చుట్టారు. బడి ఎక్స్కర్షన్. ఓ సీటు ఖాళీ ఉందిరా, నువ్వూరా, ఇంటో ఒక్కడివీ ఆడపిల్లలకి లైను కొట్టుకున్టా ఏవుంటావూ? వచ్చేయ్యి అన్నాడు నాయన.

సెన్నై, మద్రాసు, మెడ్రాసు అన్నీ సూడొచ్చు, సెన్నై నుండి మధురై మీదుగా కన్యాకుమారి వరకు. మధ్యలో వచ్చే గుళ్ళూ గోపురాలు సూస్కున్టా ఎళ్ళటం....

ఎళ్ళాం, యాట యాట యాట. మధురైలో బయల్దేరాం.
మధురై నుండి రెండొందల యాభై కిలోమీటర్లనుకుంటా. బస్సు బయల్దేరింది మధురై నుండి. నాకు నిద్ర లేదు.
ఎంత ఎక్సైట్ అయ్యానంటే, పొద్దున్నే ఐదుకల్లా అక్కడుంటాం అని డ్రైవర్ రామారావు చెప్పాడు. అందరూ గుఱకలు పెట్టి నిద్ర. నేను, రోమాంచతో, జుట్టు రేపుకుని, కళ్ళకి క్లిప్పులు పెట్టెస్కుని కిటికీలోంచి చూస్తూ కూర్చున్న. పొద్దున మూడు సమయం. డ్రైవర్ పక్కకెళ్ళి కూర్చున్నా ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక.
నాలుగైంది అంతలో నన్ను ఇంకా ఏడ్పించటానికి. ఎండ్లకాలం కదా, నాలుక్కే ఆకాశం రంగు మారటం మొదలైంది. నాలుగున్నరకల్లా కన్యాకుమారి బీచ్ దగ్గరకి వెళ్ళిపొయ్యాం. నా ఎక్సైట్మెంట్ కి అవధుల్లేవు. కళ్ళు కూడా కొట్టుకోటం ఆపెసాయి. అరుణవర్ణం అని కవులు ఎందుకలా వర్ణిస్తారో అప్పుడర్ధం అయ్యింది. అత్భుతమైన ఆ రంగు. ఎవ్వరూ కలపలేని, ఎవ్వరూ తెరకెక్కించలేని రంగు అది.
సూర్యుడు నెమ్మదిగా బయటకి రావటం మొదలెట్టాడు. ఓరి దేవుడో అనుకున్నా. కానీ, నా అదృష్టం నన్ను ఎక్కిరించింది. మబ్బులు, నల్లటి మబ్బులు, గుంపులు గుంపులు, ఎక్కణ్ణుంచొచ్చయో, తుర్రున వచ్చి, సూర్యోదయాన్ని అరచేతిని అడ్డుపెట్టి ఆపేసినట్టు నాకళ్ళకి అడ్డునిలిచాయి.
హ్మ్!! భగవంతా, ఎన్నయ్యా ఎదో, ఎప్పిడీ, న్యాయమా అనుకున్నా.
తర్వాత కాలంలో నా ఎం.సీ.యే అయ్యింది. మద్రాసు పెంటాఫోర్ లో ఇంటర్వ్యూ కాల్. వెళ్ళా. ఇంటర్వ్యూ గట్రా అయ్యాక, ఆ మరుసటి రోజు పొద్దున్నే సూర్యోదయం సూసేద్దాం ఈ సారి నాయాల్ది అనుకున్నా. కారణం నే ఉన్న రూం, మా అన్న మితృడుది, క్యాతెడ్రాల్ రోడ్డు మొదట్లో, అమ్రికోడి కాన్సులేట్ దగ్గర్లో, తెయినంపేటలో, స్టెల్లా మారిస్ కళాశాల దగ్గర్లో. అక్కణ్ణుండి ఆర్కె సాలై మీదుగా వెళ్తే మెరీనా బీచ్ వస్తుంది. మూడు కిళొమీటర్లు అనుకుంటా. పొద్దున్నే నాలుక్కే లేచి, ఆటో మాట్టాడుకొని ఎళ్ళా. మెరీనా బీచ్. హ్మ్!! వెళ్ళి అలల అంచుల దగ్గరకి వెళ్ళా. ఆ అలలను గమనించే సోయలో లేను. నా దృష్టంతా సూర్యోదయం పైనే. అప్పటికే అల్లంత దూరంలో, సముద్రపుటంచు ఆకాశంలో కలిసిపొయ్యే దగ్గర, వర్ణం మారుతోంది. ఐతే ఆ సీక్వెన్స్ ని, ఆ సూర్యోదయపు ప్రక్రియని పట్టించుకునే స్థితిలో లేరు ఆ బీచ్ లోని జనాలు. వాళ్ళ జీవితం నా దృష్టిని వారివైపుకి లాక్కుంది. వాళ్ళంతా వాళ్ళవాళ్ళ దైనందిన జీవతంలో మునిగిపొయ్యి ఉన్నారు. వాళ్ళే జాలరులు. అంతలో కొన్ని చేపల పడవలు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ దృశ్యం అత్భుతం. దాని గురించి వేరే టపాలో. వచ్చే పడవలు వస్తున్నాయ్.
సూర్యుడు ఇవేంపట్టించుకోకుండా బయటకి వస్తున్నాడు. ఆహా అనుకునే లోపు - ఓ జాలరి నాకు కొంచెం ముందు, లుంగీ ఎత్తి డ్యాష్ విసర్జనం చేసి కప్పెట్టిసి నిష్క్రమించాడు.
నే లేచి వచ్చెసా.

Mar 26, 2010

విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి - రోత(శ)య్య

ఇవ్వాళ్ళ వార్తల్లో రోతయ్య ఇలా అన్నారు -
రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పత్తి జరగటం లేదు
రాబోయే రెండు మూడేళ్ళలో విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు ఘట్టిగా ప్రయత్నాలు జరగాలని మీముందు సూచిస్తున్నా
ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు లేని రాష్ట్రం కాదు ఎక్సెస్ విద్యుత్తు గల రాష్ట్రం అని నిరూపించుకోవాలి.

వాహ్!! ఎంత మంచి ఆలోచన. భేష్.
ఐతే!! ఎలా? ఎలా పెంచుతావయ్యా రోతయ్యా? అదీ చెప్పు...
ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు
ఎంత వైట్ వినియోగమౌతోందీ
ఎంత చోరీ కాబడుతోందీ
ఎంత సరఫరాలో సచ్చిపోతోందీ
ప్రైవేటు భాగస్వామ్యంలో కొన్న విద్యుత్తు ఎంత
కొనే ధర ఎంత

ఇవన్నీ పక్కనబెట్టి -
మనం ఇలా ఎందుకు ఆలోచించం?
కోర్టులు, యూనివర్సిటీలి, ప్రభుత్వ కార్యాలయాలు, కలక్టరేటు కార్యాలయాలు, కాలేజీలు, హైటెక్ సిటీలు - వీటి టాపులు వృధాగా పడిఉన్నాయిగా, వాటీపై సూర్యరశ్మితో విద్యుత్తుని ఎందుకు తయ్యారు చేస్కోలేము?
ఎన్ని చదరపు అడుగులు ఉండవచ్చు, ఎన్ని సోలార్ ప్యానల్స్ ని స్థాపించవచ్చు, ఎన్ని వాట్స్ విద్యుత్తుని తయ్యారు చేయవచ్చూ?
ఎవరైనా ఓ సర్వే చేస్తే బాగుండు.....

Mar 23, 2010

కందిపప్పు బ్యాన్ చేస్తే ఊర్కుంటారా?

అరేయ్ ఏటినీగోల
ఆ, ఆవు మాంసం నాకిట్టం. అదే కావాలి.
అరేయ్ వద్దన్నాగా. సదుకో, ఎదవ, జెల్లకాయేస్తా
హా!! నువ్వేమో కందిపప్పు తినచ్చు, నేను ఆవుని తినకూడదా?
అరేయ్, తంతా నిన్ను. బుర్రతక్కువ వెధవ. పాల దిగుబడి తగ్గిందట్రా
ఆఅ, అంతే, అట్టైతే బఱెల్ని వధించటం బ్యాన్ చేయచ్చుగా
అబే గధె!! కర్ణాటకలో ఆవులెక్కువరా సన్నాసి
ఐయే మాత్రం కందిపప్పు బ్యాన్ చేస్తే నువ్వు ఊర్కుంటావా
ఓరేయ్ తిక్క సన్నాసి, కందిపప్పు తినే శాతం ఎంత, ఆవులు తినేవాళ్ళ శాతం ఎంత, ఎల్కేజీకి తక్కువ యూకేజి కెక్కువ. ముయ్
[కందిపప్పుని తినేటోళ్ళు కేవలం బేపనోళ్ళని కొందరి భావని. అట్టాంటోళ్ళంజూసి సింతిస్తున్నా.]

Mar 22, 2010

ఏంటీ ఈ శిక్ష

నారాయణ ఒలంపియాడ్ ప్రభంజనం

ఇతరులు ప్రకటించిన విధంగా ఒలంపియాడ్ ఫలితాలు ప్రకటిస్తే -
ఈ సంవత్సరం అన్నీరాకాల ఒలంపియాడ్స్ లో సెలక్టైన నారాయణా విద్యార్ధుల సంఖ్య 596


పై ప్రకటన, మాటీవీ ప్రసారమయ్యే కార్యక్రమంలోని *ప్రకటనల విరామంలో* కనీసం ఐదు సార్లు రిపీట్ అవుతోంది. నేను నాలుగు బ్రెకుల్లో ఇది గమనించా, ఐదో బ్రేక్లో విసుగెత్తిపొయ్యి, మాటీవీని కట్టేసా.
ఎలా తట్టుకుంటున్నారో జనాలు ఈ గోలని.

Mar 19, 2010

ఆ వేళ!

ఎంత మధురంగా ఉందా వేళ!!
పచ్చని చెట్ల పందిరి కింద
మిత్రబృందంతో ఉన్నాడతను
గప్పాలు కొట్టుకుంటూ
వయ్యస్సు ఇచ్చిన గర్వంతో
అప్పుడే విడిచినపెట్టిన కళాశాల
బిలబిలమంటూ
బయటకురుకుతున్న కాళ్ళు
కుర్రాళ్ళ కొంటెచూపులు
అమ్మాయిల దొంగచూపులు
ఇంతలో బెదిరించే
డిసిప్లైనరీ సైగలు
ఈ మధ్యన!!
మనోడికి చురుక్కున
ఏదో గుచ్చుకుంటున్న భావన
చెట్టి కిందున్నాడుగా
గొంగళి పురుగేమో అనుకున్నాడు
ఈ గుచ్చుకొనుడు ఇంకెదో గుచ్చుకొనుడని అర్ధం అయ్యింది
మనోడికి అర్ధం అయ్యింది
అది ఓ స్నిగ్ధ
మూగకళ్ళ బాకని!!
ఓ నిండైన యవ్వనపు
పదునైన చూపని
తల విదిల్చి
చుట్టూ ఉన్న బస్సుల జాతరలో
ఆ కళ్ళకోసం వెతుకులాట
మొదలెట్టాడు
అన్ని బస్సులు
వందల కళ్ళు
అన్ని బస్సులు వందల కళ్ళు
కొన్ని అందమైనవి
కొన్ని పొగరైనవి
కొన్ని కాటుక దిద్దినవి
కొన్ని సొగసైనవి
కొన్ని తమ ప్రియునితో మౌనంగా ఊసులాడేవి
కొన్ని తమ ప్రియుణ్ణి చూపుతోనే దహించివేసేవి
ఇన్నిటిమధ్య
ఇన్ని కళ్ళ మధ్య
ఓ బస్సు కిటికీలోంచి
బాణం వేసినట్టుగా
తీక్షణంగా
ఏకధారగా వస్తోన్న ఆ చూపునీ
ఆ కళ్ళనీ పట్టేసాడు మనవాడు
దొరికిపొయ్యాయి ఆ కళ్ళు
ఆహా!!
ఎంత అందంగా ఉన్నాయా కళ్ళు
ఎంత విశాలంగా ఉన్నాయా కళ్ళు
ఎంత లేతగా ఉన్నాయీ అవి
ఎంత అమాయకంగా ఉన్నాయవీ
కళ్ళు కళ్ళు కలిసాయి
చూపులు కలిసాయి
అర్రె!! పట్టుపడ్డానే అనుకున్న ఆ కళ్ళు
ఇంకోవైపుకి టకామని తిరిగాయి
అహా! నేవదులుతనా అని
మనోడు కళ్ళతో తన్ని గుచ్చుతునే ఉన్నాడు
తనవైపుపుకి తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు
నేనింకా నీవైపే చూస్తున్నా
అని సంకేతాలు పంపుతునే ఉన్నాడు
విజయం సాధించాడు
ఆ సంకేతాలను డీకోడ్ చేస్కుందా
తెలివైన అమ్మయి
ఆ మీనాక్షి
ఆ సోగకళ్ళ సుందరి
మళ్ళీ కళ్ళూ కళ్ళూ కలిపింది
మనోడు ఏడిపిద్దాం అని
తనచూపుని మరల్చాడు
ఆ కళ్ళు గుచ్చాయి
ఆ విరహం తట్టుకోలేక
మనోడు ఓటమిని అంగీకరించి
అలా కళ్ళాతోనే ఊసులాట్టంలో
మినిగిపొయ్యాడు
ఇద్దరూ
వారిద్దరూ
ఇక ప్రపంచంలో
ఎవరూలేరూ
మేమిద్దరమే
మాకింకేం పట్టవ్
మాకింకెవరూ పట్టరూ
అన్నట్టుగా మునిగిపొయ్యారు
అతనెక్కడో దూరంగా చెట్టుకింద
ఆమె బస్సులో కిటికీ పక్కన
కళ్ళు మాట్లాడుకుంటున్నాయి
చామనఛాయ ముఖం
లేతగా ఉంది ఆమె
చెక్కినట్తున్న ఆమె ముక్కు చెంపలు
అతన్ని చిత్తు చేసాయి
ఇంతలో
విధి వింతనాటకం [అని అంటాడతను] ఆడింది!
ఆమె కూర్చున్న బస్సు కదిలింది
ఆమె ఎక్కిన బస్సు తన గంమ్యం వైపుకి నడిచింది
ఆమె ఎక్కిన బస్సు నిర్దయగా తను రోజూ చేసే పనినే చేసింది
ఆ బస్సు చాలా సమయపాలన చెస్తుంది
దానికి దయా దాక్షిణ్యాలు లేవు
దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయిందా బస్సు
ఆందోళన నిండిన చూపులు
విలవిల్లాడాయి
తపించిపొయ్యాయి
చూపులు మళ్ళీ కలుస్తామా అన్నట్టు
మళ్ళీ కలిసాయి
చివరిసారా అన్నట్టు కలిసాయి
ఎన్నో భావాలతో కలిసాయి
వేదనతో కలిసాయి
ఒకే కళాశాలలో ఉన్నా
కొన్ని వేల కళ్ళలో
ఎక్కడని వెతకాలా కళ్ళకోసం
ఎంతకష్టమో ఆ వెతుకులాట
బస్సు వెళ్ళిపోయింది
మనవాడూ
తను ఎక్కాల్సిన బస్సువైపు నడిచాడు
తన గమ్యంవైపుకి నడిచాడు
మనోడిబస్సు వాణ్ని వాడి గమ్యం వైపుకి లాక్కెళ్ళెంది
మనోణ్ణి
మనోడి జ్ఞాపకాలనీ
ఆ వింతైన తీయనైన మధుర క్షణాల్నీ
విరహాన్నీ దుమ్మునీ కలుపుకుని!!!

Mar 18, 2010

నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి

ఆ రోజు ఆ కళ్ళు
ఎంతో నిశ్శహయతో
ఆర్తితో
బాధతో
నిన్ను ఈ గుండెలమీద పెట్టుకు పెంచారా
నాకేమీ చేయలేవా
నీ బాటలో ముళ్ళుండకుండా ఊడ్చారా
నన్ను బతికించలేవా
నీ ఉన్నతులకోసం నా రక్తం ధారపోసారా
నన్ను కాపాడాలేవా
నిన్ను గుండెల్లో పెట్టుకుచూసారా
నన్ను యముడి పాశం నుండి తప్పించలేవా
అని విలవిల్లాట్టం చూసా
ఆ కళ్ళు
ఉన్నట్టుండి
గుండెని ఎవరో పిసికేస్తున్నార్రా అనే భావం ప్రకటించాయి
ఏమీ చేయలేని నా నిశ్శహాయత
నేను ఆటో తెచ్చేలోపే ఆ కళ్ళు రెప్పవెయ్యటం ఆగిపొయ్యాయి
నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి
నాకు బాగా గుర్తు
ఆరోజున ఈ కళ్ళే తన తండ్రి కళ్ళను ఇలానే భద్రపరచుకున్నాయి
చివరిచూపులకోసం ఆ కళ్ళు ఈ కళ్ళ కోసం వేచిచూసాయి
ఇదిగో వచ్చాడు రమాకాంతం
ఇదిగో వచ్చాడు రమాకాంతం అన్న ప్రసాదరావుగారి
మాటకు చివరిసారిగా స్పందించాయి ఆ కళ్ళు
నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి

మార్చ్ పద్దెనిమిది మా తల్లితండ్రుల పెళ్ళిరోజు. మా నాన్న గారి నిష్క్రమణకు నా ఈ కవిత అంకితం.

ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్ దినం అంట

సోదరా, ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్కు దినం అంట. మాఊళ్ళో రోడ్లమీన ఏదో పెరేడంట. గూగులోడు కూడా వచ్చిండయ్యా. నేను ఆపీసు పైనుండి ఈ పుటోబులు లాగించినా. బాగుండయా?


ఏందో తిక్కనాయాళ్ళు!!
ప్యాట్రిక్కు దినం, పూసల దండలు ఇసరటం, స్క్లేట్లు ఇసరటం..పిల్లలకి పుల్లు ఆనందం దొరికినట్టుంది. ఎవురానందం ఆరిది. ఏతంతావు? నానేతంతానూ! నువ్వేదంటే నానదే అంతానంటావా?

ప్రదర్శన అంటే ఇదీ

ధర్మేశ్ సారూ, ఇరగదీసిన్రు!! చింపేసిన్రు...
Thats what I call a performance

Mar 16, 2010

డాలరు పంట - నా ఉగాది కవిత

మత్త కోయిలలూ
మత్తు కాకులూ
రాబందులూ రెక్కల పక్షులూ
అన్నీ
నా ఉగాది చెట్టుమీదనుంచి
ఉన్నట్టుండి
ఒక్కసారిగా
రకరకాల అరుపులతో
కొన్ని జీరబోయిన గొంతులతో
కొన్ని శ్రావ్యమైన కంఠాలతో
ఎగిరిపొయ్యాయి
నా ఉగాది చెట్టుని విడిచిపొయ్యాయి
ఖాళీ చేసాయి
అవున్లే
అవిమాత్రం ఏంచేస్తాయి పాపం
నేనేమన్నా పండ్లు కాయించానా
నేను ఎమన్నా పండ్లు ఫలలా కాయించానా
మంచు నీళ్ళు పోసి డాలర్లు కాయించాలని చూసాను
స్వార్ధం ఎరువేసి బంగారపు దిమ్మెలు పూయించాలని చూసాను
కానీ ప్రకృతి నన్ను చూసి నవ్వింది
చెట్టుకి అనురాగం మాత్రమే పూస్తుందీ అని చెప్పింది
అలా ఎలా అన్నాను
చెట్టుకి ప్రేమా వాత్సల్యాల ఫలాలు మాత్రమే వస్తాయని చెప్పింది
నెను విన్లా
నేను వినలా
నా ప్రయత్నలు చెస్తూనే ఉన్నా
డాలర్ల పంట పండుతుందేమో అని
మంచుపడే దారులవెంట
ఆశగా చూస్తూనే ఉన్నా
రోజులు
నెలలు
రోజులూ నెలలూ గడిచిపొయ్యాయేగానీ డాలరుపూత లేదు
ఇదిగో ఇప్పుడొచ్చింది
ఇప్పుడే వచ్చింది ఇంకో ఉగాది
ఇంకో యుగాది
నాలోని ప్రేమతత్వాన్ని నిదురలేపే యుగానికి ఆది
మరో కొత్త సమచ్చరంలోకి
ప్రకృతితో మమేమకమౌతూ
ఆప్యాయాలనూ అనురాగాలనూ పంచుతూ
ముందుకురికే యవ్వనాన్ని చిలకరిస్తూ
వచ్చింది ఉగాది
కొత్త కొత్త ఆశలూ
కొత్త కొత్త కోరికలూ
మూటగట్టుకున్న మనసుకి
చేయందించటానికి వచ్చింది ఉగాది
కుక్కతోక వంకరన్నట్టున్నా ఈ మనస్సు
ఈఏడాదన్నా ఈ దూరపుకొండల నునుపుని
కొలవటం మానుకోవాలని ఆ ఉగాది లక్ష్మిని కోరుకుంటా

Mar 15, 2010

ఇయ్యాల రగతం కళ్ళజూసా !!

నాయాల్ది రగతం కళ్ళజూసా పొద్దున పొద్దున్నే
అహా!! ఎవుర్దీ?? అదీ సోంవారం, మటన్కొట్టెట్టావా? ఎంతకమ్ముతున్నావేంది కిలో ఇట్టా అడుగుతారని తెల్సు.
పొద్దునపొద్దున్నే, తలకిబోస్కుని, అడ్డగుడ్డ సుట్టేస్కుని ఓ డెగిశాలో పాలుపోసి కారన్ ఫ్లేక్స్ దాంట్లో ఏస్కుని కారన్ ఫ్లేక్సు అల్పాహారం బోంచేద్దాం ఇయ్యాళ అనుకుని, డేగిశని మైక్రోవేవ్లో పెట్టి, కొలువులో *కత్తి* లేదు కమలాలు గట్రా కోస్కోటానికి అని నిన్నకొన్న సిన్న *కత్తి*ని కాయితకంలో సుట్టి ఎనకమాల్నేసుకునే సంచిలో పెట్టుకుందాం అని *కత్తి*ని తీస్కున్నా. దీనెక్క సానా పదునుగా ఉంది, కాయితకం యాడుందబ్బా అన్జూస్తే పక్కమ్మెట ఓ పొట్లంలో కాయతకం ఓటుంది. ఆ పొట్లం *కత్తి*తో కోసి అవ్వతల్నూకి ఆ కాయితకం బయటకి తీద్దాం అని కోసా, అది కుడిసేతి చూపుడేలుని కొట్టేసింది కస్సుక్కున, సెక్కేసినట్టయింది. ఓ ఆరు లీటర్ల రగతం కారి వృధా అయిపోయింది. సిరన్జీవి బ్లెడ్డుబ్యాంకీకి ఇచ్చినా పుణ్యం వచ్చునే అనుకున్నా. అది సోదరా ఇయ్యాల్టి యవ్వారం.
ఎంత *కత్తుల్తో* ఆడుకునేవోడికైనా *కత్తి* తెక్క మానదు!!

ఏందీ!! అట్టుందీ ఏలూ!! ఏంపెట్టావూ ఏలుమీన అనుకోమాక. పసుప్పెట్టా!
ఇదిగో ఇదే ఆ *కత్తి*!! కొత్త *కత్తి*!! పదునైన *కత్తి*!!!

ఏటిసేత్తాం సోదరా. తప్పు *కత్తి*ది కాదు. దాన్ని ఉపగోగింసుకున్న నా ఎడం సేత్తిద్ది. అదేటి, *కత్తి*కి కేవలం నరకటమో తెగ్గొయ్యటమో మాత్రమే తెల్సు కద!! మరి దాన్ని కూసిన్త జాగరత్తగా వాడకపోతే సూసేవా ఎన్ని అనర్ధాలు జరిగిపోతయో!!
చివరాకరుగా సెప్పేదేంటన్టే!! *కత్తుల్తో* జాగ్రత్త.

Mar 11, 2010

కృష్ణా నీ బేగనే బారో - అంజనా సౌమ్య


ఈ పాట పాడింది అంజనా సౌమ్య, చాలా బాగా పాడిందనిపించింది. మరి ఏమి రాగమో తాళమో సరిగ్గా సంగతులన్నీ వేసి పాడిందోలేదో కానీ, నన్నైతే రంజింపజేసింది.
రుద్రవీణ సినిమాలో చెప్పినట్టు రంజింపజేసేదే సంగీతం అది బిళహరి ఐతే ఏంటి ఆనందభైరవి ఐతే ఏంటి!!

ఏమంటారూ?

Mar 3, 2010

ఏంటో ఈ అర్ధం లేని ప్రకటనలు

ఒక నల్ల హిట్ తెచ్చుకోండి

హిట్ తో దోమల్ని కొడితే ఒక్కటి కూడా మిగలదు


ఇదో ప్రకటన. ఐతే బాసూ -

హిట్ ఎక్కువగా కొడితే మనం మిగలం.

బాబుగారూ
రెండు వివెల్ సబ్బులివ్వండి

అరేయ్ మూడు వీవెల్ తీసుకురా

రెండు సబ్బులే ఇవ్వండి

ఇప్పుడు రెంటికి మూడు వస్తాయ్

Feb 25, 2010

తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన

తమ్ముడు సుబ్బులు ఓ లంకెని పంపాడు. దాని సారాంశం ఇది -

"తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన విజయవాడ లో చోటు చేసుకుంది. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని తెలుగులో మాట్లాడిందని టీచర్‌ అర్థనగ్నంగా నిలబెట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు స్కూలు యాజమాన్యాన్ని నిలదీయడంతో విషయం బయటికి తెలిసింది. ఆ స్కూల్లో ఇదొక్కటే ఘటన కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి దండన ఇచ్చారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు."

వప్పుకుంటా!! ఆంగ్ల భాషా మాధ్యమ పాఠశాలల్లో తెలుగు మాట్లాట్టం ఘోరం, క్షమించరాని నేరం, శిక్షార్హం. ఐతే ఎలాంటి శిక్ష? ఆ పాఠశాల నిబంధనలు ఏంటీ? ఏమైనా పబ్లిష్డ్ డిస్క్లైమర్ ఉందా? తెలుగులో మాట్లాడితే ఇదీ శిక్ష అని తల్లితండ్రులకు ఏమన్నా చెప్తున్నరా?

ఇక నాణేనికి ఇంకో వైపు -
అసలు ఆంగ్ల భాషా మాధ్యమ పాఠశాలల్లో పనిచెసే ఉపాధ్యాయులకు భాషార్హతలు ఏంటీ?

Feb 23, 2010

ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్

నేను అత్తెసరు మర్కులతో, లోకల్ ఇంజనీరింగు కాలేజీలో, సాదాసీదా యం.సి.యే చదివా. ఏవరేజి మార్కులు. పాస్ అయ్యాక కేంపస్ ఇంటర్వ్యూలు లేవు మాకు. ఏదో కష్టపడ్డా. ఎలానో ఓలా ఉద్యోగం తెచ్చుకున్నా. కిందపడ్డా లేచా. మళ్ళీ పడ్డా మళ్ళీ లేచా. దూరపుకొండల నునుపు చూద్దాం అని ఇక్కడకొచ్చా. నునుపు చూస్తున్నా. ఓ కన్సల్టెంట్ గా నెట్టకొస్తున్నా.
నాకు తెలిసినోడు ఒకడు, పేర్లనవసరం, ఆర్.ఈ.సి లో చదివాడు. మాంచి ర్యాంకు యంసెట్లో. సరే!! సదివాడు. అయ్యింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీయస్లోనో దేంట్లోనో కొట్టేసాడు. రెండేళ్ళయ్యాక అమెరికాలో వాలిపొయ్యాడు. ఓ కన్సల్టెంట్ గా చేస్తున్నాడు.
నాకూ వాడికీ తేడా ఏంటి?
నాబోటి సాధారణ బ్యాక్ గ్రౌండ్ గాడికి గంటకి సే $60 వస్తే, ఆర్.ఈ.సీ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుండొచ్చిన వాడికీ అంతే.
నాకు తెలిసిన కుఱ్ఱాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో పిజి చేసాడు. బెంగళూరులో ఏదోక కంపెనీలో చేస్తున్నాడు.
మరింక తేడా ఏంటీ?
ఆర్.ఈ.సి లేక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ల నుండి వచ్చిన వాళ్ళు సమాజాన్ని ప్రభావితం ఎందుకు చెయ్యలేకపోతున్నారూ?
వీళ్ళు చదివిన చదువు అడవికాచిన వెన్నెల అవుతోందని ఎందుకాలోచించట్లేదు?

Feb 21, 2010

ఏంటీ ఈ అపోహలు? ఎవరు నేర్పుతున్నారిలా?



ఎవరు నేర్పుతున్నారిలా? రాజకీయ స్వార్ధాల కోసం ఇంతలా దిగజారిపోతున్నారా రాజకీయ నాయకులు?

*ఆత్మ త్యాగాలు* అని ఒక అందమైన అర్ధంకాని పదాన్ని అమాయకప్రజలపై ఉసికొల్పి, వేడెక్కించి, ముందుకునెట్టి పబ్బంగడుపుకునే ఈ ఎదవ రాజకీయ నాయకులు, దీని గురించికూడా మాట్టాడితే ఎంతబాగుంటుందీ -



పోయిన ప్రతీ ప్రాణం,
తగలబెట్టే ప్రతీ బస్సు,
నిప్పట్టించే ప్రతీ వస్తువూ,
గడచిపోయిన ప్రతీ నిమిషం,
కూలగొట్టిన ప్రతీ ప్రభుత్వ కార్యాలయ గోడా
- ప్రతీదీ విలువైందే.

మన తెలివితేటల్నీ, ఆవేశాల్నీ, ఆందోళనల్నీ, ప్రాణాల్నీ, ఆలోచనల్నీ, కన్స్ట్రక్టివ్ ప్రగతి కోసం వాడాలని కోరుకుంటా

Feb 19, 2010

ప్లేన్ హిట్స్ ఐ.ఆర్.యస్ బిల్డింగ్

ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్, ఆస్టిన్, టెక్సస్ బిల్డింగ్ పై ఒకడు ప్లైన్ తో ఎటాక్ చేసాడు.

మనవాళ్ళందరూ క్షేమం అని భావిస్తున్నా.

పన్ను సంబంధిత సమాచారం (డేటా) కూడా క్షేమం అని భావిద్దాం..

On Thursday morning, authorities in Texas said that a 53-year-old man named Joseph A. Stack III crashed a small plane into an office building in Austin that houses offices of the Internal Revenue Service. The pilot was killed and at least two people were injured.

Feb 17, 2010

35 మంది రాజినామా

వాహ్!! అత్భుతంగా ఉంది. ముప్ఫైయ్యైదు మంది లెజిస్లేచర్స్[వీళ్ళు రాజ్యాంగం చే గుర్తింపబడని - తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు.] రాజీనామా చేసారు. వీళ్ళు ప్రజల చేత ప్రజలకొరకు ప్రజలే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినుధులు. వీళ్ళు భారత[కాదు కాదు!! ఏమో ఏమో??]రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధుల్లో చేరతారు.
ఐతే, వీళ్ళ పంచెలు కాపాడుకోటం కోసం ఏమైనా సేస్తారు, చేసారు, చేస్తున్నారు, ఇప్పుడు -
తమ రాజీనామాలను మన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్/రేపటి తెలంగాణా గవర్నర్ [తెలంగాణా ప్రజలు కోరుకుంటే ఈ గవర్నర్ లేకపోతే రాష్ట్రపతి, వాళ్ళిష్టం!! నేనేమీ వ్యాఖ్యానించబోను] ప్రొఫెసర్ కోదండరాం గారికి అందజేసారు.

Feb 16, 2010

మీకో బంపర్ ఆఫర్ అంట

మీకో బంపర్ ఆఫర్ అంటయ్యా!!

ఎన్దా కతా అంటారా? ఇదిగో సదూకోన్డి -

మీకో బంపర్ ఆఫరండీ. ఇంతకీ *నాన్ స్టాప్* చూసారా? చూడకపోతే ఎన్టనే సూడండి.
పస్టు ప్రైజు సాంత్రో కారండీ
రెందో ప్రైజు లచ్చ రూపాయలండీ
మూడో ప్రైజు యాబయ్య ఏలన్డీ
ఇంకా మరెన్నో ప్రైజులన్డీ

మీరు చెయ్యాల్సిందల్లా
నాన్ స్టాప్ సినిమా జూట్టం, ఈరో ఎవురో ఇలనెవరో కనిపెట్టి
మీ టికట్టుతో పాటు *సుమన్ ప్రొడక్షన్స్* కి పంపించడం.


-----
రిపరెన్సు - ఈనాడు టీవీ

Feb 14, 2010

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ

ఓం నమో భగవతే రుద్రాయ

అయ్యా అదీ సంగతి.
జీవితంలో మొట్టమొదటి సారి శివరాత్రికి జాగారం చేసా. అదీ శివాలయంలో, అదీ అనుకోకుండా, అదీ శివ ధ్యానంలో, అదీ శివ ఘోషలో తడిసిపోతూ, అదీ ఆ ఘోషలో పాలుపంచుకుంటూ.
అత్భుతమైన అనుభవం.
ఆనందకరమైన అనుభవం.
చాలా అవసమైన దీవెన.

శుక్రవారం, మా ఊళ్ళో శివరాత్రి పండుగని జనసందోహం భక్తి శ్రద్ధల్తో జరుపుకున్నాం. వారంముందే పోష్టరేసారు. అహోరాత్ర మహన్యాస పారాయణలో పాల్పంచుకోండీ అని. అప్పుడే చెప్పా, రెండో ఝాములో వస్తా అని చెప్పా.

పదకుండింటికల్లా చేరుకున్నా. కొందరు వారి టర్మ్ ముగించేయబోతున్నారు. వెళ్ళా. కూర్చున్నా.
నా స్లాట్లో మొత్తం ఐదుగ్గురు ఔత్సాహితులు ఉన్నారు నాతో కలిపి.
ఎలా ఏంటి ప్లాన్ అన్నా.
ప్రతీ ఝాముకి పదకుండుసార్లు పారాయణం చేయగల్గాలి అన్నారు.
లఘున్యాసం తో మొదలియ్యింది పారాయణ.
త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం
ఊర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతా"త్॥

అయ్యాక చమకప్రశ్నలోని మొదటి పన్నా
అగ్నావిష్ణూ సజోషసేమా వర్ధన్తు వాంగిరః। ద్యుమ్నైర్వాజేభిరాగతం....శరీరాణి చ మే।
జ్యైష్ఠం చ మ ఓం శాంతిః శాంతిః శాంతిః

తో ఆగి మళ్ళీ మొదలై
ఓం నమో భగవతే రుద్రాయ।
ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
...నుండి
త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం
ఊర్వారుకమివ బన్ధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతా"త్॥

తర్వాత
జ్యేష్ఠం చ మ ఆధిపత్యం చ మే ... మతిశ్చ మే సుమతిశ్చ మే।
శం చ మే। ఓం శాంతిః శాంతిః శాంతిః

తో ఆగి మళ్ళీ మొదలి......
అలా పదిసార్లయ్యాక, పదుకుండోసారితో అభిషేకం చేసి, అలంకారం చెసి, నివేదనలు చేసి...
మళ్ళీ మొదలుపెట్టి...
అలా....
తెల్లవారి ఆరుకల్లా మొత్తం పూర్తిచేసి,
కలసాలను కదిలించి, వాటితో అభిషేకించి -
అలంకారం నివేదనలు చేసి - అయ్యా అని నమస్కరించుకుని, గుడి మొత్తం శుభ్రంగా ఊడ్చి పొద్దున ఏదుకి ఇంటికిజేరా.

నేను ముందు పదకుండునుండి కూర్చుని, పదకుండు సార్లు చదివి వచ్చేద్దాం అనుకున్నా.
ఇంతలో ఓ పెద్దాయన, భాస్కరం! సాధ్యమైనంత సేపు కూర్చోండి, పూజారికి కాస్త తోడుగా ఉండండి, ఏమైనా అభ్యంతరమా అన్నారు.
సరే నండీ మాష్టరూ ఉంటా అన్నా....మొత్తానికి ఓ పదిమందిమి ఆ పరమశివుని సేవలో తరించాం.

చాలా ఆనందంగా ఉంది.

మరొక్కసారి -
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ
మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాన్తకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవయ నమః



From shivaratri

Feb 6, 2010

ప్రసూన్ జోషి

ఇతను చాలా చక్కటి పాటలు రాసాడు. ఫనా, తారే జమీన్ పర్, దిల్లీ ఆరు, రంగ్ దె బాసన్తి ఇత్యాది సినిమాలకి కమ్మని పాటలు అందించాడు.

ఐతే, అంతే కమ్మగా పాడగలని ఈ పాట చూసాక అర్ధం అయ్యింది.


అలానే ౯/౨౬ పై ఒక పాట, కవిత -

Feb 4, 2010

ఆహార ధాన్యాల ధ్వంసం - జాతి విద్రోహం

అహా!! మొత్తానికి హైకోర్టు వజ్రాల్లాంటి మాటలు పలికింది. ఈ వార్త చూడండి.
http://www.eenadu.net/story.asp?qry1=3&reccount=38
డిశెంబరు ౨౪ బంద్ సందర్భంగా మహబూబ్ నగర్ జుల్లాలో తహసీల్దారు కార్యాలయానికీ, ధాన్య గిడ్డంగికీ నిప్పుపెట్టారు మన *తెలంగాణా* సహోదరులు. దానివల్ల వంటనూనె, బంగారంలాంటి కందిపప్పు, పందార, బియ్యం మొత్తం యాభైలక్షల సరుకు మసి.
"ఇలాంటి సందర్భంలో దేశంలో సంభవిస్తున్న ఆకలి చావులని మరువరాదు: అన్నారు న్యాయమూర్తి. "కొన్ని కోట్లమంది దారిద్యరేఖకి దిగువన ఉన్నార"ని, "ఈ నేపధ్యంలో ధాన్యానికి కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ నష్టం కలిగించటాన్ని జాతి వ్యతిరేక చర్య"గా న్యాయమూర్తి పేర్కొన్నారు.
"రాజ్యాంగంలోని ౫౧-ఎ అధికరణ మన విధులను తెలియజేసుంది".
"జాతికి చెందిన ఆస్తుల విధ్వంసంలో పాల్గొనే వ్యక్తి..భారతీయుడిగా విధులను ఉల్లంఘించినట్టే"నని స్పష్టం చేసారు.

పై వాటికి కారణాలు సరైన మార్గదర్శకం లేకపోవటం ఒక కారణం.

కొందరు పెద్దలు దీన్ని మార్గదర్శకం లేకపోటమే కాదు, కొవ్వెక్కి, సమాజిక బాథ్య లేక, తిన్నదరక్క అనికూడా అంటుంటారు.
బస్సులు తగలెట్టటం, కార్యాలయాల్ని తగలెట్టటం ఇవీ మనం ముందుతరాలకి నేర్పాల్సిన విద్యలు.
మొత్తానికి మంచి మాట చెప్పెరా సదరు న్యాయమూర్తి గారు.
ఐతే, ఈ నష్టాన్ని ఉద్యమకారులే, ఉద్యమ కర్తలే భరించాలి అని బిల్లు పంపితే బాగుటుంది.

Feb 2, 2010

టయోటా!! ఏమైంది నీ మాట

టయోట అ.క.అ టొయొట. ఈపేరు ఈవ్వాల్టి రోజున కొత్తగా పరిచయం చేయ్యాల్సిన పనిలేదు. అత్భుతమైన కార్లు వీడి సొంతం. కామ్రి, కరోలా, హైల్యాండర్, యారిస్, ప్రయస్, యాట యాట యాట.

ఈ మధ్య వార్త -
టయోటా వాడు మొత్తం ఇప్పటికి ఇరవైలక్షల కార్లను వెనక్కి పిలిచాడు. కారణం - గ్యాస్ పెడల్ అనగా యాక్సిలేటర్.
సమస్యేంటంటే, గ్యాస్ పెడల్ ని తొక్కామనుకోండి. దానిపైనుండి కాలు తీసేస్తే అది మళ్ళీ వెనక్కి అనగా యధాస్థానానికి రావటనికి కష్టపడుతోంది. అనగా, గ్యాస్ పెడల్ పైన కాలు తీసేసినా మీ కారు యాక్సెల్ అవుతూనే ఉంటుంది. అది డేంజర్ అపాయం.
అలానే గ్యాస్ పెడల్ ఫ్లోర్ దగ్గర ఇరుక్కుపోతోందనికూడా తెలిపారు టయోటా వారు.

On January 21, Toyota announced its intention to recall approximately 2.3 million select Toyota Division vehicles equipped with a specific pedal assembly and suspended sales of the eight models involved in the recall on January 26.

Toyota vehicles affected by the recall include:
• Certain 2009-2010 RAV4
• Certain 2009-2010 Corolla
• 2009-2010 Matrix
• 2005-2010 Avalon
• Certain 2007-2010 Camry
• Certain 2010 Highlander
• 2007-2010 Tundra
• 2008-2010 Sequoia

కాబట్టి, బాబయా!! జరహుషారుండాలే!!!

Jan 31, 2010

బి.టి వంగడాలు - జన్యుమార్పిడి

ఈరోజు వార్తా పుత్రికలో ఓ వార్త -
(యాజ్ యూజువల్గా) ప్రతిపక్షాలు, లెఫ్టిస్టు పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు *బీటీ గో బ్యాక్* అనే నినాదాలు చేసాయి

......

ప్రతీ జన్యుమార్పిడీ అపాయమేనా?
కొన్ని సమరాలనుండి (గత ఇరవైఏళ్ళుగా) ఎండోసల్ఫానో నువక్రానో లేక ఇంకో ఇంకో రసాయన ఎరువో విచ్చలవిడిగా వాడి, వాటర్ టేబుల్ని విచ్చలవిడిగా కలుషితంచేసి, సారాన్ని ఎరువులకర్పితంచేయటం ఒక ఎత్తు.
జన్యుమార్పిడి చేసి, కనీసం కొంతకాలం తెరిపి ఇవ్వటం ఒక ఎత్తు.
నిర్ణయించాల్సింది ప్రజాసంఘాలే, రైతు సంఘాలే.

ఒక(కొన్ని) ప్రశ్న(లు). నిజంగా ఎంతమందికి జన్యుమార్పిడి వల్ల జరిగే లాభలు లేక నష్టాలు తెలుసు? తెలిసినవారు ఎంతమందితెలియనివార్కి అర్ధం అయ్యేలా వవివరించారు, వివరిస్తున్నారూ? ప్రభుత్వం ఇలాంటి జన్యుమార్పిడి దిశల వైపు అడుగేయకముందు ప్రజలకు ఏ విధమైన సమాచారాన్ని విజ్ఞానాన్ని అందిస్తోందీ? ఏమైనా ఊరికి ఒక బ్రోషెర్ పంపిందా? అవగాహనా సదస్సులను ఏర్పాటుచేసిందా? ఒక హార్టీకల్చెరల్ అధికారికి దీనిగురించిన పస్టుహ్యాండు ఇన్ఫర్మేషన్ ఉందా?

నా ఉద్దేశంలో, జన్యుమార్పిడిని ఆహ్వానించాలి, వ్యతిరేకించాలి, నిరోధించాలి మరియూ నిషేధించాలి - అవసరాన్నిబట్టి, యాజమాన్యాన్నిబట్టి, అవకాశాన్నిబట్టి, విధివిధానాల్నిబట్టి, టార్గెట్స్ని బట్టి.

సరే ఎక్కడో గెల్కుతుంటే ఈ క్రింది రెండు లింకులు దొరికినయ్.
Genetic Engineering
Pros and Cons
Is Biotechnology Good?
http://aesop.rutgers.edu/~hamilton/lecture11.htm

Cornell helps India's small farmers fight moth larvae with genetically modified eggplant
By Krishna Ramanujan
http://www.news.cornell.edu/stories/Feb09/IndiaEggplant.kr.html

Jan 28, 2010

ఐ.ప్యాడ్

ముందుగా,
పొద్దున తెలుగువన్ లో రోజువారీ సినిమాలు ఏమున్నాయా అని చూస్తే పెళ్ళిపుస్తకం కనిపించింది. చూద్దాం అని నొక్కా, గుమ్మడి గురించి ముందు నాలుగు మాటలు వచ్చాయి. అదేంట్రా బాబూ అని ఈనాడు చూస్తే గుమ్మడి స్వర్గస్తులయ్యారనే వార్త. చాలా బాధేసింది. రామారావు నాగేశ్వర్రావు రంగారావు లాంటి మహామహులతో సరితూగగల నటడు.
నా దృష్టిలో అలాంటి నటులకు చావులేదు. తెలుగు సినిమా బతుకున్నంతకాలం వాళ్ళు బతికే ఉంటారు. కేవలం భౌతికంగా మనమధ్యన లేరు. అంతే.

నిన్న సీరియస్ గా దేనిగురించో ఆలోచిస్తూ నా ఐఫోన్ లో గెలుకి సమాధానం రాబడుతుంటే ఇలా అనిపించింది. వాహ్, ఎంత ఫెసిలిటీ ఈ ఐఫోన్ లో, ఇలాంటిదే కొంచెం పెద్దది వస్తే ఇక ల్యాప్టాప్ తో పనేంటి అని.

సాధారణంగా మనకి రోజువారీ పనులకి కావాల్సింది, వై-ఫై కనెక్టివిటీ, ఓ బ్రౌజర్, మెస్సెంజర్, ఫైల్స్ ని దింపుకునేమ్దుకు ఒక టూల్, స్టోరేజి ఆటిని దాచేస్కోటానికి, ఓ డాక్ ఎడిటర్, యాట యాట యాట. ఇక అంతకన్నా ఏంకావాలీ?
ఈరోజూ రేపట్లో గూగుల్ వాడు అన్నీ ఇస్తున్నాడు. గూగుల్ డాక్స్లో వర్డ్ డాక్స్ని తెరవచ్చు, కొత్తది నిర్మించవచ్చు ఏమైన్ చేయవచ్చు. అలానే పోర్టబుల్ డాక్ ఫార్మాట్ ని గూగుల్ డాక్స్ ద్వారా తెరవ వచ్చు. ఎక్సెల్ ఫైల్స్ ని కూడా. కావాల్సిందల్లా వీటిని యాక్సెస్ చేయటానికి ఓ బ్రౌజర్.

ఇలాంటి వసతులు కలిగి, పోర్టబుల్గా ఉన్న కాన్సోల్తో వచ్చిందే ఈ ఐప్యాడ్. దీన్ని టచ్ స్మార్ట్ కంప్యూటర్ అనికూడా అనుకోవచ్చు.

ఐతే, దీని రహస్యం ఏంటంటే, యాపిల్ వాడి ఐట్యూన్స్ స్టోర్, వైడ్ రేజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఈరోజున యాపిల్ వాడి స్టోర్లో లక్షల అప్లికేషన్స్ ఉన్నాయ్.

ఉదాహరణ -
నాకు గూగుల్ టాక్, యాహూ, యం.యస్.యన్ లాంటి ఐయంస్లో ఒకోదాంట్లో మూడు ఐడీలతో ఎకౌంట్లున్నాయనుకుందాం.
ఐఫోన్లో ఫ్రింజ్ అని ఒక అప్లికేషన్. ఉచితం. దీతో అన్నీ ఐ.యంస్ ని అనుసంధానించుకోవచ్చు. తర్వాత, సే నా లిస్టులో సూర్య అనే పేరుందనుకుందాం. ఈ అప్లికేషన్లోకి లాగిన్ అయి, సూరిగాడు అన్లైన్లో ఉంటే, నేను వాడికి కాల్ చేయవచ్చు (ఐ.యం టు ఐ.యం - ఫోన్ కాదు) లేక మెసేజీ పెట్టవచ్చు (ఛాట్) లేక ఐఫోన్ ౩-జి యస్ ఐతే వీడియో ఛాట్ చేయవచ్చు.

ఇంకో ఉదాహరణ -
స్కైప్ వాడిది ఉచిత అప్లికేషన్. నేను నా ఐఫోన్లో స్కైప్ లోకి లాగిన్ అయి, ఎక్కడో గుంటూర్లో ఆన్లైన్లో ఉన్న మా బామ్మర్దితో ఛాట్ చేయవచ్చు, కాల్ చేయవచ్చు (స్కైప్ టు స్కైప్) లేక ౩జి యస్ ఫోన్ ఐతే వీడియో కాల్ చేయవచ్చు.

ఇంకో ఉదాహరణ -
ఐపాడ్ టచ్ ఉంటే, సే, నిక్ జూనియర్ అప్లికేషన్ ఉచితంగా దింపుకుంటే, నిక్ జూనియర్ ఛానెల్ చూడవచ్చు. కావాల్సింది వై-ఫై.

చేతిలో కంప్యూటర్ ఉన్నట్టే కదా.
ఐప్యాడ్ అనేది ఇలాంటి ఒక పరికరం అన్నమాట. ఇది ఐపోడ్కి ఎక్స్టెన్షన్ అన్నమాట.

Jan 27, 2010

ఇదో ఆర్టు

ఏటి!! సావాన్యమనుకున్టన్నావేటి....
ఇలా నువ్వు సేయగలవా? సేయగలవనేనా??

Jan 21, 2010

ఓ పళ్ళడాక్టర్ కాడి ఇషయం

బాసూ ఇది విను
ఏంటి
పళ్ళవైద్యుడికాడికి బొయ్యా
ఓహో!! ఏంఇటంటాడు వాడు
అదోపెద్ద గాధ నాయనా
ఇవరంగా సెప్పు -
తలుపులు తీపించినా
ఆశుపత్రి ఊడ్చేవాళ్ళు లైటు పంఖా ఏసిపొయ్యారు
ఇక డకటేరు కోసం కూకొని కూకోని కాళ్ళు లాగేసినై
అయ్యిందా, ఉండు ఉండూ ఇంకా కాలా!! అప్పుడొచ్చాడు డాకటేరు. లోనకి బైటికి లోనకీ బైటికీ తొంగి సూట్టం తలుపులేస్కోటం.
మొత్తానికి పిలిసాడు లోనకి
ఎళ్ళా, కూకున్నా
నోరు తెరు అన్నాడు
తెరిసా
నరుసుని పిలిసాడు
ఏదో సూపించమన్నాడు
సేయిపెట్టిసూపించబోయింది
నీఎంకమ్మ, గ్లౌజులేస్కురా అని అర్చాడు

సరే అయ్యింది, లేచాను, ఇంతలో నెక్స్ట్ పేషంటు, వచ్చి కూకుంది, డాక్టరు అదే గ్లౌజుతో ఆమెకాడికి పొయ్యాడు, నే పారిపొయ్యి వచ్చా.

అదీకధ.....

Jan 19, 2010

మరో కేసీఆర్నౌతా - అమర్ సింగ్

మరో కేసీఆర్నౌతా - అమర్ సింగ్!!!
:):)
అబె గధె! ఫిర్ గధ కైకు బన్నాహై?
ఐనా, కేసీఅర్ *ఒకే ఒక్కడు*. మేం ఒప్పుకోం. సెరిత్రలో ఒకే కేసీఆర్ ఉండాలే

Jan 14, 2010

*ధరల నియంత్రణ* చర్చిద్దాం రండి -

ఇప్పటివరకూ అన్ని పార్టీలూ చాలా విషయాల్లో మద్దెల దరువు వేసారు, మనం చూసాం. అలాంటివాటిల్లో ఒక ముఖ్యమైనది - *ఆకాశాన్నంటుతున్న ధరలు*.
ట్రాన్స్పోర్టేషన్ ధర పెరిగింది, గిడ్డంగుల అద్దె పెరిగింది, కూలీ ధర పెరిగింది, డ్రైవర్కిచ్చే బేటా పెరిగింది, ఇలా ప్రతీ ఎండ్పాయింట్లో, ఒక డామినో ఎఫెక్టు వల్లా అన్నీ *పుష్* కాబడుతున్నాయి.
ధరలు తగ్గించటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందీ అని ప్రతిపక్షాలు ఒక రాయి వేస్తాయ్, వేస్తున్నాయి ప్రతీసారీ. కావచ్చు. అయిఉండవచ్చు కూడా. మొత్తం సిస్టంని దృష్టిలో ఉంచుకుని, ఊకదంపుడు వ్యాఖ్యలు చేసే రాజకీయనాయకులకు, వినాయకులకు, చేతకాని దద్దమ్మల విదేశీనీడన పరిపాలన చేస్తున్న వెన్నెముకలేని ప్రభుత్వాలకు, మనలో ఎవరైనా *ఇదీ ధరలనియంత్రణా విధానం* అని కనీసం బ్లాగులోనైనా ప్రచురించగలిగితే!! అనే ధృక్పదంనుండి -
ధరల నియంత్రణ ఎలా చేయవచ్చి మీరనుకుంటున్నారూ?

Jan 13, 2010

ఆంధ్రా వస్తు భహిష్కరణ -

ఆంధ్రా వస్తు భహిష్కరణ -
పొద్దున్నే దందధావనం దేంతో?
కోల్గేట్ పామోలివ్
స్నానం ఏ సబ్బుతోజేస్తా?
డోవ్
తలకి నీళ్ళు ఏ షాంపూతో పోస్కుంటా?
హెడ్ అండ్ షోల్డర్స్
బట్టలు ఏంకట్టుకుంటా?
లోన జాకి
సొక్కా వ్యాన్ హ్యూసన్
పాయింటు అల్లెన్ సాలి
బూట్లేమేస్కుంటా?
నైకి, లేక రీబాక్
ఏబండి నడుపుతా?
హాండా, లేక సుజుకి
ఏ కార్ నడుపుతా?
సుజుకి, లేక హాండా లేక ఫోర్డ్, లేక మిట్సిబిషి
ఏందమ్ముకొడతా?
ఎచ్.డి విల్స్
ఏంకళ్ళజోడు పెడతా?
రేబాన్

ఇప్పుడేందీ గోల, ఆంధ్రా వస్తు బహిష్కరణ
నాకో విషయం అర్ధం కావట్లా ... ఆంధ్రలో కూడా ఇదేకదా తంతు ...
కొత్తగా ఈ బహిష్కరించుడేందో!!! దేన్ని బహిష్కరించాల్నో సంఝైతల్లే....

Jan 8, 2010

జ్ఞాపకాల దొంతర - జనవరి

ఆరోజుల్లో -
మండుటెండలకి సుప్రసిద్ధమైన పల్నాడ్లో కూడా డిశెంబరు జనవరుల్లో సలిపుట్టేది. సలిమంటేసుకునేవాళ్ళం. పొద్దున్నే మంచుదొంతరలు కప్పేసేవి ఊరుఊరుని, పంటపొలాల్ని. గడ్డిమీన, చెట్లమీన పూరిగుడిశెలమీనా మంచుబిందువులు కప్పుకునుండేవి.
అట్టాంటిరోజుల్లో, జనవరి నెల మొదట్లో -
రెండోమూడో మానికల బియ్యం నానబెట్టి,
నీడపడని కొంచెం సురుక్కుమనే ఎండలో నులకమంచం వాల్చి
పైన దుప్పటిపరిసి
బియ్యం ఆ దుప్పటిమీన పల్సటిపొరలా పోసి,
బాగా ఆరేంతలో
గోడకానోనున్న రోలు సుబ్బనంగా కడిగి,
రోకలి సుబ్బనంగా కడిగి
తడిలేకుండా తుడిసి
మెద్దానం రెంటికో మూడుకో ఇక రంగంలో దిగితే
ఒకపోటు, జూడుపోటు
ఆ బియ్యం రోట్లో ఏసుడు పోటు ఏసుడు
దంచిన్దాన్ని జల్లెళ్ళో పోసి జల్లెడపట్టి కిన్దకి దిగని నూకని మళ్ళీ రోట్లో ఏసి
అట్టా మొత్తం అయినాక, బియ్యప్పిండిని మళ్ళోరోజు ఎండబోసి
పిండిబాగ ఏడెక్కినాక
పొయ్యెట్టి, మంచిబెల్లంతో పాకంపట్టి యాలుకలేసి కమ్మగా చలిమిడి ముద్ద చేస్తే,
ఇక పెద్ద ఇనప భాండిపెట్టి, నూనెపోసి అమ్మ కూర్చుంటే,
నేనూ అన్నయ్య ఇద్దరం బాదం ఆకులమీద చలిమిడి ముద్దపెట్టి గుండ్రంగా అప్పచ్చిలా నొక్కి ఇస్తే బాగా కాల్చి పీటలాంటె ఓ జల్లెడమీద పెడితే దాన్ని నూనెకక్కేలా నొక్కితే -
ఆవచ్చిన అరిశెలు* కరకరలాడుతూ, ఎన్నితిన్నా ఇంకా తినాలనిపించే అరిశెలు.
.....................
జనవరి నాకు అత్యంత ఇష్టమైన నెల. కారణం *రేగ్గాయలు*. :):)
దోర రెగ్గాయలు తినీ తినీ పసరుపడేది.
ఇక పండువి తినీతినీ పళ్ళు పులిసిపొయ్యేవి.
అదొకెత్తైతే రేగి అప్పచ్చులు. రేగిపొట్టుపచ్చడి.

నోరూరుతోంది...ఏంచేయ్యటం??

యావత్ జనులకూ సంక్రాంతి శుభాకాంక్షలు