Showing posts with label టెక్నాలజీ. Show all posts
Showing posts with label టెక్నాలజీ. Show all posts

Dec 19, 2024

యాపిల్ గుండు

 నా పుట్టినరోజుకి మా అన్నయ్య యాపిల్ వాచ్ బహుమతిగా పంపించాడు

ఇంట్లో శ్రీమతి గారికి సూరిగాడికి యాపిల్ వాచ్ ఎప్పట్నుంచో ఉన్నాయి.2018లో నేను సాంసంగ్ గాలక్సీ కొన్నాను. ఎంటేలుకి వెళ్ళినా పెట్టుకుని వెళ్ళే స్తాయికి ఎదిగాను. 2022లో ఉన్నట్టుండి పాపం నిమిషానికి ఒకసారి క్రాష్ అవ్వటం మొదలైంది. ఇక ఆ వాచ్ కి అంత్యక్రియలు కొత్త వాచ్ ఏది కొందాం అని చూస్తే amezfit అనే వాచ్ నచ్చి కొనుక్కున్నా.

రెండేళ్ళయ్యింది దాన్ని ధరించటం మొదలుపెట్టి, నాకు నచ్చింది. స్యాంసంగ్ అంత వర్సటైల్ కాకపోయినా!

పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య ఏరా నీకు యాపిల్ వాచ్ లేదు కదా, యాపిల్ ఎకొ సిస్టంలోని వాచ్ అయితే బాగుంటుంది పింపిస్తా ఉండూ అని పంపించాడు.

శ్రీమతి గారితో యాపిల్ వాచ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అసలు మనం యాపిల్ ని ఎప్పట్నుంచి మొదలు పెట్టాం అనే దగ్గరకి వెళ్ళింది

2008 అక్టోబర్ లో అనఘ పుట్టిండి. నవంబర్లో iPhone 3 కొన్నాను. iPhone గమ్మత్తు ఏంటంటే రిలీజ్ అయిన ఏడాది ఫోన్ ధర $999. అప్పట్లో యాపిల్ వాడు ATT తో కలసి అమ్మేవాడు.

గత 16 ఏళ్ళలో ఇప్పటికి iPhone 3 4 5 6 6s 7 8 10 10s xs 11 12 12max 12 max pro 13 max 13 max pro 14 max 15 max pro 16 max అయ్యాయి. అవికూడా నాలుగు ఫోన్లు అయ్యాయి. నలుగురికి నాలుగు అన్నమాట. ఒక $25000 అయ్యుండచ్చు కేవలం ఫోన్లకి

iPhone మొదలైనప్పటినుండి గుండు కొట్టించుకోటంలో కొత్తరకం మొదలైంది డేటాప్లాన్ రూపంలో. నెలకి $30. ఇప్పటికి 16 ఏళ్ళు. 16*12*30=5760, కేవలం ఒక ఫోన్ కి. ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని గుండ్లు.

దీనెమ్మ జీవితం యాపిల్ వాడికి ఏ జన్మలో ఋణపడ్డామో ఏమో ATT వాడి దగ్గర ఏ జన్మలో అప్పులు కొట్టేశామో ఏమోగానీ.... ఇప్పటికి ఒక $30 $35 వేల డాలర్లు కట్టి ఉంటాం

Jan 6, 2021

తెలుగు పాటలు Open Project ఆలోచన/అవకాశం

 ఆ మధ్యకాలంలో హిందీ లిరిక్ కోసం smriti.com అనే ఒక వెబ్సైట్ కి వెళ్ళేవాడిని. ఎందుచేతనో ఆ సైట్ మూతపడింది.


ఆ సైట్ తయ్యారు చేసినవారు ఒక మంచి ఆలోచనతో చేశారు.

పాట వెతుక్కోటానికి - మొదటి అక్షరంతో వెతుక్కునేలా లిస్ట్ చేశారు.

పాడిన వారి ద్వార వెతుక్కునే విధమూ ఉంది.

కథానాయకుడి పరంగా వెతుక్కునే విధమూ ఉంది.

సంగీతదర్శకుడి పరంగా వెతుక్కునే విధమూ ఇచ్చారు.


తెలుగులో అలాంటి సైట్ ఉన్నట్లు నాకు ఎక్కడా తగల్లేదు.


అలాంటి సైట్ తయ్యారు చేయటానికి కావాల్సిన ముడి పదార్థాలు నేను స్పాన్సర్ చెస్తాను. ఓపిగ్గా కూర్చుని కోడింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకి రండి.


సోదరుడు వేణు శ్రీకాంత్ ఎన్నో పాటలు తన బ్లాగులోకి ఎక్కించాడు. సోదరుడి సహాయం తీసుకోవచ్చు పాటల కోసం.

Aug 19, 2020

Phone Tapping


ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద బురద చల్లటం బహు సాధారణం. అయితే బురద చల్లేప్పుడు తమ చేతులకీ సదరు బురద అంటుకుంటుందనీ, అది తమ మీదా పడుతుందీ అని గుర్తించకపోవటం కేవలం కళ్ళుండి గుడ్డితనం.


Phone Tapping అయ్యింది అని ఒక పార్టీ అరుపులు.


అసలు ఇక్కడ Tapping అనే పదం కరెక్టేనా?

నాకు ఒక కాల్ వచ్చినప్పుడు, ఆ కాల్లోకి చొచ్చుకొచ్చి దాన్ని మూడో చెవి వినగలదా?


ఫోన్లోకి దూరి డేటాని కొట్టేయటం అనేది - హ్యాక్ చేయటం అంటాం.

ఫోన్ సంభాషణలు పట్టటానికి చిన్నా చితకా హ్యాకర్లు చేయలెరు అని నా అభిప్రాయం.



నల్లమోతు శ్రీధర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు - 

1. కొత్త టెక్నాలజీతో (ఇజ్రాయల్ సూట్కేస్ సైజ్ ఫోన్ ట్యాపింగ్ సిస్టం) వాయీస్ ట్యాపింగ్ సాధ్యమే.

2. "ఫోన్ ట్యాప్ చేస్తే దాన్ని కనుక్కోలేరు" అని.


నాకున్న నెట్వర్కింగ్ స్కిల్ల్స్ మరియూ పరిజ్ఞానం పై స్టేట్మెంట్స్ మీద కామెట్ చేసే స్థాయిలో లేదు. కానీ, రెండో పాయింట్ - ఫోన్ ట్యాప్ చేస్తే కనుక్కో లేము అనేది wrong statement అని నా అభిప్రాయం.


ట్యాప్ చేస్తే మిమ్మల్ని కనుక్కోలేరు కాబట్టి మీ ఇష్టం అనే ఓ అలోచనకి ఊతం ఇచ్చేలా ఉంది.


ఒక ఫండమెంటల్ ప్రశ్న - ట్యాప్ చేసేంత స్థాయి చంద్రబాబుకి ఉన్నదా?


ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చెసిందనీ, ప్రైవేటు వ్యక్తులు ట్యాప్ చేస్తున్నారనీ ప్రధానమంత్రికి లేఖ వ్రాశారు చంద్రబాబు గారు.


బ్లాగులోకంలో ఎందరో టెకీలు - దీని గురించి స-వివరంగా సమాచారం ఇచ్చేవాళ్ళుంటే బాగుంటుంది.

ఈ వ్యవహారం అనేక కోణాలు

48 గంటలు ఛాలెంజ్ - బుట్టదాఖలు

రోజుకో కొత్త అరుపులు అని కొందరి భావన.


అసలు యై.యస్.ఆర్.సీ.పి న్యాయవ్యవస్థ మీది గౌరవం లేదని అస్థిత్వం లేని జనశక్తి అరుపులు


మీదగ్గర ఆధారాలుంటే ముందుకు రావాలి కదా అని అస్మదీయ వర్తా పరికల అరుపులు


మాదగ్గర ఆధారలున్నాయి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాం అని తెదేపా అరుపులు


Apr 5, 2020

ఇయర్ బడ్స్

సూరిగాడు వాడి పడేసిన ఇయర్ బుడ్స్ వాట్టం మొదలెట్టాను నావి పక్కన పడేసి. హంగులు ఆర్భాటాలు పక్కన పెడితే ఇవి పెట్టుకుంటే చెవిటోడితో సమానం. పక్కన *బం* పడ్నా తెలియదు.

ఇంతలో కొత్త సమస్య -
ఎడమ చెవిది వినబడును
కుడిచెవిది వినబడదు

ఎన్నోరకాలుగా *ఎక్కడా ఇక్కడా నొక్కినా* పనిజేయటంలేదు
వాడినే అడిగా ఏరా అని
హా అవి ఔట్ ఆఫ్ సింక్ అన్నాడు
భలే భలే మరి సింక్ చేయటం ఎలా అడిగాను
నాకు హోంవర్క్ ఉందని వెలుగులోకి జారుకున్నాడు నన్ను చీకట్లోకి నెట్టి

అలా కుస్తీ సిగపట్లు పడుతుండగా ఏకళనుందో కుడిది పనిచేయటం మొదలెట్టింది

అనూహ్యంగా ఎడమది పనిచేయటంలేదు

ఈ సమస్యని పూరించిన వారికి నా రెండు ఇయర్ బడ్స్ నుంచి ఒకదాన్ని నిట్ట నిలువునా చీల్చేసి బహుమతిగా ఇస్తానని వాక్దానం చేస్తూ నా రాజ్యంలో చాటింపు వేయిస్తున్నా

May 19, 2018

Windshield

మొన్నోరోజు HOV లైన్లో నా మానాన నేను ఇంటికి కారు నడుపుకుంటూ రేడియో వింటూ వెళ్తున్నా. US 290 expansion గత పదేళ్ళుగా నడుస్తున్నది. సూరిగాడికి పెళ్ళై పిల్ల్లు పుట్టేప్పటికి తప్పక రెడీ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. సరే, మొన్న అలా వెళ్తున్న నేను నా పక్కనే ఓ పెద్ద ట్రైలర్ వెళ్ళటం గమనించాను. అది వెళ్ళిన ఒక నిమిషానికి ఓ పెద్ద శబ్దం. బెలూన్ పగిలిన శబ్దం వినిపించింది. ఏదో ట్రైరో ఏదో బ్లాస్ట్ అయుంటుందని అనుకుని నా మాన నేను ఇంటికొచ్చి, కారాపేసి, తాళం తీస్తూ Windshield right corner వైపుకి అనుకోకుండా చూశాను. రెండు అరచేతుల మేర అద్దం పగిలిపోయుంటాన్ని గమనించి గుండె గతుక్కుమంది. అదే అద్దం మొత్తం పగిలి షాటర్ అయి కళ్ళల్లోనో ముఖంమీదనో పడుంటే అనిపించింది.

ఈ దేశంలో క్రాక్ కొట్టిన అద్దాలతో కార్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎందరో.
పగిలిపోయినా నెర్రె కొట్టిన అద్దంతో తిరగటం ఏమాత్రమూ మంచిది కాదు. సెక్యూర్ అసలు కాదు.
ఈ దేశంలో ప్రతీదానికి బీమా ఉండాలి. ఇండి తీరాలి. బీమా సర్వ రక్ష అనుకుంటాం. కానీ కాదు. బీమా ప్రతినిధి కాలికేస్తే ఏలుకేస్తాడు. ఏలికేస్తే కాలికేస్తాడు. చివరాకరికి డిడక్టబుల్ అంటాడు. అక్కడే మనకి గొళ్ళెం పడుతుందని తెలియని బీమా గొర్రెలం మనం.

వెంటనే బీమావారికి కాలు చేస్నినాను. అమ్మా అయ్యా ఇదీ పరీస్థితి అని. అయ్యోపాపం ఔనా! అరె! అలా అయ్యిందా? సారీనే! బాధపడకు మరి. ఇవన్నీ సహజం...ఎన్నిమాటలు చెప్పిందో ఆమె. మా పెదనాన్నగారి బాబాయి కూతురు కూడా అంత ఇదిగా మాట్టాడుండదు.

అక్కా! సరేకానీ, ఏవన్నా సహాయం చేస్తావా? అన్నాను చివరికి ఆశతో దింపుడు కళ్ళతో.
తమ్మీ! హనీ! నేనిక్కడుంది ఎందుకనుకున్నా! భలేవాడివే! సేఫ్లైట్ అని ఓ కంపెనీతో మనకి మాంచి రిలేషన్ ఉంది. వాడికి చెప్పి నీ అద్దం బిగించేయిస్తా. అయితే నీ డిడక్టబుల్ #$500 కదా! ఏటి? అలా బేలగా చూడకు. అద్దం ఖరీదు #$299 అవుతుంది. వాడొస్తాడు. ఆడబ్బులిచ్చి చక్కగా వేయించుకో అంది ఆమె హుందాగా గొప్పగా పెద్దగా ఓ అక్కలా ఓదార్చుతూ.

కర్మరా బాబూ అనుకుని వాడితో అపాయింటుమెంటు తీస్కుని నిట్టూర్చాను.

ఓ సాయంత్రం వాడొచ్చాడు, సేఫ్లైట్ అని వ్యాన్ వెస్కుని. హహహ! ఏవిటి! హహహ అద్దం పగిలిందే హహహ అంటాడు. అన్నాయ్! నవ్వకు! నీ డబ్బు నాజేబుకి చిల్లు. ఏంచేస్తాం అని వాడికి కారు అప్పగించాను.

కానీ వాడు బాగనే చేసాడని నా అభిప్రాయం.

Dec 14, 2012

కొత్త కెమేరాలు

క్రిస్మస్ సీజన్ వచ్చింది. ఎలక్స్ట్రానిక్స్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో ఏ కెమెరా బెస్టూ అని ఒక మిత్రుడడిగాడు.
ఇంతక ముందు నేను కెమెరాలపై ఒక టపా వ్రాసినా మళ్ళీ ఓమారు వ్రాస్తున్నా.
కెమేరాలు ఇప్పుడు మూడు రకాలనుకోచ్చేమో
1. పాయింట్ అండ్ షూట్
2. మిర్రర్ లెస్
3. డిజిటల్ యస్.యల్.ఆర్

పాయింట్ అండ్ షూట్ కెటగిరీలో కేనన్ వాడు కొత్తగా యస్.యక్స్ ఫిఫ్టీ హెచ్‌యస్ రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు కేనన్ సైట్లో
http://www.usa.canon.com/cusa/consumer/products/cameras/digital_cameras/powershot_sx50_hs
Inline image 1
మొన్న నా మిత్రుడు కెమేరా కొందాం రా ఆని పిలిస్తే బెస్ట్ బై అనే షాపుకి వెళ్ళినప్పుడు చూశాను ఈ కెమేరాని. దీని ముందరి వెర్షనుకీ దీనికీ పేద్ద తేడా లేదనుకుంటాను. దీని ముందరి వెర్షన్ యస్.యక్స్ వార్టీ. ధరలో ఐతే పేద్ద తేడా లేదు
Inline image 2
జూం లో తేడా ఉన్నది, ఐ.యస్.ఓ ఆప్షన్స్ కొత్తదాంట్లో ఎక్కువున్నాయి. చూస్కుని వీటిల్లో ఏదోకటి కొనుక్కోచ్చు
మిర్రర్ లెస్ కెమెరాలని కొత్తగా విపణిలోకి కొన్ని కెమేరాలొచ్చాయి.
వికీవిక్కయ్య ఏవంటాడంటే
The Mirrorless interchangeable-lens camera (MILC) is a popular class of digital system cameras. Unlike a compact digital camera, a MILC is equipped with an interchangeable lens mount and unlike a digital single-lens reflex camera, a MILC does not have a mirror-based optical viewfinder.
నైకాన్ 1
Inline image 3
పానసానిక్ లూమిక్స్ GF5
Inline image 4
ఇంకా శాంసంగ్ వారి NX 200

Inline image 5
కేనన్ వాడి ఈ.ఓ.యస్. యం
Inline image 6
ఇంకా సోనీ, ఒలింపస్ ఇత్యాదివారివి కూడా ఉన్నాయి.
ఇవి పాయింట్ అండ్ షూట్ లాంటివే కానీ లెన్స్ మార్చుకోవచ్చన్న మాట.
ఇక మిగిలింది డిజిటల్ యస్.యల్.ఆర్.
కేనన్ వాడి T4i బాగుంది.
Inline image 7
ఐతే కొనేప్పుడు రివ్యూలు గట్రా చూస్కొని కొనుక్కుంటే మంచిది.
ధర పాయింట్ అండ్ షూట్ 300-400 ఉంటే మిర్రర్ లెస్ 500-800 ఉంటే T4i వచ్చి 800-900 ఉన్నది కిట్ లెన్సుతో కలిపి

May 24, 2012

డిజిటల్ యస్.యల్.ఆర్ లెన్స్

ఈమధ్య మిత్రులు చాలా మంది డిజిటల్ యస్.యల్.ఆర్ కెమెరాలు కొంటున్నారు లేక కొందామనుకుంటున్నారు.
ఐతే, కెమెరా కొనంగనే సంబడం కాదు, దానికి తగ్గ లెన్స్ కూడా ఉండాలోయ్ అని కామేశ్వర్రావ్ అన్నట్లు, ఔను! నిజమే. దానికి తగ్గ లెన్స్ కూడా ఉండాలి. ఉండి తీరాలి. బాడీ ఓన్లీ కొన్నవారికి ఇంతక ముందరివి కొన్ని లెన్స్ ఉండే అవకాశం ఉన్నది. బండిల్ కొన్నవారికి కొన్ని లెన్స్ వచ్చి కలెక్షనులో చేరే అవకాశం ఉన్నది.
పెద్ద కెమెరాలు కొంటే వాటితో బండిల్ అయి వచ్చే లెన్స్ ఒక కేటగిరీ ఐతే, చిన్న కెమెరాలతో వచ్చే బండిల్ లెన్స్ వేరే.
Canon EF-S 18-55mm f/3.5-5.6 IS SLR Lens చిన్న కెమేరాలతో ఇది బండిల్ లెన్స్గా వస్తుంది.
కొంచెం పెద్ద కెమేరాతో ఐతే 18-135mm f/3.5-5.6 IS UD వస్తుంది బండిల్ లెన్సుగా

ఐతే, సధారణంగా ఒక కెమెరాకి ఏఏ లెన్స్ అవసరం అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నే! దీన్ని ఇలా వర్గీకరించవచ్చు
రోజువారి అవసరానికి
ల్యాండ్‌స్కేపింగుకి
పొట్రైట్స్ తీయటనికి
స్పోర్ట్స్ అవసరాలకి

రోజువారీ అవసరాలకీ అంటే? కెమెరా చంకనేస్కుని బయటకి వెళ్ళామనుకుంటే, కసక్కున రోడ్డుమీద ఏదో తీయాలనిపించింది, లేక పార్కుకి వెళ్ళాం, ఓ పూ పొదని తీయలనిపించింది....ఇత్యాదివి రోజువారీ అనుకోచ్చు.
ల్యాండ్స్కేపింగ్ అనేది మనం పనిగట్టుకుని ఏ దుర్గం చెరువు దగ్గరకో వెళ్ళి కొండనెక్కి సూర్యాస్తమయాన్ని తీద్దామనుకున్నపుడు ఇది అవసరం.
పోట్రైట్స్ అంటే ఇంట్లో, పిల్లల్ని లేక టైమర్ పెట్టి కుటుంబాన్ని తీస్కోవాలనుకోటానికి
స్పోర్ట్స్ అవసరాలు అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని కసక్కున లాగాలంటే.


1. Everyday lens - Canon EF-S 17-55 f2.8 IS - Costs $1099

2. Landscape lens - Canon EF-S 10-22mm f/3.5-4.5 USM SLR Lens for EOS Digital SLRs - Costs Price:     $799.00

3. Portrait lens/Prime lens - Canon 85 f1.8; Canon 50mm and so on

4. Sports lens - Canon EF 70-200mm f/2.8L USM Telephoto Zoom Lens costs Price:     $1,329.40

Canon 35mm f/1.4 L USM Lens పిల్లల్ని తీయటానికి పుట్టిన్రోజు పార్టీలకీ బాగుంటుందని చెపుతుంటారు. దీని ధర $1,379.00.

చూడాల్సింది యఫ్-నెంబర్
పైవాటిల్లో కొన్ని f2.8, కొన్ని  f/3.5-4.5  కొన్ని f1.8.
f/number పెరుగుతున్న కొద్ది ధర తగ్గుతుంటుంది.

http://upload.wikimedia.org/wikipedia/commons/8/87/Aperture_diagram.svg
Inline image 1
[గమనిక :- ఇవన్నీ నేను అక్కడా ఇక్కడా సంపాదించిన విషయాలు. నాకన్నా బాగా తెలిసిన వారు పైన నే చెప్పిన విషయాలపై అవగాహన ఉన్నవారు సలహాలు ఇవ్వ ప్రార్థన. ఇది కేవలం సమాచారం కొరకే అని గమనించ గలరు.]
లెన్సుల రివ్యూ కొరకు http://www.the-digital-picture.com/Reviews మంచి సైటు

Mar 17, 2012

ఐప్యాడు మూడు


అదన్నమాట సంగతి. ఈపొద్దు ఉర్కుతాబోయి ఐప్యాడు కొనక్కొచ్చినా. రాంగనే ముందర ఈనాడు.నెట్, రమాకాంరతావు.బ్లాగుస్పాటు.కాము అని కొట్టుచూసినా. క్రిస్టల్ క్లియర్ గా ఉంది కథ

ఫోటో చెప్పలేనంత క్లియర్గా ఉంది
హోము గారితో ముఖసమయం (బుర్ర తిరిగిందా? అనగా! ఫేస్ టైం అని, అదియునూ తెలవదు తమకు...) ద్వారా మాట్లాడినాను, ఐఫోనుకి కాలు చెయ్యి చేసి. ఎక్సలెంటుగా ఉంది కథ.

ఇట్టా తీసింది నన్ను ఐప్యాడు ఈప్యాడు పుటోబు కసక్కున

Dec 3, 2011

తొక్కలో విండోస్ (విస్తా)

మొన్నమధ్య ఏదో సమస్యొచ్చి, కొత్త హార్డ్ డ్రైవ్ వేసి విస్తా ఇన్స్టాల్ చేసాను. ఆరు నెలలు అయ్యిందనుకుందాం. ఈ కొత్త హార్డ్ డ్రైవ్ రెండు టెరాబైట్లు. రెండొందల జిబి పక్కన పెట్టా. 1.8 టెరాబైట్ మిగిలింది.
విండోస్ విస్తా వేసా అందులో. బాగనే ఉంది. హాం౨డీ డాం౨డీగా పని చేస్తున్నది. బాగనే ఉంది. ఇంకో పార్టీషన్ చేయాల్సొచ్చింది. సి డ్రైవ్ సైజు చూసి షాక్ అయ్యా. 1.47 TB Avaliable from 1.79 TB అంటుంది. హా?? అంటే దాదాపు మూడొందల డెబ్భై జిబి గయా????
ఎక్కడకి పోయిందీ?
కొన్ని డిస్క్ యుటిలిటీస్ వేసి చూసాను.
ఉదాహరణకి, యూనిక్సులో డియు అని ఒక కమాండు. విండోసులో కూడా థర్డ్ పార్టీ దొరుకుతుంది. అది వేసి చూస్తే, సి డ్రైవులో యూజ్డ్ డిస్క్ స్పేస్ కేవలం ఎనభైఒక్క జిబి మాత్రమే వాడినట్లు చూపుతున్నది.


ఈ ఓపెన్ సోర్స్ టూల్ ఉంది. విన్‌డిఐఆర్‌స్టాట్ అని. అది మొత్తం స్టాటిస్టిక్స్ చూపుతుంది. రూట్ నుండి ఏఏ డైరెక్టరీలు ఎంతెంత ఆక్యుపై చేసాయీ అని. డెభై+ జిబీ సి డ్రైవు అని చెప్పింది.


కానీ, సి డ్రైవ్ మీద రైటు క్లిక్కు కొట్టి ప్రాపర్టీస్ చూస్తే, 342 GB యూజ్డ్ స్పేస్ అని చూపుతున్నది.



విండోస్ ఎక్స్‌పి నుండి మై*క్రో*సాఫ్ట్ వాడు షాడోకాపీ అని ఓ కాన్సెప్టు తెచ్చాడు.

http://en.wikipedia.org/wiki/Shadow_Copy
ఏందయ్యా అంటే స్నాప్‌షాట్ అన్నమాట
Shadow Copy (Volume Snapshot Service or Volume Shadow Copy Service or VSS), is a technology included in Microsoft Windows that allows taking manual or automatic backup copies or snapshots of data, even if it has a lock, on a specific volume at a specific point in time over regular intervals. It is implemented as a Windows service called the Volume Shadow Copy service. A software VSS provider service is also included as part of Windows to be used by Windows applications. Shadow Copy technology requires the file system to be NTFS to be able to create and store shadow copies. Shadow Copies can be created on local and external (removable or network) volumes by any Windows component that uses this technology, such as when creating a scheduled Windows Backup or automatic System Restore point.

vssadmin list shadows అని కొడితే లిస్ట్ చూపెడుతుంది. నా లాప్ టాప్ లో కేవలం రెంటి లిస్ట్ చూపెడితే నా డేస్క్ టాపులో, అంటే పై గోల నడుస్తున్న బాక్సులో ముప్ఫైకి పైగా చూపుతున్నది. అవి ఏవన్నా స్పేస్ ఆక్యుపై చేస్తున్నయా?

దీనయ్య విండోస్. మా సోదరుని లాగా, నేనూ తొందర్లో మా౨క్ ఓయస్సుకి మారితే బెటరని ఘాట్టిగా నిర్ణయించాను

Aug 11, 2011

యాన్డ్రాయిడ్ లో తెలుగు డబ్బాల్లా కనిపిస్తోందా?

నాదగ్గర డ్రాయిడ్ ఎక్స్ టు ఉంది. నా బ్లాగు తెరిస్తే డబ్బాలు డబ్బాల్లా రెండర్ అవుతుంది తెలుగు ఖతి. దీనెంకయ్య ఎట్రా బాబూ అనుకుని ఆడా ఈడా ఎతుకతనే ఉన్యా.
యాడా ఏదీ దొరకలా. ఇందాక యాణ్ణో గెలుకుతా ఉంటే ఓ తీగ నా మౌజు కాలికి రగిలింది. ఏందిరా అబ్బియ్యా అనిజూస్తే ఇదీ కత -
ఒపెరా మిని అంట దించుకో
ఒపెర మిని తెరువు
అడ్రస్సు బారు, మందుకొట్టే కాదులేప్పా, అడ్రస్సు బారులో opera:config అనంటా కొట్టు.
కిందకంటబో
Use bitmap fonts for complex scripts
అని ఉండిద్ది. ఉంటంఉంటం no అనుండిద్ది. దాన్ని yes కు మార్చి, save కొట్టు.
అడ్రస్సు బారులో బ్లాగు ఓపెన్ కొట్టు.....
టట్టడాయ్
అదన్నమాట
ఇంటికెళ్ళినాక స్క్రీన్ షాట్ పెడతాలేబ్బా......
ఇంక ఎంజా మాడు ఏంది గుడ్లప్పగించి సూస్తా


అప్డేట్ -
ఒపెరాలో బ్లాగ్

ఫైర్ఫాక్స్ ఆన్ డ్రాయిడ్, ఈనాడు మొబైల్ -

బాగుంది. వావ్ కేక.
ఐతే ఫైఫాక్స్ బ్లాగ్ తుస్సుమంది -


ఈనాడు ఒపేరాలో ఫ్లాప్

Jun 22, 2011

వీడియో గేమింగులో క్రొత్త ఒరవడి

ఈ మధ్య ఓ మితృడి ఇంటికి వెళ్ళినప్పుడు, వారి పిల్లాడు సూరిగాడు కల్సి ఓ ఆటఆడుతుంటే చూట్టానికి నేనూ వెళ్ళాను. నన్నాశ్చర్యపరచిందా ఆట. బౌలింగ్ ఆట అది. ఆశ్చర్యపరచటాకి కారణాలు ఇవి -
ఇంతక మునుపు నేను ఆడిన చూసిన ఆటలన్నీ ఓ కుర్చీలోనో సోఫాలోనో కదలకుండా కూర్చుని, ఆట్టానికి రిమోటు చేతిలో పెట్టుకుని రిమోటుని మాత్రమే వాడుతూ ఆటలోని కారెక్టర్లను కదలించటం జఱుగుతుండేది. కానీ ఇక్కడ, ఓ చిన్న సెన్సర్ ఉంది ఓ మూల, అది మన కదలికలను పట్టి, ఆ ఆటలోని ఓ కారెక్టరుకి ఆపాదిస్తుంది. వావ్!! భేషైన ఆలోచన అనుకున్నాను. ఆశ్చర్యపోయాను. ఆ సెన్సరుని ఎక్సుబాక్సు వాడు కినెక్ట్ అంటాడు. ఆవేళ వాళ్ళు ఆడింది ఎక్సుబాక్సులో కినెక్టు ద్వారా బ్రున్స్విక్ ప్రొ బౌలింగ్. చాలా బాగా నచ్చింది నాకు. సూరిగాడిక్కూడా బాగా నచ్చింది.

ఇంటికి వచ్చాక, మరి మనవద్ద పి.యస్ త్రీ కదా ఉంది, దానిక్కూడా ఇలాంటి ఇంటరాక్టివ్ గేమింగ్ టూల్స్ ఏవన్నా ఉన్నయా అని కొట్టాను గూగుల్లో.
ప్లేస్టేషన్ త్రీ కోఱకు , మరియూ మూవ్ మోషన్ కంట్రోలర్ అని ఒక సెట్టు కనిపించింది.
PlayStation_Eye.png
PSMove.png
 ఇదేదో బాగుందే అనుకుని వెతగ్గా వెతగ్గా ఓ బండిల్ దొరికింది అమెజాన్లో. పియస్ త్రీ మూవ్ + ఐ + స్పోర్ట్స్ ఛాంపియన్స్ బండిల్. సామ్స్ క్లబ్బులో ఏదోక డీల్ ఉంటే కొట్టేసా మొత్తానికి. ఇంటికెత్తుకెళ్ళంగనే టివీ మీద ఇ ని పెట్టా. స్పోర్ట్స్ ఛాంపియన్స్ గేమ్ డివిడి పీయస్ త్రీలో పెట్టా. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్కుంది. ఆట్టం మొదలెట్టా.
ఈ స్పోర్ట్స్ ఛాంపియన్సులో మొత్తం ఆర్ ఆటలు ఉన్నాయి.
255px-Sports_Champions.png
టేబుల్ టెన్నిస్ (పింగ్ పాంగ్)
బీచ్ వాలీబాల్
గ్లాడియేటర్
డిస్క్ గోల్ఫ్
బాచి
ఆర్చెరి

టెబుల్ టెన్నిస్ నన్ను భలే ఆకట్టుకుంది. ఎంత ఇంటరాక్టివ్ అంటే అంత. నిజ్జంగా టిటి ఆడిన ఫీలింగ్ వచ్చింది. మరోమాట, చెమటలు కక్కేలా ఆడుతున్నా. అదీ ముఖ్యమైన విషయం.
ఇక బీచ్ వాలీబాల్ కూడా చాలా బాగుంది. అనఘ నేనాడతా నేనాడతా అని దూకుతున్నది.
సూరిగాడికి ఫ్రిస్బి డిస్క్ గోల్ఫ్ బాగా నచ్చింది. తెగ ఆడ్డుతున్నాడు.
ఇక ఆర్చెరి భలే ఇంటరెస్టింగా ఉంది. ఐతే ఆర్చెరి ఆట్టానికి రెండు మోషన్ కంట్రోలర్స్ కావాలి. ఒకటి సంధించేది, రెండోది ఎక్కుపెట్టేది. సూరిగాడికి ఇదికూడా నచ్చింది. ఐతే ఇంకాస్త పెద్దైతేగానీ పూర్తిగా అర్థం అవ్వదు+కంట్రోల్ రాదు.
గ్లాడియేటర్ ఆట
Sports_Champions_Gameplay.jpg
గ్లాడియేటర్ అంటే కత్తి యుద్ధ వీరుడు అనగా కత్తుల కాంతారావ్ అన్నమాట. ఈ ఆటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆడితే చక్కటి కార్డియో గేం అవుతుంది.

వీడియో గేమ్స్, పొట్టకదల్దు ఇత్యాదివి అనుకునేవారు ఈ ఆటని తప్పక ప్రయత్నించాలి.

Dec 10, 2010

టా౨బ్లెట్ల యుద్ధం

NOTION INK వాడి ADAM అనే ఓ TABLET తొందర్లో రిలీజు కాబోతోంది అమెరికా మార్కెట్టులో.
ఇది దేశీయ కంపెని. బంగళూరు దీని ప్రధాన కేంద్రం.

Apple వాడూ ఏ ముహూర్తాన ipad అన్నాడోగానీ, టా౨బ్లెట్ల యుద్ధం మొదలైంది.

Apple ipad
new-product-wifi.jpg

పది టా2బ్లెట్లు ipad తో పోటీపడేవి ఇవిగో
JooJoo
for_home_page_use.png

HP Slate
c02063984.jpg
Exopc slate

product-slate-c.jpg

IVD Vega
ICDVega01.png
Viliv X70
s5_1.jpg

Plastic Logic QUE proReade
r
plasticlogic.jpg

Archos 9
A101it_sleek_design.png
Dell Steak
streak-design1.jpg

Asus Eee Tablet
78112.jpg
Notion Ink Adam
notion.jpg
Lenovo IdeaPad
lenovoideapad.jpg

అదబ్బా ఇంకా ఏవన్నా ఉన్యాయేమో, నాకు పెద్దగా తెలవదు. ఇవన్నీ దాదాపు మూడు వందల డాలర్ల నుంచి ఆరు వందల డాలర్ల ధరల్లో ఉన్నాయి. చాలామటుకు లైనక్స్ మీద చేసినవే.

Oct 4, 2010

గెలికితే ఏటౌద్దీ?

ఓ ఇదేం పెద్ద ప్రశ్నకాదు. గిలికితే ఏటౌద్దీ? రెండు విధాలు -
తెలిసి గెలికవా?
తెలియక గెలికావా?
అబ్బే అట్టా కాదబ్బా, తెల్సీ తెలియకుండా కూడా గెలకచ్చూ అన్నాడంట నాబోటిగాడు.
ఏంకత అంటే, పోయినేడాది మాయమ్మకు ఓ ల్యాపీ అంపించా. ఎచ్.పి పవీలియన్, డివి-౭ సిరీస్. నాలుగు జిబి రా౨ము..గట్రా.
ఇంటరునెట్టుకి తగిలించింది మితృల సహాయంతో...మొదటినాల్రోజులు బెమ్మానంగా పని సేసింది. దెన్ స్టార్ట్స్ స్ట్రగుల్. ఏందివయ్యా అంటే క్రా౨ష్ అవుతున్నది పావుగంట-అఱగంట కాంగనే.
మొన్నీమద్దిన అన్నయ్య గుంటూరెళ్ళినప్పుడు కొత్తదెత్తుకెళ్ళి దాన్ని తెచ్చి నా సేతిలో పెట్టాడు.
అవున్రొరేయ్ ఎందుకు క్రాషౌతున్నదంటా అన్నాడు అన్న. ఏమోరా అన్నా. పంఖా పని సేస్తల్లేదేమో దుమ్మో మట్టో దారవో వడ్డం పడుండిద్దేమో సూద్దామా అన్నాడు జంకుతా. మనం బుస్సున పైకిలేసి, స్క్రూడ్రైవర్ పట్రా అన్నా. జంకుతా జంకుత తెచ్చాడు. లా౨ప్టాప్ సెడగొట్టం అనే ఓ బృహత్తర కార్యక్రమానికి తెరదీసాం. మొత్తానికి ఊడదీసాం. పంఖా పనిసేయట్లేదని అరదం అయింది. సరే బిగించేద్దాం పంఖా కొని తర్వాత ఏయొచ్చు అనుకున్నాం. తిరిగి పెడతా ఉంటే జిఫ్ కనెక్టర్ ఊడిపోయింది. హమ్మనీ ఎన్కమ్మ నుకున్నాం. ఆయాల బీరుకొట్టి తొంగున్నాం.

ఇది తెరతీయటం పేర్లుపట్టం పటుకే అని తెలియజేస్కుంటన్నా. ఇప్పుడు వసలు కతలోకొస్తే -
రెండువారాలక్రితం
శనోరం మద్దేనం
జిఫ్ కనెక్టర్ని సోల్డరింగ్ గన్ తో అంటిద్దాం అనుకున్నా. మళ్ళీ ల్యాపీని ఊడదీసా....సోల్డర్ సేయటానికి రాలా. మదర్బోర్డ్ పైన జిఫ్ కనెక్టర్ పెట్టడానికి టైనీటీనీగా ఉండి, నాకు రాలేదు. సరే బంకపెట్టి అతికిద్దాం అని ప్రయత్నించా. అహా!! అతుక్కుందిగానీ, కనెక్టివిటీ పోయింది.


ఇంతకీ జిఫ్ కనెక్టర్ అంటే ఏంటీ అంటారా?
ల్యాపీలో కీబోర్డ్, డిస్ప్లే, పవర్, ఇత్యాదివి మదర్బోర్డ్ కి కనెక్ట్ చేసే కార్డ్స్ కొన్నుంటాయి. నేచెప్పేది పవర్/ఆడియో కంట్రోల్స్ ని మదరబోర్డ్ కి కనెక్టు చేసే కనెక్టర్ గురించి. ఇది పోతే పవర్ రాదు.

http://en.wikipedia.org/wiki/Zero_Insertion_Force

అదీ కథ....

Sep 25, 2010

కిరికిటీల మహత్యం - విప్పితిని

మొన్నటి నా సమస్యకు పరిష్కారం దొరికెన్ -
ఒక డైరెక్టరీ లో ఉన్న కేవలం సబ్‌డైరెక్టరీలను మాత్రమే నిర్మూలించే విధానం ఏంటీ?

RMDIR [/S] [/Q] [drive:]path
RD [/S] [/Q] [drive:]path

/S Removes all directories and files in the specified directory in addition to the directory itself. Used to remove a directory tree.
/Q Quiet mode, do not ask if ok to remove a directory tree with /S.

Examples

rmdir c:\test

Remove the test directory, if empty.

rmdir c:\test /s

Windows 2000, Windows XP and later versions of Windows can use this option with a prompt to permanently delete the test directory and all sub directories and files. Adding the /q switch would suppress the prompt.

కావున
ఒక రూట్ యందు ఉండి, అక్కణ్ణుంచి ఒక సబ్‌ డైరెక్టరీ యందలి కంటెంటును మాత్రమే తుడిచెవేయవలెనన్న
ఇదిగో ఇలా ఒక బ్యాచి ఫైలు రాస్కున్యా -
@echo off

@REM 1. goto profile home
set temp_home="C:\Temp\TestFolder"
@REM 2. goto that folder you want to delete the content under it
set top_folder="topfolder"
@REM 3. delete all under top folder
FOR /D %%i IN (%temp_home%\%top_folder%\*) DO (
rmdir /S /Q "%%i"
)


శుభ వారాంతం

Sep 22, 2010

కిరికిటీల మహత్యం నాయనా

యునిక్స్ లో ఉదాహరణకి
rm -r temp/
అని కొడితే టెంప్ అనే డైరెక్టరీ అడుగున ఉన్నవన్నీ జంప్స్ అవుతాయి
అదే విండోస్లో?
పై డైరెక్టరీలో ఉండి, rmdir or rd /S /Q temp\ అని కొడితే డాస్ తిట్టింది.
నీఎక్క అని
rd /S /Q temp/ అనికొట్టా మళ్ళీ తిట్టింది
దీనెమ్మ అని
rd /S /Q temp\ . అని ఇచ్చా
ఏ డైరెక్టరీ నుండి పై కమాం౨డు ఇచ్చితినో ఆ డైరెక్టరీ యందలి ఫైళ్ళు మొత్తం పాయే....
అందులో పదిహేను ఉపనిషత్తులు తెలుగీకరించినవి కూడా పాయే....undo సేయటానిక్కూడా లేవు..ఆఫైళ్ళు రిసైకిల్ బిన్ ల్ లేవు.
ఇట్టకాదని రెస్టోర్ టు పొద్దున అని కొట్టా. వామ్మో డిలీట్ ఐన డైరెకటరీలను సూపింది
వహ్వా అనుకుని ఒక డైరెక్టరీలోకి సూసినా...ఖాళీ...ఇంకో దాంటో సూసినా..ఖాళీ....
డైరెక్టరీలను నూక్కొచ్చిందిగాని ఫైళ్ళను ఎగర్నూకింది.


అయ్యా విండోస్ మహత్యం మహాప్రభో

Jul 9, 2010

బాడ్ టెస్టింగ్ కి ఓ ఉదాహరణ

నాకు మైన్ స్వీపర్ అనే ఆట అంటే భలే ఇష్టం. ఆ ఇష్టం ఐఫోన్ చేతికొచ్చాక కూడా తగ్గలా. ఐస్టోర్ లో వెతికా. మైన్ స్వీపర్ ఉచితంగా దొరికింది. దింపాను.
ఈ మధ్య ఆ ఆట అప్డేట్ వచ్చింది. సరే అని దింపాను. ఈ కొత్త అప్డేట్ తర్వాత చాలా కాలానికి ఈ మధ్యెప్పుడో దులిపా ఆడదాం అని.
బూతు అనిపించింది పై సిచ్యువేషన్
కార్నర్ లో నాలుగు మైన్స్ ఉన్నట్టు చూపింది.
కార్నర్ కి మూడే మైన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది బ్యాడ్ టెస్టింగ్ కి ఓ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు కదూ?
సరే, నేను మొట్టమొదటా ఈ కార్నర్ ని ఓపెన్ చేసా కాబట్టి నాలుగొచ్చింది అనుకుందాం. నాలుగుపైన నొక్కా ౧ వచ్చింది. అది ఇంకా బూతు.

ఇంకోచిన్న ఉదాహరణ.
అప్పుడెప్పుడో నేను ఓ పోస్టేసా. గంట మీటింగు ఇరవి సెకెండ్లలో పూర్తి అని - http://ramakantharao.blogspot.com/2009/03/blog-post_26.html
మా టోనీగాడి దగ్గర ఓ కెమేరా ఉంది. దాంట్లో ప్రతీ పదినిమిషలకో బరెస్ట్ ని సెట్ చేసి పెడితే అలా తీసూ ఉంటుంది అది. పై మీటింగ్ కి ముందు కెమేరాని ఫిక్స్ చేసాడు. ప్రతీ పది నిమిషాలకోసారి బరెస్ట్ ని సెట్ చాసాడు. మీటింగ్ లో కూర్చున్నాడు. మీటింగ్ అయ్యింది. వచ్చి చూస్తే కెమేరా ఆఫ్ అయి ఉంది. ఎక్కడ సమస్య? ఏమన్నా ఆలోచించగలరా?
కెమేరాలో ఐడిల్ టైం ఉంటుంది. అది రీచ్ కాంగనే ఆటోమేటిగ్గా ఆగిపోతుంది.
మఱ్ఱోజు జరిగిన మీటింగ్లో ఆ ఐడిల్ టైమర్ ని వాయిడ్ చేస్తే సరిగ్గా అనుకున్నట్టు పని చేసింది.
పై సిచ్యువేషన్లో టెస్టింగ్ బ్లండర్ ఏంటీ?
అన్-మాన్న్డ్ బరెస్ట్స్ మోడ్ లో ఉన్నప్పుడు అడిల్ టైం ఫ్లాగ్ ని అన్ సెట్ చేయాలి అనే టెస్ట్ కేస్ ని రాయలేకపోవటం. కాదంటారా?