Showing posts with label ఆలోచన. Show all posts
Showing posts with label ఆలోచన. Show all posts

Jan 9, 2025

2025 లో గాడినపెట్టాల్సిన అభ్యాసం

నిజం చెప్పాలంటే కార్యాలయానికి వెళ్ళే రోజుల్లో కొన్ని విషయాలలో చెప్పలేనంత ప్రగతిని సాధించాను. కొన్ని ముఖ్యమైన సూక్తాలు నేర్చుకున్నాను. అతిముఖ్యమైన ఉపనిషత్తులు నేర్చుకున్నాను. తైత్తిరీయ ఆరణ్యకంలోని ప్రథమ ప్రశ్న - అరుణప్రశ్న నేర్చుకోగలిగాను. నిజం చెప్పాలంటే అరుణ ప్రశ్న చాలా పెద్ద పాఠం. తైత్తిరీయ అరణ్యకంలోని సప్తమ అష్టమ నవమ ప్రశ్నలను తైత్తిరీయ ఉపనిషత్ అంటారు. అవి శీక్షావల్లి బ్రహ్మానందవల్లి భృగువల్లి. తైత్తిర్రియ ఆరణ్యకంలోని పదవ ప్రశ్నని మహా నారాయణ ఉపనిషత్ అంటారు.

విషయంలోకొస్తే కోవిడ్ నా అభ్యాసాన్ని కూల్చివేసింది అని చెప్పక తప్పదు. కోవిడ్ అంతా యూట్యూబ్ చూట్టానికే సరిపోయింది. సగం కారణం సమాజంలో కోవిడ్ కంటే దారుణంగా ప్రబలిన అపోహలు. అమ్మ భారత్ లో చిక్కుకుపోయి ఉండటం. అమ్మ చెప్పే వార్తలు ఉదంతాలు, అవి నిజమా అని మన వెతుకులాట. కనీసం అమ్మకి చెప్పగలగాలి కదా పలానీ వార్త నిజం అనో నిజం కాదనో. ఇంటంచి పనిచెసే రోజుల్లో చేతినిండా గంటలు గంటలు ఖాళీ సమయం ఉన్నా నిమిషం పొల్లుపోకుండా టంచనుగా యూట్యూబ్ చూట్టం. జర్నలిస్టు సాయి జర్నలిస్టు YNR జర్నలిస్టు గొట్టంగాడు జర్నలిస్టు బొంగోడు ఇదే కథ. అలానే రిపబ్లిక్ న్యూస్ NDTV న్యూస్ గాడిద గుడ్డు న్యూస్ జీవితం సరిపోలేదు.

మొత్తానికి కోవిడ్ మొత్తం యూట్యూబ్ కి అలవాటుపట్టం కోవిడ అయ్యాక వ్యసనంగా మారటం ఒక వరుసలో జరిగిపోయాయి. 

వీటితో నేర్చుకునే సమయాన్నంతా నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ అస్సలు సమయం లేదు అనే ఓ నెపంతో భజన.

నేర్చుకోవాల్సిన అనేక విలువైన పాఠాలు చాలా ఆగిపోయాయి నా వైపు ఆశగా చూస్తూ ఏమో కదిలిస్తాడేమో అని.

అలా ఆగిపోయినవాటిల్లో ముఖ్యమైనవి:

మహా నారయణ ఉపనిషత్తు మొదలు పెట్టాను, ఆగిపోయింది

అచ్ఛిద్రం మొదలు పెట్టాను, ఆగిపోయింది

అశ్వమేధం మొదలు పెట్టాను, ఆగిపోయింది

రుద్ర క్రమ పాఠం మధ్యలోకి వచ్చాను, ఆగిపోయింది

రుద్ర ఘన పాఠం మొదలు పెట్టాను ఆగిపోయింది

రుద్ర పాఠానికి పదం క్రమం ఘనం చక్కగా నోట్సు రాసుకుందాం అని మొదలుపెట్టాను.... అదీ ఆగిపోయింది...

రుద్ర యంత్రం గీయాలి అనుకున్నా... ముందుకు పడలేదు అడుగు.

కొన్ని పాజిటివ్ ఎనర్జీ యంత్రాలు గీయాలని అనుకున్నా రుద్ర యంత్రం శ్రీ యంత్రం వారాహీ యంత్రం రాజ శ్యామల యంత్రం..

2025లో, ఆగిపోయిన నా అభ్యాసాన్ని తిరిగి మొదలు పెట్టాలని యూట్యూబ్ చట్రంలో ఇరుక్కుపోయిన పుఱ్ఱెని పట్టుకుని ఒక ఊపు ఊపి నిద్ర లేపాలనీ ఒక ధృడమైన నిర్ణయం తీస్కున్నాను.


ఇలా నిర్ణయం తీస్కోటానికి కారణం కూడా ఉంది. పోయినవారం చదివిన సుభాషితంలోని శ్లోకం

శ్లో. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః                                                                                         న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః


కేవలం కూర్చుని కలగంటే ఏమీ కాదు, లేచి చేస్తేనే ఏదైనా సాధించగలం.



 

सुखार्थिनः कुतो विद्या नास्ति विद्यार्थिनः सुखम्।

सुखार्थी वा त्यजेद्विद्यां विद्यार्थी वा त्यजेत्सुखम्॥


प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनम् ।

तृतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यसि ॥

Dec 8, 2024

గెలుపు ఓటమి

 ఆటలో గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు

ఒక పరిణితిచెందిన క్రీడాకారుడికి

గెలుపునుండి ఏమి నేర్చుకున్నావు

ఏటమి ఏమి నేర్పింది అనేది ముఖ్యం

ఆడిన ప్రతీసారీ ఏదోకటి నేర్చుకోక పోతే ఆడటం అనవసరం

చచ్చిన చేపతో సమానం 



Mar 14, 2023

ఏం పాట వింటున్నా?

ఏం పాట వింటున్నారూ? అని ఇందక ఒక tweet చూసినాను.

మెదదు పొరల్లో ఏవో తెలియని కొన్ని మెదడుకంపనలు ప్రకంపనలు.

ఏం పాట వింటున్నా?

అనేక రకాల సమాధానాల వెల్లువ

తెలుగు పాట వింటున్నా

పొద్దున్నే పొద్దున వినాల్సిన పాటల్ని వింటున్నా

మధ్యాహ్నం మధ్యాహ్నం వినాల్సిన పాటల్ని

మాపటేళ సాయంత్రపు ఆలోచలనఈ ఊహల్నీ ప్రజ్వలింపజేసే ఉసిగొల్పే ఊరటగొల్పే లాలించే పాట్లనే వింటాను వింటున్నాను

ఓ రోజంతా ఉల్లాసంగా ఆనందంగా తట్టిలేపేలా పట్టుకు ఊపేలా సాగాలంటే ఏం పాటలు వినాలో ఆ పాటలే వింటా వింటున్నా

నా మనసుకి నచ్చిన రచయిత కవి రాసిన పాటలు వింటున్నా

ఇలాంటి రకరకాల సమాధానాల పరంపరల నుండి ఓ స్పష్టమయిన సమాధానాన్ని పట్టి బయటకు లాగినాను

ఏం పాట?

నాన్నా! ఏం పాట వింటున్నా?

చెవిలో AirPods 23 గం 59ని ఓట్టుకుని ఏవో పాటలు వింటూ ఊగిపోయే కొడుకుని అడిగాను ఆర్తిగా.

You know Drake? అన్నాడు పొంగిపోయే భావోద్వేగంతో

Drake? వాడెవడు అన్నాను

హా~ ఔన్నానా NBA Player అన్నాడు చిరాకు నిండిన స్వరంతో నీకేం తెలియదు అన్నట్టుగా, "అతనొక పాటగాడు నాన్నా' అన్నాడు నయ యువ రక్తం ఉరకలై పోరుతుండగా పెల్లుబికే ఓ స్వరంతో.

ఈ కాలపు ప్రవాహం ఇదీ, గమనించూ అంటున్న హెచ్చరికతో.

YouTube లో వెతికాను ఎవడూ ఈ డ్రేకుడు అని..

కటింగ్ జటింగ్ ఫిటింగ్ రటింగ్ మధ్యమధ్యలో ఓ పాతిక సార్లు f*** word విరివిగా వాడుతూ వస్తోంది వాడి బాణీ.

తల విద్ల్చి నువ్వు ఏమి వింటున్నావూ అని అడగబోయాను కూతురు గారి గది వద్దకు  వెళ్ళి.

తలుపు తెరచిన తనవాకిట BTS పాటగాళ్ళ/గత్తెల చిత్రపటాలు విరివిగా అంటించి ఉన్నాయి చిందరవందరగా తలుపు నిలువునా

హృదయంతరాలలోంచి చిమ్ముకురాబోయిన ప్రశ్నని నిర్దాక్షిణ్యంగా దిగమింగుతూ garage లోకి నడిచాను భారంగా

మనసంతా ఏందాకాలపు వేడి గాలికి పైకి లేస్తున్న దుమ్ములో చిక్కుకున్న కాగితపు ముక్కలా ఉంది అల్లల్లాడుతూ

youtube playlist లోంచి ఒక పాటను play చెయ్యమన్నాను రిమోటు గాడిని

"తీగనై మల్లెలు

పూచిన వేళా

ఆగనా

అల్లనా

పూజకో మాల

మనసు తెర తీసినా

మోమాటమేనా 

మమత కలబోసినా

మాట కరువేనా"

వేటూరి స్రవంతి ప్రవాహం

భావం నేపథ్యానికి గోడ

భావం పదానికి అల్లికకు వ్యక్తీకరణకూ పునాది

భావం లేక పోతే ఇవేవీ లేవు

భావం భాష అల్లుకు పోయిన రెండు లోహాలు. విడదీయలేం

పాట పదం సాహిత్యం కవిత మనసు పొరల్లోంచి పెల్లుబికే ఓ ఊట.

దాని ప్రవాహానికి ఒడ్డు భావం భాష

"మనసు తెర తీసినా"

మనసు తెర తీయటం ఏంటీ? మనసుకి కూడ తెర ఉంటుందా?

ఇలాంటి ప్రశ్నలు ఉదయించాలంటే స్ఫురించాలంటే భావం తెలియాలి భాష అర్థం కావాలి...

తర్వాతి పాట ప్రవాహం


అభినవ తారవో

నా అభిమాన తారవో

అభినవ తారవో

అభినయ రసమయ కాంతిధారవో

మంజుల

మధుకర

శింజాన

సుమశర

శింజిని

శివరంజనీ


నిజం చెప్పాలంటే ఈ పాటకి ఒక ఆస్కార్ సరిపోదు. ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. అసలు ఈ లాంటి భావన ఏ దేశంలోనూ ఉండదు. కేవలం భారతావనిలో తప్ప. సినారె! అంతే!


నేపథ్యం తెలియకుండా పాట వింటే కలిగే ప్రయోజనం ఏవిటీ?


మనసులో ఏదో అలజడి


ఇంతకీ ఏం పాట వింటున్నానూ?

ఏ పాట వినాలీ?

Jan 6, 2021

తెలుగు పాటలు Open Project ఆలోచన/అవకాశం

 ఆ మధ్యకాలంలో హిందీ లిరిక్ కోసం smriti.com అనే ఒక వెబ్సైట్ కి వెళ్ళేవాడిని. ఎందుచేతనో ఆ సైట్ మూతపడింది.


ఆ సైట్ తయ్యారు చేసినవారు ఒక మంచి ఆలోచనతో చేశారు.

పాట వెతుక్కోటానికి - మొదటి అక్షరంతో వెతుక్కునేలా లిస్ట్ చేశారు.

పాడిన వారి ద్వార వెతుక్కునే విధమూ ఉంది.

కథానాయకుడి పరంగా వెతుక్కునే విధమూ ఉంది.

సంగీతదర్శకుడి పరంగా వెతుక్కునే విధమూ ఇచ్చారు.


తెలుగులో అలాంటి సైట్ ఉన్నట్లు నాకు ఎక్కడా తగల్లేదు.


అలాంటి సైట్ తయ్యారు చేయటానికి కావాల్సిన ముడి పదార్థాలు నేను స్పాన్సర్ చెస్తాను. ఓపిగ్గా కూర్చుని కోడింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకి రండి.


సోదరుడు వేణు శ్రీకాంత్ ఎన్నో పాటలు తన బ్లాగులోకి ఎక్కించాడు. సోదరుడి సహాయం తీసుకోవచ్చు పాటల కోసం.

Oct 8, 2020

వస్తా వట్టిదే పోతా వట్టిదే

కొలువు ముగించి నడకకి బయల్దేరాను
బెల్లం చుట్టూ మూగిన చీమల్లా
ఆలోచనలు మూగినై మనసు మీద
రేడియో పెట్టుకున్నాను 
తత్వాలు వస్తున్నా భక్తి రంజనిలో
కీశే శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలోంచి స్వీయ రచన 
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే... ఓహో
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే... ఓహో
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా... మా దేవ శంభో
మా లింగ మూర్తి
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
మనసు బాలమురళిగారి తత్వంలో మునిగిపోయింది
అంతలో - తర్వాతి తత్వం

వస్తా వట్టిదే  
పోతా వట్టిదే  
ఆశ ఎందుకంట
చేసిన ధర్మము 
చెడని పదార్ధము 
చేరును నీ వెంట
చేతిలో అమృతము 
ఉన్నంత సేపే 
అన్నదమ్ములంట
ఆఘాధంబై  
పోయేనాడు  
ఎవరురారు  వెంట
వస్తా వట్టిదే  
పోతా వట్టిదే  
ఆశ ఎందుకంట
చేసిన ధర్మము 
చెడని పదార్ధము 
చేరును నీ వెంట

పంచ భూతముల
తోలు బొమ్మతో
ప్రపంచమాయనట
అంతము వరకు
కించిత్ ఆ శ తో 
పెంచెను జగమంతా

వస్తా వట్టిదే  
పోతా వట్టిదే  
ఆశ ఎందుకంట
చేసిన ధర్మము 
చెడని పదార్ధము 
చేరును నీ వెంట

ఈ మాటలు - చేతిలో అమృతము 
ఉన్నంత సేపే 
అన్నదమ్ములంట
ఆఘాధంబై  
పోయేనాడు  
ఎవరురారు  వెంట
- వినగానే ఒక్క నిమిషం 
సాయంత్రం మసకి చీకటిలో బావురుమని ఏడ్చాను
హృదయం వికలమైంది
బరువెక్కిపోయింది
ఎంత పచ్చి నిజం

Oct 4, 2020

ఒక చిన్న ప్రొజెక్ట్ వర్క్/ఉద్యోగావకాశం Job/Project work offer

ఒక చిన్న ప్రొజెక్త్ వర్క్/ఉద్యోగావకాశం

అవకాశం

నా దగ్గర ఒక ఆలోచన ఉన్నది. సదరు ఆలోచనని అభివృద్ధి చెసేందుకు నాకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే కోడింగ్ వచ్చిన విద్యార్థి/ర్థులు ఒకరు లేక ఇద్దరు కావాలి.


ఉండాల్సిన అర్హతలు:

ఆకళింపు

కొంచెం సహనం

ఆలోచించేతత్వం


ఉండకూడనివి:

అసహనం

సోమరితనం


ఏమేమి వచ్చుండాలి?

Java/Python/Java Scripting/Objective C


నేనేమి ఇవ్వగలనూ?

Project Work చేశాడనే సర్టిఫికెట్

కొంత విత్తం. ఎంతా అనేది పరీస్థితిని బట్టి.


నా బ్లాగు చదివే మిత్రులలో ఎవరికైనా పైన చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలు తెలిస్తే ఇక్కడ ఓ కామెంట్ పెట్టండి కాంటాక్ట్ సమాచారంతో - సదరు కామెంటుని నేని సంగ్రహించి పబ్లిష్ చేయకుండా తీసివేస్తాను.


Folks, I have small project in my mind. I am looking for college going kid who is in need of project work and who wants to make little pocket money. If the folk deliver me what I am looking for, I will keep getting simple projects again.

I need someone who is in the final year of college 

must haves:

good listening skills

good levels of patience

must not have:

short temperment

laziness

must know:

Java/Python/Java Script/Objective C.

what I can offer:

a deserving candidate will get project work certificate.  I am willing to pay stipend.

Sep 19, 2020

బుచ్చిబాబు చివరకు మిగిలేది నాటకం

 ఎందరో రచనలు చేస్తారు.

కొన్ని రచనలే లోతుగా స్పృశిస్తాయి.


"ఇతరులతో సంపర్కం వదులుకుని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యధార్థం అని నమ్మి సమాధాన పరుచుకోవడం, సంఘంతో నిమిత్తం వున్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీన పునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరకు మిగిలేది ఏమిటి?"

ఈ ప్రశ్న అంత సులభంకాదు జవాబు చెప్పటానికి.


ఒక వ్యక్తి భావుకతని అతని స్థాయికి వెళ్ళి అతనితో ప్రయాణించి అతన్ని గమనిస్తూ వెళ్తే కానీ అర్థం కాదు. ఆవిష్కారం కాదు.


దయానిధి అనే భావకుడితో ప్రయాణం చేసేలా చేశాడు ఆ పాత్ర సృష్టికర్త *బుచ్చిబాబు* *చివరకు మిగిలేది* అనే తన నవలలో


చివరకు మిగిలేది నవలని ఎప్పుడో చదివిన జ్ఞాపకం. వయసులో ఉన్నప్పుడు ఉన్న వేడి ఆలోచనా ధోరణీ చపున ఎగసి పడే ఆవేశం నలభైల్లో పడ్డాక పడి విరిగిన అలలా అయిపోయింది.


నాలో నా ఆలోచనలలో కలిగే మార్పులు నాకు సుస్పష్టంగా తెలుస్తున్నాయి.



పోయినవారమో అంతకముందో ఏదో పనిలో ఉండి ఆకాశవాణి పెట్టుకుని వినటం మొదలుపెట్టాను. చివరకు మిగిలేది నాటకం నన్ను కట్టేసింది. దానిలోని పాత్రలు అద్భుతంగా మలచారు నండూరి రామకృష్ణ గారు మరియూ పాలగుమ్మి పద్మరాజు గారు.


ఈ నాటకం నన్ను మరోమారు చివరకు మిగిలేది నవల చదివేలా ప్రోత్సహించింది.


చూద్దాం ఆలోచనలు భావాలు ఎలా తిరుగుతాయో.


Aug 5, 2020

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అనేది ఎక్స్పెక్టేషన్. ఎవరి ఎక్స్పెక్టేషన్ అంటే - సాధారణ పౌరుడి ఎక్స్పెక్టేషన్ అనుకుందాం. నెలబారు మనిషికి ఆమాత్రం కోరికలు ఆమాటకొస్తే హక్కులు ఉండకూడదా?

కానీ 21 శతాబ్దిలో ఏదేశంలో చూసినా ఏప్రాంతంలో చూసినా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుందాం అనే రంధిలో ఉన్న మనిషి/అతను నిర్మించిన రాజకీయ వ్యవస్థ ఎన్ని అక్రుత్యాలకు పాలుపడుతున్నాయో చూస్తే జుగుప్స కలుగుతుంది.

ప్రతిపక్షం పాలకవర్గాన్ని దించటానికి హత్యలు చేయటానికి మారణకాండ చేయటానికి నలుగుదిక్కులా ప్రజల మనోభవాల్ని రెచ్చగొట్టి ఎగదోస్తున్నాయి.

అటుజెసి ఇటుజెసి మధ్యలో జనాల ప్రాణాలే రాలిపోతున్నాయి. ప్రజలు మళ్ళీ మళ్ళీ గొర్ఱెలు కాబడుతున్నారు. రాజకీయ క్రీడలో పావులు కాబడుతున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కోవిడ్ సమయంలో ఎలా ప్రజల ప్రాణాలతో ఆటాడుతున్నదో ఓసారి చూద్దాం.

ఓ పెద్దాయన
67 ఏళ్ళు
పాపం ఏవో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్
బిపీ సుగర్ లాంటివి వెంటాడాయి నేలబారు మనిషికి నేలబారు రోగాలు
ఇంతలో ఆయన భార్య గారికి కోవిడ్ వ్యాధి లక్షణాలు
ఆయన అల్లుడు ముప్పతిప్పలుపడి ఆశుపత్రిలో ఒక బెడ్ సంపాదించాడు
ఆమెకి ట్రీట్మెంట్ దొరికింది. తగ్గి ఇంటికి వచ్చింది. ఇంతలో ఆయనకి కరోనా లక్షణాలు.
మళ్ళీ అల్లుడు తీవ్రంగా శ్రమించి ఆశుపత్రిలో ఒక మంచాన్ని సాధించాడు.
మామగారు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా?
నేను వెళ్ళను అంటాడు.
ఎందుకయ్యా అంటే - ఆశుపత్రిలో భోజనం సరిగ్గా పెట్టటంలేదని పలానా ఛానల్లో చెప్పారు, పలానా పార్టీవాళ్ళు చెబుతున్నారు అంటాడు.
ఆశుపత్రికి వెళితే అటునుంచి అటే అట అంటాడు. ఎవరన్నారయ్యా అంటే ప్రతిపక్షం కోడైకూస్తున్నదిగా అంటాడు. పలానీ ఛానల్లో దీనిమీదే నిన్న చర్చ జరిగింది అంటాడు.
ఆశుపత్రిలో చికిస్త అసలు జరగంటంలేదుట అంటాడు.
తగినంత మంది డాక్టర్లు లేరు అంటాడు. వాదన.

ఈ తర్జన భర్జనలో ఆయన పోనేపోయాడు.

ప్రతిపక్షం ఆయన్ని తిరిగితేగలదా?

జనాల్లో అపోహలను నరనరాల్లోకి ఎక్కిస్తున్న ప్రతిపక్షం పోయిన ప్రాణాలను తేగలదా?

జనాలలో బతికే సైకలాజికల్ స్ట్రెంత్ ని ఇవ్వాలన్న కనీస ధర్మాన్ని పాటించని ప్రతిపక్షం ఉండి దేనికి?

ప్రభుత్వం తప్పు చేయచ్చు. దాన్ని కరెక్త్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. ఆ పాత్రని ప్రతిపక్షం పోషిస్తున్నదా?

Jun 5, 2020

అభిమానమా రాక్షస్త్వమా?

అప్పట్లో ఓ పేద్ద హీరో కొడుకు  గారు తన ఫ్యాన్స్‌తో ఏవన్నారో చూశాం.
ముద్దన్నా పెట్టాలి లేకపోతే కడుపన్నా చేశాయాలి అంటూ కొంతకాలం క్రితం -



అలా ఆయన పిలుపు ఇచ్చినందుకు ఎందరికి కడుపులయ్యాయో తెలియదు కానీ ఆ పిలుపుకి స్పందించిన వాళ్ళు ఉండే ఉంటారు.
ఇప్పుడు అతని  అన్నగారి కుమారుడి ఫ్యాన్స్ వంతు. ఆమెవరో ఓ హీరోయిన్. ఆమెకు ఒపీనియన్స్ ని నిర్భయంగా చెప్పునుకునేందుకు కక్కునేందుకు ట్విట్టర్ అనే బక్కెట్టు ఉంది.
అందులో నిర్భయంగా ఆమె అనుకోళ్లను నిర్భీతిగా వెళ్లగక్కే హక్కు ఆమెకి ట్విట్టర్ ఇచ్చింది.
ఆమేమీ కశ్మీర్ లో కాల్చివేయబడ్డ తీవ్రవాదులు దేశభక్తులనో లేక లోకేశ్ బాబు దేనికీ పనికిరాడానో అనలేదు.
కేవలం "పలానీ హీరో గురించి తెలియదు, అతని అభిమానిని కాదు" అన్నది. 

ఈంటీ ఈ పైత్యం?
ఒకడేమో ఆడది కనిపిస్తే కడుపు చేయమంటాడు. ఒకడి ఫ్యాణ్సేమో నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం అంటారు.

ప్రజలు వీళ్ళని గెలిపించి మంత్రులుగా యంపీలగా ముఖ్యమంత్రులుగా చేస్తారు.

ఇది వేలంవెఱ్ఱి అభిమానమా? రాక్షసతవపు అభిమానమా?

నాకు జుగుప్స కలిగించింది వీళ్ళ నేర/కుట్రపూరిత ఆలోచనా ధోరణి.
రేప్ చేస్తారా? గ్యాంగ్ రేప్ చేస్తారా? ముఖం మీద యాసిడ్ పోస్తారా?

వీళ్ళ ఆలోచనాధోరణిని కఠినంగా శిక్షించాలని చట్టాన్ని న్యాయాధికారుల్నీ ప్రార్థిస్తున్నా


Jun 2, 2020

Watch Strap

Watch Strap

Samsung Galaxy S3 Frontier అనే వాచ్ కొన్నా ఆ మధ్యలో. దానికి కంపెనీ వాడు ప్లాస్టిక్ స్ట్రాప్ ఇచ్చాడు. అది పెట్టుకుంటే చర్మం పాచిపోయినట్టుగా అయ్యింది. ఓ రోజు తొక్క లేచింది కూడా. కాస్త మంచిది కొందాం అని వెతికాను. etsy.com అనేదాంట్లో ఒకటి కనిపించింది.

https://www.etsy.com/listing/671151452/samsung-galaxy-watch-band-gear-s3?ga_order=most_relevantga_search_type=allga_view_type=galleryga_search_query=gear+s3+paracordref=sr_gallery-1-1frs=1


వీడి బొంద $45 అన్నాడు.


మనమే ఒకటి చేసుకుంటే పోలా అనుకున్నా.

Samsung Galaxy S3 frontier pin size 22mm. అమెజాన్‌లో తెప్పించాను. నా దగ్గర paracord ఉంది నల్ల రంగుది. ఇంకా కావాల్సింది buckle. అదీ అమెజాన్‌లో తెప్పించాను.

వాచ్ కి రెండువైపులా ఎంత పొడుగు కావాలో సైజు చూసి అల్లాను.

May 27, 2020

దేవుడి మాన్యం



కొన్ని వేల సంవత్సరాలుగా ప్రభువులు బ్రాహ్మణికల్ యాటిట్యూడ్‌లో తడిసి ముద్దై గుళ్ళు, గుడి వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి కోసం మాన్యం, గుడికొక అర్చకుడు అనే వ్యవస్థని ఏర్పాటు చేశారు.

కొన్ని శతాబ్దాలో దశాబ్దాలో నడిచాక పరాయి పాలకులు దేశాన్ని గుళ్ళను గుడి సంపదను దోచుకోగా మిగిలిన టాంజిబుల్ ప్రాపర్టీలని తమతో తీసుకెళ్ళలేక పాపం డీలాపడి, సదరు భూముల్ని ఎలా దోచుకోవాలా అని బాధపడ్డారు.

శతాబ్దాలు దశాబ్దాలు గడచాక నల్లదొరల పాలనలో దోచేవాడే పాలకుడు అయ్యాడు రాజకీయ వేత్త అయ్యాడు కాబట్టి దోపిడికి అడ్డు అదుపూ లేకుండా పోయింది.

దోచుకున్నోడికి దోచుకున్నంత అయ్యింది.

ఈ రాపిడిలో దోపిడిలో ఒరిపిడిలో ఎండ్లకాలం అమెరికన్ అమ్మాయి డ్రస్సు లాగా వేల ఎకరాలున్న దేవుడి మాన్యం కాస్త కురచై కురచై జానెడుకొచ్చింది.

ఇందులో తిలా పాపం తలా పిరికెడు.

చివరికి 2020వ సంవత్సరం ఓ పెద్దాయన -
ఆ ఫైలు ఇలా తే! స్వామి వారికి ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఎవరెవరు ధారాదత్తం చేశారో చూద్దాం అన్నాడు.
ముందరి ప్రభుత్వ హయాంలో ఏసీ గదుల్లో కూర్చునే కొందరు బడాబాబులు "అబ్బే! వేస్ట్ భూమి. ఎందుకూ పనికిరాదు. అక్కడెక్కడో, మనకి దూరం గురూ కనీసం వెళ్ళి చూడను కూడా లేము, ఏ పాతిక సెంట్లో ఉంటే ఎవడు కాపాడతాట్టా" అన్నారు.

వాళ్ళని తప్పు పట్టలేం.

ఒకరకంగా చెబితే - భక్తులు ఇచ్చే భూమిని ట్రాక్ చేయటమూ కష్టమే, దాంట్లో అసాంఘీక కార్యకలాపాలు జరక్కుండా కాపు కాయటమూ కష్టమే.

ఇంతలో కొందరు మేధావులు - ఈ చిన్న చిన్న ముక్కలని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి, ఎక్స్ఛేంఝ్ ఆఫర్ కింద కన్సాలిడేటెడ్ గా ఓ పెద్ద ముక్క పొందవచ్చు కదా?

ఎగ్రీడ్. మంచి ఆలోచనే. అయినా కష్టమే.

సరే! ఏతావాతా - దేవుడికి భక్తులిచ్చిన భూమిని వదిలించుకోవటం అనకుండా - దాన్ని ఏదోరకంగా ప్రజలకే ఇస్తే అటు ప్రజలకూ ఉపయోగం. ఇటు కనిపించని ఆ దేవుడికి ఆనందం.

అయితే సమస్య - దీన్ని గురించిన రాజకీయం.
అమ్ముదాం అన్నది ఎవరూ?
ఇంతక ముంది ఎన్ని సార్లు అమ్మారు?
ఇప్పుడు అమ్మటానికి ప్రాతిపదిక ఎప్పటిదీ?

ఈ ప్రశ్నలు అడిగితే - మీరు సమస్యని డైల్యూట్ చేస్తున్నారు, జనాల వేడి మీద నీళ్ళు పోస్తున్నారు అంటున్నారు.
అడక్క పోతే - తిరుపతి కొండనే అమ్మేస్తారు దగుల్బాజీలు అంటున్నారు


దీనికి పరాకాష్ఠ - గుంటూరు రైల్వేస్టేషన్ని, గాంధీ పార్కునీ, దానిముందున్న కూరగాయల మార్కెట్టుని అమ్మేస్తున్నారట అని ప్రచారం.

ఎంతకి దిగజారిపోతున్నారో రాజకీయ నికృష్ఠులు అనిపించింది.

May 5, 2020

వదంతులు


గత కొన్ని నెలలుగా భారతదేశం ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంది. వాటిల్లో ప్రధానమైనవి - ఆర్టికల్ 370/ సిఏఏ/ యన్.ఆర్.సి లపై హింసాయుత అల్లర్లు/ విముఖత.

ఒక సాధారణ పౌరుడికి ఇవి ఎంత వరకూ అర్థమయ్యాయో నాకు తెలియదు. ఒక సాధారణ పౌరుడికి వీటిని అర్థమయ్యే విధంగా ప్రభుత్వాలు ఏంచేశాయో తెలియదు. వీటిని విడమరచి చెప్పే ప్రయత్నం ఎవరైనా చేశారో లేదో కూడా తెలియదు.

ప్రతీ వార్తా ఛానెల్లో పొద్దుటి నుంచి అర్థరాత్రి దాకా జరిగిన అర్థంలేని వేడి వేడి చర్చల్లో కొట్టుకోవటం పరస్పర నింద, ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక వర్గాన్ని రెచ్చగొట్టటం లాంటి - వ్యూవర్షిప్ ని పెంచుకునే కార్యక్రమాలే తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజాన్ని మాట్లాడిన చర్చాలేదు వార్తా ఛానలూ లేదు.

రాష్ట్ర పాలకులకే వీటిమీద సరైన అవగాహన లేదు. ఇంక సాధారణ పౌరులకి ఏం అవగహాన?

కోవిడ్ మొదలుతున్న రోజుల్లో ఇంట్లో ఏసి పని చేయటం మానేసంది. అమ్మా! ఎలాగూ ఇంకో 15 రోజుల్లో ప్రయాణం ఉందిగా అమెరికాకి. తిరిగి వెళ్ళినప్పుడు చూపిద్దువులే అన్నాను.
అలసత్వం మనిషికి మంచిది కాదని అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి, వాయిదా వేయటం మంచిది కాదని అనేక దృష్యాంతరాలున్నాయి మన పురాణ ఐతిహాసాల్లో.
మనం వినం కదా! మనుషులం కదా!

పాపం అమ్మ సరే అన్నది. ఇంతలో కోవిడ్ విజృంభణ, విమానాలు ఇంటికి వెళ్ళిపోవటం లాక్‌డౌన్ గట్రా అన్నీ కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయాయి.
నిన్న ఒకతను మొత్తానికి ఏసీ బాగుచేయటానికి వచ్చాడు.
మాటల్లో - ముస్లిములందరినీ భారత్ దేశం నుంచి పంపించేసి హిందూదేశంగా భారతదేశాన్ని మార్చాలని మోడి ప్రయత్నిస్తున్నాట్ట అండీ అంటాడు.

అమ్మ నాతో ఈ విషయం ప్రస్థావించినప్పుడు నాకు ఒక్క నిమిషం పాటు ఏం చెప్పాలో పాలుపోలేదు.

మూలాల్ని కలుషితం చేసే దౌర్భాగ్యులు తయ్యారైయ్యారు దేశంలో.

ఏంచెయ్యాలీ? ఏంచెప్పాలీ? ఎవర్ని మార్చాలి. ఎవరు మార్చాలి? ఎలా మార్చాలీ?

ఆందోళనకు గురి అయ్యాను.

వదంతులు వ్యాప్తి చేయకండి. మీకు అర్థమైతే విడమర్చి చెప్పండి. లేక పోతే అరవకుండా కూర్చోండి. తెలిసీ తెలియకుండా దేశాన్ని కలుషితం చేయకండి.

వాట్స్ యాప్‌లలో ఫేసుబుక్‌లలో చెత్త ఫార్వర్డ్ చేయకండి.

చూసిందంతా నిజం కాదు.

విన్నదంతా నిజం కాదు.

చెత్తని మోయకండి.

మీ చెత్త అభిప్రాయాల్ని పక్కన వాళ్ళ మీద రుద్ది వాళ్ళ జీవితాల్ని కడతేర్చకండి.

Apr 18, 2020

ఆంగ్లమాధ్యమం గొడవ

కొన్ని ముందస్తు ప్రశ్నలు

1. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని తాము పని చేస్తున్న పాఠశాలలోనే చదివిస్తున్నారు?

2. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

3. ఎందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

4. ఎందరు ప్రభుత్వ పాలకులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

5. మీలో ఎందమంది మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశలకి పంపిస్తున్నారూ?

6. మీలో ఎందరు పపిద్దాం అనుకుంటున్నారూ?

అనుబంధ ప్రశ్నలు:

ప్రభుత్వ పాఠశాలకి పంపిద్దాం అనుకుంటే - ఎందుకు అనుకునే దగ్గరే ఆగిపోయారూ?
పంపించమూ అంటే - పంపించకపోటానికి ప్రతిబంధకాలు ఏవిటీ?

ఇవే ప్రశ్నలు నన్ను అడిగితే - నా సమాధానాలు/ఆలోచనలు -

నేను జిల్లాపరిషత్ ప్రధమికోన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య అయ్యాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశలలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేస్కున్నాను.

మా నాన్న పని చేసిన స్కూల్లో చదువుకునే అవకాశం కలిగింది. లెక్కలకు ఆంగ్లానికి మా నాన్నే వచ్చేవారు.

అయితే ఇప్పుడు, ఒకవేళ నేను భారతదేశంలో ఉండి ఉంటే మా పిల్లల్ని జిల్లా పరిషత్ పాఠశాలకి పంపించుండేవాడినా అని అడిగితే పంపించుండేవాడ్ని కాదేమో.

ఎందుకుటా అంటే మాధ్యమాం అని చెప్పక తప్పదు.

నావరకు నాకు కేవలం మాధ్యమం అనేదే ప్రతిబంధకం.

ప్రభుత్వపాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు. క్వాలిఫైడ్ విద్యావిధానం ఉంటుంది. వ్యక్తిత్వ వికాశం ఉంటుంది. ఆట స్థలం ఉంటుంది. డ్రిల్ మాష్టారు ఉంటారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో కుక్కి కూర్చోబెడతారు. వ్యక్తిత్వ వికాశం ఉండదు. మార్కులే గీటురాళ్ళు. ఆట స్థలం మృగ్యం. ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ అవునా కాదా చెప్పలేం. విద్యావిధానం ఎవరు నిర్ణయిస్తారో తెలియదు.

బాడ్ యాపిల్స్ ఎక్కడైనా ఉంటాయి. వాటిని పక్కన పెడితే, నాణ్యమైన విద్య అనేది ప్రభుత్వ పాఠశలల్లోనే అని నా ప్రగాఢ విశ్వాసం. ఇది నేను ఒక జిల్లాపరిషత్ పాఠశాలలో పని చేసిన ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా చెబుతున్నా.

ఇప్పట్లోకి వస్తే - నా పిల్లల్ని తెలుగు మీడియంకి పంపలేను. ప్రభుత్వ పాఠశలలో ఆంగ్ల మీడియం ఉంటే పంపించటానికి నాకేమాత్రం సంశయం లేదు.

అమెరికా లాంటి దేశాలల్లో ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్య ప్రైవేటు పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్యతో పోలిస్తే పదిరెట్లకన్న ఎక్కువ.

అమెరికాలో 46 మిలియన్ పిల్లలు పబ్లిక్ విద్యావిధానంలో ఉండగా 4 మిలియన్ విద్యార్థులు మాత్రమే ప్రైవేటు విద్యావిధానంలో ఉన్నారు

భారత దేశంలో ప్రైవేటు పాఠశాలలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నదని నా అభిప్రాయం.

మౌళిక ప్రశ్న ఈ విషయానికి సంబంధించి -
ప్రభుత్వ పాఠశలలని పునరుద్ధరించాలంటే ప్రభుతం ఏం చేయాలీ?
ప్రజలు ఏంచేయాలీ?

ప్రభుత్వం పాఠశాల వ్యవస్థని పునరుద్ధరించాలి. గట్టి చేయాలి. జెడ్.పి.టి.సి లాంటి రాజకీయ వ్యవస్థని పాఠశల నుంచి వేరు చేయాలి. ఉపాధ్యాయులని ప్రేరేపించాలి. జవజీవాల్ని నింపాలి.

ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం మత్రమే అనే నిర్ణయం సరైంది కాకపోవచ్చు కానీ ఆంగ్ల మాధ్యమం అనేది తప్పుకాదు.

వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా వ్యవస్థని పునర్మించకుండా గుడ్డిగా ఆంగ్లమాధ్యమం అనటం సరైంది కాదని న అభిప్రాయం.

ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో కూడా కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని నా అభిప్రాయం

Apr 5, 2020

సుదతి

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా
సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును మరుల విరులు కురియగ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
- సినారె

కొంచెం విచిత్రమైన ఆలోచన ఇది. సాధారణంగా అతను ఆమె శరీరాకృతినో కురులనో కళ్ళనో లేక చెవులనో పొగుడుతాడు. సదరు విషయాలన్ని శృంగార విశేషాలు. కొందరు చెవి ఝుంకాలను నడుముకున్న ఆభరణాలను చేతికున్న వంకీలను కూడా జత చేస్తారు
కాని ఇక్కడ సినారె సుదతి తనువు మదన ధనువు అంటాడు. ఆమె శరీరం మదనుడి విల్లు అన్నాడు కానీ ముందు సుదతి అని వాడాడు.
సుదతి - చక్కని పలువరుస కలది
అప్పుడే డెంటల్ డాక్ దగ్గరకెళ్ళి డీప్ క్లీనింగ్ చేయించుకొచ్చింది.


దీనికి మూలం బహుశా సంస్కృత సాహిత్యం అయుండచ్చు.

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
హరతి దర తిమిరమతిఘోరం

జయదేవ అష్టపది
వదసి
యది
కించిత్
అపి
దంత
రుచి
కౌముది
హరతి
దర
తిమిరం
అతి
ఘోరం

ఎలా అర్థం చేస్కోవాలో - ప్రియా మూతి బిగించుకుని  కూర్చున్నావు, ఒక్క మాట పలకటానికి నోరుతెరువు. తెల్లని నీ పలువరుస నుంచి వచ్చే కాంతి ఈ ఘోర తిమిరాన్ని హరించనీ.

Jun 10, 2019

ఈ రోడ్డు నీ బాబుదా


మొన్నీమధ్య ఈ ప్రకటన చూశాను ఎదో టీవీలో
ఏంతో అర్థవంతంగా అనిపించింది.

ఈ యాడ్ చూసినాకైనా సీటు బెల్టు పెట్టుకోకుండా నడపటం క్షేమంకాదని, నడిపేప్పుడు ఫోన్లు గట్రా చూడకూడదని వాహన చోదకులు గ్రహిస్తారని భావిస్తా.

Click it or Ticket



May 17, 2019

బలవంతపు గాంధీఇజం



గాంధీ గొప్పవాడు అయుండచ్చు. గాంధీఇజాన్ని కాంగ్రేస్ జనాల నరనరాల్లోకి ఇంకింపజేసి ఉండచ్చు.
ఎక్కడో ఓ మూల ఎవడోకడు దాన్ని వ్యతిరేకించే తిరుగుబాటు చేసే ఇజంతో ఉండడా?

గాంధీ అనే ఓ మనిషి తీసుకున్న కొన్ని నిర్ణయాలు సదరు విప్లవకారుడికి నచ్చలేదు. అతను గాంధీని అంతం చేశాడు.

గాంధీని హత్య చేయడం నేరం. నేరానికి ఖచ్చితంగా శిక్ష వేసింది న్యాయస్థానం. కాటాలో నేరమూ-శిక్ష సమం అయ్యింది వ్యవస్థకి.

అయితే గాంధీ అనే వ్యక్తిని హతమార్చటం దేశద్రోహమా? దేశవ్యతిరేకమా?

అభివృద్ధి పేరుతో దేశాన్ని అమ్ముకుంటున్న ఈతరం రాజకీయనాయకులు దేశభక్తులా?

May 11, 2019

ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకటం ఎలా

బ్రౌజర్లలో ఒక ఫీచర్ ఏవిటంటే - బ్రౌజింగ్ హిస్టరీని బట్టి *రెకమెండేషన్స్* ఇవ్వటం.
అలాంటి ఒక రికమెండెడ్ లింక్ ఒకటి *ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకటం ఎలా* అని
లింకులోకెళితే - ఎక్కువకాలం ఆరోఘ్యంగా బతకటనికి 8 చిన్న చిన్న అడుగులు అంటూ ఏదోరాసుకొచ్చాడు
1. లే! పదా!
2. నిజమైన ఆహారం తిను
3. నీ మిత్రుల్ని పిలువ్
4. సప్లిమెంట్స్ ఆపు
5. 8 గంటలు నిద్రపో
6. ప్రకృతితో ప్రకృతిలో ప్రకృతిగా - ప్రకృతికి దగ్గరగా బతుకు
7. బీడి తాగటం మానేయ్
8. అతిగా తాగిన మగాడు అస్సలు తాగని ఏనుగు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు

ఈ 8 పాయొంట్లూ ఆలోచింపజేసేవిలాగనే ఉన్నాయి.
లే పదా! స్థబ్దత నుంచి మేలుకో. కూర్చుంటె పొట్ట పెరగటం తప్ప ఏమీ కాదు. రోజుకో గంట నడవటం గొప్ప కాదు. గంటగంటకోసారి లేవటం పది నిమిషాలు తిరగటం గొప్ప.
నిజమైన ఆహారం తిను అన్నాడు. నిజవే! చిప్స్ గడ్డి కంప తినే సంస్కృతి నుండి బయటపడు. భారతీయ భోజనం భేషైన భోజనం అని గుర్తించాలి.
ఇక సంఘ జీవితం. ఈరోజు రేపట్లో ఫేసుబుక్కో ఫేసుబుక్కో ఫేసుబుక్కో. ఎంతసేపూ అదేగోల. ఏందయ్యా అంటే సామాజిక మాధ్యమాలు. కేవలం మిధ్య. నిజమైన మితృడు ఒక్కడు - సాయంత్రం పూట అలా కూర్చుని కబుర్లతో మునిగిపోయి. నిజమైన మితృలు ఎందరు?
సప్లిమెంట్స్ ఆపేయంటాడు. బహుశా నిజమే. ఏడాదికి రమారమి 30 బిలియన్ డాలర్లు సప్లిమెంట్స్ మీద ఖర్చుపెడతారట.
ఈ దౌభాగ్యానికి కారణం?
గూగుల్
కానీ 8 గంటల నిద్ర మాత్రం కష్టం అనిపిస్తుంది.

Aug 8, 2018

నాన్న ఏడీ

Daniele బడి నుంచి ఇంటికొచ్చింది.
అమ్మానాన్న ఏడీ అని డెవిడ్ కోసం ఇల్లంతా వెతుకుతూ అడిగింది 
నాన్సీ పిల్లకేసి నిర్లక్ష్యంగా చూస్తూ
వచ్చి పాలు తాగు
మీ నాయన ఇంకో ముఫై ఏళ్ళవరకూ రాడు
అంది కసి నిండిన గొంతుకతో
మసిబారిపోయిన ఆలోచనలతో


ఇద్దరు మూడేళ్ళ కవల పిల్లలు తండ్రి మైక్ కోసం తపిస్తూ వెతుకుతున్నారు మూడు గదుల అపార్టుమెంటులోసదరు తండ్రి యొక్క మారుతల్లి కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ
మీనాయన ఇంకరాని తీరాలకి వెళ్ళిపోయాడని చెప్పలేక  గొంతు పొడారబోయి
చెప్పినా  చిన్నారులకు అర్థంగాక 

మైక్ ని చంపిన కేసులో డేవిడ్ కి 35 ఏళ్ళ జైలు శిక్ష

చంపినోడికీ పిల్లలున్నారు
చచ్చినోడికీ పిల్లలున్నారు 

First 48 అనే ప్రోగ్రాం చూస్తూ
నా మనసు బాధతో మూలిగింది

విధిచేయు వింతలన్నీ
మతిలేని చేష్టలేనని



అన్న  కవి నా మనసులో మెదిలాడు కవిత సాక్షిగా 

Jul 9, 2018

मुसाफ़िर हूँ मैं यारों

मुसाफ़िर हूँ मैं यारों ना घर है ना ठिकाना मुझे चलते जाना है, बस, चलते जाना मुसाफ़िर... एक राह रुक गई, तो और जुड़ गई मैं मुड़ा तो साथ\-साथ, राह मुड़ गई हवा के परों पे, मेरा आशियाना मुसाफ़िर...

Feb 9, 2018

స్లీపోవర్

పిల్లలీమధ్య  పిల్లలున్న వాళ్ళు ఎవరు ఇంటికొచ్చినా స్లీపోవర్కి ఉంటారా అని అడుగుతున్నారు. ముఖ్యంగా అనఘ. తన మిత్రురాళ్ళ బృందంలో ఎవరొచ్చినా స్లీపోవర్కి ఉండండి, ఉండనివ్వండీ అని వచ్చిన తల్లితండ్రుల్ని, ఉండమని చెప్పండి అని మమ్మల్ని పోరుతున్నారు.

బాగనే ఉన్నా ఇది ఎక్కడన్నా వికటిస్తుందేమో ఎక్కడో ఓ భయం. ఆ భయానికి మూలం ఓ మితృడి ద్వారా విన్న ఒక సంఘటన!

ఒక దేశీ తెలుగు కుటుంబం
ఇద్దరే పిల్లలు
పన్నెండేళ్ళ అమ్మాయి
చిన్న పిల్లాడు

ఒకానొక రోజున అమ్మాయి తన స్నేహితురాలింటికి స్లీపోవర్కి వెళ్ళింది. సదరు స్నేహితురాలు తెల్ల వాళ్ళు.

ఎలా జరిగిందో తెలీదు
ఏమైందో తెలీదు
కొంతకాలానికి స్లీపోవర్కి వెళ్ళిన తెలుగమ్మాయి గర్భవతి అయ్యింది... ఎవరు అని ఆరాతీస్తే తెల్లమ్మాయి తండ్రి అని తెలిసింది

తర్వాత ఏవైంది అనేది అనవసరం....