Apr 29, 2020

వై.యస్.ఆర్.సి.పి వల్లనే కరోనా ఉధృతం



బాబు గారు ఎప్పుడూ అంతే. నిప్పులు తొక్కుతుంటారు అదేఅదే చెరుగుతుంటారు.
కరోన తీవ్రతను ముందుగానే ఎలా గుర్తించారటా? ఎంత ముందుగా గుర్తించారటా?
నేను వై.యస్.ఆర్.సి.పి పార్టీకి చెందినవాణ్ణి కాదు. కానీ, ఎందుకో బాబు చెప్పేదాంట్లో ఏడుపు తప్ప ఏమీ ఉండదని ఎప్పుడూ అనిపిస్తుంటుంది.



దక్షిణభారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందనటం బాబుకే చెల్లు. 

Apr 28, 2020

అయ్యా ప్రకాశ్ రాజ్ గారూ! ఎక్కడా తమరూ?

డియర్ మిస్టర్ ప్రకాశ్ రాజ్!

2019 జనరల్ ఎలక్షన్లప్పుడు ప్రతీరోజు టీట్లు వడ్దించావు.

ప్రధాని నరేంద్రమోడీ మీద గుట్కా తిని ఉమ్మాలని ప్రయత్నించావు. యాంటీ హిందుత్వా అన్నావు. నరేంద్ర మోడీ అసలు చదువుకున్నాడా నిశానీనా అన్నావు.

"ఎవరైతే సీఏఏ సర్టిఫికేట్లు అడుగుతున్నారో.. వాళ్లు డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లేవు. పైగా పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పొలిటికల్ సైన్స్‌లో ఆయనకు డిగ్రీలు ఉండే ఉంటాయి కానీ చూపించడం లేదు. ప్రధాని ఇప్పుడు చూడు.. ప్రజలే నీకు పొలిటికల్ సైన్స్ నేర్పించి నిన్ను సాగనంపుతారు"

“”When you can FAKE your degree and become a SUPREME LEADER.. why are you in a library..””.. is this why you are HITTING STUDENTS OF THIS COUNTRY ???  .... SHAME ON YOU #JustAsking అన్నావు.

దేశానికి ఇప్పుడు కావాల్సింది ఎన్నార్సీ కాదు , దేశంలో నిరుద్యుగులు ఎంత మంది ఉన్నారో తెలిపే నిరుద్యోగుల రిజిస్టర్.


BY ELECTION RESULTS
congratulations KARNATAKA
BACK STABBERS back in action.
HOPE it doesn’t BACKFIRE ..ಅನರ್ಹರಿಗೆ ಮಣೆ ಹಾಕಿದ್ದೀರಿ...ಒಳಿತಾಗಲಿ...””ಮಾಡಿದ್ದುಣ್ಣೊ ಮಾರಾಯ””ಈ ಮಾತು ಯಾರಿಗೆ ಅನ್ವಯಿಸುತ್ತೊ ಕಾದು ನೊಡೋಣ ..#JustAsking

మనం గెలిస్తే గొప్ప అంటావు. మనం ఓడితే ఊరు దిబ్బ అంటావు.

వీటినన్నిటినీ నేను గుర్తించను. నీ పొలిటికల్ వ్యూస్ నాకెందుకూ.

కానీ నీ పొలిటికల్ మైలేజ్ కోసం ఏంచేస్తున్నావూ?

గౌరీ లంకేష్ అనే ఆమెని ఎవరో హత్య చేశారు. ఆ హత్య ఎవరు చేశారూ? ఆమెనే ఎందుకు చంపారూ? ఇవి అంత ఈజీ ప్రశ్నలు కాదు.

ఆమె హత్యకి దారితీసిన పరీస్థితులు మాత్రం ఆమె ధోరణి అని కొందరు చెప్పుకున్నారు.

ఆమె లెఫ్టిస్ట్.

ఆమె నీ మిత్రురాలు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే మైలేజ్ పెరుగుతుంది నీకు.

కాంట్రవర్సియల్ జనాలతో ట్యాగ్ చేస్కుకుంటే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది.

నీ అద్భుతమైన ఆలోచన బాగనే పనిచేస్తుందనుకున్నావు.

ఎలక్షనలో నీ పరీస్థితి ఏవైందో చెప్పాల్సిన పనిలేదు.

సరే ఇప్పుడు నిన్ను గుర్తుతెచ్చుకోవాల్సిన కర్మ ఎందుకంటే -
మొన్న మహారాష్ట్రలో ఇద్దరు స్వామీజీలను వాళ్ళ డ్రైవర్ని వెంటాడి తల పగలగొట్టి మరీ చంపారు.
ఎక్కడా నువ్వూ?
ఒక్క మాట లేదేం?
నోరు పెగలటం లేదా?
మాట పడిపోయిందా?
బొంగులే వాళ్ళు హిందువులు అంటావా?
భోషాణం గాళ్ళు సాధువులు కషాయం కట్టుకున్నారు అంటావా?

సన్నాస్లుని చంపితే ఏందీ చంపకపోతే ఏందీ అంటా?

సన్నాస్లుని చంపారని అరిస్తే పొలిటికల్ మైలేజ్ ఏవొస్తుందీ అంటావా?

ఎక్కడున్నావ్ ప్రకాశ్ రాజ్?

Apr 24, 2020

ఆర్ణబ్ గోస్వామి

భారతీయ వార్తా మాధ్యమ జగత్తులో ఓ కొత్త ఒరవడి సృష్టించింది ప్రణయ్ రాయ్. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ౧౯౮౦ చివరి దశలో వర్ల్డ్ దిస్ వీక్ అంటూ ముప్పావుగంట ప్రోగ్రామ్ ద్వారా ఆ ఒరవడికి పదును పెట్టాడు రాయ్. కొంతకాలానికి యన్.డి.టి.వి ని తెరమీదకు తెచ్చాడు. యన్.డి.టీ.వి మొట్టమొదటి *నిరంతర వార్తా స్రవంతి*. సదరు స్రవంతిలో మొట్టమొదటి/రెండో తరం వార్తాహరులు వార్తా పాఠకులలో పేరు తెచ్చుకున్నవాళ్ళలో శ్రీనివాసన్ జైన్/ బర్ఖా (క్షమించాలి) దత్/ రాజ్ దీప్ సర్దేశాయ్/ ఆర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు అనేకులు. బర్ఖా/శ్రీనివాసన్ జైన్ లాంటివాళ్ళు ఇంక అందులోనే ఉన్నారు. రాజ్ దీప్ సర్దేశాయి బయటకి వెళ్ళిపోయాడు.

ఆర్ణబ్ గోస్వామి యన్.డి.టి.వి లో ఉన్నంత కాలం ఉన్మాదాన్ని ప్రధానంగా నమ్ముకున్నాడు. అతను ఏరోజు శాంతంగా మాట్టాడిన సందర్భం నాకు కనిపించలేదు యన్.డి.టి.వి లో ఉన్నన్ని రోజులు. ప్రతీ ప్రశ్నని ఉన్మాదిలా అడిగేవాడు. ఇండియా వాంట్స్ టు నో అంటూ గొంతు చించుకునేవాడు.

మొన్నీమధ్య ఒక దృశ్యమాలిక సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. ఆర్ణబ్ ఓ విమానంలో ప్రయణిస్తుండగా కునాల్ కర్మ (క్షమించాలి. ఇతనికీ ప్రవీణ్ కర్మకీ స్నేహితం ఉందా అనడిగితే కాకిరిగుమ్మ గుఱ్ఱపు బండిలో తీసుకెళ్ళి వదిలేసి రాబడును, గుఱ్ఱానికి గుగ్గుళ్ళు మీఖర్చే) అనే ఓ దౌర్భాగ్యుడు వ్యక్తిగత స్థాయికన్నా దగ్గరగా వీడియో తీయటం మొదలెట్టాడు. అతను ముఖమ్లో ముఖం పెట్టి అతన్నే వీడియో తీయటం. ఒకరకంగా ఇది వ్యక్తి స్వేచ్ఛను కాలరాయటం. మానవత్వాన్ని మర్చిపోవటం. ఇదీ వ్యక్తిగత స్థాయిలో హింస. వ్యక్తి సహనాన్ని పరీక్శించటం. సరే వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయటం. దీన్ని అద్భుతమైన కార్యంలా పొగిడిన నట్*యిజనులూ ఉన్నారు. తిట్టిన నెటిజనులూ ఉన్నారు.

ఈ మొత్తం కాండలో ఆర్ణబ్ గోస్వామి ఎంతో హుందాగా శాంతగా తన ఉన్మాద నైజాన్ని దాదాపుగా అధిగమించేసి ఒక అడుగు పైకే వేశాడు. సదరు కర్మకి అది చెంపపెట్టు.

అదే రాజ్ దీప్ సర్దేశాయ్ ఎలా పబ్లిక్ మీద ఉన్మాదాన్ని ప్రదర్శించాడో చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో తిరిగింది. వేరే కథ.

కలక్రమంలో ఆర్ణబ్ రిపబ్లిక్ టివి అనే ఓ వార్తా ఛానల్లో మేనేజింగ్ డైరెక్టర్ గా వెళ్ళటం జరిగింది. ఈ మధ్య సదరు వార్తా ఛానల్ని చూట్టం జరిగింది కూడా. ఆర్ణబ్ తన స్వభావాన్ని ఏంచేతనో మెరుగుపరుచుకున్నాడాని చెప్పక తప్పదు. దురుసుతనాన్ని ఉన్మాదాన్ని వదిలేసినట్టుగా అనిపించింది.

నిన్నటి ఓ వార్త - ఆర్ణబ్ లేట్ నైట్ కొలువు ముగించుకుని భార్యతో కలిసి ఇంటికి వస్తుండగా కొందరు వారి కరోలా కారుని వెంబడించటం, దురుసుగా కారు పక్కగా వచ్చి కారుని ఆపే ప్రయత్నం చేయటం, అద్దాల్ని పగలగొట్టి గంగాజల్ పొయ్యటానికి ప్రయత్నించటం అంతలో ఆర్ణబ్ ఇంటి సెక్యూరిటి సిబ్బంది చూట్టం పరుగెత్తుకుంటూ రావటం దాడి చేస్తున్న దుండగుల్ని అడ్డుకోవటం జరిగాయి. ఆర్ణబ్ అతని భార్యతో క్షేమంగా ఇంటికి చేరుకోటం సీక్వెన్షియల్ ఈవెంట్స్ జరిగిపోయాయి.

సదరు దుండగులు యూత్ కాంగ్రేస్ అని తేలటం. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే కాంగ్రేస్ నేతలు సెలబ్రేట్ (అల్క లాంబా) చేసుకోటం - రాజకీయ కోణాన్ని ఆవిష్కరించాయి.

ఇలాంటివి కొత్తేంకాదు భారత ఆమాటకొస్తే ప్రపంచానికి. ఎన్ని చూడలేదూ?

౨౧వ శతాబ్దంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మన రాజకీయ వ్యవస్థ ఏస్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేస్కోవచ్చు.
ఏవైనా ఈదాడిని అన్ని వర్గాలవారూ ఖండించాలి.

తప్పు ఎవరిదైనా కావచ్చు - జర్నలిస్టుల మీద దాడి చేయకూడదు.
కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

మహారాష్ట్రలో కాంగ్రేస్ కొయిలేషన్ పాలన నడుస్తున్నది. (సోనియా గాంధీ కనుసనల్లో)

రెండ్రోజుల క్రితం ముగ్గురు వ్యక్తుల్ని దారుణంగా చంపిన రక్త చరిత్ర కళ్ళ ముందే తిరుగాడుతున్నది.

రక్తం మరిగిన ఒక జర్నలిస్టుగా ఆర్ణబ్ గోస్వామి సోనియా గాంధీని సూటిగా ప్రశ్నించాడు.


"పులీస్ వాలోంనె సంతోంకో భీడ్ కో సీంపాఁ. క్యా ఉన్‌పర్ రాజనీతిక్ దబావ్ థా?"
"సంతోఁ కె శరీర్ పర్ గెరువా కపడే థే, ఇసీలియే ఉన్‌కీ హత్యా కీ గయీ?"
"ఇంసాఫ్ కె సవాల్ పర్ అపరాధియోంకా ధర్మ్ క్యోం మతారహా హై మహారాష్ట్ర సర్కార్?"
"సోనియా గంధీ సే సవాల్ పూఛ్‌నా అపరాధ్ కబ్‌సే హో గయా?"
"సోనియాగాంధీ! దో సంతోఁ కో మార్ డాలా ఆప్ కి పోలీస్ నే ఆప్‌కో యే సాంప్రదాయక్ ఘటనా క్యోం నహీ కహా థా?"
 
ఇవి తప్పు ప్రశ్నలు అని నేననుకోటంలేదు. ఆమాటకొస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉంది.


చివరగా ఈ దాడి కాంగ్రేస్ ధోరణిని మళ్ళీ తెరమీదకు తెచ్చింది. గాంధీల భజన. సోనియా గాంధీ త్యాగమూర్తి అనీ, ఆమె భారత్ మాత అని ప్రొజెక్ట్ చేయటం దౌర్భాగ్యం.

Apr 21, 2020

వార్తాపుత్రికల పైత్యం



ప్రపంచం అంతా ఓవైపు గడగడ లాందుతోంది. 200 పైగా దేశాల్లో కరోన జనాలని చంపుతోంది. వణికిస్తోంది. భారతదేశంలో సమర్థవంతమైన  నాయకత్వం కరోన ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది/పడుతోంది - అంతే కట్టుదిట్టంగా అమలుచేయటానికి ప్రయత్నిస్తోంది కూడా.

బాగుంది. మోడిని మోసే పత్రికలు మోయచ్చు. మోడీని వ్యతిరేకించేవి మోడీ ఏ బ్రాండు కడ్రాయరు వేస్కున్నాట్టా ఈ నిర్ణయం తీసుకున్నప్పుడూ అని రాస్కోవచ్చు.

తప్పులేదు.

లోకల్ వార్తాపుత్రికలు తమ రంగుల్నీ వ్యక్తపరచుకోవచ్చు. జగన్ దొంగ అని లేక చంద్రబాబు కరోనాకన్నా డేంజరస్ అనీ.

తప్పులేదు.

కానీ వార్తాపుత్రికల దిక్కుమాలిన దౌర్భాగ్యానికి పరాకాష్ట -
అమెరికాలో శవాలు గుట్టలు గుట్టలుగా పోసారటా
ట్రంపుకి శవాలని ఏంచేయాలో తెలియట్లేదటా
గంటకి వందమంది పోతున్నారటా
టెక్సాసులో కూడా కరోనా వచ్చిందటా
పక్కనున్న న్యూ మెక్సికోలో కూడా కరోణా వచ్చిందటా
ట్రంపుకి వ్యాపారమే ముఖ్యంటా
జనాలు బిక్కుబిక్కుమంటున్నారటా

ఇలాంటి వార్తలు అక్కడున్న పెద్దవాళ్ళలో ఎలాంటి భయాందోళల్ని కలిగిస్తాయి గురిచేస్తాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే  మా అమ్మ పొద్దున ఇలా అడిగింది -
అమెరికాలో కుక్కలు కూడ బిక్కుబిక్కుమంటున్నాయటగా అని

రాస్కోండయ్యా! లోకేశ్ గురించో బాబు గురించో జగన్ గురించో. వడ్డించండి కరోనా వార్తల్ని ప్రాసలతోటి. ఎవడొద్దన్నాడూ?
కానీ కుక్కలు బిక్కుబిక్కు మనటం ఏంటీ? దరిద్రుల్లారా!
జర్నలిజమా మీ పైత్యమా?

సామాజిక మాధ్యమాలు/నెటిజనులు

సామాజిక మాధ్యమాలు అనేవి గొప్ప పాత్ర పోషించవచ్చు నేటి సమాజంలో. వాటి పాత్ర constructive side of the world అనేదాంట్లో ఎంత ఉందీ అనేది పక్కన పెడితే, destructive side ఎంతా అనేది ఒకసారి చూద్దాం.
అయితే ముందస్తు మీమాంశ
తప్పు తుపాకీదా? కాల్చేవాడిదా?
తప్పు Technology దా దాన్ని వాడేవాడిదా?
తప్పు కారుదా దాన్ని తోలేవాదిదా?
ఇలాంటి వాటికి సమాధానం వెతకటం కంటే బొంత ఊతకటం ఎలా అనే వీడియో చూట్టం ఉత్తమం.

ఈమధ్యకాలంలో వార్తాపుత్రికలు - వైరల్ అనే పదానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నాయో మనం చూడొచ్చు.
అలాంటివాటిల్లో నన్ను తీవ్రంగా ఉద్రేకపరచినవి, నన్ను కుదిపివేసినవి, బాధపెట్టినవి, అసహనానికి గురిచేసినవి కొన్ని వీడియోలో సదరు సామాజిక మాధ్యమాలల్లో విరివిగా చక్కర్లు కొట్టాయి.

1. covid 19 policing పోలీసుల మీద జనాల దాడి.
2. shaheenbag విషయంలో జరిగిన దాడులు
3. కశ్మీర్ లో జరిగిన దాడులు
Example

ఈ వీడియోలను చూస్తే ఎంద ఘోరంగా ఉన్నాయో అనే విషయాన్ని పక్కనపెడితే - ఇవి ఎలాంటి అడుగు వేయటానికి దారిచూపుతున్నాయి అనేది ముఖ్యమైన మౌళికమైన ప్రశ్నగా నాకనిపిస్తుంది.

దేశాన్ని మతపరంగా ముక్కలు చేయటనికి ఈ విడియోలు ఎంతగా ప్రోద్బలాన్ని ఇస్తున్నాయో చెప్పాల్సిన పని లెదు.

నా దృష్టిలో అలజడులు జరిగేప్పుడు ఇంటర్నెట్ ని ఆపేయటం గొప్ప ఆలోచన. article 370 revoke సమయంలో మోడి కశ్మీరులో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయతం గొప్ప దార్శనికతకు నిదర్శనం అని నా అభిప్రాయం.

ఎందుకంటే - వదంతులు అగ్గిలాగా వ్యాపిస్తాయి. అవి నిజాలని మోయవు. వదంతులు కేవలం రెచ్చగొట్టేవే కానీ నిజాలు కావు.

ట్విట్టర్ లో టపాలు కూడా అధికశాతం - opinions మాత్రమే.
సాక్షి కానీ ఈనాడు కానీ ఆమాటకొస్తే ఏవార్తపుత్రికైన opinions ని జానాలమీద ఎందుకు రుద్దాలి?
opinions ని జనాలు ఎందుకు మోయాలి? opinion is not truth. జర్నలిజంలో ఇది నేర్పరా?

Trump లాంటి వాళ్ళు ట్విట్టర్ ని అధికార ప్రకటనల కోసం వాట్టం కేవలం దౌర్భాగ్యం.

Apr 18, 2020

ఆంగ్లమాధ్యమం గొడవ

కొన్ని ముందస్తు ప్రశ్నలు

1. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని తాము పని చేస్తున్న పాఠశాలలోనే చదివిస్తున్నారు?

2. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

3. ఎందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

4. ఎందరు ప్రభుత్వ పాలకులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?

5. మీలో ఎందమంది మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశలకి పంపిస్తున్నారూ?

6. మీలో ఎందరు పపిద్దాం అనుకుంటున్నారూ?

అనుబంధ ప్రశ్నలు:

ప్రభుత్వ పాఠశాలకి పంపిద్దాం అనుకుంటే - ఎందుకు అనుకునే దగ్గరే ఆగిపోయారూ?
పంపించమూ అంటే - పంపించకపోటానికి ప్రతిబంధకాలు ఏవిటీ?

ఇవే ప్రశ్నలు నన్ను అడిగితే - నా సమాధానాలు/ఆలోచనలు -

నేను జిల్లాపరిషత్ ప్రధమికోన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య అయ్యాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశలలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేస్కున్నాను.

మా నాన్న పని చేసిన స్కూల్లో చదువుకునే అవకాశం కలిగింది. లెక్కలకు ఆంగ్లానికి మా నాన్నే వచ్చేవారు.

అయితే ఇప్పుడు, ఒకవేళ నేను భారతదేశంలో ఉండి ఉంటే మా పిల్లల్ని జిల్లా పరిషత్ పాఠశాలకి పంపించుండేవాడినా అని అడిగితే పంపించుండేవాడ్ని కాదేమో.

ఎందుకుటా అంటే మాధ్యమాం అని చెప్పక తప్పదు.

నావరకు నాకు కేవలం మాధ్యమం అనేదే ప్రతిబంధకం.

ప్రభుత్వపాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు. క్వాలిఫైడ్ విద్యావిధానం ఉంటుంది. వ్యక్తిత్వ వికాశం ఉంటుంది. ఆట స్థలం ఉంటుంది. డ్రిల్ మాష్టారు ఉంటారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో కుక్కి కూర్చోబెడతారు. వ్యక్తిత్వ వికాశం ఉండదు. మార్కులే గీటురాళ్ళు. ఆట స్థలం మృగ్యం. ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ అవునా కాదా చెప్పలేం. విద్యావిధానం ఎవరు నిర్ణయిస్తారో తెలియదు.

బాడ్ యాపిల్స్ ఎక్కడైనా ఉంటాయి. వాటిని పక్కన పెడితే, నాణ్యమైన విద్య అనేది ప్రభుత్వ పాఠశలల్లోనే అని నా ప్రగాఢ విశ్వాసం. ఇది నేను ఒక జిల్లాపరిషత్ పాఠశాలలో పని చేసిన ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా చెబుతున్నా.

ఇప్పట్లోకి వస్తే - నా పిల్లల్ని తెలుగు మీడియంకి పంపలేను. ప్రభుత్వ పాఠశలలో ఆంగ్ల మీడియం ఉంటే పంపించటానికి నాకేమాత్రం సంశయం లేదు.

అమెరికా లాంటి దేశాలల్లో ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్య ప్రైవేటు పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్యతో పోలిస్తే పదిరెట్లకన్న ఎక్కువ.

అమెరికాలో 46 మిలియన్ పిల్లలు పబ్లిక్ విద్యావిధానంలో ఉండగా 4 మిలియన్ విద్యార్థులు మాత్రమే ప్రైవేటు విద్యావిధానంలో ఉన్నారు

భారత దేశంలో ప్రైవేటు పాఠశాలలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నదని నా అభిప్రాయం.

మౌళిక ప్రశ్న ఈ విషయానికి సంబంధించి -
ప్రభుత్వ పాఠశలలని పునరుద్ధరించాలంటే ప్రభుతం ఏం చేయాలీ?
ప్రజలు ఏంచేయాలీ?

ప్రభుత్వం పాఠశాల వ్యవస్థని పునరుద్ధరించాలి. గట్టి చేయాలి. జెడ్.పి.టి.సి లాంటి రాజకీయ వ్యవస్థని పాఠశల నుంచి వేరు చేయాలి. ఉపాధ్యాయులని ప్రేరేపించాలి. జవజీవాల్ని నింపాలి.

ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం మత్రమే అనే నిర్ణయం సరైంది కాకపోవచ్చు కానీ ఆంగ్ల మాధ్యమం అనేది తప్పుకాదు.

వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా వ్యవస్థని పునర్మించకుండా గుడ్డిగా ఆంగ్లమాధ్యమం అనటం సరైంది కాదని న అభిప్రాయం.

ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో కూడా కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని నా అభిప్రాయం

Apr 5, 2020

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా

నాకు నచ్చిన పాట వినటం ఒక ఎత్తు
వాడికిష్టమైన పాటలు randam గా వేయటం ఒక రకం
కథలోకి వెళితే -
పని నుంచి ఇంటికొచ్చాను భారంగా
బాగా వాన కురిసినట్టుగా ఉంది
అంతా చిత్తడి చిత్తడి
అలా కొట్టుకెళ్ళి ద్రాక్షారసం తెచ్చుకుని కూసింత గొంతులోకి ఒంపుకుని
ఆశ్వాదిస్తూ
అనుభవిస్తూ
టీవీ పెట్టాను
ఆపాత మధురాలంటు మధువొలకబోస్తున్నాడో చానల్ వాడు

విజయశాంతి నాగార్జునల రసమయగీతం
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
ఆ నా గొంతు శృతిలోనా
ఆ నా గుండె లయలోన

ఎంచేతనో  predictable stereotype పాట వ్రాశాడు ఆత్రేయ

తర్వాతి పాట
బాలయ్య రజని నటించిన సీతారాముల కళ్యాణం అనే సినిమా నుంచి

అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము

మన ప్రేమ తుది లేని ఆకాశము
ప్రతి రోజు పూర్ణిమా శ్రావణము

మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా

హృదయాల నామాలె వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా

వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా

గెలిచాము కలిశాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా

శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

ఇదికూడా predictable కాని పదాల అల్లిక బాగుంది. ఈపాటని రసమయ కావ్యంలా అనుకున్నా బాలయ్య అతి ఎబ్బెట్టుగా ఉంటుంది ఎప్పటిలాగానే

తర్వాతి పాట
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
దాసరి పైత్యం కష్టం
ఈపాటల క్యాసెట్టు ఉండేది అప్పట్లో

తర్వాతి పాట

ఏప్రిల్ ఒకటి విడుదల నుంచి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను..
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

షోలే ఉందా ?
ఇదిగో ఇందా ....
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా..

ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే..
వీడికి అన్నయ్య వాడే..

జగదేకవీరుడి కథా.. ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల.. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

ఒకటా రెండా.. పదులా వందా
బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా.. మతి పోయిందా
చాల్లే మీ కాకి గోలా.. వేళా పాళంటూ లేదా

ఏవైంది భాగ్యం కథా? కదిలిందా లేదా కథా?
వ్రతమేదో చేస్తోందటా.. అందాక ఆగాలటా
లౌక్యంగా బ్రతకాలీ.. సౌఖ్యాలే పొందాలి...

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను..
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

At a glance ఇది వేటూరి సాహిత్యంలా అనిపిస్తుంది
చిన్న చిన్న పదాలు సరళమైన భాష
సరదా ప్రాస
వంశీ మార్కు పైత్యం
ఇళయరాజా మాయాజాలం
కానీ ఇది సిరివెన్నెల పదం

ఏవైంది భాగ్యం కథ అని చిన్నారవ్ అడగటం
ఓ సాగా

భర్తకు శతృవు

భర్తకు శతృవు - భార్య అందం
భార్య రూపవతీ శతృ
భార్యకు శాపం - భర్త వ్యసనం
ఆడదానికి శతృవు - ఆడదే

విలువలు లేని వెధవలు

విలువలు లేని వెధవలు
డాలరు వలువలు వొలిచి
తొక్కిపట్టి బొక్కసంలో బంధిస్తుంటే
ఇంకా పనిముంగిట్లో
నిండా మునిగి
తలుపుతట్టే అవకాశాలని చేజార్చుకుని
ముందరితరాలకు ఏవిద్దామని
నీ ఆలోచన ఓనేస్తం
(స్వగతం)

మనిషి ఆలోచన

అంతఃస్వభావం
బాహ్య స్వభావం
రెండూ మనిషిని లొంగదీసుకుంటాయి
రెండూ మనిషిని నడిపిస్తాయి
దేని ప్రభావానికి మనిషి బానిసో
కాలం నిర్ణయిస్తుంది
ఎప్పట్లాగానే మనిషి ఆలోచన
కాలానికి బానిస
(కాలం = situation)

నిరాశావాది స్వగతం

నా కలలు
నా ఊహలు
నా ఆశలు
నా ఆలోచనలు
నీ చుట్టూ కోటలు
నీ చుట్టూ తోటలు
నీ చుట్టూ పాటలు
నీ చుట్టూ ఊహలు
నా కలలు
గాలికి కొట్టుకుపోయే ఈకలు
నా ఊహలు
నీటిపై కరిగిపోయే రాతలు
నా ఆశలు
మట్టిలో కలిసిపోయే ఆకులు
- నిరాశావాది స్వగతం

నా గ్రంథాలన్నీ నీ కథలే

నా గ్రంథాలన్నీ నీ కథలే
నా గంథాలన్ని  నీ సువాసనలే
నా ఆలోచనలంతా నీ ఊసులే

ఇక్కడ చదివానో ఎక్కడ విన్నానో జ్ఞాపకం రావట్లేదు.

సుదతి

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా
సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును మరుల విరులు కురియగ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
- సినారె

కొంచెం విచిత్రమైన ఆలోచన ఇది. సాధారణంగా అతను ఆమె శరీరాకృతినో కురులనో కళ్ళనో లేక చెవులనో పొగుడుతాడు. సదరు విషయాలన్ని శృంగార విశేషాలు. కొందరు చెవి ఝుంకాలను నడుముకున్న ఆభరణాలను చేతికున్న వంకీలను కూడా జత చేస్తారు
కాని ఇక్కడ సినారె సుదతి తనువు మదన ధనువు అంటాడు. ఆమె శరీరం మదనుడి విల్లు అన్నాడు కానీ ముందు సుదతి అని వాడాడు.
సుదతి - చక్కని పలువరుస కలది
అప్పుడే డెంటల్ డాక్ దగ్గరకెళ్ళి డీప్ క్లీనింగ్ చేయించుకొచ్చింది.


దీనికి మూలం బహుశా సంస్కృత సాహిత్యం అయుండచ్చు.

ప్రియే చారుశీలే.. ప్రియే చారుశీలే..
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
హరతి దర తిమిరమతిఘోరం

జయదేవ అష్టపది
వదసి
యది
కించిత్
అపి
దంత
రుచి
కౌముది
హరతి
దర
తిమిరం
అతి
ఘోరం

ఎలా అర్థం చేస్కోవాలో - ప్రియా మూతి బిగించుకుని  కూర్చున్నావు, ఒక్క మాట పలకటానికి నోరుతెరువు. తెల్లని నీ పలువరుస నుంచి వచ్చే కాంతి ఈ ఘోర తిమిరాన్ని హరించనీ.

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటు లేని భావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటు లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా

చాలా కాలం తర్వాత
ఒక కవి తపన
ఓ గాయకుడు భావగర్భితంగా స్రవించిన ధార

అద్భుతం అనక తప్పదు

ఇయర్ బడ్స్

సూరిగాడు వాడి పడేసిన ఇయర్ బుడ్స్ వాట్టం మొదలెట్టాను నావి పక్కన పడేసి. హంగులు ఆర్భాటాలు పక్కన పెడితే ఇవి పెట్టుకుంటే చెవిటోడితో సమానం. పక్కన *బం* పడ్నా తెలియదు.

ఇంతలో కొత్త సమస్య -
ఎడమ చెవిది వినబడును
కుడిచెవిది వినబడదు

ఎన్నోరకాలుగా *ఎక్కడా ఇక్కడా నొక్కినా* పనిజేయటంలేదు
వాడినే అడిగా ఏరా అని
హా అవి ఔట్ ఆఫ్ సింక్ అన్నాడు
భలే భలే మరి సింక్ చేయటం ఎలా అడిగాను
నాకు హోంవర్క్ ఉందని వెలుగులోకి జారుకున్నాడు నన్ను చీకట్లోకి నెట్టి

అలా కుస్తీ సిగపట్లు పడుతుండగా ఏకళనుందో కుడిది పనిచేయటం మొదలెట్టింది

అనూహ్యంగా ఎడమది పనిచేయటంలేదు

ఈ సమస్యని పూరించిన వారికి నా రెండు ఇయర్ బడ్స్ నుంచి ఒకదాన్ని నిట్ట నిలువునా చీల్చేసి బహుమతిగా ఇస్తానని వాక్దానం చేస్తూ నా రాజ్యంలో చాటింపు వేయిస్తున్నా

నాకం

ఓ మహాత్మా
ఓ మహర్షి

ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం

శ్రీశ్రీ మహాప్రస్థానం
ఆకలిరాజ్యం సినిమాలో ఈ కవితని శ్రీ బాలసుబ్రహ్మణ్యం చాలా భావావేశంతో పాడారు, కమల్ హాసన్ జీవించాడు

శ్రీశ్రీ నవకవితా పితామహుడు ఊరకనే కాలేదు. ఆయన భావాలు గొప్పగా ఉంటం వల్ల అయ్యాడు. ఆయనకి బీజం ఎక్కడ పడిందో తెలియలేదు. ఆయన సాహిత్య స్రవంతికి మూలాలేంటో?
ఆయన పురాణాలు ఉపనిషత్తులు బాగా చదివి ఉంటాడు.

ఉదాహరణకు -
ఏది నరకం ఏది నాకం

నాకం అనే పదం నేను వినలేదు ఈ కవితలో తప్ప.

అకము akamu. [Skt. from ఆ = not & క = happiness.] n. Ache, pain, affliction. Sin. దుఃఖము, పాపము నాకము = న+అకము = heaven, the sinless place.

ఈ పదం ఇక్కడ దొరికింది -
మహానారాయణ ఉపనిషత్

అంభస్యపారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్
అంభః
అపారః
భువనః
అస్య
మధ్యే
*నాకః*
అస్య
పృష్ఠే
మహతో
మహీయాన్