భావాన్ని వ్యక్తపరచాలంటే భాష కావాలి.
మన భాష తెలుగు. కాబట్టి మనం మన భావాలని తెలుగులో వ్యక్తపరుస్తాం.
మరి తేడా ఎక్కడా? భావంలోనా భాషలోనా?
ఉదాహరణ -
౧. రేడియో విరిగింది.
మొన్నీ మధ్య టీవీలో ఓ ప్రకటన చూసా. విక్స్ అనుకుంటా. ఒక ముసలాయన కుర్చిలో కూర్చుని రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటుంటాడు. రేడియో కిందపట్టమో జరుగుతుంది. అరెరె
రేండియో విరిగిందే అంటాడా ముసలాయన, వెంటనే ఓ ఔత్సాహిక కుఱ్ఱాడు కామెంటరీ చెప్పేందుకు ముందికి వస్తాడు...బ్లబ్లబ్ల.
రేడియో విరిగేందేవిట్టా వాడి బొంద.
లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి మాస్ కమ్యూనికేషన్స్ చదువాతారు కొందరు. మాస్ తో కమ్యూనికేట్ చేయాలంటే దృశ్యం ఎంత ముఖ్యమో శ్రవణం కూడా అంతే ముఖ్యం అనే ఓ సింపుల్ పాయింటుని సదరు కళాశాల అధ్యాపకులు నేర్పరా ఏవిటి వీళ్ళకి?
సరే పరాయి భాషనుండి దిగుమతి చేస్కున్న ప్రకటన, తెలుగీకరించారనుకుందాం. ఇంతక మునుపట్లో కూడా ఇలా జరిగిందే మరి. ఇదేమీ కొత్త కాదుగా. విక్స్ కి గోలీలో ఖిచ్ ఖిచ్ దూర్ కరో. గొంతులో గుర గురా విక్స్ తీస్కో అనే ఓ వాక్యాన్ని తెలుగులో చెప్పించటానికి ఓ పెద్ద భాషమీద పట్టు, భాషాపాండిత్యం ఏం అక్కర్లేదుగా.
౨. మరక మంచిదే. మరకవల్ల ఏమన్నా లాభం కలిగితే మరక మంచిదే.
ఈ ప్రకటన ఓ దౌర్భాగ్యపు నీచ నికృష్టపు విలువలకు నిదర్శనం. ఇందులో భాషా ప్రయోగమే కాదు దృశ్య ప్రయోగం కూడా ఘోరం. చదువు మనిషికి ఆలోచలని రేకెత్తించేలా ఉండాలి. ఇది తీసిన వాడేవడోగానీ వాడికి కనీస లాజిక్కు లేదు.
పిల్లాడు బడికెళ్ళాడు.
స్నేహితుణ్ణి అడుగుతాడు రోజీ మిస్ రాలేదేం అని.
వాళ్ళ కుక్క పిల్ల సచ్చిందిగా అందుకే రాలేదు అని చెప్తాడా సదరు మితృడు.
కట్ చేస్తే రోజీ మిస్ ఇల్లు
పిల్లాడు, కుక్క సచ్చిందని బాధపడకు రోజీమిస్ నేనున్నాగా అని కుక్కలా ప్రవర్తిస్తాడు.
మిస్ అయిన లాజిక్కు -
పిల్లాడికి రోజీ మిస్ ఇల్లు ఎలా తెలుసు?
పిల్లాడు బడి ఎగ్గొట్టి రోజి మిస్ ఇంటికి ఎలా వెళ్ళాడు?
ఆ వయసు పిల్లాడు ఒక్కడే ఎలా వెళ్ళగలడూ?
మరక మంచిదే, మరక వల్ల లాభం కలిగితే వాడి పిండాకూడు కలిగితే మరక మంచిదే? ఏం మరకా? వాడి బొంద మరకా?
బడి ఎగ్గొట్టి రోడ్లెమ్మట తిరిగితే పడే మరక సంగతేవిట్టా?
[బడీ అయ్యాక, ఇంట్లో చెప్పి, వాళ్ళా నాన్న దింపితే....నాకు కొంచెం అకల్ ఉంది బట్]
ఇలా ప్రకటనల్లో వచ్చే తెలుగు, లేక మన యాం౨కరు అమ్మాయిల ముద్దు ముద్దు (ఆపాట పట్టుకుని ముక్కు మీద గుద్దు గుద్దు) తెలుగు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి. అదలా ఉంచితే, మనలోనే కొందరు ఖూనీ చేసేస్తున్నారు తెలుగుని, తమ మాతృభాషని.
వీపు ఇరగ్గొడతా అంటాడు ఓ మితృడు
నెయ్యి గుప్పెడు తింటే అత్భుతం ఈ పచ్చడితో అంటాడు ఇంకో మితృడు
చేయి పగిలిందంటాడు ఇంకొకడు
తల విరిగింది అంటాడు మరొకడు
ఎక్కడా లోపం?