ఆటలో గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు
ఒక పరిణితిచెందిన క్రీడాకారుడికి
గెలుపునుండి ఏమి నేర్చుకున్నావు
ఏటమి ఏమి నేర్పింది అనేది ముఖ్యం
ఆడిన ప్రతీసారీ ఏదోకటి నేర్చుకోక పోతే ఆడటం అనవసరం
చచ్చిన చేపతో సమానం
ఆటలో గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు
ఒక పరిణితిచెందిన క్రీడాకారుడికి
గెలుపునుండి ఏమి నేర్చుకున్నావు
ఏటమి ఏమి నేర్పింది అనేది ముఖ్యం
ఆడిన ప్రతీసారీ ఏదోకటి నేర్చుకోక పోతే ఆడటం అనవసరం
చచ్చిన చేపతో సమానం
ఇజ్రాయేల్ ని సమర్థిస్తావా?
నిన్న ఓ రోజున నా కూతురు నన్ను ఒక ప్రశ్న వేసింది
నువ్వు ఎవ్వర్ని సమర్థిస్తావూ ఇస్జ్రాయేల్ నా లేక పాలస్తీనా నా అని
చాలా క్లిష్టమైన ప్రశ్న
ఒక భారతీయుడిగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్కుంటే భారతదేశానికి ఇజ్రాయేల్ చాలా మిత్ర దేశం. అదే సమయంలో భారత దేశానికి ఎస్సార్ అరాఫత్ మిత్రుడు, భారతదేశ సందర్శనకి రావటం అనేక ఒప్పందాలమీద సంతకాలు.
భారత దేశం కూడా ఇజ్రాయేల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న సమస్య లాంటి సమస్యనే అనుభవిస్తున్నది.
ఇలాంటి నేపథ్యంలో నేను ఎవర్ని సపోర్ట్ చెయ్యాలీ? చేస్తానూ?
సూటిగా సమాధానం చెప్పాను.
ఎవరైతే ఉగ్రవాదం మీద పోరాడతారో వాళ్ళని సపోర్ట్ చేస్తాను అని చెప్పాను.
అంటే? అన్నది
ఒక దేశంలోకి చొచ్చ్కువచ్చి వందలమంది మీద కాల్పులు జరిపి వందలమందిని బందీలుగా చేస్కున్న వాళ్ళ మీద దాడి చెయ్యాలి
అలా దాడి చేసే సమయంలో తమ మీద దాడులు జరక్కుండా ప్రపంచ దృష్టిని మరల్చేలా జనవాసాల్లో దాక్కుని ముందు ఆడవాళ్ళని ముసలి ముతకని పిల్లల్ని పెట్టి వాళ్ళ వెనక దాక్కున్న వాళ్ళ మీద ఎక్కు పెట్టాలంటే ఎలా?
జనావాసాల కింద బొరియలు చేస్కుని అందులో దాక్కున్న వాళ్ళాని చంపటం ఎలా?
తప్పదు
కొందరు/అందరు బలి అవ్వాల్సిందే
"కానీ పిల్లల్ని చంపటం ఎలా సమర్థిస్తావూ?" మళ్ళీ ప్రశ్న
"పిల్లల్ని ఎరగా వేస్తున్నవాళ్ళు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి" అన్నాను
"ఏవైనా పిల్లల్ని చంపటాన్ని సమర్థించ కూడదు" తన వెర్షన్
"దీనికోసమే ఇలా ప్రపంచాన్ని పోలరైజ్ చేయటం కోసం సానుభూతి కోసమే వాళ్ళు జనావాసాల కింద బొరియలు తవ్వుకున్నది సొరంగాలల్లో దాక్కున్నది" అన్నాను
"ఇదొక గెరిల్లా యుద్ధ తంత్రం" అని చెప్పటానికి ప్రయత్నించాను
"ఇది చాలా చిన్న సమస్య. అయ్యా మీరూ మీరూ పోట్లాడుకోండి కొట్టుకోండి చంపుకోండి. సామాన్యుల ప్రాణాలు బలితీయకండి అని ఎవరూ ముందుకి రాలేదు. అయ్యా మీ దేశం నుండి ఎత్తుకొచ్చిన వాళ్ళు వీళ్ళే తీసుకెళ్ళండి. మా జనావాసాల కింద మీరు దాక్కోకండి.. మా బ్రతుకులు మాకు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం అని ఎవరూ అనలేదు.... ఈరోజు వరకూ. దీనర్థం ఇది ఒక రాజకీయ సమస్య. రాజకీయ సమస్యలకు పరిష్కారం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరటం లాంటిది" అని ముగించాను
శ్రీశ్రీ గారికి రష్యా అంటే ఎంత ప్రేమో చెప్పలేంది. ఆయన కవితల్లో రష్యాని ఎవరెస్ట్ శిఖరం మీద కాదు కాదు ఇంకా పైన కూర్చూబెట్టాడు
తన కళ్ళద్దాలని ఎఱ్ఱ కళ్ళద్దాలుగా మార్చుకునేంత ప్రేమించడు
గర్జించు రష్యా
గాండ్రించు రష్యా
రష్యాలో గని కార్మికుడు
రష్యాలో రిక్షావాలా
రష్యాలో పొగ గొట్టపు ధ్వని
రష్యాలో బందరు లడ్డు
రష్యాలో గాడిద గుడ్డు
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రష్యా మీద ప్రేమ కవితలు
రష్యా వాసన!
ఖడ్గసృష్టి చివర్న ఫుట్ నోట్స్ సెక్షన్ లో "మళ్ళీ రష్యా వెళ్తున్నాను" అని ఒక నోట్.
1954 లో శ్రీశ్రీ మొదటిసారి రష్యా వెళ్ళాట్ట. తిరిగి రాలేక రాలేక వచ్చాక ఒక ఇష్టాగోష్ఠి సమావేశం జరిగిందట. అందులో మాస్కో విశ్వవిద్యాలయం గురించి ముచ్చటిస్తూ (అంటే కీర్తిస్తూ) "అప్పుడే జన్మించిన శిశువును రోజుకొక గదిలో నిద్రబుచ్చితే, అన్నీ గదులు పూర్తయ్యేప్పటికి శిశువుకి వందేళ్ళు వస్తాయి" అని కవితాత్మకంగా వాక్రుచ్చారట. 100*360=36500 రోజులు. సదరు మాస్కో విశ్వవిద్యాలంలో ఎన్ని రూములున్నాయో మరి. గూగుల్ గారిని అడిగాను, వారి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సు గారు ఇలా చెప్పుకొచ్చారు The central tower of Moscow State University's main building has over 5,000 rooms. The tower is 36 stories high and 240 meters tall, and it contains 33 kilometers of corridors.
Moscow State University is Russia's largest and oldest university. It has a complex campus with 1,000 buildings and structures, and it also has eight dormitories that house more than 12,000 students.
నిజం చెప్పాలంటే 1954 నాటికి ఒక విశ్వవియాలయంలో 5000 గదులు ఉండటం గొప్పవిషయమే అయుండచ్చు.
విషయంలోకి వస్తే
ఈ ఇష్టాగోస్ఠిని వక్రీకరిస్తూ ఆంధ్రపత్రికలో ఒక వ్యాసం వచ్చిందట, “ఆంధ్ర రచయితల గురుతర బాధ్యత” వ్యాసం శీర్షిక, 04/01/1955 న ముద్రింపబడింది.
ఇందులో మాస్కో విశ్వవిద్యాలయం జార్ చక్రవర్తుల కాలంలో కడితే ఆ కీర్తిని కమ్యూనిష్టు రష్యాకి శ్రీశ్రీ ఆపాదించాడని సారాంశం
శ్రీశ్రీ 04/01/1955 న ఈ వ్యాసాన్ని కువ్యాఖ్యానం అంటూ ప్రతిగా ఒక లేఖ రాశాట్ట, అది 07/01/1955 న అచ్చైయిందట. తాను చెప్పింది మాస్కో విశ్వవిద్యాలయం స్థాపన 1755, పునరుద్ధరణ 1954 గురించి అని.
ఆంధ్రపత్రిక కువ్యాఖ్యానానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో మధ్యంతర ఎన్నికలు ఫిబ్రవరి 1955 జరగవలి ఉంది.
కాంగ్రేస్ కమ్యూనిష్టుల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఘాట్టి పోటీ ఉంది.
ఎన్నికల ప్రచారం అప్పటికే ఊపండుకుంది.
సహజంగానే అంధ్రపత్రిక కాంగ్రేసుకి కొమ్ము కాసేది. కాంగ్రేస్ మరియూ ప్రెస్ కమ్యూనిష్టుల మీద అక్కసు వెళ్ళగక్కటమే పై వ్యాసం లక్ష్యం. అందులో భాగంగానే తన మీద నిందారోపణకి ఒడిగట్టాయంటూ శ్రీశ్రీ భావోద్వేగం.
నిజం చెప్పాలంటే ఆంధ్రా కమ్యూనిష్టులు రాష్ట్రం ఏర్పడ్డప్పటినుండి తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. MLC దగ్గ్రనుండి MLA లదాకా తమ ప్రభావం చూపించారు.
ఫిబ్రవరి 11 1955 శాసనసభ ఎన్నికలు జరిగాయి. 167 స్థానాలకు 581 మంది పోటీ చేశారు. భారత జాతీయ కాంగ్రేసు 119 స్థానాలు గెల్చుకుంటే భారతీయ కమ్యూనిష్టు పార్టీ 15 స్థానాలు గెలుపొందింది.
31.13% ఓటు శాతం. కమ్యూనిస్టు గాలి బాగనే వీచినట్టు లెక్క
ఇక్కడి అసలు విషయం ఎలక్షన్లు కాదు
శ్రీశ్రీ గారి నైజం
అంతగొప్ప అభ్యుదయ వాది
అభ్యుదయ రచయితల సంఘం విప్లవరచయితల సంఘం అది ఇదీ.
ఒక చిన్న బావిలోని కప్ప ఓ రోజు ఓ పెద్ద చెఱువులోకి దూకిందట. అంత పెద్ద చెఱువు దానికి ఆశ్చర్యాన్ని కలిగించిందట. తామరాకులు ఒడ్డెమ్మటి బొక్కలు ఆహా ఓహో..అలా ఉంది శ్రీశ్రీ ధోరణి.
1000 ఏళ్ళ పరాయి పాలనలో మన వనరుల మీద మన సంపద మీద దాడి జరిపి నిష్క్రమిచాడు తురుష్కుడు, మిగిలిందాన్ని పీల్చి పిప్పి అయ్యాక స్వాతంత్రం అనే చిరిగిపోయిన చీకిపోయిన గోచీని దిశమొలమీద లాగి చుట్టి వెళ్ళాడు బ్రిటీషుడు.
కమ్యూనిష్టులు ఈ దోపిడీని గుర్తించారా?
భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రష్యా దేశానికి జార్ చక్రవర్తి నుండి స్వాతంత్రం రాలేదు. ఆయన్ని చంపి పాలనని తమ చేతుల్లోకి తీస్కున్నారు.
జార్ చక్రవర్తి పోతూ పోతూ సంపదను తీసుకు పోలేదు కానీ బ్రిటీషుడు పోతూ పోతూ భారతదేశ సంపదను దోచుకెళ్ళాడు. ఈనాటి ఆ సంపద లెక్క 5 ట్రిలియన్ డాలర్లు అంటున్నారు కొందరు.
ఏవైనా శ్రీశ్రీ ఎఱ్ఱ కళ్ళద్దాలలో రష్యా ఎంత బాగున్నా ఎంత ఎఱ్ఱగా ఉన్నా భారతదేశపు ఎఱుపు పసుపు నలుపు తెలుపు కనపడకపోవటం కేవలం కళ్ళద్దాల మహిమ మాత్రం కాదు
ఆంధ్రా నుంచి వచ్చిన నేను ఒక సగటు ఆంధ్రావాడిలాగనే ఉంటాగానీ ఇంకోలా ఎలా ఉంటా? పుట్టుకతో వచ్చిన, పెరగటంలో కలిగిన జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం నాది.
సరే! విషయంలోకొస్తే, సూరిగాడు కాలేజీకి వచ్చాడు.
నమ్మలేకపోతున్నారు కదూ? నా బ్లాగులో ఎన్నో పోస్టులు పిల్లల మీద వేశాను. ముఖ్యంగా సూరిగాడి మీద. ఎందరో బ్లాగు మిత్రులు సూరిగాడికి ఫ్యాన్స్ అయ్యారు. వాడి పుట్టినరోజుకి శుభాకాంక్షలు అందించారు ప్రతీ ఏడాది, పెద్దలు అనేకులు దీవించారు.
మహాభారత్ టీవీ serial మొట్టమొదట వచ్చే మాటలు గుర్తుకొస్తున్నాయి
మై సమయ్ హూఁ మై కభీ రుక్తా నహీఁ, హమేషా ఆగె బడ్తా రహ్తా హూఁ, ఔర్ ఠీక్ ఉసీ తరాహ్ కాం హై, హమేషా బడ్థా హీ రహ్తా హై, పర్ సమయ్ కభీ కాం కేలియే నహీఁ రుక్త
కాలం నాకోసమో నీకోసమో ఆగదు...ఎప్పుడూ తన మానాన తాను ప్రవహిస్తూనే ఉంటుంది. నా బ్లాగ్ లో మొదటి పోస్ట్ వేసే నాటికి సూరిగాడు ఏడాది వయసు. ఈ రోజున 18 ఏళ్ళ వయసు.
కాలేజీకి సిద్ధం అవుతున్నాడూ అంటే ... పుత్రోత్సాహము, చెయ్యొదులన్నా, పొంగిపోనీ అన్నా...
సరే విషయంలోకొస్తే, మనోడు ఓ పెద్ద పగలనూకుతాడు భూమి మొత్తాన్ని తలకిందులుగా తిప్పే పైతాన్ కోడ్ రాసి, ఎక్జిక్యూట్ చేస్తే సిస్టంస్ అన్నీ వేడెక్కి పగిలిపోతాయి అని నేను ఏమాత్రమూ ఊహించలా.
అసలు వాడు ఏమి చదువుతున్నాడు అని కూడా నేను పెద్ద పట్టించుకోలా. బడి నుంచి ఇంటికొచ్చేవాడు, బ్యాగ్ ఇస్సిరికొట్టి baskaetball ఆడుతుండేవాడు. నేను దాన్ని ప్రోత్సహించాను. వాడి కన్నా ఏడాదో రెండేళ్ళో ముందున్నవాళ్ళు రాత్రిళ్ళు 1 దాకా హోంవర్కులు చేస్తూ హడావిడీ పడేవాళ్ళు. వీడు మాత్రం పది కల్లా దుప్పటి ముసుగులోకి జారుకునే వాడు. ఏరాబాబూ హోంవర్క్ లేదా అంటే, స్కూల్లోనే చేశా అని చెప్పేవాడు. ఆశ్చర్యం వేసేది. ఇదేంటిది, ఇలాఎలాగా? ఇల్లాక్కూడా అవ్విద్దా అని నోరెల్లబెట్టి ధనా ధనా అని మోగే బాస్కెట్ బాల్ హూప్ వైపు చూస్తూ ఉండేవాణ్ణి. వాడొచ్చి, మూసేయ్ నోట్లోకి దోమలు ఈగలూ కార్లు బస్సులూ ఎల్తన్నయ్యై అని చెప్పేవాడు వెటకారంగా.
మోడీ గారు చెప్పిన మాట, మన అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది - జో ఖేలేఁ వో ఖిలే, ఆడేవాడు వికసిస్తాడు అని. నా అభిప్రాయం - అది అక్షర సత్యం అని.
నేను వాడి చదువులో వేలు పెట్టకుండా ఉంటానికి కారణాలు అనేకం.
ఒక ముఖ్య కారణం - మీవాడు చదువులో వెనకబడి ఉన్నాడు అని బడి నుంచి నాకు నోటిఫికేషన్ రానంత వరకూ నేను వేలు పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది.
ఇంకొక విషయం - ప్రతీవాడు IIT కి వెళ్ళలేడు. వెళ్ళినా మొదటిరోజు నుంచే 20 అడుగులు దూకు కమాన్ పెర్ఫార్మ్ అనే డిమ్యాండ్ ఉంటుంది. ఎందుకు అంత ఒత్తిడి? అనిపించింది
మూడూ విషయం - సూరిగాడి మిత్రబృందంలో ఒకడి నాన్న 1960 లల్లో వచ్చి స్థిరపడ్డ సంతతి. అతను ఒకమాట చెప్పాడు. గురూ పిల్లవాడు MS చేద్దాం అనే అలోచన ఉన్నటైతే BS ఏకాలేజీలో చేసినా దాదాపు ఒక్కటే. అంతేగాక, అమెరికా సిస్టంలో, ప్రతీ వాడికి ఏదోక కాలేజీలో సీటు తప్పక రాసిపెట్టి ఉంటుంది. కొందరు Texas A&M కి వెళ్తారు, కొందరు UT Austin కి వెళ్తారు మిగతావాళ్ళు మిగతా కాలేజుల్లోకి వెళ్తారు. అంతే అన్నాడు.
ఓరిదీనెమ్మ దీనికోసం చిన్నప్పటి నుంచి ఎన్ని వెషాలు తలితండ్రులు వేస్తారూ, ఎన్ని వేషాలు పిల్లలచేత వేయిస్తారూ? హవర్స్ అని వాలెంటరీంగ్ అని మ్యూజిక్ అని స్పోర్ట్స్ అనీ సాకర్ mom సాకర్ డాడ్ .. అదీ ఇదీ ...
ఇవన్నీ అవసరమే కాదన్ను కానీ అవసరానికి మించి యాస్పైర్ అవటం మనిషి నైజం అనిపిస్తుంటుంది..
ఏవైనా ఉరుకులు పరుగులు taekwondo లు basketball లు music లు dance లు అవి ఇవి - వీటన్నిట మధ్యలోంచి లేచి నాన్నా కాలేజీకి అప్లై చేస్కుంటున్నా, UT Arlginton UNT UT Dallas UofH Texas Tech లాంటి కాలేజీలల్లో వచ్చింది. కానీ UT Arlginton UNT Texas Tech లో నేను కోరుకున్న మేజర్లో వచ్చింది అన్నాడు.
సరేరా నాయనా, మంచి నిర్ణయం తీస్కో, ఏది బాగుంటుందో తెలుసుకో, ఇండస్ట్రీకి ఏది దగ్గరగా ఉంటుందో ఇండస్ట్రీకి ఏది సుస్పష్టంగా కనిపిస్తుందో కనుక్కుని చేరు అన్నాను.
మా ఇంటి వెనుక ఓ పెద్దాయన MIT లో PhD చేసి ఇక్కడకొచ్చి సెటిల్ అయ్యాడు పెద్ద వయసులో. మా స్కూల్ డిస్ట్రిక్టులో ఆయన అనేక స్కూల్స్ లో సబ్స్టిట్యూట్ టీచర్ గా చేస్తుంటాడు కాలక్షేపానికి. అప్పుడెప్పుడో మాటల మధ్యలో మీ వాడికి కాని అమ్మాయికి కానీ చదువు విషయంలో లెక్కలు కెమిస్ట్రీ ఫిజిక్సుల్లో ఏవైనా సహాయం కావాలంటే ఏమాత్రమూ సందేహించకుండా నా డోఋ కొట్టు, మీ పిల్లలకి ఉచితంగానే చెప్తాలే అని మాటిచ్చాడు.
సూరిగాడు ఒకటి రెండు సందర్భాలల్లో ఆయనదగ్గరకు వెళ్ళొచ్చాడు కూడా.
వీడికి పైన చెప్పిన కాలేజీలల్లో వచ్చింది అని తెలిసిన తర్వాత ఓ రోజు సాయంత్రం ఆయన వాక్ చేసుకుంటూ మా ఇంటి ముందునుంచి వెళ్తూ అగాడు హై అంటూ.
పెద్దాయనా, PhD చేసిన వ్యక్తి, MIT నుంచి వచ్చిన వ్యక్తి, పైగా సూరిగాడికి రెండు ముక్కలు ప్రపంచాగ్నికి సమిధలు ఆహుతొక్కటి ఇచ్చిన వ్యక్తి. బాగున్నారా సార్ అని పలకరించాను.
"యా యా ఏం జరుగుతోంది. మీవాడు కాలేజీలల్లో అప్లికేషన్ పడేస్తున్నాడా? అబ్బే కంగారు పడకు, ఏదోకదాంట్లో వస్తుంది అడ్మిషన్. భలే వాడివే ఊర్క టెన్షన్ పడతావెందుకూ" అన్నాడు
"అంటే ఉంటుంది కదా మాష్టారూ పిల్లాడన్నాక. అందునా చింపి చేట చేసే వాడైతే పేద్ద ఆలోచించం కానీ వాడు నాకొడుకు కదండి, అందుకే భయం" అంటూ ఒక సామాన్య తెలుగు వాడు వదిలే ఓ క్లిష్టమైన సంక్లిష్టమైన అదైన ఇదైన ప్రశ్నని వదిలాను. ఆంధ్రా నుంచి వచ్చిన నేను ఒక సగటు ఆంధ్రావాడిలాగనే ఉంటాగానీ ఇంకోలా ఎలా ఉంటా? పుట్టుకతో వచ్చిన, పెరగటంలో కలిగిన జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం నాది.
"పై కాలేజీలల్లో ఏకాలేజీ బాగుంటుందీ, ఈ కాలేజీలు మంచివేనా" అని.
ఆయన నావైపు ఓ చూపు విసిరి చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి అర్జునా వినూ అంటూ మొదలుపెట్టాడు
"పై కాలేజీలన్నీ మంచివే. అమెరికాలో మంచి కాలేజీ కాదు అనబడే కాలేజీనే లేదు. నీకో ముఖ్యమైన విషయం చెప్తా సావధానంగా విను, ఏకాలేజీకి వెళ్ళినా, మంచి చెడు చదివే వాడిని బట్టి. విద్యార్థిని బట్టి. కొన్ని కాలేజీలల్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి. తేడా అంతే. కొన్ని కాలేజీలు ఇండస్ట్రీకి దగ్గరగా ఉండి సంబంధాలు కలిగి ఉంటాయి. కొన్ని ఉండవు. ఏది ఏవైనా కష్టపడి అవకాశాలని అందిపుచ్చుకుంటూ వెళ్ళేవాడే రాణిస్తాడు." అని ముగించాడు.
నాకు కళ్ళు తెరుచుకున్నాయి.
నిజమే అనిపించింది చివరాకరికి.
ఏం పాట వింటున్నారూ? అని ఇందక ఒక tweet చూసినాను.
మెదదు పొరల్లో ఏవో తెలియని కొన్ని మెదడుకంపనలు ప్రకంపనలు.
ఏం పాట వింటున్నా?
అనేక రకాల సమాధానాల వెల్లువ
తెలుగు పాట వింటున్నా
పొద్దున్నే పొద్దున వినాల్సిన పాటల్ని వింటున్నా
మధ్యాహ్నం మధ్యాహ్నం వినాల్సిన పాటల్ని
మాపటేళ సాయంత్రపు ఆలోచలనఈ ఊహల్నీ ప్రజ్వలింపజేసే ఉసిగొల్పే ఊరటగొల్పే లాలించే పాట్లనే వింటాను వింటున్నాను
ఓ రోజంతా ఉల్లాసంగా ఆనందంగా తట్టిలేపేలా పట్టుకు ఊపేలా సాగాలంటే ఏం పాటలు వినాలో ఆ పాటలే వింటా వింటున్నా
నా మనసుకి నచ్చిన రచయిత కవి రాసిన పాటలు వింటున్నా
ఇలాంటి రకరకాల సమాధానాల పరంపరల నుండి ఓ స్పష్టమయిన సమాధానాన్ని పట్టి బయటకు లాగినాను
ఏం పాట?
నాన్నా! ఏం పాట వింటున్నా?
చెవిలో AirPods 23 గం 59ని ఓట్టుకుని ఏవో పాటలు వింటూ ఊగిపోయే కొడుకుని అడిగాను ఆర్తిగా.
You know Drake? అన్నాడు పొంగిపోయే భావోద్వేగంతో
Drake? వాడెవడు అన్నాను
హా~ ఔన్నానా NBA Player అన్నాడు చిరాకు నిండిన స్వరంతో నీకేం తెలియదు అన్నట్టుగా, "అతనొక పాటగాడు నాన్నా' అన్నాడు నయ యువ రక్తం ఉరకలై పోరుతుండగా పెల్లుబికే ఓ స్వరంతో.
ఈ కాలపు ప్రవాహం ఇదీ, గమనించూ అంటున్న హెచ్చరికతో.
YouTube లో వెతికాను ఎవడూ ఈ డ్రేకుడు అని..
కటింగ్ జటింగ్ ఫిటింగ్ రటింగ్ మధ్యమధ్యలో ఓ పాతిక సార్లు f*** word విరివిగా వాడుతూ వస్తోంది వాడి బాణీ.
తల విద్ల్చి నువ్వు ఏమి వింటున్నావూ అని అడగబోయాను కూతురు గారి గది వద్దకు వెళ్ళి.
తలుపు తెరచిన తనవాకిట BTS పాటగాళ్ళ/గత్తెల చిత్రపటాలు విరివిగా అంటించి ఉన్నాయి చిందరవందరగా తలుపు నిలువునా
హృదయంతరాలలోంచి చిమ్ముకురాబోయిన ప్రశ్నని నిర్దాక్షిణ్యంగా దిగమింగుతూ garage లోకి నడిచాను భారంగా
మనసంతా ఏందాకాలపు వేడి గాలికి పైకి లేస్తున్న దుమ్ములో చిక్కుకున్న కాగితపు ముక్కలా ఉంది అల్లల్లాడుతూ
youtube playlist లోంచి ఒక పాటను play చెయ్యమన్నాను రిమోటు గాడిని
"తీగనై మల్లెలు
పూచిన వేళా
ఆగనా
అల్లనా
పూజకో మాల
మనసు తెర తీసినా
మోమాటమేనా
మమత కలబోసినా
మాట కరువేనా"
వేటూరి స్రవంతి ప్రవాహం
భావం నేపథ్యానికి గోడ
భావం పదానికి అల్లికకు వ్యక్తీకరణకూ పునాది
భావం లేక పోతే ఇవేవీ లేవు
భావం భాష అల్లుకు పోయిన రెండు లోహాలు. విడదీయలేం
పాట పదం సాహిత్యం కవిత మనసు పొరల్లోంచి పెల్లుబికే ఓ ఊట.
దాని ప్రవాహానికి ఒడ్డు భావం భాష
"మనసు తెర తీసినా"
మనసు తెర తీయటం ఏంటీ? మనసుకి కూడ తెర ఉంటుందా?
ఇలాంటి ప్రశ్నలు ఉదయించాలంటే స్ఫురించాలంటే భావం తెలియాలి భాష అర్థం కావాలి...
తర్వాతి పాట ప్రవాహం
అభినవ తారవో
నా అభిమాన తారవో
అభినవ తారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల
మధుకర
శింజాన
సుమశర
శింజిని
శివరంజనీ
నిజం చెప్పాలంటే ఈ పాటకి ఒక ఆస్కార్ సరిపోదు. ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. అసలు ఈ లాంటి భావన ఏ దేశంలోనూ ఉండదు. కేవలం భారతావనిలో తప్ప. సినారె! అంతే!
నేపథ్యం తెలియకుండా పాట వింటే కలిగే ప్రయోజనం ఏవిటీ?
మనసులో ఏదో అలజడి
ఇంతకీ ఏం పాట వింటున్నానూ?
ఏ పాట వినాలీ?
Trump supporters imitating the death of George Floyd.
— Sawyer Hackett (@SawyerHackett) January 6, 2021
Truly the scum of the earth.
pic.twitter.com/6yqyPDXlIe
ఓ జాత్యహంకారీ -
ఎటూ నీ పయనం?
నేటి నలగగొట్టబడ్డ నల్ల బిడ్డడు
రేపు ఎల్లదొరై నీ దేశాన్ని పాలించవచ్చు
ఒక్కసారి నీ కర్మ ఎలా కాలుతుందో ఆలోచించు ఆనాడు
ఎవరి రోడ్డులూ
ఎవరి దేశం అంటూ విర్రవీగుతున్నావు
ఈ దేశం నీయబ్బ సొమ్ము కాదని నీ అంతరాత్మకు తెలుసు
ఓ జాత్యహంకార-ఇజానికి బానిసా
నీ ఆత్మని అమ్ముకొకిలా
నిజాన్ని తెలుసుకుని బతుకు మనిషిలా
బతకనివ్వు మానవజీతినిలా
మూర్తుల విధ్వంసం కొత్తేమీ కాదు. సూటిగా ఒక మాట చెప్పుకుందాం. మా ఊళ్ళవైపు అనగా పల్నాటి వైపు ఎన్నో దేవాలయాలు శతాబ్దాల చరిత్ర కలవి - విధ్వంసం అయిపోయాయి. నా కళ్ళ ముందు - మా ఊరికి దగ్గర్లో ఉన్న బుగ్గ మల్లయ్య దేవాలయం, మూడు వేల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. మల్లయ్య నిల్చుని ఉంటాడు పంచలోహంతో చేయబడి. కాళ్ళ వరకు విరగ్గొట్టబడ్డాడు. విగ్రహం మాయం. ఇలాంటివి ఎన్నో. మా ఉరికి దగ్గర్లోని రేగులగడ్డ దగ్గర్లో కల ఒక కోటలో దేవాలయంలో మూర్తులు మాయం, మూర్తులని ప్రతిస్థాపించిన గద్దెలు తొవ్వబడ్డాయి.
కారణాలు? మంచలోహ విగ్రహాలు అవటం ఒకకారణం. విగ్రహప్రతిష్ఠలో నవరత్నాలను వాడతారనేది ఇంకోకారణం.
ప్రస్తుతంలోకొస్తే - జగన్ వచ్చాక హిందూమతం మీద, గుళ్ళమీద దాడులు ఎక్కువయ్యయనేది వార్త.
క్రైస్తవీకరణ ఎక్కువైంది - ఇందులో ఏమాత్రమూ సంశయం లేదు.
ప్రభుత్వం ఈరకంగా మెజారిటీల మనోభావాలని దెబ్బతీస్తుందని నేననుకోవట్లేదు. హిందువుల ఓట్లను కోల్పోయే ఆలోచన ఏ పార్టీ కూడా చేయదు అని నా అభిప్రాయం.
ఇది రాజకీయ లబ్ది కోసం చేస్తున్నదే అని నా అభిప్రాయం.
ఏవైనా - ఈ సంఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అలాగే ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఖండించి తీరాలి.
పొంత లేని స్టేట్మెంట్స్ మానేయాలి
గెలిచినప్పుడు వ్యవస్థ బ్రహ్మాండంగా పని చెసిందనీ, ఓడినప్పుడు వ్యవస్థ దొందగదనీ లేక లంచగొండిది అనీ అభాండాలు వేసే నాయకులను తరిమితరిమి కొట్టాలని నా పిలుపు.
ఉదాహరణకు ట్రంప్ -
నేను గిలిస్తే ఒప్పుకుంటాను.
ఓడితే మాత్రం ఒప్పుకోనని 2016 అన్నాడు.
సరే! గెలిచాడు. 4 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాడు.
ఇప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో వ్యవస్థాగతమైన సమస్యలున్నాయంటాడు.
4ఏళ్ళు పాలించినప్పుడు ఈ సమస్యలని తూర్పారపట్టి సరిదిద్ది ఉండచ్చుగా? ఈ వ్యవస్థలని ఒక గాట్లోపెట్టి ఉండచ్చుగా?
అబ్బే లేదు. ఇలా ఏళ్ళకు ఏళ్ళు ఏడవటమే! వ్యవస్థ సరిగ్గా పని చేయలేదని కేవలం నెపం.
నిన్ననో మొన్ననో ఈ వార్త చూశాను
"భారతీయ జనతా పార్టీ (భాజపా) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు."
భాజపా తన బొంద తానే పెట్టుకుంటున్నదని అనిపించింది. పైన ప్రకటించిన ఇద్దరు వ్యక్తులూ భాజపా భావజాలంతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన వాళ్ళు కారు. ఒకరు మరీ దారుణంగా కాంగ్రేస్ భావజాలంలోంచి వస్తే మరొకరు అవకాశావాద రాజకీయాలతో నెట్టుకుంటూ కేవలం పదవులే ముఖ్యంగా కేవలం లైంలైట్లో ఉంటానికే వచ్చిన వ్యక్తి.
ఇలాంటివారికి పార్టీలో ప్రధాన్యత ఇస్తే ఎప్పటినించో పార్టీనే అంటిపెట్టుకుని భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తులు ఏమి చేయాలీ? వారికి గుర్తింపెదీ?
భాజపా తన బొందని ఈరకంగా తానే పెట్టుకుంటున్నదని నా భావన
ఎందరో రచనలు చేస్తారు.
కొన్ని రచనలే లోతుగా స్పృశిస్తాయి.
"ఇతరులతో సంపర్కం వదులుకుని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యధార్థం అని నమ్మి సమాధాన పరుచుకోవడం, సంఘంతో నిమిత్తం వున్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీన పునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరకు మిగిలేది ఏమిటి?"
ఈ ప్రశ్న అంత సులభంకాదు జవాబు చెప్పటానికి.
ఒక వ్యక్తి భావుకతని అతని స్థాయికి వెళ్ళి అతనితో ప్రయాణించి అతన్ని గమనిస్తూ వెళ్తే కానీ అర్థం కాదు. ఆవిష్కారం కాదు.
దయానిధి అనే భావకుడితో ప్రయాణం చేసేలా చేశాడు ఆ పాత్ర సృష్టికర్త *బుచ్చిబాబు* *చివరకు మిగిలేది* అనే తన నవలలో
చివరకు మిగిలేది నవలని ఎప్పుడో చదివిన జ్ఞాపకం. వయసులో ఉన్నప్పుడు ఉన్న వేడి ఆలోచనా ధోరణీ చపున ఎగసి పడే ఆవేశం నలభైల్లో పడ్డాక పడి విరిగిన అలలా అయిపోయింది.
నాలో నా ఆలోచనలలో కలిగే మార్పులు నాకు సుస్పష్టంగా తెలుస్తున్నాయి.
పోయినవారమో అంతకముందో ఏదో పనిలో ఉండి ఆకాశవాణి పెట్టుకుని వినటం మొదలుపెట్టాను. చివరకు మిగిలేది నాటకం నన్ను కట్టేసింది. దానిలోని పాత్రలు అద్భుతంగా మలచారు నండూరి రామకృష్ణ గారు మరియూ పాలగుమ్మి పద్మరాజు గారు.
ఈ నాటకం నన్ను మరోమారు చివరకు మిగిలేది నవల చదివేలా ప్రోత్సహించింది.
చూద్దాం ఆలోచనలు భావాలు ఎలా తిరుగుతాయో.
గౌతు లచ్చన్న
ఆకాశవాణిలో స్వాతంత్ర సమరయోధులతో ముఖాముఖీ ప్రసారం అవుతున్నది ప్రతీ రోజు. నిన్న శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారితో ముఖాముఖీ. చేసింది శ్రీ రావురి భరద్వాజ.
ఆయన కుటుంబ నేపథ్యం, ఎనిమిదిమంది పిల్లల్లో ఈయన చినరివాడు. అంతమంది ఖర్చైపోగా ఈయన, అన్న అక్క మాత్రమే మిగిలారట.
వీళ్ళది కల్లు గీత కార్మిక కుటుంబం.
ఆ నేపథ్యం నుంచి స్వాతంత్ర సమరంలో పాల్గొని సర్దార్ బిరుదు దాకా సాగింది వీరి ప్రవాహం.
ఎన్ని సార్లు అరెస్ట్ అయ్యింది, ఎన్ని ఉద్యమాలు 1920 నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చారు.
ఆ ఆడియో దొరుకుతుందేమో చూడాలి.
ఇంతలో ఇంటికొచ్చి ఈయన గురించి ఇంకా సమాచారం దొరుకుతుందేమో అని గూగుల్లో వెతికాను -
గూగుల్ People also searched for అని మొట్టమొదట చంద్రబాబు నాయుడిని లిస్ట్ చేశాడు.
దౌర్భాగ్యం. చంద్రబాబు అప్పట్లో స్వాతంత్ర పోరాటం చేయించాడన్న సంగతి ఏ పత్రికా రాసిఛావలెదు.
నాకు నిజంగా తెలియదు.
అక్కడ ఫేడ్బ్యాక్ అని లింక్ ఉంది.
అందులో ఇలా ప్రశ్నించాను.