Showing posts with label నేను. Show all posts
Showing posts with label నేను. Show all posts

Jan 9, 2025

2025 లో గాడినపెట్టాల్సిన అభ్యాసం

నిజం చెప్పాలంటే కార్యాలయానికి వెళ్ళే రోజుల్లో కొన్ని విషయాలలో చెప్పలేనంత ప్రగతిని సాధించాను. కొన్ని ముఖ్యమైన సూక్తాలు నేర్చుకున్నాను. అతిముఖ్యమైన ఉపనిషత్తులు నేర్చుకున్నాను. తైత్తిరీయ ఆరణ్యకంలోని ప్రథమ ప్రశ్న - అరుణప్రశ్న నేర్చుకోగలిగాను. నిజం చెప్పాలంటే అరుణ ప్రశ్న చాలా పెద్ద పాఠం. తైత్తిరీయ అరణ్యకంలోని సప్తమ అష్టమ నవమ ప్రశ్నలను తైత్తిరీయ ఉపనిషత్ అంటారు. అవి శీక్షావల్లి బ్రహ్మానందవల్లి భృగువల్లి. తైత్తిర్రియ ఆరణ్యకంలోని పదవ ప్రశ్నని మహా నారాయణ ఉపనిషత్ అంటారు.

విషయంలోకొస్తే కోవిడ్ నా అభ్యాసాన్ని కూల్చివేసింది అని చెప్పక తప్పదు. కోవిడ్ అంతా యూట్యూబ్ చూట్టానికే సరిపోయింది. సగం కారణం సమాజంలో కోవిడ్ కంటే దారుణంగా ప్రబలిన అపోహలు. అమ్మ భారత్ లో చిక్కుకుపోయి ఉండటం. అమ్మ చెప్పే వార్తలు ఉదంతాలు, అవి నిజమా అని మన వెతుకులాట. కనీసం అమ్మకి చెప్పగలగాలి కదా పలానీ వార్త నిజం అనో నిజం కాదనో. ఇంటంచి పనిచెసే రోజుల్లో చేతినిండా గంటలు గంటలు ఖాళీ సమయం ఉన్నా నిమిషం పొల్లుపోకుండా టంచనుగా యూట్యూబ్ చూట్టం. జర్నలిస్టు సాయి జర్నలిస్టు YNR జర్నలిస్టు గొట్టంగాడు జర్నలిస్టు బొంగోడు ఇదే కథ. అలానే రిపబ్లిక్ న్యూస్ NDTV న్యూస్ గాడిద గుడ్డు న్యూస్ జీవితం సరిపోలేదు.

మొత్తానికి కోవిడ్ మొత్తం యూట్యూబ్ కి అలవాటుపట్టం కోవిడ అయ్యాక వ్యసనంగా మారటం ఒక వరుసలో జరిగిపోయాయి. 

వీటితో నేర్చుకునే సమయాన్నంతా నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ అస్సలు సమయం లేదు అనే ఓ నెపంతో భజన.

నేర్చుకోవాల్సిన అనేక విలువైన పాఠాలు చాలా ఆగిపోయాయి నా వైపు ఆశగా చూస్తూ ఏమో కదిలిస్తాడేమో అని.

అలా ఆగిపోయినవాటిల్లో ముఖ్యమైనవి:

మహా నారయణ ఉపనిషత్తు మొదలు పెట్టాను, ఆగిపోయింది

అచ్ఛిద్రం మొదలు పెట్టాను, ఆగిపోయింది

అశ్వమేధం మొదలు పెట్టాను, ఆగిపోయింది

రుద్ర క్రమ పాఠం మధ్యలోకి వచ్చాను, ఆగిపోయింది

రుద్ర ఘన పాఠం మొదలు పెట్టాను ఆగిపోయింది

రుద్ర పాఠానికి పదం క్రమం ఘనం చక్కగా నోట్సు రాసుకుందాం అని మొదలుపెట్టాను.... అదీ ఆగిపోయింది...

రుద్ర యంత్రం గీయాలి అనుకున్నా... ముందుకు పడలేదు అడుగు.

కొన్ని పాజిటివ్ ఎనర్జీ యంత్రాలు గీయాలని అనుకున్నా రుద్ర యంత్రం శ్రీ యంత్రం వారాహీ యంత్రం రాజ శ్యామల యంత్రం..

2025లో, ఆగిపోయిన నా అభ్యాసాన్ని తిరిగి మొదలు పెట్టాలని యూట్యూబ్ చట్రంలో ఇరుక్కుపోయిన పుఱ్ఱెని పట్టుకుని ఒక ఊపు ఊపి నిద్ర లేపాలనీ ఒక ధృడమైన నిర్ణయం తీస్కున్నాను.


ఇలా నిర్ణయం తీస్కోటానికి కారణం కూడా ఉంది. పోయినవారం చదివిన సుభాషితంలోని శ్లోకం

శ్లో. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః                                                                                         న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః


కేవలం కూర్చుని కలగంటే ఏమీ కాదు, లేచి చేస్తేనే ఏదైనా సాధించగలం.



 

सुखार्थिनः कुतो विद्या नास्ति विद्यार्थिनः सुखम्।

सुखार्थी वा त्यजेद्विद्यां विद्यार्थी वा त्यजेत्सुखम्॥


प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनम् ।

तृतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यसि ॥

Dec 8, 2024

గెలుపు ఓటమి

 ఆటలో గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు

ఒక పరిణితిచెందిన క్రీడాకారుడికి

గెలుపునుండి ఏమి నేర్చుకున్నావు

ఏటమి ఏమి నేర్పింది అనేది ముఖ్యం

ఆడిన ప్రతీసారీ ఏదోకటి నేర్చుకోక పోతే ఆడటం అనవసరం

చచ్చిన చేపతో సమానం 



Jun 29, 2020

10k Miles

Happy to share that I completed 10000 recorded miles in more or less 11 years.

May 26, 2020

Beets



ఆ మధ్య బీట్స్ నాటినాను.
అవి ఇంతింతై అన్న చందంగా
మొత్తానికి ఇంత అయినయి

బీట్రూట్ కూర వీటితో చేసింది చాలా బాగుంది.

Jun 1, 2019

మైలురాళ్ళు


ఈ టపా 2013 సెప్టెంబరు 10 న రాశాను.
ఆనాటికి నా నడక యజ్ఞం వెయ్యి మైళ్ళు చేరుకుంది.

అదొక గర్వించతగ్గ మైలురాయిలా అనిపించింది.

ఆశ్చర్యంగా కాలం తన బాటలో తాను తనమానానతాను నడిచిపోయింది. ఒక్క నిమిషం కాల ప్రవాహంలో ఊపిరి తీసుకోటానికి ఆగి వెనక్కి చూస్కుంటే ఎన్నో నడకానుభూతులు.

నడకలో గొప్పతనం ఏంటంటే, నడిచినంతసేపు నీతో నువ్వు నీకై నువ్వు నీలో నువ్వు మాట్టాడుకోవచ్చు చూసుకోవచ్చు రమించుకోవచ్చు

అడిగేవాడుడండు
ఆక్షేపించేవాడుండడు
వేలెత్తి చూపేవాడుండడు

ప్రకృతిలో ప్రకృతితో మమేకం అయి
ప్రతీ చెట్టుని
ప్రతీ పుట్టనీ
గట్టుని
కయ్యల్ని
గడ్డి పరకల్ని
అనుభవిస్తూ
కొండకచో కలలు కంటూ

వెయ్యిమైళ్ళ నడక పక్కన పెడితే మధురాంతకం రాజారాం గారి కథ ఒకటి జ్ఞాపకానికొచ్చింది. ఆ కథని మా మోర్జంపాడులో పనిచేసిన తంతితపాలా బంట్రోతుకి అన్వయిస్తే రోజుకి ఎన్ని మైళ్ళు నడిచుంటాడో సదరు బంట్రోతు. అలా ఎన్ని సంవత్సరాలు పని చేసుంటాడో.

చేతికి పెట్టుకునే పెడోమిటరు లేక చేతికి తగిలించుకునే అలాంకారాలు (wearable) వచ్చాక రోజుకి 10000 అడుగులు అనే లెక్క నిజంగానే ఓ కర్త్వయంలా అయి కూర్చుంది చాలా మందికి నాతోబాటుగా. మా అమ్మకీ ఒక fitbit కొనిచ్చాను. రోజుకి 10000 అడుగులు వేస్తున్నారా అంటుంది అమ్మ.

2013 సెప్టెంబరు 10 న 1000 మైళ్ళు అనే మైలురాయి.
ఈరోఝు నా ఐఫోన్ లోని mapmyrun లో రికార్డు చేయబడ్డ నా నడక నన్ను ఎక్కడిదాకా తీసుకెళ్ళిందో చూశాను.

















8,885.72 మైళ్ళు అని అని చూపెట్టింది అప్లికేషన్

Dec 13, 2018

bye bye g+

కొన్ని ఏళ్ళ క్రితం గూగులుడు బజ్ అని మొదలెట్టినప్పుటి ఉత్సాహం సందోహం కళ్ళముందు తళ్ళుక్కున మెరిసేంతలో బజ్ కాస్తా ప్లస్ గా అవతరించటం కొస మెరుపు. ఎన్ని పోస్టులు, ఎన్ని లైకులు, ఎన్ని ప్రొఫైల్ వ్యూస్ వెరసి ఒక గొప్ప అనుభవం. 2018 చివరాకరికి గూగులుడు తేల్చిందేవిటంటే - ఏ సర్వీసూ శాశ్వతం కాదని. గూగులుడు ఎన్నో సర్వీసులను కడతేర్చాడు. ఇప్పుడు ప్లస్. పెద్ద విషయం ఏంకాదు వాడికి. గూగులుకి అలవాటైనవాడు కొంచెంసేపు విలవిల లాడినా ఇంకో కొత్త మత్తుని వెతుక్కుని అలవాటు చేసుకుని బానిస అవుతాడు.

ఏవైనా! నా గూగుల్ ప్లస్ ప్రొఫైలుని తీసేస్తున్నాను.

నా ఫేసుబుక్కు ప్రొఫైలుని తీసేసాను

bye bye g+

Dec 31, 2015

ఈవేళటి యువతకి నే ఇచ్చే అతి చిన్న క్లాస్ ఇదీ -

ఈవేళటి యువతకి నే ఇచ్చే అతి చిన్న క్లాస్ ఇదీ -

౧. వ్యాయామం ముఖ్యం
౨. మానసిక ఒత్తిడిని తగ్గించుకోటం ముఖ్యం
౩. బరువుని అదుపులో పెట్టుకోటం ముఖ్యం
౪. వేళపట్టున భోజనం ముఖ్యం
౫. కంటి నిండా నిద్ర ముఖ్యం
౬. ఇంటికి వెళ్తూ ఆఫీసుని, ఆఫీసుకి వెళ్తూ ఇంటినీ తీసుకువెళ్ళకుండా ఉంటం ముఖ్యం
౬. గీత గీస్కొని, అది దాటకుండా ఉంటం ముఖ్యం. అనగా, ఒక పెగ్, లేక ఒక బీర్.  అంతే! ఒక చుట్ట. మానేయండి అని చెప్పను. అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం.

పైవాటిల్లో అనేకం (బొంగు, ఉన్న ఐదు పాయింట్లలో అనేకం ఏవిట్టా అంటావా?) నేను చేయలేకపోయా. కనీసం, ఇప్పటకిన్నా కండ్లు తెరిచా. నన్ను ఫాలోకండీ అని చెప్పను. ఏదోకచోట మొదలుపెట్టుకోండీ అని చెప్తా!

ఎవరైనా ఎవరికైనా స్పూర్తిని రగిలించవచ్చు! చూసే దృష్టిలో ఉంటుంది!!

జై భారత్!!

Sep 10, 2013

వెయ్యిమైళ్ళ నడక

జస్ట్ టు ఇన్స్పైర్!
నేను వెయ్యి మైళ్ళు నడిచినానని గొప్పగా చెప్పటంలేదు కానీ, ఆనందంగా చెప్పుకుంటున్నా. ఈ వెయ్యిమైళ్ళ నడక కేవలం బయట నడుస్తూ రికార్డ్ చేసినవి మాత్రమే. మధ్యలో అనేకం ట్రెడ్ మిల్ మీద నడిచినవి ఉన్నాయి.
ఈ సొద ఎందుకంటే, నడవండి!


నడక మంచిది!!

Mar 17, 2012

ఐప్యాడు మూడు


అదన్నమాట సంగతి. ఈపొద్దు ఉర్కుతాబోయి ఐప్యాడు కొనక్కొచ్చినా. రాంగనే ముందర ఈనాడు.నెట్, రమాకాంరతావు.బ్లాగుస్పాటు.కాము అని కొట్టుచూసినా. క్రిస్టల్ క్లియర్ గా ఉంది కథ

ఫోటో చెప్పలేనంత క్లియర్గా ఉంది
హోము గారితో ముఖసమయం (బుర్ర తిరిగిందా? అనగా! ఫేస్ టైం అని, అదియునూ తెలవదు తమకు...) ద్వారా మాట్లాడినాను, ఐఫోనుకి కాలు చెయ్యి చేసి. ఎక్సలెంటుగా ఉంది కథ.

ఇట్టా తీసింది నన్ను ఐప్యాడు ఈప్యాడు పుటోబు కసక్కున

Dec 6, 2011

లాంగ్ డ్రైవ్స్ - నా అనుభవాలు

ఆల్బెనీలో ఉన్నప్పుడు ప్రతీ రెండో మూడో నెలలకోమారు జెర్సి వెళ్ళొచ్చేవాళ్ళం. అక్కడ్నుండి జెర్సి 135 మైళ్ళ దూరం. 135 మైళ్ళు రెండున్నర గంటలు లేక మూడు గంటలు పట్టేది. పెద్ద డ్రైవ్ చేసినట్టు ఉండేది కాదు. కానీ ఒకసారి మాత్రం సిన్మా కనిపించింది.
అది అగస్టు, 2007. ఆల్బెనీ నుండి షికాగో వెళ్దాం అని అనుకున్నాం. డ్రైవ్ చేయాలంటే కష్టమే కదా అని విమానావకాసాలు చూసాం. ఆల్బెనీ నుండి షికాగోకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఐతే చాలా ఖరీదు. వేరే మార్గం? నెవార్క్ నుండిగానీ లేక జె.యఫ్.కె నుండిగానీ బుక్ చేస్కుంటే తగ్గుతుందని జె.యఫ్.కె నుండి చేసాను. సాయంత్రం ఏడుకి ఫ్లైట్. మధ్యానం బయల్దేరాం ఆల్బెనీ నుండి. I-87 మీద అలా న్యూయార్క్ వైపు వెళ్తే, జి.యస్.పి వస్తుంది. దానిమీద మరికొంత దూరం వెళ్తే I-95 వస్తుంది. దానిమీద కొంతవెళ్ళి జె.యఫ్.కె కి వెళ్ళాలి. I-95 దాకా బాగనే వెళ్ళాం. I-95 మీద చుక్కలు కనిపించాయి. మొత్తానికి జె.యఫ్.కె కివెళ్ళేప్పటికి ఆరు. ఏడుకి ఫ్లైట్. బ్యాగేజ్ గట్రా చెకిన్ చేసి కూర్చున్నాం. ఇంతలో ఎనౌన్స్మెంట్. ఫ్లైట్ బ్యాడ్ వెదర్ కారణంగా గంట డిలే అని. సరే అని ఏదో మింగి కూర్చున్నాం ముగ్గురం. అప్పటికి పిల్ల ఇంకా పుట్టలేదు. ఎనిమిదైంది. మళ్ళీ ఎనౌన్స్మెంట్. మరో గంట లేట్ అని. తొమ్మిదైంది. మరో గంట లేట్ అని చెప్పారు. అలా పదకుండైంది. ఇక లాభంలేదని వెళ్ళి అడిగితే థండర్‌స్ట్రాం వల్ల మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అని చావుకబురు చల్లగా పదకుండింటికి చెప్పారు. సరే ఐతే మరి మా లగేజీ మాకిస్తే వెళ్ళిపోతాం అని చెప్తే...ఒక్కొకరి లగేజి దింపి ఇచ్చేప్పటికి పన్నెండున్నర. లగేజి తీస్కుని పార్కింగ దగ్గరకి వెళ్ళి కారు వెత్తుక్కుని బయట పడేప్పటికి ఒంటిగంట అయ్యింది తెల్లవారుఝామున. మా స్నేహితునికి కాల్ చేసా వాళ్ళింటికి వెళ్దాం అని. అతను ఫోన్ ఎత్తలేదు. పిల్లాడు కార్లో పడుకున్నాడు. తను కునకు తీయకుండా నాకు నిద్రరాకుండా ఉండేందుకు ఏదోకటి మాట్టాడుతోంది. ఒంటిగంటకి రోడ్డెక్కితే, మా I-87 పట్టుకునేందుకు చుక్కలు కనిపించాయి, ఒక రాంగ్ ఎక్జిట్ తీస్కోడంతో. అష్టకష్టాలు పడి మొత్తానికి I-87 పట్టుకున్నాం. రెండైంది అప్పటికి టయం తెల్లవారు ఝామున. ఒకవైపు తనకి నిద్ర వస్తున్నా ఆపుకుంటూ నాకు నిద్ర రాకుండా ఉంటంకోసం ఏదో మాట్లాడుతోంది. అట్టకాదని నిద్రపొమ్మని చెప్పి, ఓ సర్వీస్ ఏరియాలో ఆగి కాఫీ తీస్కుని ఒక తొక్కుడు తొక్కా పెడల్ని. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఏదివిలో విరిసిన పారిజాతమో దగ్గరనుండి ఇద్దరు భామల కౌగిలిలో స్వామీ వరకు పాడుకుంటూ డ్రైవ్ చెసాను. అయ్యక కె అంటే కిషోర్ పాటలు పెట్టి కుమ్మా౨ను. ఇంటికి రెండు గంటల్లో చేరుకున్నాం. అంటే నాలుగింటికి దిగాం ఆల్బెనీలో.
నేర్చుకున్న నీతి - అంత కష్టపడాల్సిన పనిల్యా. ఎదోక హోటెల్లో ఆగవచ్చు. ఐతే, అది ఆగేంత డిస్టెన్సూ కాదు. ఆగకుండా వెళ్ళేంత ఇదీ కాదు. నీతి పెద్దగా ఏం లేదు. ఇఫ్ యూ కెన్ డూ ఇట్. డూ ఇట్. అంతే. మనో ధైర్యం కావాలి. అదొక పాఠం అనుకోవచ్చు, బట్ ఎట్ హై రిస్క్.

తర్వాతి లాంగెస్ట్ డ్రైవ్ - ఆల్బెనీ టు షికాగో.
౨౦౧౦ జనవరిలో పిల్లా జెల్లాలను భారతావనికి పంపించాను. కేన్సాసులో ఉద్యోగం దొరికింది. మార్చి మొదటివారంలో జాయనింగు. ఇల్లుగిల్లూ ఖాళీజేసి మార్చి రెండున రోడ్డెక్కా. చివరిసారిగా ఆల్బెనీలోని దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండవెట్టుకుని పొద్దున పదిన్నరకి రోడ్డెక్కా. I-90 వెస్ట్. ఆల్ ది వే షికాగోకి తీస్కెళ్తుంది. ఈసారి కొంచెం తెలివిగా గార్మిన్ నువి కొని కారుకి తగిలించా. ఇంకోతేడా ఏంటంటే, కారు మారింది. ౨౦౦౯ ఆగస్టులో నా నిస్సాన్ ఆల్టిమాని ట్రేడ్-ఇన్ చేసి హాన్డా సిఆర్-వి ఈఎక్స్-ఎల్ తీస్కున్నా. వావ్!! వాటే డ్రైవ్. హాన్డా నన్ను ఎక్కడా నిరాశపరచలేదు. ఫోర్ వీల్ డ్రైవ్. అత్భుతంగా ఉంది. అలా అలా సాగిపోయింది ఐ నైంటి మీద. వెళ్తూ వెళ్తూ సాయంత్రానికి కొలంబస్ ఒహాయో దాటి టొలెడో దాకా వచ్చాను. పది అయ్యింది. రాత్రిళ్ళు అందునా మార్చిలో, కొంత సహనానికి పరీక్షే. ఓ ఎక్జిట్లో ఆపి, గాస్ కొట్టించుకుని, ఆ చలికి, నిద్ర రాకుండా ఉండేందుకు ఏంచేయ్యాలా పొద్దుణ్ణించి ఆగిన చోటల్లా కాఫీలు తాగీ తాగీ నోరంతా కంపైందిగా అనుకుంటూ లోనకి వెళ్ళి చూస్తే, ఏదో స్మూతీ కనిపించింది. ప్రయత్నిద్దాం అని తీస్కున్నా. ఒక్క సిప్పు, వళ్ళంతా కొత్త ఉత్సాహం ఉరకలేసింది, చలిలో చల్లటి జివ్వు అన్నమాట.
మొట్టమొదటి హెచ్చరిక -
మళ్ళీ రోడ్డెక్కి, తొక్కటం మొదలెట్టా. పోలీస్ బాబాయ్ లైటేసాడు. దీనెమ్మ జీవితం అనుకున్నా. వచ్చి లైటేసి లోనకి చూసాడు. ముందు పాసింజరు సీటులో నెత్వర్క్ కేబుల్స్ అవి ఇవి వెనక అంతా ఏవో సామాను టివి గట్రా లతో నిండిపోయి ఉన్నదిగా.
ఏట్రా మాయ్యా!! యాడికీ
షికాగో ఎల్తన్నా
ఏందియ్యన్నీ?
రిలొకేట్ అవుతున్నగా. ఎసన్షియల్స్ అట్టుకెల్తన్నా
నీ డ్రైవర్స్ ఇలాగివ్వు
ఇదిగో

పదినిమిషాలు పోయినాకొచ్చాడు.
అబ్బీ! డెభై లైను మీద ఎనభై ఒకటి ఎల్తన్నావ్. తప్పుకదూ?
పొద్దుననంగా బయల్దేరా బాబాయ్. గమనించలేదు. కావాలని వెళ్ళింది కాదులే
సరే! నీకింత వరకూ ఓక్క టిక్కెట్టు కూడా లేదు కాబట్టీ, ఇదిగో ఈ నోటెడ్ వార్నింగు. పుచ్చుకో
ఇవ్వు
దీన్ని ఏంజేస్తా?
ఏమో
ఏమో కాదు మాయ్యా!! ప్రిజ్జీకి అంటించుకొని రోజూ సూస్చా ఉండు. ఇంక పో!

అలా బయటపడి, మొత్తానికి షికాగో పన్నెండున్నరకి సేరుకున్నా. లాస్ట్ గంట బోరు కొట్టింది. కానీ!! విసుగు అనిపించలేదు.
850 మైళ్ళు. దాదాపు పదమూడు గంటలు, మధ్యలో నాల్గు బ్రేకులు.

షికాగో ఎళ్ళినాక మూడోరోజుకో కాన్సాసుకి చెరాను. షికాగో నుండి కేన్సాసుకి పలు దార్లు. ఒకటి, షికాగో - డిమొయిన్స్ - కేన్సాస్ I-80W తర్వాత I-35S ఎంది గంటల డ్రైవ్. రెండోది I-55S నుండి I-72W కొంత దూరం వెళ్ళినాక ఇది US 36 W లో కలుస్తుంది, ఆనక ఇది I-35S లో కలుస్తుంది. నా జిపియస్ రెండో దారెంబటి ఎళ్ళరా సిన్నా అన్నది.  I-55S మీద కొంత ట్రాఫిక్ ఎక్కువున్నా, వెళ్ళేకొద్దీ తగ్గింది. బ్లూమింగుటన్ను నార్మల్ దాటినాక బాగా తగ్గిపోయింది. స్ప్రింగుఫీల్డు దగ్గరకొచ్చేప్పటికి కొంత పెరిగినా,  I-72W కలిసేప్పటికి అసలు ట్రాఫిక్కు ఉండదు. ఇక హాన్నిబాల్ దగ్గర  అనుకుంటా I-72W US 36 W విడిపోతుంది. ఇక తర్వాతంతా కంట్రీ సైడ్ ప్రయాణం  I-35S దాకా. అస్సలు ట్రాఫిక్ ఉండదు. ఈగలు దోమలు తోలుకుంటూ ఉంటుంది ఈ మార్గం. ఆవేళ్టి నా ప్రయాణం ఎక్కడా తలనొప్పి అనిపించలా. సాఫీగా సాగింది. వింతగా అనిపించింది. ఈశాన్యానికీ మధ్య పశ్చిమానికి ఎంత తేడానో అనుకునేంత తేడా కనిపించింది. ఊర్ల పేర్లు విచిత్రంగా అనిపించింది. హానిబాల్, క్విన్చి, కామెరూన్, చిల్లికొతె ఇలా మిసోరీ రాష్ట్రంలోని ఊళ్ళ పేర్లు.
పోయినేడు ఈఏడు కలిపి దాదాపు  ఆరుఏడు సార్లు వెళ్ళొచాను షికాగో.
మొన్న థాంగ్స్ విగివింగుకి కూడా వెళ్ళొచ్చాను.
ఐతే!! ఈసారి ఓ అనుభవం.
వెళ్ళేప్పుడు చిల్లకొతె దాటినాక అనుకుంటా. కాప్ ఆపా౨డు. అబ్బాయ్, అరవై ఐడు లైను మీద డెభై ఆరు ఎల్తన్నావ్. ఎందుకలాగా అన్నాడు. అయ్యా ఇంటెన్షన్ల్ కాదు. పేద్ద గమనించలేదు అన్నాను.
ప్రత్యేకించి ఈ కాలంలో, సంధ్యవేళ ఇంత స్పీడ్ మంచిది కాదు. ఇది జింకల మేటింగు సీజన్. అవి గుద్దుతాయ్ వచ్చి. వెళ్ళాల్సిన దానికన్నా పన్నెండు మైళ్ళు ఎక్కువ ఎల్తన్నాక్ కాబట్టి ఇదిగో టిక్కెట్టు అని నూటాపది డాలర్లకు టిక్కేటు సింపి ఇచ్చాడు. అయ్యా! నాకింతవరకూ ఏలాంటి చరిత్రా లేదు అన్నాను కన్సిడర్ చేస్తాడేమో అని. అహా!! తెల్లోడు, ఎదవ, పట్టించుకోలా.
ఇదిగో ఇప్పుడే చెక్కు పంపించి వస్తన్నా.


నేనిచ్చే సలహా -
కీప్ లెఫ్ట్, పాస్ రైట్. ముందరున్న వాటిని పాస్ చేస్కుంటా వెళ్తే బోర్ కొట్టదు. అంతేగాక అలసట ఉండదు.
క్రూజ్ పెట్టుకోద్దు. మజా ఉండదు.
పాస్ చెసేప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు. కాప్ ఆపినా, పాస్ చేస్తున్నావు కాబట్టి ఎళ్ళినావని చెప్పుకోచ్చు

Apr 15, 2010

సెరిత్ర పుటల్లో సూరిగాడు

సెరిత్ర అడక్కు సెప్పింది ఇను.
ఇంతకీ కతేంటంటే సూరిబాబు సెరిత్రపుటల్లోకెక్కాడు, పుట మూడొందల ఇరవై ఐదంట.
సూస్కోండి ఈడ

అబ్బే మరేంలేదు, మా నాయన మీద *త్తి దూస్తావా *త్తి అని, రోంత కోపం సూపించాడని సెరిత్రపుటల్లోకెక్కాళ్ళే.
ఇషయం ఏంటంటే
ఫోటోఫనియ అని ఓ సైటు. దాంట్లో ఓ యాభై రకాలుగా ఫోటోని మార్చుకోవచ్చు.
ఐఫోన్ అప్లికేషన్ కూడా ఉంది, దింపా, నే మొన్న జిమ్మీలో తీసిన ఫోటోని పెన్సిల్ ఆర్ట్ లాగా మార్చా. బాగుందా?

ఇంకోటి

Apr 7, 2010

మీకు తెలుసా?

ఇవ్వాళ్ళా రేపట్లో, ఐ.టీ మరియూ తదితర సంబంధ ఉద్యోగస్తుల్లో ప్రతీ ఐదుగ్గురిలో ఒకరు మధుమేహవ్యాధిగ్రస్తులు. నమ్మలేకపోతున్నారా? నిజం. ఐదుగ్గురిలో ఒకరు కాకపోయినా, ఎనిమిదిమందిలో ఖచ్చితంగా ఒకరు అని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయ్. ఐతే, మిగతా ఏడుగ్గురిలో ఎంతమంది ప్రొ-డయాబెటిక్ అంటే ఓ పెద్ద తడుముకోవాల్సిన పనిల్యా. ఎందుకంటే, ఆపీస్కి వెళ్ళి, ఏమాత్రం శారీరక శ్రమ లేకుండా కాలు కదపకుండా, ఏసీరూములో, ఏమాత్రం చెమటపట్టకుండా, హాయిగా కూర్చుని కాఫీలమీద కాఫీలు తాగే జాతికి అత్యంత ప్రియమైనది ఈ వ్యాధి.
సరే అక్షింతలు అటుంచి, కనీసం కళ్ళు తెరిచే కళ్ళు తెరుచుకుందాం ఇకనైనా అనుకునే జాతికి ఈ సమాచారం -
గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒకటుంటుంది. ఈ ఇండెక్స్ విలువ ఎక్కువ, మధ్యస్తం, తక్కువ అని మూడు రేంజులు.

ఎక్కువ, మధ్యస్త గ్లై.ఇం విలువ కలిగిన ఆహారమ్ తింటే ఏంటిటా?
గ్లై.ఇం ఎక్కువున్న ఆహారం తింటే అది నీ ఆరోగ్యం పై గమనించతగ్గ తేడాలను గమనించతగ్గ సమయంలో చూపుతుంది. గమనించతగ్గ = వారం రోజుల్లో.
ఉదాహరణకి - మ్యాక్ డోనాల్డ్స్. మనోళ్ళు ఆహ్, మ్యాక్ ఇండియాలో కూడానా, అబ్బో పొరుగింటి పిల్లకూర అత్భుతం అని, కుమ్ముతుండచ్చు. ఐటె, మీకో రహస్యం తెలుసా! మ్యాక్ లో ఒక నెల క్రమం తప్పకుండా ఆహారం భుజిస్తే, ఎన్నో నష్టాలు.
మోర్గన్ స్పుర్లాక్, అని ఓ లఘుచిత్రాల దర్శకుడు *సూపర్ సైజ్ మి* అని ఓ లఘుచిత్రాన్ని తీసాడు.

Super Size Me (http://en.wikipedia.org/wiki/Super_Size_Me) is a 2004 American documentary film directed by and starring Morgan Spurlock, an American independent filmmaker. Spurlock's film follows a 30-day time period (February to beginning of March 2003) during which he eats only McDonald's food. The film documents this lifestyle's drastic effects on Spurlock's physical and psychological well-being, and explores the fast food industry's corporate influence, including how it encourages poor nutrition for its own profit. Spurlock dined at McDonald's restaurants three times per day, eating every item on the chain's menu. He also always "super-sized" his meal—but only if it was offered. Spurlock consumed an average of 20.92 megajoules or 5,000 kcal (the equivalent of 9.26 Big Macs) per day during the experiment. As a result, the then-32-year-old Spurlock gained 24½ lbs. (11.1 kg), a 13% body mass increase, a cholesterol level of 230, and experienced mood swings, sexual dysfunction, and fat accumulation to his liver. It took Spurlock fourteen months to lose the weight gained from his experiment.

కాబట్టి, ఈ గ్లై.ఇం ఎక్కువ ఉన్న ఆహారం తీస్కుంటే ఒబేసిటి అనగా ఊబకాయం వచ్చే అవకాశాలు మేండుగా ఉన్నాయోయి.
అంతే కాకుండా రక్తంలో గ్లూకోజు శాతాన్ని పెంచుతాయి ఇవి. అంతే కాకుండా గ్లూకోజుని రక్తంలోకి తొందరగా శ్రవించేలా చేస్తాయి.

తక్కువ గ్లై.ఇం విలువలు ఉన్న అహారం వల్ల లాభాలేంటి?
Switching to eating mainly low GI carbs that slowly trickle glucose into your blood stream keeps your energy levels balanced and means you will feel fuller for longer between meals.

* Low GI diets help people lose and manage weight
* Low GI diets increase the body's sensitivity to insulin
* Low GI carbs improve diabetes management
* Low GI carbs reduce the risk of heart disease
* Low GI carbs improve blood cholesterol levels
* Low GI carbs can help you manage the symptoms of PCOS
* Low GI carbs reduce hunger and keep you fuller for longer
* Low GI carbs prolong physical endurance
* High GI carbs help re-fuel carbohydrate stores after exercise

ఎలా? ఎక్కడా?

* అల్పాహారంలో ఓట్లు, బార్లీ, లాంటివితినటం
* ముతక ధాన్యాలు (హోల్ గ్రైన్), దంపుడు బియ్యం, విసుఱ్ఱాయితో చేస్కున్న పిండి లాంటివి వాట్టం
* పిండి పదార్ధాలు తగ్గించుకోటం
* పండ్లు ఫలాలు ఎక్కువగా తినటం
* బాస్మతి మంచిందటయ్యా


గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి ఇంకా కావాలంటె ఇక్కడ చూడండి
http://www.glycemicindex.com/

మన పుల్లశనగలు చాలా మంచిదంటయ్యా. దీంట్లో గ్లై.ఇం విలువ చాలా తక్కువ, మరియూ, పీచు పదార్ధం ఎక్కువ. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన సూక్ష్మ ధాతువులు కూడా ఉన్నాయంట.

Chickpeas (http://en.wikipedia.org/wiki/Chickpeas)are a helpful source of zinc, folate and protein.They are also very high in dietary fiber and hence a healthy source of carbohydrates for persons with insulin sensitivity or diabetes. Chickpeas are low in fat and most of this is polyunsaturated. Nutrient profile of desi chana (the smaller variety)is different , especialy the fibre content which is much higher than the light coloured variety. One hundred grams of mature boiled chickpeas contains 164 calories, 2.6 grams of fat (of which only 0.27 grams is saturated), 7.6 grams of dietary fiber and 8.9 grams of protein. Chickpeas also provide dietary calcium (49–53 mg/100 g), with some sources citing the garbanzo's calcium content as about the same as yogurt and close to milk. According to the International Crops Research Institute for the Semi-Arid Tropics chickpea seeds contain on average:

* 23% protein
* 64% total carbohydrates (47% starch, 6% soluble sugar)
* 5% fat
* 6% crude fiber
* 3% ash

There is also a high reported mineral content:

* phosphorus (340 mg/100 g)
* calcium (190 mg/100 g)
* magnesium (140 mg/100g)
* iron (7 mg/100 g)
* zinc (3 mg/100 g)


ఇక, కొన్ని కొన్ని పరిశోధనల్లో తేలిందేంటంటే అపరాలు తినటం మంచిదట.
Pulses in Diabetes Diet Management - The Evidence

A diet that produces hyperglycemia and a greater demand for insulin increases the risk of Type 2 diabetes. Individuals with or at risk of Type 2 diabetes are advised to eat a diet in which about 50-60% of energy is supplied by carbohydrates obtained mainly from whole grains, fruit, vegetables and low-fat milk. Pulses make an important contribution to healthy eating because their effect on blood glucose is less than that of most other carbohydrate-containing foods.

In one study, nine adults with Type 2 diabetes ate dried peas as part of a mixed meal and then later ate a mixed meal made with potatoes. Their blood glucose and insulin levels were lower after eating the mixed meal made with dried peas than after eating the mixed meal made with potatoes. A different study looking at healthy people found that those eating a chickpea-based meal had lower blood glucose and insulin levels than those eating wheat-based meals (either a whole grain plus wheat bran or white bread). These findings and others show that pulses can be useful for diabetics because they cause less of a rise in blood glucose than potatoes or wheat-based foods.

ఇప్పుడర్ధమైందా, మన ఎనకటి తరాలు అంత గట్టిగా ఎలా ఉండేవాళ్ళో. దంపుడు సరుకు, చేత్తో తయ్యార్సేస్కున్న పిండి, కట్టెలపైన వంట.

మొన్నీమధ్య మి.మంతెన ఇలాచెప్పుకొచ్చాడు -
నేను రోడ్డెమ్మట పనిచేసే ఓ కుటుంబాన్ని గమనించాను. ఆ కుటుంబం గత కొన్ని నెలలు సమచ్చరాలుగా రోజువారీ కూలీ, రోడ్డు కాంట్రాక్టరు దగ్గర. వాళ్ళ దైనందిన పని ఏంటంటే రోడ్డువెయ్యటం లేక బాగుచెయ్యటం. నేను ఓ రోజు ఉండబట్టలేక వెళ్ళి అడిగా! ఇంత రద్దీ రోడ్డులో ఇంత పొగ కాలుష్యంలో పని సేస్తున్నారు కదా, మరి మీకు శ్వాసకోశ అంబంధ వ్యాధులు రావా అని. వాళ్ళంటారూ, నాలుగేళ్ళయ దవాఖానకుబొయ్యి. మాకేంరావు బాబు అని. ఎందుకా అని నేను వాళ్ళ జీవిత శైలిని గమనిస్తే ఇలా బోధపడింది. వాళ్ళు పొద్దస్తమానం రెక్కలతో పని చెస్తారు. రెక్కలు అనగా చేతులు. చేతులు ఎక్కువగా వాట్టంవల్ల డొక్కలు, ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి. దానివల్ల ఊపిరి తిత్తులు గట్టిగా ఉంటాయి, మరియూ ఆరోఘ్యంగా ఉంటాయి. ఎవడైతే చేతులు కదల్చకుండా ఉంటాడో వాడికి ఊపిరితిత్తుల సమస్యలు రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.

బ్లాగ్ లోకంలో మన బ్లాగ్ మితృలు కొందరు మీరు మరి ఎస్సర్సైజూ గట్రా అంటున్నరుకదా మరి చేసినాంక ఎట్టున్నరో పుటోబులు పెట్టుండ్రి అని.
ఇవి కేవలం స్పూర్తికోసమే సుమా
ఇదిగో ఈడ సూడండి.
ఇట్టున్నా -
From essersije


ఇంకా కొన్ని పుటోబులు ఉన్నాయి, అయి ఈడపెడితే సిన్నపిల్లలు దడుసుకుంటారని పెట్టాట్లా.