Showing posts with label తాళము వే..గొళ్ళెము మ. Show all posts
Showing posts with label తాళము వే..గొళ్ళెము మ. Show all posts

Apr 10, 2010

తాళము వే....గొళ్ళెము మ.....

ఏందీ, మళ్ళీయా? నీ ఎన్కమ్మ!! అనుకున్టన్నావా?
అనుకో!! ఏంపర్లేదు.
ఎరైటీ బాసూ....ఎరైటీ...
ఏంకత అన్టన్నావా??
ఇదీ కత -
ఆపీస్కొచ్చా
పనీ పాటా సేత్తన్నా
పన్నెండైంది గంట
ఆకలి రోకలైంది
జోలె లోంచి సద్ది మూట తీద్దాం అని సెయ్యిపెట్టా
శనగిత్తనాల కూర
డబ్బా పెరుగు
మరి రొట్టెలేవీ?
మరిసిపొయ్యా

Jul 13, 2009

తాళము వేసితిని గొళ్ళె....

ఈ దినం పొద్దుగాల్నే పొద్దుగాల్నే ఝలక్.
లేచాం, ఆపీస్కి తయ్యారయ్యాం. బండికాడికిపొయ్యాం. తాళంచెవి పెట్టాం, స్టార్టు చేసాం. అక్కడ ఓ లైటు ఎలుగుతున్నది. ఏందిరా అని కళ్ళజోడు మిటకరించి చూస్తే రిజర్వ్ లో పడింది బండి. దీనెన్కమ్మ అనుకుని పెట్రోలు బంకు దాంకా ఐనా వచ్చుద్దా నాయనా అనుకుంటా ఎళ్ళా. బంకుకాడికిబొయ్యా. ఆపినా, టాంకీ ఓపెన్జేసినా. మరి కార్డుముక్క గీకి పెట్రోలు కొట్టుకోవాలిగా, ఆడికి ఎళ్ళ, జోబిలో సేయిపెట్టి లాగా పర్సు. రాలా. ప్యాంటు ఊడదీసి దులిపా, పర్సు లేదు. గాడీలో పెట్రోలు లేదు, ఇంటికిబొయ్యి పర్సు తెచ్చి కొట్టొద్దాం అంటే. ఏట్రా బగమంతుడా అని బంకోడికాడికి బొయ్యా. బంకోడు పాకిస్తానీ.
హాయ్ అన్నాడు
నేను ఇరోచనాలప్పుడు బాత్రూం దొరక్కపోతే ఎలా మొహం పెడతామో అలాపెట్టి,
వెల్, హమ్!! నాకు నీ సహాయం కావాలి.
ఏంటి
నేను వాలెట్ మర్సిపొయ్యా, నాకు పుల్ ట్యంక్ కావాలి. అస్సలు లేదు గ్యాస్. కనీసం ఇంటికి వెళ్ళొద్దామనా లేదు. కాబట్టి పుల్ ట్యాంక్ కొట్టు, నా ఐపోన్ ఈడబెడతా. ఎళ్ళి పర్సు తెచ్చుకుంటా. డబ్బులిచ్చి నా మొబైల్ తీస్కుంట
నువ్వు యాడుంటావ్.
దగ్గరే.
ఇంటికాడికి పొయ్యిరాటానికి ఎంతకావాలి.
ఓ గ్యాలన్ కొట్టు.
గ్యాలన్ 2.59 (క్యాష్ కి)
హం!! (ఇంతలో బుడ్డి ఎలిగింది), బాసూ ఉండు నాకాడ కొంచెం క్యాష్ ఉండాలి అనీ ఆజోబీలొంచీ ఈజోబీలొంచీ పీకా 37 వొచ్చినై బైటికి.
తస్సదియ్యా కొట్టు 37కి.
వెళ్ళి కొట్టుకో పో అన్నాడు.


అలా 13.70 గ్యాలనులు కొట్టించి, మళ్ళీ ఇంటికి తిప్పి, పర్సు తీస్కుని ఆపీస్ దార్లో పడ్డా.

ప్యాంటు వేసుకుంటిమీ పర్సు మరసితిమీ.

Jul 3, 2009

తాళము వేసితిని, గొళ్ళెము....

అపీస్లో నాకాడ ఓ కాపీ మేకర్ (కాపీ పిల్ట్రీ) ఉంది. ఒకానొక కాలంలో పొద్దున, సాయంత్రం బయటకెళ్ళి కాపీలు తాగేవాణ్ణి. ఓ సమచ్చరం కాణ్ణుండి, నా డెస్కుకాణ్ణే కాపీ సేస్కుని తాగేత్తన్నా.

ఈ పిల్ట్రీ ఓ చిన్న యంత్రం. ఓ లోటా నీళ్ళు పోసి, ఓ కాయితకం ముక్కేసి అందులో కాపీ పగొడ్రీ ఏసేసి మూతపెట్టేసి స్పిచ్చి నొక్కితే కింద గాజు లోటాలోకి కాపీ వచ్చుద్ది. ఎంత వీజీ, ఏంకనిపెట్టావరా తెల్లనాకొ** అనుకుంటా అప్పుడప్పుడు.

మూడు స్టెప్పుల్లో ఎలిపెంటు అనగా ఏనుగుని ప్రిజ్జిలో ఎలా పెడతావ్ అని సిన్నప్పటి స్నేయితుల్తో ఆట్లాడేవాళ్లం.
ప్రిజ్జి డోర్ తీ
ఏనుగుని లోనకి నెట్టు
తలుపెయ్.

ఎంతవీజీ. కాపీ కూడా అంతే!! ఓ పెద్ద సెయ్యాల్సిన పన్లేదు.

మూత తీ,
నీళ్ళు పొయ్యి,
కాయితకం ముక్క ఇంతక ముంది ఉంటే తీసేయ్,
కొత్తతి పెట్టు,
కాప్పొడి కుమ్ము,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.

ఇంతవీజీ ఐతే జీవితంలో ఎకసెక్కాలేడనించొత్తాయ్ సోదరా!!
మనం ఓ రోజు ఇలాసేసాం.
మూత తీ,
....
కాయితకం ఎయ్యి,
కాపీపొడి ఎయ్యి,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.

ఓ ఐదు నిమిషాల్తర్వాత పొ(ప)గలు మంటలు (మరీ మంటలు రావులే). ఏట్రా నాగన్నా అని సూత్తే, హా!! పిల్ట్రీలో నీళ్ళు మరచితిరి, డింగ్! డాంగ్!! అంది పిల్ట్రీ.

ఓ రోజు ఇట్టా కూడా సేసాం

మూతతీ,
నీళ్ళు పొయ్యి,
కాయితకం వెయ్యి,
.....
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి.
ఏసేసా, నొక్కేసా, ఓ ఐదునిమిషాలకి గాజు లోటా తీసి సుత్తే ఏడి నీళ్ళు ఎక్కిరించినయి.

ఇంకోరోజు -
మూతతీ,
నీళ్ళుపొయ్యి,
కాయితకం వెయ్యి,
కాపీపొడి ఎయ్యి,
మూతెట్టు,
స్పిచ్చి వెయ్యి,
కింద గాజు లోటా మర్సిపో...
ఏందిరా కిందకి రాటల్లా అని సూత్తే కయితకం మొత్తం నిండిపొయ్యి ఉంది కాపీ.

కలికాలంలో కాపీకోసం ఎన్ని తిప్పలు బగమంతుడా