Showing posts with label కళ. Show all posts
Showing posts with label కళ. Show all posts

Sep 20, 2020

ఆదివారం పాటలతో ప్రయాణం

ఆదివారం పని చేయటం అంత ఈజీకాదు.

కాస్త ఊరట కోసం ఆకాశవాణి పెట్టాను.

ఒక్కో పాట నన్ను పరుగెత్తేలా చేస్తున్నాయి

"అలుపన్నది ఉందా

ఎగిరే అలకు

ఎదలోని లయకు

అదుపన్నది ఉందా

కలిగే కలకు

కరిగే వరకు

మెలికలు తిరిగే నది నడకలకు

మరి మరి ఉరికే మది తలపులకు


నా కోసమే చినుకై కరిగి

ఆకాశమే దిగదా ఇలకు

నా సేవకే సిరులే చిలికి

దాసోహమే అనదా వెలుగు

ఆరారు కాలాల అందాలు బహుమతి కావా

నా ఊహలకు

కలలను తేవా నా కన్నులకు


నీ చూపులే తడిపే వరకు

ఏమైనదో నాలో వయసు

నీ ఊపిరే తగిలే వరకు

ఎటు ఉన్నదో మెరిసే సొగసు

ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే

తరుణం కొరకు

ఎదురుగా నడిచే తొలి ఆశలకు"


- సిరివెన్నెల

గాయం చిత్రం నుంచి 


తేలిక పదాలతో అల్లిన ఈ పాట మొదలు సిరివెన్నెల మార్క్ ని ఆవిష్కరిస్తుంది. 

ఈ పాటని అనుభవించెలోపు ఇంకోపాట మొదలైంది


ఓ కన్నె పువ్వా కాటేసి పోనా - మొదలులోనే వేటురి బాణి అర్థమైపోయింది.


"ఓ కన్నె పువ్వా కాటేసి పోనా

నా తేనే బువ్వా భోంచేసి పోరా


శివ శివా ఏంటమ్మా నాలో ఇంత కువ కువా

హర హరా అందాలకెందుకింత పెర పెరా

కనుల నిదుర కరువై అది పగటి కలల పరమై

పరువమేమో బరువై అది మరువలేని దరువై

ఎల్లకిల్లా పడ్డదమ్మా ఎన్నెల బిళ్లా

తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా

తొలి చూపులో...

తొలి చూపులో చలి కాచుకో పులకింతల పున్నమి వేళా"

ఇంక చెప్పేదేవుందీ


తేనె బువ్వలు

మల్లె బువ్వలు 

వేటూరి శృంగారంలోచి ఉద్భవించిన ఊహలే కదా?


తర్వాతి పాట గులాబి చిత్రం నుంచి

ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో 

సునీతకి సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని ఇచ్చిన పాట.


"ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది

నీ నీడగా మారి నావైపు రానంది

దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో"


సిరివెన్నెల గారి ఈ ఊహ అద్భుతమైన ఊహ. నా గుండె నీ నీడగా మారిపోయింది. మనిషి నుంచి నిడని వేరు చేయలేం అతను ఆమె దగ్గరకి చేరితే తప్ప.

అబ్బా ఇకచాల్లే ఈపాటల పదనిస అనుకుంటుండగానే తర్వాత మొదలైంది.

పాపం రాజేంద్రప్రసాద్ ని మింగేసిన సినిమా రాంబంటు.

ఇందులోని ఈ పాట - 


"సందమామ కంచమెట్టి, సన్నజాజి బువ్వపెట్టి

సందెమసక చీరగట్టి, సందుచూసి కన్నుగొట్టి"

చెప్పకనే చెబుతుంది ఇది వేటూరి బాణి అని

చందమా కంచంలో సన్నజాజి బువ్వ. మళ్ళీ అదే గోల.

సందె మసక చీకటి అంటే కనిపించీ కనిపించని చీకటిని చీరగా చుట్టిందట శృంగార తార. అతన్ని కవ్వించటానికి అందాలని ఆరబోస్తూ కన్ను కూడా కొట్టిందట పాపం.

కానీ అతనేమో - 

"భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల, సీతలాంటినిన్ను మనువాడుకోవాల

బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల, బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల

ఏడుకొండలసామి ఏదాలుజదవాల, సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల

అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల, సింహాద్రప్పన్న సిరి(జాస?)లివ్వాల"

అంటూ లెక్కలు కడుతున్నాడు ముడుపుల మూటలు చుడుతున్నాడు ఆమెని ఏ మాత్రమూ పట్టించుకోకుండా

ఆమేమో పెదవితేనెలందిస్తే పెడమోములు, తెల్లారిపోతున్న చెలినోములు

పిల్లసిగ్గు చచ్చినా, మల్లెమొగ్గ విచ్చినా

అంటూ వేడి నిష్టూరాలు పోతున్నది.


Jun 2, 2020

Watch Strap

Watch Strap

Samsung Galaxy S3 Frontier అనే వాచ్ కొన్నా ఆ మధ్యలో. దానికి కంపెనీ వాడు ప్లాస్టిక్ స్ట్రాప్ ఇచ్చాడు. అది పెట్టుకుంటే చర్మం పాచిపోయినట్టుగా అయ్యింది. ఓ రోజు తొక్క లేచింది కూడా. కాస్త మంచిది కొందాం అని వెతికాను. etsy.com అనేదాంట్లో ఒకటి కనిపించింది.

https://www.etsy.com/listing/671151452/samsung-galaxy-watch-band-gear-s3?ga_order=most_relevantga_search_type=allga_view_type=galleryga_search_query=gear+s3+paracordref=sr_gallery-1-1frs=1


వీడి బొంద $45 అన్నాడు.


మనమే ఒకటి చేసుకుంటే పోలా అనుకున్నా.

Samsung Galaxy S3 frontier pin size 22mm. అమెజాన్‌లో తెప్పించాను. నా దగ్గర paracord ఉంది నల్ల రంగుది. ఇంకా కావాల్సింది buckle. అదీ అమెజాన్‌లో తెప్పించాను.

వాచ్ కి రెండువైపులా ఎంత పొడుగు కావాలో సైజు చూసి అల్లాను.

Jun 9, 2018

Anthony Bourdain

Anthony Bourdain అనే అతను మట్టిలో కలిసిపోయాడనే వార్త నన్ను కాస్త బాధపెట్టింది. నా దృష్టిలో Anthony Bourdain ఒక food philosopher. ఇతను ఒక ఫుడ్ ప్రజెంటరుగా ఖ్యాతిని గాంచాడు. food netwrok లో ఈయన ప్రోగ్రాములు అనేకమార్లు చూశాను.
అన్నిటికన్నా నాకు బానచ్చిన ఇతని కార్యక్రమం Parts Unknown. ఇతని ఇంకో కార్యక్రమం నాకు బాగా నచ్చింది, ఎక్కువగా చూసింది - No Reservations. తిండి మీద ఇంత గొప్పగా ఓ కార్యక్రమాన్ని డిజైన్ చేయటం, తిండి ద్వారా ఓ ప్రాంతపు సాంప్రదాయాలని/ధోరణిని ఆవిష్కరించటం గొప్పవిషయం. ఆరకంగా ఇతను గొప్ప విజయాన్ని సాధించినట్టే.
ఎవరూ వెళ్ళని దేశాలకి, ఎవరూ చూడని వినని సందులు గొందుల్లోకి వెళ్ళి లోకల్ ఫుడ్ ని తెరకెక్కించటం సామాన్యమైన విషయం కాదు.

The show has won 5 Emmy Awards, garnered 11 nominations for writing, sound mixing, editing and cinematography, as well as a 2013 Peabody Award.

Bourdain was working on an episode of the show in Strasbourg, France at the time of his death on June 8, 2018.

Parts Unknown twitter handle

@PartsUnknownCNN

Jul 17, 2012

అనఘ ఆర్ట్ - గణేశ



అయ్యా
అదన్నమాట
తన ఊహల్లోని గణేశుడిలా ఉన్నాడన్న మాట



పింక్ గణేశ్ అన్నమాట
చెల్లిని చూసి అన్న స్పూర్తిపొంది ఇప్పటికిప్పుడు ఇలా వేసినాడు

 
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

May 25, 2012

సెవ్వాకు లెట్టుకుంది సిరి సిరి మువ్వా

కోక కట్టుకుంది - సె
వ్వాకు లెట్టుకుంది - కొత్త
దాకలంబ లెట్టుకోని
తాళ్ళరేవు వోడమీదా
సిరి సిరి మువ్వా - బల్
తళుకు సీరలంపినానే
సిరి సిరి మువ్వా
అందినట్టు తెలపవేమే
సిరి సిరి మువ్వా - నా
అందగత్తెవీవు గావ
సిరి సిరి మువ్వా
అద్దాల మేడలోన
సిరి సిరి మువ్వా - నీతొ
సద్దులాడ నోచనైతి
సిరి సిరి మువ్వా
కాని కాల మౌటచేత
సిరి సిరి మువ్వా
కడకు నీకు దూరమైతి
సిరి సిరి మువ్వా॥
చల్లని వెన్నెలనాడు
సిరి సిరి మువ్వా - వేయి
కళ్ళా నిన్ను చూడాల
సిరి సిరి మువ్వా
తెల్లని దేహమువాడు
సిరి సిరి మువ్వా
ఎల్ల సిరుల నివ్వాలి
సిరి సిరి మువ్వా॥
జోడు కొయ్యల వోడా మీదా
సిరి సిరి మువ్వా - జోడి
పావురా లంపినానే
సిరి సిరి మువ్వా
అందిందో అందలేదో
సిరి సిరి మువ్వా నాకు
తిరుగు టపా రానేదే
సిరి సిరి మువ్వా

- కళా ప్రపూర్ణ డా॥ అనసూయా దేవి గారి "జానపద గేయాలు" నుండి
http://archive.org/details/janapadagayyaalu020440mbp

Jul 27, 2011

దేవ్.డా!!! నాకు గిటారెందుకియ్యలే?

దేవ్.డా!!
అడక్కుండానే ఐఫోన్ ఇచ్చినవ్.
అడుక్కుంటే కారిచ్చినవ్, లోన్లోనేలే.
ధర్మప్రభువ్వి, పెండ్లిజేపిచ్చినవ్, బిడ్డల్నిచ్చినవ్
ఇసుమంత తెల్వినిచ్చినవ్
గిటారెందుకియ్యలే?
ఐ కొసెన్ యూ ఆన్సర్ దేవ్.డా
నాకు గిటారెందుకియ్యలే?
ఇప్పుడుజూడు, ఈ పాటలు, ఎట్లా వాయించలె, నాకు గిటారు రాదు. కానీ వాయించాలె. ఎట్టా దేవ్.డా? ఎట్టా?

బాబులూ అమ్మలూ దయగల ప్రభువులూ!! మీలో ఓరికన్నా గిటారు మీట్టం వస్తే ఈపాట వాయించి, రికార్డింగ్ చేసి అంతర్జాలంలోకి ఎక్కించి లింకు కొట్టాల్సిందిగా వేడుకుంటన్యా!!

**********************************
Song: AANE WALA PAL JAANE WALA HAI
Vocals: Kishore Kumar
Movie: GoLMaaL
**********************************


Strumming Pattern: | d - d u | d u d u |


Chords:

E---------C#m-B----------E--
Aane wala pal jaane wala hai
-----------B--------------E----
Ho sake to isme zindegi bita do
-----------A----------C#m-----G#-C#m
Pal jo yeh jaane wala hai ... ho ho


E-----------C#m------------E-
Ekbar yum mili masoom si kali
-------------A---------------------E-
Khilte hue kaha, "Kushpash main chali"
-----------B-------------------E------
Dekha to yehi hai Dhoonda to nahin hai
-----------A----------C#m-----G#-C#m
Pal jo yeh jaane wala hai ... ho ho


E----------C#m-------------E--
Ekbar waqt se lamha gira kahin
-----------------A----------------E--
Wahaan dastaan mili Lamha kahin nahin
-----------B--------------E---
Thoda sa haske Thoda sa rulake
------------A----------C#m-----G#-C#m
Pal yeh bhi jaane wala hai ... ho ho

Dec 17, 2010

స్పాన్టేనియస్ ఆర్ట్

మొన్న అనఘ వాడి పెన్ను లాక్కుందని నా మీద అలిగి మూల కూర్చుని పెన్నుతో ఈ బొమ్మ బెరికాడు.


ట్రీ ఫేస్
ముందు కళ్ళు మూసుక్కూర్చుంది వాడేనట. దాకలమూచి ఆడుతున్నాడంట.
అటు ఇటు ఉన్న పిల్లకాయలు నిక్, పియర్స్ ఇత్యాది వాడి క్లాసు మేట్లు. బహుశా వాడి రెసెస్ టయం అయిఉండచ్చు.

అదీ కథ ఈ దినం.

Dec 1, 2010

ఆర్ట్

ప్రతీ మనిషిలోనూ ఎదోక కళ ఉంటుంది. ఐతే చాలామంది దాన్ని గమనించరు, నర్చర్ చేయరు.
మొన్నటి ఆదివారం మా దేవాళయంలో అఖండ రుద్ర పారాయణ జరిగింది. ఆరున్నరకల్లా గుళ్ళో ఉండాలి అన్నారు పెద్దలు. నాలుగున్నరకి లేచి ఐదుంబావు కల్లా రోడ్డెక్కి ఆరు ఇరవై కల్లా గుళ్ళో ఉన్నాను. ఎరేంజ్‌మెంట్లు మొదలెట్టాము అందరం. పారాయణ చెసేప్పుడు అభిషేకానికి అవసరమైనన్ని పాలు పండ్లు పండ్ల రసాలు ఇత్యాది సామగ్రిని సిద్ధం చేసాం. అంతలో గురువుగరు అబ్బాయ్ ఆ పెద్ద బల్ల తీసుకురండి ఇటు అని పురమాయించారు. ఎందుకన్నా అనుకుంటూనే తెచ్చి పెట్టాం. దానిపై ఓ వస్త్రాన్ని పరిచి, పైన ముగ్గులు వేసి, అదిగో ఆ డబ్బా ఇటు తే అన్నారు గురువుగారు. పై కాయితం తీసి చూస్తే అందు బుల్లి బుల్లి శివలింగాలు. చక్కగా నల్లటి రంగులో, తెల్లని నామంతో. వందకు పైగ ఉన్నాయి.
From కార్తీకమాసం

సరే ఆరు గంటల కార్యక్రమం అయ్యాక ప్రసాదాది కార్యక్రమాలప్పుడు ఎవరు చేసారయ్యా ఇన్ని లింగాలను ఎలా అని అడిగితే శ్రీ వినయ్ కుమార్ గారు చేత్తో చేసారని తెలిసింది. ఆయన అటుగా వెళ్తుంటే అభినందనలు తెలియపరచాను కరచాలనం చేసాను, అయ్యా చేయిని ఊపకండి ఇంకా నొప్పులుగా ఉన్నాయి అన్నారతను.
మట్టితో చేసి, కాల్చి, నల్లరంగు వేసి.........................ఎంత కళాత్మకత, ఎంత ఆర్టిస్టిక్ విజన్, థాట్.
హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. వారు, అయ్యా మా పిల్లకు కూడా సహాయం చేసారని వినయంగా తెల్పారు.

ఓం నమఃశివాయ.

From కార్తీకమాసం

Jul 18, 2008

మీ ఇంట శుభకార్యాలకూ, పెళ్ళిళ్ళకూ

ఫోటోగ్రాఫర్ కావాలా...
సంప్రదించండి......
భాస్కర్ రామరాజు (అంటే నేనే :))

నా ఈ ఫోటో ని తీసినవాడు..
మా బుడ్డోడు...
వాడి ఫోటోగ్రఫిని ఇక్కడ చూడండి.