Showing posts with label రేడియో. Show all posts
Showing posts with label రేడియో. Show all posts

Oct 8, 2020

వస్తా వట్టిదే పోతా వట్టిదే

కొలువు ముగించి నడకకి బయల్దేరాను
బెల్లం చుట్టూ మూగిన చీమల్లా
ఆలోచనలు మూగినై మనసు మీద
రేడియో పెట్టుకున్నాను 
తత్వాలు వస్తున్నా భక్తి రంజనిలో
కీశే శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలోంచి స్వీయ రచన 
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే... ఓహో
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే... ఓహో
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా... మా దేవ శంభో
మా లింగ మూర్తి
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
ఏమి సేతురా లింగా, ఏమి సేతురా
మనసు బాలమురళిగారి తత్వంలో మునిగిపోయింది
అంతలో - తర్వాతి తత్వం

వస్తా వట్టిదే  
పోతా వట్టిదే  
ఆశ ఎందుకంట
చేసిన ధర్మము 
చెడని పదార్ధము 
చేరును నీ వెంట
చేతిలో అమృతము 
ఉన్నంత సేపే 
అన్నదమ్ములంట
ఆఘాధంబై  
పోయేనాడు  
ఎవరురారు  వెంట
వస్తా వట్టిదే  
పోతా వట్టిదే  
ఆశ ఎందుకంట
చేసిన ధర్మము 
చెడని పదార్ధము 
చేరును నీ వెంట

పంచ భూతముల
తోలు బొమ్మతో
ప్రపంచమాయనట
అంతము వరకు
కించిత్ ఆ శ తో 
పెంచెను జగమంతా

వస్తా వట్టిదే  
పోతా వట్టిదే  
ఆశ ఎందుకంట
చేసిన ధర్మము 
చెడని పదార్ధము 
చేరును నీ వెంట

ఈ మాటలు - చేతిలో అమృతము 
ఉన్నంత సేపే 
అన్నదమ్ములంట
ఆఘాధంబై  
పోయేనాడు  
ఎవరురారు  వెంట
- వినగానే ఒక్క నిమిషం 
సాయంత్రం మసకి చీకటిలో బావురుమని ఏడ్చాను
హృదయం వికలమైంది
బరువెక్కిపోయింది
ఎంత పచ్చి నిజం

Sep 27, 2020

కీ|శే|| బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి ఆకాశవాణిలో (రిప్లే)

 కీ|శే|| బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి ఆకాశవాణిలో


నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఆకాశవాణిలో బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖీ (రిప్లే) వచ్చింది. నిజం చెప్పాలంటే ఎటువంటి నాన్-సెన్స్ లేకుండా సుత్తిలేకుండా ఎంతో హుందాగా చక్కటి భాషతో స్లోగా ఉంటుంది ఆకాశవాణి. 

అదేకోవకు చెందింది ఈ ముఖాముఖీ కార్యక్రమం. శ్రీ మోహన కృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖీ కార్యక్రమాన్ని ఎంతో హుందాగా నిర్వహించారు. బాలసుబ్రహ్మణ్యంగారితో ముఖాముఖీ ఒక గంటలో తేలేది కాదు. ఆయన పాడిన పాటలు ఎన్నో పాటతో ఆయన ప్రయాణానికి ఎన్ని ఏళ్ళో - ఆసారాన్నంతా ఒక గంటలోకి కుదించటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. 


బాలసుబ్రహ్మణ్యం గారికి లలిత గీతాల పోటీలో బహుమతి రావతం, ఆ నాటి జ్ఞాపకాలు అయన పంచుకోవటం బాగుంది. అయితే మోహన కృష్ణగారు చక్కటి ప్రశ్న వేయటం కొస పెరుపు - మీరు పాడిన పాట ఎదీ? అని. బాలసుబ్రహ్మణ్యం గారు వారి తండ్రిగారు రాసిన పాట అని ఆ పాటన తడమటం -"పాడవే వల్లకీ పాట". తండ్రిగారు రాసిన పాటను ఆయన పాడటం ఎంత గొప్ప అనుభూతి? బాలసుబ్రహ్మణ్యంగారు కాలంలో కలసి పోయినా వారి పుత్రుడు తాత గారి రచనలని, తంద్రి గారి రచనలని సెకరించి అచ్చు వేయిస్తే అంత గొప్పగా ఉంటుందో అని నా మనసులో ఓ ఆలోచన స్పురించింది, అది ఇప్పటికే జరిగుండకపోతే.


ముఖాముఖీ అనేక పాటలని స్పృశించకపోయినా మోహనకృష్ణ గారు చక్కగా తన స్టైల్లో ప్రశ్నలు అడగతం, బాలసుబ్రహ్మణ్యం గారు న్వ్వుతూ జవాబులు చెప్పటం - వీనుల విందుగా అనిపించింది.



కొన్ని మెరుపులు -

"అబ్బాయ్ మురళీకృష్ణ సరస్వతీ  పుత్రులైన శ్రీ బాలమురళీకృష్ణ గారి దగ్గర నువ్వు అంతేవాసివి - నేను అంతే" ఎంత నిజాయితీగా చెప్పుకున్నారో?


Sep 20, 2020

ఆదివారం పాటలతో ప్రయాణం

ఆదివారం పని చేయటం అంత ఈజీకాదు.

కాస్త ఊరట కోసం ఆకాశవాణి పెట్టాను.

ఒక్కో పాట నన్ను పరుగెత్తేలా చేస్తున్నాయి

"అలుపన్నది ఉందా

ఎగిరే అలకు

ఎదలోని లయకు

అదుపన్నది ఉందా

కలిగే కలకు

కరిగే వరకు

మెలికలు తిరిగే నది నడకలకు

మరి మరి ఉరికే మది తలపులకు


నా కోసమే చినుకై కరిగి

ఆకాశమే దిగదా ఇలకు

నా సేవకే సిరులే చిలికి

దాసోహమే అనదా వెలుగు

ఆరారు కాలాల అందాలు బహుమతి కావా

నా ఊహలకు

కలలను తేవా నా కన్నులకు


నీ చూపులే తడిపే వరకు

ఏమైనదో నాలో వయసు

నీ ఊపిరే తగిలే వరకు

ఎటు ఉన్నదో మెరిసే సొగసు

ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే

తరుణం కొరకు

ఎదురుగా నడిచే తొలి ఆశలకు"


- సిరివెన్నెల

గాయం చిత్రం నుంచి 


తేలిక పదాలతో అల్లిన ఈ పాట మొదలు సిరివెన్నెల మార్క్ ని ఆవిష్కరిస్తుంది. 

ఈ పాటని అనుభవించెలోపు ఇంకోపాట మొదలైంది


ఓ కన్నె పువ్వా కాటేసి పోనా - మొదలులోనే వేటురి బాణి అర్థమైపోయింది.


"ఓ కన్నె పువ్వా కాటేసి పోనా

నా తేనే బువ్వా భోంచేసి పోరా


శివ శివా ఏంటమ్మా నాలో ఇంత కువ కువా

హర హరా అందాలకెందుకింత పెర పెరా

కనుల నిదుర కరువై అది పగటి కలల పరమై

పరువమేమో బరువై అది మరువలేని దరువై

ఎల్లకిల్లా పడ్డదమ్మా ఎన్నెల బిళ్లా

తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా

తొలి చూపులో...

తొలి చూపులో చలి కాచుకో పులకింతల పున్నమి వేళా"

ఇంక చెప్పేదేవుందీ


తేనె బువ్వలు

మల్లె బువ్వలు 

వేటూరి శృంగారంలోచి ఉద్భవించిన ఊహలే కదా?


తర్వాతి పాట గులాబి చిత్రం నుంచి

ఈవేళలో నీవు ఏంచేస్తు ఉంటావో 

సునీతకి సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని ఇచ్చిన పాట.


"ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో

అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది

నీ నీడగా మారి నావైపు రానంది

దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో"


సిరివెన్నెల గారి ఈ ఊహ అద్భుతమైన ఊహ. నా గుండె నీ నీడగా మారిపోయింది. మనిషి నుంచి నిడని వేరు చేయలేం అతను ఆమె దగ్గరకి చేరితే తప్ప.

అబ్బా ఇకచాల్లే ఈపాటల పదనిస అనుకుంటుండగానే తర్వాత మొదలైంది.

పాపం రాజేంద్రప్రసాద్ ని మింగేసిన సినిమా రాంబంటు.

ఇందులోని ఈ పాట - 


"సందమామ కంచమెట్టి, సన్నజాజి బువ్వపెట్టి

సందెమసక చీరగట్టి, సందుచూసి కన్నుగొట్టి"

చెప్పకనే చెబుతుంది ఇది వేటూరి బాణి అని

చందమా కంచంలో సన్నజాజి బువ్వ. మళ్ళీ అదే గోల.

సందె మసక చీకటి అంటే కనిపించీ కనిపించని చీకటిని చీరగా చుట్టిందట శృంగార తార. అతన్ని కవ్వించటానికి అందాలని ఆరబోస్తూ కన్ను కూడా కొట్టిందట పాపం.

కానీ అతనేమో - 

"భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల, సీతలాంటినిన్ను మనువాడుకోవాల

బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల, బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల

ఏడుకొండలసామి ఏదాలుజదవాల, సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల

అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల, సింహాద్రప్పన్న సిరి(జాస?)లివ్వాల"

అంటూ లెక్కలు కడుతున్నాడు ముడుపుల మూటలు చుడుతున్నాడు ఆమెని ఏ మాత్రమూ పట్టించుకోకుండా

ఆమేమో పెదవితేనెలందిస్తే పెడమోములు, తెల్లారిపోతున్న చెలినోములు

పిల్లసిగ్గు చచ్చినా, మల్లెమొగ్గ విచ్చినా

అంటూ వేడి నిష్టూరాలు పోతున్నది.


Sep 19, 2020

బుచ్చిబాబు చివరకు మిగిలేది నాటకం

 ఎందరో రచనలు చేస్తారు.

కొన్ని రచనలే లోతుగా స్పృశిస్తాయి.


"ఇతరులతో సంపర్కం వదులుకుని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యధార్థం అని నమ్మి సమాధాన పరుచుకోవడం, సంఘంతో నిమిత్తం వున్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీన పునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరకు మిగిలేది ఏమిటి?"

ఈ ప్రశ్న అంత సులభంకాదు జవాబు చెప్పటానికి.


ఒక వ్యక్తి భావుకతని అతని స్థాయికి వెళ్ళి అతనితో ప్రయాణించి అతన్ని గమనిస్తూ వెళ్తే కానీ అర్థం కాదు. ఆవిష్కారం కాదు.


దయానిధి అనే భావకుడితో ప్రయాణం చేసేలా చేశాడు ఆ పాత్ర సృష్టికర్త *బుచ్చిబాబు* *చివరకు మిగిలేది* అనే తన నవలలో


చివరకు మిగిలేది నవలని ఎప్పుడో చదివిన జ్ఞాపకం. వయసులో ఉన్నప్పుడు ఉన్న వేడి ఆలోచనా ధోరణీ చపున ఎగసి పడే ఆవేశం నలభైల్లో పడ్డాక పడి విరిగిన అలలా అయిపోయింది.


నాలో నా ఆలోచనలలో కలిగే మార్పులు నాకు సుస్పష్టంగా తెలుస్తున్నాయి.



పోయినవారమో అంతకముందో ఏదో పనిలో ఉండి ఆకాశవాణి పెట్టుకుని వినటం మొదలుపెట్టాను. చివరకు మిగిలేది నాటకం నన్ను కట్టేసింది. దానిలోని పాత్రలు అద్భుతంగా మలచారు నండూరి రామకృష్ణ గారు మరియూ పాలగుమ్మి పద్మరాజు గారు.


ఈ నాటకం నన్ను మరోమారు చివరకు మిగిలేది నవల చదివేలా ప్రోత్సహించింది.


చూద్దాం ఆలోచనలు భావాలు ఎలా తిరుగుతాయో.


Jul 29, 2020

కిన్నెత్ కథ

సాక్షి నాటకం మూడు భాగాలుగా ఆకాశవాణి రేడియోలో ఇప్పటికి అనేక సార్లు ప్రసారం అయ్యింది, అనేక సార్లు విన్నాను కూడా.
ఈ నాటకంలో జంఘాల శాస్త్రిగా కీశే సుత్తివేలు
సాక్షి రంగారావు కూడా నటించారు.
ఎందరో గొప్ప నటులు. వారందరికీ వందనాలు.
వీళ్ళు గొప్ప నటులంటే.
సుత్తివేలు, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాదు, గొల్లపూడి, రావు గోపాల రావు, కైకాల, కాకరాల ఇలాంటివాళ్ళు గొప్ప నటులు.


ఏవైనా సాక్షి మూడో భాగంలో కిన్నెత్ కథ ఎంతో ఆసక్తిగా అనిపించింది.
ఇది కథే కావచ్చు. కాని ఒక కోణాన్ని ఆవిష్కరించారు రచయిత పానుగంటి.
ఇందులో షాజహాన్ ముంతాజ్ ల మధ్యలోకి ఇంకోక స్త్రీ భార్యగా రావటాన్ని ముంతాజ్ సహించకపోవటం, అసూయతో ఆమెని అంతమొందించటానికి పరిచారిక అయిన రోషనారతో ఒక పధకం రచించటం, షాజహాన్ ఆ పధకంలోకి లాగబడటం, వెరసి కిన్నెత్ బలి కావటం.

కథని పక్కనపెడితే, షాజహాన్ కి ముంతాజ్ అంటే అంత ప్రేమా? వీడికి బహు భార్యలు. ఇందర్లో ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడంటే ఎక్కడో ఓ పెద్ద డిస్కనెక్ట్.

PN Oak లాంటి వాళ్ళు ఎన్నో రాసుకొచ్చారు ఈ అంశం మీద.

నిజానిజాలు దేవుడికెరుక.

https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF_%E0%B0%AE%E0%B1%82%E0%B0%A1%E0%B0%B5_%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%82/%E0%B0%85%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81

Jul 27, 2020

అనఘ రేడియో జాకీ

మిత్రుడు వెంకట్ Telugu NRI Radio లో guest RJ రోల్ చేయగలదా అనఘా అని అడిగాడు.
మా మంచికోరే మిత్రుడు అడిగిందే తడవు ఆనందంగా నేను ఒప్పేసుకుని అనఘ గారికి వివరించాను రేడియో జాకీ అంటే ఏంటీ దానివల్ల జరిగే మంచి, అలాంటి వేదిక దొరకటం అన్నీ.
"యా చేస్తా" అన్నది అనఘ.

తను ఒప్పుకోవటం కార్యక్రమం తయ్యారు కవటం చకచకా జరిగిపోయాయి

బ్లాగ్ మిత్రులు తన  కార్యక్రమాన్ని తప్పక వినాలని కోరుతున్నా



ఈ అవకాశాన్నిచ్చిన మిత్రుడు వెంకట్ కి కృతజ్ఞతాంజలులు అనఘ తరపునుంచి.

May 3, 2020

చెలియలి కట్ట నాటకం

ఆకాశవాణిలో చెలియలి కట్ట నాటికి వస్తున్నది

విశ్వనాథ రచన
వినదల్చుకున్నవాళ్ళు వినచ్చు


ఈ నవలకి ఒక నేపథ్యం ఉంది
తెవికి -
విశ్వనాథ సత్యనారాయణ 1935లో వ్రాసిన నవల. చలం వ్రాసిన మైదానం నవలను ఖండిస్తూ రాసిన నవలగా ఇది తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. మొట్టమొదట ఇది ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆపైన దాదాపుగా 12 ముద్రణలు పొంది ప్రాచుర్యమైనది.

https://te.m.wikipedia.org/వికి/చెలియలి_కట్ట

ఈమాటలో ఓ వ్యాసం
http://eemaata.com/em/issues/199907/1107.html

By the way - ఈ నాటకాన్ని ఇక్కడ వినచ్చు
https://archive.org/details/CheliyalikattaViswanathaSathyanarayana