Showing posts with label పద వినోదం. Show all posts
Showing posts with label పద వినోదం. Show all posts

May 11, 2022

పదవినోదం #3

 

నిలువు: 

1. పొలానికి కొట్టేది 

2. ఆలోచన 

4. పాలించువాడు 

6. కనుమఱుగైనది, కాలగర్భంలో కలిసినది అని అర్థం 

7. తెలుగులో నీతిచంద్రిక రచించిన ఈయన పేరు చివరి బిరుదు 

8. నేల విడిచి చేయగూడనిది

అడ్డం: 

2. సాంప్రదాయరీతిలో జానపద నృత్య రీతి, భాగవతం చెప్పే విధానం 

3. తెల్లవారు ఝాము 

5. రామాయణంలో సేతువు నిర్మించే అవసరం పడినప్పుడు ఈ వానర ముఖ్యుణ్ణి పిలిపించారు, ఆకాలానికి సివిల్ ఇంజనీరు అనుకోండి.. 

9. ఉత్త/ఖాళీ 

10. కాశీలో దొరికేది

Oct 17, 2020

పద వినోదం #2

 




అడ్డము:
1. నిజ ఆశ్వయుజ మాసంతో ఇవి మొదలు
5. ఇలా అడిగితేనే మీకు మాత్రమే చెబుతాను అనే సినిమా తీశారు 
7. ప్రాణి, జీవించువాడు
8. నల్లగుడ్డు
10. సారథి నడుపునది
12. పూర్ణచంద్రుడు గల పున్నమి
13. _ _ శాంభవి చంద్రమౌలిరబలా!
15. రేగిన కోరికలతో గాలులు వీచగా..
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా..
కాలము లేనిదై గగనము అందగా..
ఈ సినిమలోనిదే ఈ వేటూరి శృంగార రచన
16. సుక్ష్మము
21. దీనికి చక్కలిగింతలు పెట్టాట్ట వెనుకటికి ఎవడో

నిలువు:
2. మంత్రి
3. ఈ చెట్టు నారాయణుడితో సమానమే!
4. లూజైన మంచం ఇది ఆడిందట, కానీ ఒక్కసరేనండోయ్.
5. నాలుగు టంకముల ఎత్తు బియ్యము పట్టు పరిమాణము
6. మహాకవి కాళిదాసు సినిమాలో కాళిదాసు హనుమంతుడిని ఈ రాయుడు అనిపిలుస్తాడు చమత్కారంగా
9. మంగళహారతి
10. ఇదొకరకం తెలుగు పద్యం
11. కిం గోత్రమహమస్మి, అంబా! కిం గోత్రమహమస్మి? అంటా ఈ అబ్బాయి వాళ్ళమ్మ సత్యకామతో
13. కీలుగుఱ్ఱం సినిమలో ఈమె యక్ష రాక్షసి గుణసుందరిగా వేసింది
14. ఈయన్ని చూసిన కంట మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధేస్తుందట
18. కీర్తి లాంటిదే
19. ఉమామహేశ్వర రావు ఈ రూపం అంటూ ఓ సినిమా వచ్చిందీమధ్య
20. చేత్తో కొలిచే ఓ కొలత

Oct 8, 2020

పద వినోదం

 


అడ్డం

1. మంచానికి కిందకాళ్ళకట్ట - మరి పైన

3.కర్ణాటకలో ఖ్యాతిగాంచిన ఓ ఊరు. ఆంగ్ల ఆమెతో మొదలు.

5. అడవిలో అగ్గి అటునుంచి రాసుకుంది

6. మట్టిని కాల్చి ఇల్లుకట్టేది కాస్త ఉల్టాపల్టా అయ్యింది.

8. కొంకణ్ గా పిలువబడే ఈ చిన్న రాష్ట్రం బీచ్ లకు ఖ్యాతి గాంచింది

10. తడబడ్డ నెఱ్ఱె

12. తినేదాంట్లో ఇది ఉంటే మధుమేహం చెప్పుచేతల్లో ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు

14. ఔన్సులు - తెలుగు కొలమనంలో

15. ఇంట్లో వండటానికి ఏమీ లేవని ఆమె అంటే, బయట పచ్చగా ఉన్నదాంతోనే వండమన్నాట్ట ఓ పెద్దాయన

16. చివర్ని కోల్పోయిన అందమైన యువతి

17. జంటపదంలో మొదటిసగం=రెండోసగం అయితే ఒక సగమే మిగిలింది.

18. స్థిరంగా ఉంటాన్ని ఇలా కూడా అంటారట

19. అవినీతిని అంటగట్టే శాఖ, చివర్ని కోల్పోయింది.

20. అటునుంచి ఇందులో పెరిగిన తాడిచెట్టు. 

21. తిరగబడ్డ బండితోలువాఁడు



నిలువు

1. మిట్టమధ్యానం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఈతకెళ్ళొచ్చి పట్టుబడ్డప్పుడు నాన్న పోసేది?

2. క్రిమిసంహారకాలు విచ్చలవిడిగా వాట్టం వల్ల బలి అయిన చిన్న పక్షి, అంతరించేస్తాయికి వచ్చినై

3. ఈ ఊరిని 8గాలి ఉరు* అంటారుట ఇంగ్లిషులో

4. దిన్ని బక్కెట్ల మీద బక్కెట్లతో నింపితేనే వాడుకోటానికి నీళ్ళు. 

7. ఎప్పుడూ వేపుడు కూరేనా? మన నలభీమ పాకంలో రాంములక్కాయ ... చేసేవిధానం రాసుకొచ్చాడు. అలా చేయొచ్చుగా?

9. చెఱువు/బావి/లంకెబిందెలతో సహితంగా ఇంటిని రాసిచ్చాట్ట ఒకతను

11. భార్యాభర్తలు కొబ్బరికాయ కొని ...కొట్టుకుని తింటారు, మనకెందుకుటా

13. రాజకీయ వినయకులు తరచుగా కరుచుకుంటుంటారు. సదరు *కరుచు*కుంటాన్ని ఇలా కూడ అనొచ్చుట - తలక్రిందులుగా

14. సేవకుడే కాస్త అచ్చుతప్పుతో స బదులు శ 

16. అచ్చెరువున అచ్చెరువున ఈ...న వికసించిన కమలం 
 

(చిన్న ప్రయత్నం మాత్రమే. సలహాలు సూచనలు ఎల్లప్పుడూ స్వాగతిస్తా )