Showing posts with label రాజకీయం. Show all posts
Showing posts with label రాజకీయం. Show all posts

Jan 6, 2021

ఓ జాత్యహంకారీ

 



ఓ జాత్యహంకారీ -

ఎటూ నీ పయనం?

నేటి నలగగొట్టబడ్డ నల్ల బిడ్డడు

రేపు ఎల్లదొరై నీ దేశాన్ని పాలించవచ్చు

ఒక్కసారి నీ కర్మ ఎలా కాలుతుందో ఆలోచించు ఆనాడు


ఎవరి రోడ్డులూ

ఎవరి దేశం అంటూ విర్రవీగుతున్నావు

ఈ దేశం నీయబ్బ సొమ్ము కాదని నీ అంతరాత్మకు తెలుసు


ఓ జాత్యహంకార-ఇజానికి బానిసా

నీ ఆత్మని అమ్ముకొకిలా

నిజాన్ని తెలుసుకుని బతుకు మనిషిలా

బతకనివ్వు మానవజీతినిలా 

Jan 5, 2021

మూర్తుల విధ్వంసం

మూర్తుల విధ్వంసం కొత్తేమీ కాదు. సూటిగా ఒక మాట చెప్పుకుందాం. మా ఊళ్ళవైపు అనగా పల్నాటి వైపు ఎన్నో దేవాలయాలు శతాబ్దాల చరిత్ర కలవి - విధ్వంసం అయిపోయాయి. నా కళ్ళ ముందు - మా ఊరికి దగ్గర్లో ఉన్న బుగ్గ మల్లయ్య దేవాలయం, మూడు వేల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. మల్లయ్య నిల్చుని ఉంటాడు పంచలోహంతో చేయబడి. కాళ్ళ వరకు విరగ్గొట్టబడ్డాడు. విగ్రహం మాయం. ఇలాంటివి ఎన్నో. మా ఉరికి దగ్గర్లోని రేగులగడ్డ దగ్గర్లో కల ఒక కోటలో దేవాలయంలో మూర్తులు మాయం, మూర్తులని ప్రతిస్థాపించిన గద్దెలు తొవ్వబడ్డాయి.


కారణాలు? మంచలోహ విగ్రహాలు అవటం ఒకకారణం. విగ్రహప్రతిష్ఠలో నవరత్నాలను వాడతారనేది ఇంకోకారణం.


ప్రస్తుతంలోకొస్తే - జగన్ వచ్చాక హిందూమతం మీద, గుళ్ళమీద దాడులు ఎక్కువయ్యయనేది వార్త.


క్రైస్తవీకరణ ఎక్కువైంది - ఇందులో ఏమాత్రమూ సంశయం లేదు.


ప్రభుత్వం ఈరకంగా మెజారిటీల మనోభావాలని దెబ్బతీస్తుందని నేననుకోవట్లేదు. హిందువుల ఓట్లను కోల్పోయే ఆలోచన ఏ పార్టీ కూడా చేయదు అని నా అభిప్రాయం.


ఇది రాజకీయ లబ్ది కోసం చేస్తున్నదే అని నా అభిప్రాయం.


ఏవైనా - ఈ సంఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అలాగే ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఖండించి తీరాలి.

పొంత లేని స్టేట్మెంట్స్ మానేయాలి

Dec 13, 2020

మాస్క్ పెట్టుకోవటం అనేది హక్కు

ముఖానికి మాస్క్  పెట్టుకుంటే కోవిడ్ సంక్రమించ కుండా ఆపలేమేమో కానీ కనీస జగ్రత్తకీ ఉపయోగపడచ్చు. ఈవిషయాన్ని చెప్పటానికి పి.హెచ్.డి చెయ్యాల్సినా పని లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని మనం కపాడుకోటానికి ఉపయోగపడతాయి అని చెప్పటానికి డా||ఫౌచి ఇంటింటికి వెళ్ళో లేక ప్రతీ మనిషికీ ఫోన్ చేసో చెప్పల్సిన పనిలేదు.


ముఖానికి మాస్క్ వేసుకోటం అనేది ఒక మనిషి తనకు తనుగా స్వచ్ఛందంగా చేయ్యాల్సిన ఆచరించాల్సిన సమాజిక బాధ్యత కనీసం ఈ రోజుల్లో.


మాస్క్ పెట్టుకోవటం అనేది హక్కు.


ఘోరం ఏవిటంటే మాస్క్ పెట్టుకోవటాన్ని పెట్టుకోండని చెప్పటాన్ని పెట్టుకోకపోతే ఏదోలా పెట్టుకునేలా చేసే ఆలోచననీ రాజకీయం చేసేశారు కొందరు. దానికి కొన్ని వార్తా సంస్థలు వత్తాసు.


నిన్న రాత్రి వాషింగ్‌టన్ లో జరిగిన సంఘటన - కార్లో వెళుతూ మాస్క్ పెట్టుకున్నారని ఆపారు ప్రౌడ్ బాయిస్ అనే ఒక ట్రంప్‌ని మోసే గుంపు. వీళ్ళ దృష్టిలో మాస్క్ పెట్టుకున్నవాళ్ళు ట్రంప్ ని వ్యతిరేకించేవాళ్ళు.


భయంగొలిపే సంఘటన.


Dec 8, 2020

ట్రంపిజం

ఆనాడు డ్యూటీలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి అందునా ఒక స్త్రీ మీద చేయిచేసుకుని పదవని కోల్పోయి తన ఉనికినే కోల్పాయాడు ఒక మంత్రి. 

ఈనాడు తన బాధ్యతను తాను నిర్వర్తించినందుకు ఈమె ఇంటి మీదకు తుపాకులతో వేళ్ళారు దుర్మార్గులైన కొందరు.

ఒక దొంగ పుట్టుకతో దొంగ కాడు, ఒక దొంగ తయ్యారు కాబడతాడు.

ఒక దేశాధ్యక్షుడు పుట్టడు, తయ్యారుకాబడతాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో. (మన కర్మ మనదేశంలో ఇంకా కుటుంబ పాలనలో మగ్గుతున్న రాజకీయ కుటుంబాలున్నాయనుకోండి)


ఈమె పేరు జోసిలిన్ బెన్‌సన్, మిషిగన్ రాష్ట్రానికి సెక్రెటరి. రాష్ట్ర సెక్రెటరి ఇంటి మీదకే వేళ్ళారంటే వీళ్ళు ఎంతలా ప్రేరేపితం కాబడ్డారో?

వీళ్ళు ట్రంపిజాన్ని మోస్తున్న సైనికులు అని వేరేగా చెప్పాల్సిన పనిలేదు. తప్పు వీళ్ళదా? వీళ్ళని ప్రేరేపిస్తున్న వ్యవస్థదా?

తప్పు చేసేవాడిదే చేయించేవాడిదా?

తప్పు గొఱ్ఱెదా కాసేవాడిదా? 

ఇంత జరిగినా రిపబ్లికన్ పార్టీ నుంచి గానీ, దేశాధ్యక్షుడి నుంచి గానీ దీన్ని ఖండిస్తూ ఎక్కడా ఒక్క స్టేట్మెంట్ లేదు.

Jocelyn Benson just released a statement: “As my four year old son and I were finishing up decorating the house for Christmas on Saturday night ... dozens of armed individuals stood outside my home shouting obscenities and chanting into bullhorns in the dark of night.”

 

Nov 18, 2020

తాతగారి ట్వీట్స్

తాతగారి ట్వీట్స్ లో లాజిక్ అర్థం అవ్వలెదు.

రిగ్గింగ్ జరిగింది అంటాడు - అర్థమైంది.

కాబట్టి నేనే గెలిచాను అంటాడు. అదెలా? 

 

Nov 8, 2020

ఎన్నికల వ్యవస్థలో సమస్యలున్నాయా?

 గెలిచినప్పుడు వ్యవస్థ బ్రహ్మాండంగా పని చెసిందనీ, ఓడినప్పుడు వ్యవస్థ దొందగదనీ లేక లంచగొండిది అనీ అభాండాలు వేసే నాయకులను తరిమితరిమి కొట్టాలని నా పిలుపు.

ఉదాహరణకు ట్రంప్ - 

నేను గిలిస్తే ఒప్పుకుంటాను.

ఓడితే మాత్రం ఒప్పుకోనని 2016 అన్నాడు.

సరే! గెలిచాడు. 4 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాడు.

ఇప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో వ్యవస్థాగతమైన సమస్యలున్నాయంటాడు.

4ఏళ్ళు  పాలించినప్పుడు ఈ సమస్యలని తూర్పారపట్టి సరిదిద్ది ఉండచ్చుగా? ఈ వ్యవస్థలని ఒక గాట్లోపెట్టి ఉండచ్చుగా?

అబ్బే లేదు. ఇలా ఏళ్ళకు ఏళ్ళు ఏడవటమే! వ్యవస్థ సరిగ్గా పని చేయలేదని కేవలం నెపం.



Oct 21, 2020

*జగన్ లేఖ #ట* గాళ్ళకు ఈ వీడియో

 *జగన్ లేఖ #ట* గాళ్ళకు ఈ వీడియో


గత వారంగా కొట్లాటలు దొమ్మీలు వార్తాఛానళ్ళలో. ఓ కుమ్ముకుంటున్నారు. బాకా పత్రికలు బాకాలూదటం.

బాకా ఛానళ్ళలో డప్పులు వాయించటం.


వాటికి ముక్తాయింపులు సదరు వార్తా పుత్రికల సంపాదకులు చట్టాలను న్యాయాన్ని తూర్పారపట్టినట్టుగా ఫీల్ అవ్వటం. పీహెచ్‌డి చేసినట్టు దస్తాలకు దస్తాలు సంపాదకీయాలు రాసి అక్కసు కక్కోవటం.


న్యాయ వ్యవస్థ మీద ఆరోపణ చేయకూడాదా? ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ద్వారా ప్రాప్తించిందేగా?

సరే ఏవైనా ఈరోజొక యూట్యూబ్ వీడియో చూశాను. నాకు బాగా నచ్చి ఇక్కడ అందిస్తున్నాను.

Sep 29, 2020

భాజపా తన బొందని తానే పెట్టుకుంటున్నదని నా భావన

నిన్ననో మొన్ననో ఈ వార్త చూశాను

"భారతీయ జనతా పార్టీ (భాజపా) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు."


భాజపా తన బొంద తానే పెట్టుకుంటున్నదని అనిపించింది. పైన ప్రకటించిన ఇద్దరు వ్యక్తులూ భాజపా భావజాలంతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన వాళ్ళు కారు. ఒకరు మరీ దారుణంగా కాంగ్రేస్ భావజాలంలోంచి వస్తే మరొకరు అవకాశావాద రాజకీయాలతో నెట్టుకుంటూ కేవలం పదవులే ముఖ్యంగా కేవలం లైంలైట్లో ఉంటానికే వచ్చిన వ్యక్తి. 


ఇలాంటివారికి పార్టీలో ప్రధాన్యత ఇస్తే ఎప్పటినించో పార్టీనే అంటిపెట్టుకుని భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తులు ఏమి చేయాలీ? వారికి గుర్తింపెదీ?


భాజపా తన బొందని ఈరకంగా తానే పెట్టుకుంటున్నదని నా భావన


Aug 5, 2020

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్ష రావణాసురుడు

ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అనేది ఎక్స్పెక్టేషన్. ఎవరి ఎక్స్పెక్టేషన్ అంటే - సాధారణ పౌరుడి ఎక్స్పెక్టేషన్ అనుకుందాం. నెలబారు మనిషికి ఆమాత్రం కోరికలు ఆమాటకొస్తే హక్కులు ఉండకూడదా?

కానీ 21 శతాబ్దిలో ఏదేశంలో చూసినా ఏప్రాంతంలో చూసినా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుందాం అనే రంధిలో ఉన్న మనిషి/అతను నిర్మించిన రాజకీయ వ్యవస్థ ఎన్ని అక్రుత్యాలకు పాలుపడుతున్నాయో చూస్తే జుగుప్స కలుగుతుంది.

ప్రతిపక్షం పాలకవర్గాన్ని దించటానికి హత్యలు చేయటానికి మారణకాండ చేయటానికి నలుగుదిక్కులా ప్రజల మనోభవాల్ని రెచ్చగొట్టి ఎగదోస్తున్నాయి.

అటుజెసి ఇటుజెసి మధ్యలో జనాల ప్రాణాలే రాలిపోతున్నాయి. ప్రజలు మళ్ళీ మళ్ళీ గొర్ఱెలు కాబడుతున్నారు. రాజకీయ క్రీడలో పావులు కాబడుతున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం కోవిడ్ సమయంలో ఎలా ప్రజల ప్రాణాలతో ఆటాడుతున్నదో ఓసారి చూద్దాం.

ఓ పెద్దాయన
67 ఏళ్ళు
పాపం ఏవో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్
బిపీ సుగర్ లాంటివి వెంటాడాయి నేలబారు మనిషికి నేలబారు రోగాలు
ఇంతలో ఆయన భార్య గారికి కోవిడ్ వ్యాధి లక్షణాలు
ఆయన అల్లుడు ముప్పతిప్పలుపడి ఆశుపత్రిలో ఒక బెడ్ సంపాదించాడు
ఆమెకి ట్రీట్మెంట్ దొరికింది. తగ్గి ఇంటికి వచ్చింది. ఇంతలో ఆయనకి కరోనా లక్షణాలు.
మళ్ళీ అల్లుడు తీవ్రంగా శ్రమించి ఆశుపత్రిలో ఒక మంచాన్ని సాధించాడు.
మామగారు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా?
నేను వెళ్ళను అంటాడు.
ఎందుకయ్యా అంటే - ఆశుపత్రిలో భోజనం సరిగ్గా పెట్టటంలేదని పలానా ఛానల్లో చెప్పారు, పలానా పార్టీవాళ్ళు చెబుతున్నారు అంటాడు.
ఆశుపత్రికి వెళితే అటునుంచి అటే అట అంటాడు. ఎవరన్నారయ్యా అంటే ప్రతిపక్షం కోడైకూస్తున్నదిగా అంటాడు. పలానీ ఛానల్లో దీనిమీదే నిన్న చర్చ జరిగింది అంటాడు.
ఆశుపత్రిలో చికిస్త అసలు జరగంటంలేదుట అంటాడు.
తగినంత మంది డాక్టర్లు లేరు అంటాడు. వాదన.

ఈ తర్జన భర్జనలో ఆయన పోనేపోయాడు.

ప్రతిపక్షం ఆయన్ని తిరిగితేగలదా?

జనాల్లో అపోహలను నరనరాల్లోకి ఎక్కిస్తున్న ప్రతిపక్షం పోయిన ప్రాణాలను తేగలదా?

జనాలలో బతికే సైకలాజికల్ స్ట్రెంత్ ని ఇవ్వాలన్న కనీస ధర్మాన్ని పాటించని ప్రతిపక్షం ఉండి దేనికి?

ప్రభుత్వం తప్పు చేయచ్చు. దాన్ని కరెక్త్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. ఆ పాత్రని ప్రతిపక్షం పోషిస్తున్నదా?

Aug 4, 2020

48 గంటలు సమయం ఇస్తున్నా - బాబు

48 గంటలు సమయం ఇస్తున్నా, అసెంబ్లీ రద్దు చేయండి. 

ఎన్నికల మానిఫెస్టోలో మూడు రాజధానులు పెట్టలేదు. 

రాజీనామా చేసి, అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళి .. 


 2014 ఎన్నికలలో అమరావతి రాజధాని అనీ, 
50 వేల ఎకరాలు సెకరిస్తాం అనీ, 
సింగపురం కంపెనీలకు అప్పగిస్తాం అనీ, 
సింగపూర్ ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయనీ మానిఫెస్టోలో చెప్పారా?

అమరావతి అని నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారూ? 
ఓటింగ్ పెట్టారా? 
ప్రజల అభిప్రాయం తీస్కున్నారా? 

రేపొద్దున పుల్లయ్య ముఖ్యమంత్రి అయితే ప్రతీ జిల్లా హెడ్క్వార్టర్ రాజధాని అంటాడు. 

ఎవడి పాలనా సౌకర్యం వాడిది. 

ఎందుకింత రాద్ధాంతం.

Jul 11, 2020

NTR కి భారతరత్న

శ్రీ పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే ఓ ఆలోచన రావటానికి ఆయన సుదీర్ఘమైన రాజకీయ/సాహిత్య ప్రయాణం మాత్రమే కాకుండా ఆయన ఆలోచించిన తీరు, సంస్కరణలు మొదలైనవి అనేక కారణాలలో కొన్ని.

NTR కి ఎందుకు ఇవ్వాలి భారతరత్న?
ఆమాటకొస్తే ప్రకాశం పంతులుకి ఎందుకివ్వలేదు?
ఎల్లాప్రగడ సుబ్బారవుకి ఇవ్వొచ్చుగా?

భారతరత్న అనేది కేవలం మోసేవాళ్ళ బలాన్నిబట్టేనా?

క్యాండిడేట్ ప్రతిభకి సంబంధం లేదా?

భారతరత్న - కేవలం ఒక తంతు మాత్రమే. ప్రభుత్వ ప్రాపగాండానే. మోసేవాళ్ళ బలప్రదర్శన మాత్రమే.

Jul 5, 2020

అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ఖర్చు చేయక్కరలేదు -చంద్రబాబు


అమరావతికి రు.9000 కోట్లు ఖర్చుచేశాం, మరో లక్షకోట్లు కావాలని చెబుతున్నారు. రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు
-చంద్రబాబు



పైసా ఖరు లేకుండా అమరావతి నిర్మించవచ్చా?
ఎలా?
అలా అయితే తన 5 సంవత్సరాల పాలనలో బాబు రాజధాని నగరానికి పెట్టిందెంతా? how to get that information?

గూగులించాను. వికీపీడియాలో ఈ కొంత సమాచారం దొరికింది. అది నిజం కావచ్చు, కాకపోనూ వచ్చు.

Economy and infrastructure
The state government originally initiated the Singapore-based Ascendas-Singbridge and Sembcorp Development consortium for the city's construction. The city's infrastructure was to be developed in 7–8 years in phases, at an estimated cost of ₹33,000 crore. ₹7,500 crore from the Housing and Urban Development Corporation Limited (HUDCO), $500 million from the World Bank and ₹2,500 crore from the Indian Government, of which ₹1,500 crore has been granted.

As of July 2019, the World Bank dropped funding for Amaravati. As of September 2019, the Ascendas-Singbridge and Sembcorp Development consortium have also withdrawn from the project. With only state government allocated budget of ₹500 crore in 2019, the Amravati project has substantially slowed, with no deadline in sight.

Nine themed cities consisting of Finance, Justice, Health, Sports, Media, and Electronics; including Government buildings designed by Norman Foster, Hafeez Contractor, Reliance Group, and NRDC-India will be built within the city. Pi Data Centre, the fourth largest of its kind in Asia with an investment of ₹600 crore (US$84 million), and Pi Care Services, a healthcare BPO, were inaugurated at Mangalagiri IT park. HCL Technologies, an IT firm would set up one of its centres in Amaravati.

BRS Medicity with an investment of $1.8 billion is to come to Amaravati. Mangalagiri Sarees and Fabrics produced in Mangalagiri mandal, a part of the state capital, were registered as one of the geographical indications from Andhra Pradesh.

దీన్ని ఎలా అర్థం చెస్కోవాలో నాకు అర్థం కావట్లేదా? లేక బాబుకి అర్థం అవ్వలేదా లేక జగన్‌కి అర్థం కావట్లేదా?

ఎవరన్నా సుదీర్ఘంగా వివరణ ఇస్తే బాగుండు.

Jun 28, 2020

పీవీ నరసింహారావు గారికి భారతరత్న

కీ|శే|| శ్రీ పి.వి.నరసింహారావు (28 జూన్ 1921 – 23 డిశెంబర్ 2004) 

పీవీ గారి గురించి రాసేంత గొప్పవాణ్ణి కాదు.

ఆయన గొప్పతనం ఇప్పటికే అనేకులు ప్రచురించారు. నేను కొత్తగా ఇన్‌వెన్‌ట్ చెయ్యటంలేదు.

కానీ పీవీ గారిలో ఓ నాటక కర్త ఉన్నాడనీ, ఆయన రాసిన నాటకం ఒకటి ఎప్పుడో ఎక్కడో విన్నట్లు నాకు జ్ఞాపకం.

ఎవరికైనా పీవీ గారి నాటకాలు కానీ నాటికలు కానీ దొరికితే పంచమని ప్రార్థన.

KCR గారు పీవీ గారి శతజయంతి ఉత్శవాలు జరిపించటం KCR ఔన్నత్యానికి నిదర్శనం.

KCR పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే నినదించటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.

ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ ఈవిషయాన్ని గట్టిగా ప్రస్తావించలేదు.

అయితే - ఈ ప్రస్తావనని కేవలం KCR మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏక కంఠంతో నినదిస్తే తప్పక నెరవేరుతుందని నా అభిప్రాయం.

పీవీని కేవలం తెలంగాణాకి పరిమితం చేయటం అర్థరహితం. 

దేశప్రధాని అందరికీ ప్రధాని అని గుర్తుంచుకోవాలి.
దేశప్రధానికి ప్రాంతీయతని అంటగట్టటం అవివేకం.

[తెలుగులకు ఉన్న దరిద్రం ఏవిటంటే - గిరిగీసుకుపోయి దాంట్లోనే మగ్గటం.
కూపస్తః మండూకః అని సామెత.
ఎందుకంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తెలుగు వాడు. ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వాలని కోరింది తమిళ్నాడు ప్రభుత్వం. అంధ్ర ప్రభుత్వం కాదు.
ఇలాంటివి అనేకం.]

Jun 8, 2020

వ్యవస్థ ఇలా కాలేదు - ఇలా తయారు చేయబడింది.

వ్యవస్థ ఇలా కాలేదు - ఇలా తయారు చేయబడింది అంటూ ఒకామె ప్లకార్డ్ పట్టుకున్న టిట్టర్ నన్ను ఆపేసింది. వ్యవస్థని ఇలా చెక్కారు పెద్దలు. ఏదేశం వేళ్ళినా ఇందులో పెద్ద మార్పు ఉండదు. బలవంతుడిదే రాజ్యం. రక్షకుడే భక్షించటానికి వత్తాసు. కంచే చేనును మేసేందుకు ప్రోత్సాహం. ఈ దేశం నలుమూలలా గోలలు సమ్మెలు హర్తాళ్లు నడుస్తున్నాయి. దేశాధ్యక్షుడు ఫిడేలు వాయించటం మాత్రం ఆపటంలేదు. సింపుల్ - ఆందోళనకారుల్లారా, ఏంకావాలీ? ఓహ్! అవునా "పరిశీలిస్తాం" అని కేవలం ఒక్క మాట అంటానికి నోరు రావట్లేదు. ఇదేవన్నా Anti CAA ప్రొటెస్టా? కాదు. పోనీ ఇదేవన్నా Anti NRC ప్రొటెస్టా? కాదు. అసలే కోవిడ్‌తో లక్షమందిని పొట్టనబెట్టుకున్న వ్యాపారకాంక్ష. దీనికి అంతం? ఎలక్షన్లా?

ఏడాదిలో 13 లక్షల టన్నుల ఇసుక మాయం

జగ 'మేత ' గజ 'మేత ' ఏడాదిలో 13 లక్షల టన్నుల ఇసుక మాయం చేశారట. బాబు గారి ట్వీటు. మాంచి సినిమా రచయితని ట్విట్టర్ మీదకి వదిలనట్టున్నారు బాబు గారు. ప్రాసలు అనుప్రాసలు అంత్యప్రాసలు అల్లాడిస్తున్నారు ఎవరోగాని. విషయానికొస్తే - నిన్నటిదాకా ఇసుక రీచిల్లో ఇసుక లేదన్నారు. ఇప్పుడేమో తూకం పట్టి కొలిచినట్టుగా అక్షరాలా 13 లక్షలా 36 వేల 860 టన్నులా 13 గ్రాముల ఇసుక మాయం అంటున్నారు. ఏవైయుండాలి? ఇసుక తినేది కాదు. కట్టడాలకే వాడాలి. లేదా సముద్రంలోనన్నా కలపాలి. జగన్ ఇంట్లో దాచేసుకుని ఉంటాడేమో అని నా అనుమానం. ప్రతిపక్షం నేత హుందాగా వ్యవహరించాలి. ప్రపంచంలోనే సీనియర్ నేత ఇలా నీచస్థాయిలో పాలకపక్షం మీద ఇంటార్నెట్లో దాడికి దిగటం ఆయన పెద్దరికానికే వదిలేద్దాం. దీనిమీద సమగ్ర చర్చ గరుగుతుందా ట్విట్టర్లో అంటే అదీ ఉండదు. జై జై అంటూ జేకొట్టే జనాలు తప్ప

May 27, 2020

దేవుడి మాన్యం



కొన్ని వేల సంవత్సరాలుగా ప్రభువులు బ్రాహ్మణికల్ యాటిట్యూడ్‌లో తడిసి ముద్దై గుళ్ళు, గుడి వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి కోసం మాన్యం, గుడికొక అర్చకుడు అనే వ్యవస్థని ఏర్పాటు చేశారు.

కొన్ని శతాబ్దాలో దశాబ్దాలో నడిచాక పరాయి పాలకులు దేశాన్ని గుళ్ళను గుడి సంపదను దోచుకోగా మిగిలిన టాంజిబుల్ ప్రాపర్టీలని తమతో తీసుకెళ్ళలేక పాపం డీలాపడి, సదరు భూముల్ని ఎలా దోచుకోవాలా అని బాధపడ్డారు.

శతాబ్దాలు దశాబ్దాలు గడచాక నల్లదొరల పాలనలో దోచేవాడే పాలకుడు అయ్యాడు రాజకీయ వేత్త అయ్యాడు కాబట్టి దోపిడికి అడ్డు అదుపూ లేకుండా పోయింది.

దోచుకున్నోడికి దోచుకున్నంత అయ్యింది.

ఈ రాపిడిలో దోపిడిలో ఒరిపిడిలో ఎండ్లకాలం అమెరికన్ అమ్మాయి డ్రస్సు లాగా వేల ఎకరాలున్న దేవుడి మాన్యం కాస్త కురచై కురచై జానెడుకొచ్చింది.

ఇందులో తిలా పాపం తలా పిరికెడు.

చివరికి 2020వ సంవత్సరం ఓ పెద్దాయన -
ఆ ఫైలు ఇలా తే! స్వామి వారికి ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఎవరెవరు ధారాదత్తం చేశారో చూద్దాం అన్నాడు.
ముందరి ప్రభుత్వ హయాంలో ఏసీ గదుల్లో కూర్చునే కొందరు బడాబాబులు "అబ్బే! వేస్ట్ భూమి. ఎందుకూ పనికిరాదు. అక్కడెక్కడో, మనకి దూరం గురూ కనీసం వెళ్ళి చూడను కూడా లేము, ఏ పాతిక సెంట్లో ఉంటే ఎవడు కాపాడతాట్టా" అన్నారు.

వాళ్ళని తప్పు పట్టలేం.

ఒకరకంగా చెబితే - భక్తులు ఇచ్చే భూమిని ట్రాక్ చేయటమూ కష్టమే, దాంట్లో అసాంఘీక కార్యకలాపాలు జరక్కుండా కాపు కాయటమూ కష్టమే.

ఇంతలో కొందరు మేధావులు - ఈ చిన్న చిన్న ముక్కలని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి, ఎక్స్ఛేంఝ్ ఆఫర్ కింద కన్సాలిడేటెడ్ గా ఓ పెద్ద ముక్క పొందవచ్చు కదా?

ఎగ్రీడ్. మంచి ఆలోచనే. అయినా కష్టమే.

సరే! ఏతావాతా - దేవుడికి భక్తులిచ్చిన భూమిని వదిలించుకోవటం అనకుండా - దాన్ని ఏదోరకంగా ప్రజలకే ఇస్తే అటు ప్రజలకూ ఉపయోగం. ఇటు కనిపించని ఆ దేవుడికి ఆనందం.

అయితే సమస్య - దీన్ని గురించిన రాజకీయం.
అమ్ముదాం అన్నది ఎవరూ?
ఇంతక ముంది ఎన్ని సార్లు అమ్మారు?
ఇప్పుడు అమ్మటానికి ప్రాతిపదిక ఎప్పటిదీ?

ఈ ప్రశ్నలు అడిగితే - మీరు సమస్యని డైల్యూట్ చేస్తున్నారు, జనాల వేడి మీద నీళ్ళు పోస్తున్నారు అంటున్నారు.
అడక్క పోతే - తిరుపతి కొండనే అమ్మేస్తారు దగుల్బాజీలు అంటున్నారు


దీనికి పరాకాష్ఠ - గుంటూరు రైల్వేస్టేషన్ని, గాంధీ పార్కునీ, దానిముందున్న కూరగాయల మార్కెట్టుని అమ్మేస్తున్నారట అని ప్రచారం.

ఎంతకి దిగజారిపోతున్నారో రాజకీయ నికృష్ఠులు అనిపించింది.

May 19, 2020

హిందూ దుకాణాలల్లో ఏమీ కొనొద్దు

ఇదెంతవరుకూ నిజమో తెలియదు.

బెంగుళూరులో హిందూ దుకాణాలల్లో ఏమీ కొనొద్దు అంటూ ఫత్వా జారీ అంటూ, కొందరు టపోరి ఉర్దూలో షాపింగ్ చేస్తున్న ముస్లిం ఆడవాళ్ళని అరవటం, మీకెన్నిసార్లు చెప్పాలీ అంటూ ఏదో అరుస్తున్న కొన్ని వీడియాలు సోకాల్డ్ మాధ్యమాలల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది నిజమా? నాకు తెలియదు. కానీ, నిజమైతే?

ఒక్క సలహా -
ముస్లిం దుకాణాలల్లో కొనటాన్ని త్యజించటమో
హిందూ దుకాణాలల్లో కొనటాన్ని త్యజించటమో కాదు

మేడ్ ఇన్ చైనాని త్యజించండి
విదేశి వస్త్రాన్ని త్యజించండి
విదేశీ ఆలోచనల్ని త్యజించండి

కనీసం మన ఆర్థిక వ్యవస్థన్నా బాగుపడుతుంది.
హిందూ దుకాణంలో కొనకుండా ఎంతకాలం జరుగుతుందీ? ముస్లిం దుకాణానికి వెళ్ళకుండా ఎలా ఈడుస్తారూ?

మీనింగ్‌లెస్ కథ

May 9, 2020

అచ్చెన్నాయుడూ


ఏంటయ్యా ఇదీ? కనీస నాలెడ్జ్ ఉండొద్దా?

1."ప్రమాదఘటనకు దారి తీసిన కారణాలను నిజాలను నిగ్గుతేల్చేందుకు కేంద్రప్రభుత్వం విచారణ బృందం ఏర్పాటు చేయాలి."
బాగుంది.
ఎందుకుటా?
"రాష్ట్రప్రభుత్వం, సీయం జగన్ పట్ల మాకు, ప్రజలకూ నమ్మకం లేదు."
ఇదేవన్నా బాబు మిద దాడా లేక నీమీదనా?
ఏంటి గురూ నువ్వు మాట్టాడేదీ?
2. "ఎల్జీ పాలిమర్స్ లో తయ్యారయ్యే ముడి సరుకు ప్రభుత్వానికి సంబంధించిన కొందరు ముఖ్యులకు వెళ్తోంది"
గురూ. ఏం మాట్టాడుతున్నావ్? ఇదేవన్నా బంగారమా లేక తినేదా? అది స్టెరైన్. ఇంట్లో అంట్లు తోంకోటానికో లేక కూరల్లో వేస్కోటానికో లేక సారాయిలో కలపటానికో వాడరు.

రాజకీయం చేయి. వద్దనట్లేదు
నీ అస్థిత్వాన్ని చాటుకో. అదీ వద్దనటం లేదు.
సిల్లీగా స్టేట్మెంట్స్ ఇచ్చి నిన్ను నువ్వే పాతాళానికి నెట్టుకోకు. చంద్రబాబు కూడా నిన్ను కాపాడలేడు.

May 6, 2020

#mahoorparvez



ఈమె ట్వీట్ ఎంత నిజమో నాకు తెలియదు. ఈమె నిజమైన వ్యక్తో లేక ఈమె ట్విటర్ హ్యాండిల్ ఒక బోట్ మేనేజ్ చేస్తుందో కూడా నాకు తెలియదు.

కశ్మీర్ భారత్ అంతర్భాగం. కాదనటానికి ఎవరికీ హక్కు లేదు, ఒమర్ అబ్దుల్లా/రాహు గాంధీతో సహా.

అక్కడ హింస సాగుతున్నది.
అయుండచ్చు.

ఉత్తి పుణ్యానికి ముస్లిములని ఊచకోత కోస్తున్నారు.
కొంత నిజం కూడా అయుండచ్చు.

వేర్పాటూ వాదానికి కొమ్ముకాస్తున్నవాళ్ళతో పాటు కొందరు పోతారు.
అది తప్పదు.

దేశాన్ని రక్షించే రక్షకభటులు కశ్మీరునీ రక్షించాలి.
వాళ్ళ ధర్మం అది.

కశ్మీరుని కాయటానికి చైనావాళ్ళని పెట్టలేం కదా?

బై ద వే - చైనా వాళ్ళూ ఏం గొప్పవాళ్ళు కాదు ఆమాటకొస్తే! లెఫ్టిస్టిక్ పార్టీలన్నీ ఓ చైనా అని రొమ్ములు బాదుకుంటారు. చైనీయులు టిబెట్ వేర్పాటువాదుల్ని ఎలా అణగతొక్కిందో వెతికితే దొరుకుతాయి.

కశ్మీర్ సమస్యని పరిష్కరించుకోవాలంటే అనేక మార్గాలు ఉండచ్చు.
పోరాటం చేయొచ్చు.

కానీ ఇండియన్ ఆర్మీని తెగచంపటమే కాకుండా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్స్ ఇవ్వటం దిగజారుడుతనం.

ఇలాంటివాళ్ళని ఏమి చెయ్యాలీ?

వదిలేయాలా?

వీళ్ళకి ఇలాంటివి చెబుతున్న వాళ్ళని పట్టుకుని శిక్షించాలా?

ఎంత కాలం ఇలా?

ఇవన్ని పక్కనపెడితే - అసలు వీళ్ళకేంకావాలీ?

కశ్మీర్ ని పాకిస్థాన్ లో కలపాలా?

కశ్మీర్ దేశం కావాలా?

కశ్మీర్ ని చైనాలో కలపాలా లేక కశ్మీర్ ని ఆఫ్ఘనిస్థాన్ లో కలపాలా?

చెప్పుడు మాటలు విని జీవితాలని నాశనం చేసుకునేవాళ్ళు కొందరు.

జనాల అమాయకత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేసేవాళ్ళు కొందరు.

గోడకి అటువైపు ఇంద్రలోకం నవలోకం అని నమ్మే గొఱ్ఱెలు

దౌర్భాగ్యం

అంతులేని కథ....