మొన్నోరోజు సాయంత్రం 9కి అనుకుంటా ఎవడో ముందు తలుపుని దబాదబా బాది పారిపోయాడు.
నాకు పిచ్చ కోపం వచ్చి, పరిగెత్తుకుంటు వెళ్ళి తలుపు తీసి చూస్తే ముగ్గురు పిల్లలు పరుగెత్తి పోతూ కనిపించారు. ఒకడు దూరంనుంచి మధ్య వెలు చూపిస్తూ Fuck you అనుకుంటూ అరుచుకుంటూ చీకట్లోకి కనుమరుగైపోయారు.
షాక్ కి గురి అయ్యాను. ఒక్కసారి ఏంచేయాలో అర్థం కాలేదు. సూరిగాడు వెనకాలగ వచ్చి కూల్ డౌన్ చిల్ లోపలకి నడువు అంటూ తీసుకెళ్ళాడు నోరు తెరచి చూస్తూ ఉండిపోయిన నన్ను.
భార్య గారు పిల్లలు పిచ్చ లైట్ గా ఉన్నారు సంఘటన గురించి మాట్లాడుతూనే.
నేను మాత్రం షాక్ లో ఉన్నాను ఇంకా. ఎంతకీ ఆలోచనలు తెగలెదు.
సూరిగాడు కూర్చోబెట్టి చెప్పాడు - అలా randomగా ఇంటి తలుపు కొట్టటాన్ని Ding Dong Ditch అంటారు. ఇందులో పేద్ద విషయం ఉండదు. ఇది కేవలం ఫన్ కోసమే. ఇలా తలుపు కొట్టినప్పుడు మనం రియాక్ట్ అయితే మనల్ని ఎంచుకుని మళ్ళి మళ్ళి కొడతారు అని చెప్పుకొచ్చాడు.
ఆరోజుతో ఆ విషయం మరుగున పడిపోయింది.
మూడో రోజున మళ్ళీ - దబాదబా బాదటం పారిపోవటం దదాపు 9గంటలకే. ఈసారి వెంటబడ్డాను. మొత్తానికి పక్కసందులో ముగ్గురు పిల్లలు సైకిళ్ళ మీద కనిపించారు. నన్ను చూసి బెదిరారు.
హేయ్ ఆగు అన్నాను ఒక టోపీ పెట్టుకున్నవాడ్నిని.
ఎందుకాగాలి నేనేం చేయలేదే అన్నాడు.
నువ్వు ఏంచేశావని నేనసలు అడగనే లేదుగా ఎందుకు భుజలు తడుముకుంటున్నావ్ అన్నాను.
దూరం దూరం అసలే కోవిడ్ మేము వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళిపోబోతుంటే చెప్పాను -
నాదగ్గరున్న సర్వైలెన్స్ కెమేరలో మీరు దొరికారు. టోపీ పెట్టుకున్నవాడే తలుపు కొట్టీంది. నువ్వు అచ్చం కెమేరాలో దొరికినవాడి పోలికలోనే ఉన్నావు.
ఇప్పుడు నేను ఇంటికెళ్ళి పోలీసులతో తో మాట్లాడతాను. కెమేరా ఫుటేజ్ చూపిస్తాని వచ్చాను.
ఒకసారి కెమెరా ఫుటేజ్ చూస్తే ఆ పిల్లాడు తలుపు కొట్టి వెళ్ళలేదు. తలుపు కొట్టి కాలితో డోర్ ని తన్ని మరీ వెళ్ళాడు.
నాకెందుకో ఆడ్ గా అనిపించింది. కలితో తన్నటం అనేది కసిని తెలుపుతున్నది. కక్షని తెలుపుతున్నది. ఇది రెసిజం కేస్ అనిపించింది.
భయం వేసింది కూడా. వీళ్ళ ఇంటి ముందు అనఘ బస్ ఎక్కుతుంది. దీన్ని మనసులో పెట్టుకుని అనఘని ఏడిపిస్తారా? అనిపించింది.
తర్వాత తెలిసిన విషయం - ఈ పిల్లలు కేవలం దేశీ ఇళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనీ, అందునా ring లాంటివి లేని ఇళ్ళను టార్గెట్ చేస్తున్నారని.
ఏవైనా పోలీస్ మాట ఎత్తినాక మళ్ళీ రాలేదు వీళ్ళు.
ding dong ditch అని యూట్యూబ్ లో వెతికితే ఓ వీడియో నన్ను అసహనానికి గురిచేసింది.
ఎవడో దేశి. వాడి తలుపు మీద ఇలానే ముగ్గురు తెల్లపిల్లలు తలుపు బాదటం మాయం అవ్వటం.
మరి అలా ఎంతకాలం నడిచిందో తెలియదు.
సదరు దేశీ గాడికి ఎక్కడో కాలింది. ఓ రోజు వాళ్ళని కార్లో వెంబడించాడు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కారుతో గుద్ది వాళ్ళమీద నుంచి పోనిచ్చాడు కారుని.
ముగ్గురు తెల్ల పిల్లల ప్రాణాలు పొయ్యాయి.
సదరు దేశీకి శిక్ష పడింది.
హస్యం అనేది అంతదకా వెళ్ళటం అవసరమా?

