Jun 28, 2011

కార్స్ ౨ (త్రిడి)

మేం సినిమాహాలుకి వెళ్ళి సినిమా చూసి ఆరేళ్ళపైనే అయ్యింది. చివరిసారి కుటుంబసహితంగా వెళ్ళి చూసిన సినిమా శంకర్ దాదా యంబిబియస్. ఆతర్వాత థియేటరుకి వెళ్ళి సినిమా చూసిన సందర్భం లేదు. అమెరికా వచ్చిన తర్వాత, సూరిగాణ్ణి ఒకటి రెండు సందర్భాల్లో తీస్కెళ్దాం అనుకున్నా మనోడు తెలుసుగా, ఒకడు ఇద్దరితో సమానం కాబట్టి, కొంత భయపడ్డాం. అనఘ పుట్టినాక రోజూ సినిమాలే కాబట్టి ఇక ప్రత్యేకించి థియేటరుకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు.
ఇహ ఇప్పటి సందర్భానికి ప్రేరణ -
రెండువేల ఆరులో ఈ కార్స్ సినిమా రిలీజు అయ్యింది. అప్పట్నుండి సూరిగాడు లైటెనింగ్ మెక్వీనుకి పెద్ద పంఖా అయిపొయ్యాడు.

Cars_2006.jpg

ఎంతలా అంటే నిద్రలో లైటెనింగే లేస్తే లైటెనింగే పడుకుంటే లైటేనింగే. మావిడ ఏదో ఓ మాట చెప్తుంది ఈలాంటి పిచ్చికి. లాఫ్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ? అనుకుంటా. అంటే, వాడినకొద్దీ పిచ్చి పెరగటం. ఎవరికైనా వాడినకొద్దీ మోజు తగ్గుతుంది. కానీ మనోడికి చూసినకొద్దీ పిచ్చి ఎక్కువౌతున్నది. వాడు గీసే బొమ్మలన్నీ లైటెనింగ్ మెక్వీనువే. మొదట్లో ఓ యాంగిల్లో గీస్తే ఇప్పుడు రకరకాల యంగిల్సులో గీస్తున్నాడు.
అనఘకీ ఎక్కించాడు. అనఘ ఎక్కడ లైటెనింగ్ మెక్వీన్ కనిపించినా సూర్యా మెకీన్ మెకీన్ అన్నకి చూపిస్తుంది.
ఇహ ప్రస్థుతంలోకి వస్తే మూడు నెలల ముందునుండి ఈ కార్స్ రెండు చిత్ర ప్రకటనలు మొదలైయ్యాయి. వీడి గోల మొదలైంది. ఇట్టే పట్టేసాడు ఆ ప్రకటనలలలో వచ్చే పేర్లను. ఫ్రాన్చెస్కొ బెర్నౌలి పేరు పట్టేసాడు. చూద్దామా రిలీజ్ అయ్యిందా చూద్దామా రిలీజు అయ్యిందా అని గోల మొదలైంది. జూన్ ఇరుబత్తినాల్గున రిలూజు. దాన్ని నోట్ చేస్కున్నాడు. ఇవ్వాళ్ళ జూన్ పది, పదకుండు, ఇవ్వాళ్ళ పన్నెండు ..ఇలా లెక్కబెట్టటం మొదలైంది. మొత్తానికి జూన్ ఇరుబత్తినాల్గు రానేవచ్చింది. నాన్నా రిలీజు అయ్యింది నాన్నా, ఎత్తుకెళ్తవా నాన్నా అని పాట పాట్టం మొదలెట్టాడు. మా టైని టీనీ ఊళ్ళో అది రిలీజు కాలేదు. ఏంజేస్చాం బాబూ దగ్గర్లోని సిటీలోని ఏ.యం.సి వారి ఐమాక్స్ త్రి-డీ థియేటరులో టిక్కెట్లు బుక్ చేసి ఎత్తుకెళ్ళాను జనాలని.
వాడికి, వాడి జీవితంలోనే మొట్టమొదటి సినిమా, థియేటరులో, అదీ త్రీడీ. ఎక్జైట్మెంట్ తట్టుకోలేక పొయ్యాడు బిడ్డ.
Cars_2_Poster.jpg

బాగా ఎంజాయ్ చేసాడు. అనఘ కూడా అరవకుండా కూర్చుంది. ఐమాక్స్ లో మాకూ మొదటి సినిమానే. మేమూ ఎంజాయ్ చేసాం. ఆరేళ్ళ తర్వాత థియేటరుకి వెళ్ళటం బాగుంది.
ఇక కార్స్ ౨ త్రిడి సినిమా కథ ఇవన్నీ పక్కనపెడితే, తెల్లోడి టేకింగ్ బాగుంది. వాడి ఊహా స్థాయి అత్భుతం.
డిస్నీ గాడు వరసబెట్టి వాడి పాతసినాలకి బూజుదులిపి త్రీడీలోకి వదుల్తున్నాడు. లైయన్ కింగ్ రాబోతోంది త్రిడీలో. సదరు ప్రకటన అత్భుతంగా ఉంది కూడా.
ఐతే త్రిడీ చూట్టం మంచిదేనా కళ్ళకూ? అనేది ప్రశ్నే! కళ్ళు బాగా స్ట్రైన్ అవుతాయట. అంతేకాక తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉందట. కాబట్టి, ఇకపై సూరిగాణ్ణి కేవలం టుడి సినిమాలకే తీస్కెళ్ళాలని నిర్ణయించాను.
article-1271618-096A5718000005DC-566_468x479_popup.jpg

Jun 23, 2011

బజ్జులో కవితావేశం

muralidhar namala -
కచ్చగా రాసా నేనొక కవిత
అది కసి గా తీసుకొచ్చి చదువుతా
వినకపొతే మీ అందర్ని నరుకుతా
అది విని బతికితె మళ్ళీ చదువుతా..
మళ్ళీ చదువుతా..మళ్ళీ చదువుతా..
muralidhar namala - ఓ పిల్లా…….
సరదగా నీపై వేసాను వల…
నువ్వు తగిలావు ఒక చేపలా…
పట్టుకున్నావు నన్ను ఒక జలగ లా..
నిన్నిప్పుడు వదిలించుకొవడం ఎలా.. ఎలా..

Bhãskar Rãmarãju - సచ్చిన పావుని మల్లీమల్లీ సంపటం నేయవా?
అహా!! నాకు తెలవక అడుగుతా
నేయవేనా

Venu Srikanth Darla - అద్దీ అట్టా నిలదీయి భయ్యా..
muralidhar namala - ఏవండీ ఎవన్నా అంటే అన్నామంటారు. ఎవరు విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. స్టేజీ మీద మాకూ ఒక అవకాశముంటది కదా.

Bhãskar Rãmarãju - కచ్చగా రాసావా ఓ కవిత
మల్లీమల్లీ సదూతావా ఆ కవిత
మేం ఏంపాపంసేసుకున్నామో చెపుత
అప్పుడైనా ఆపుతావా ఈ కవిత
ఓరి మార్తాండోయ్ ఆపరా నీ మోత
మోగట్నేదు నీ ఈడియో ఏ మోత
ఇట్టా జనాల మీనకు ఒదలమాక ఓ ఉడుకుమోత
మాకసలే ఉక్కపోత
ముర్లి, నువ్వు లగెత్తుకొచ్చెయ్ ఎందుకీ కవిత
సవిత
మోత
కత
కిత

muralidhar namala - ఇస్తా వేడిగా మరొకటిస్తా
చూస్తా మీ అందరి అంతూ చూస్తా
తీస్తా ఒక్కోరికి తిత్తి తీస్తా
కోస్తా బ్లేడుతో సమ్మగా కోస్తా
వేస్తా వేగిన నూనెలో వేస్తా
వస్తా మరో కవితతో మళ్ళొస్తా

Bhãskar Rãmarãju - నువ్వు మరోటి ఏస్తే నే తీస్తా
అంతు చూస్తానంటే బైటికి తీస్తా
తిత్తితీస్తానంటే జర్రున తీస్తా
జోబిలోంచి తాళం తీస్తా
సర్రున స్టార్టు చేస్తా
కారుని రోడ్డుపైకి తెస్తా
ఇక లగెత్తిస్తా

muralidhar namala - వేణుగారు నన్నాపకండి ఈ రోజు నాలో చెలరేగిన ఈ చైతన్య స్రవంతిని ఆపకండంతే. భాస్కరన్నాయ్ ఎంత దూరం పారిపోతాడో చూస్తా ఈ రోజు.

Venu Srikanth Darla - ఓకే మురళి గారు.. ఐతే మీరు తగ్గకండి.. కమాన్ కిల్ ఎవ్రిబడీ... నేను మాత్రం పారిపోతున్నా...

Bhãskar Rãmarãju - లగెత్తే నన్ను
పట్టుకోవలనుకుంటున్న నిన్ను
ఆపలేదు ఏ మన్ను మిన్ను
చూపకు వెన్ను
చూపను నా కన్ను [అంటే నేను ఎనక్కి తిరిగి చూడను అని]
ఉన్నాడు వేణు వెన్ను దన్ను
బయటకి మాత్రం తీయకు పెన్ను
పొడవకు నన్ను
ఒప్పుకుంట నిన్ను
ఒప్పేస్కుంటా ఇంకన్ను

Bhãskar Rãmarãju - రావాల రావాల
కవితలతో కొట్టాల
ఆలోచనల సెగ పుట్టాల
ఇంత సేపెందుకే బాల
అందుకో నా ఈ హేల
రావాల రావాల

Bhãskar Rãmarãju - ఏవిటయ్యా మురళీ
చేయవయ్యా ఏదోక రవళీ
ఆడించెయ్ కవితలతో కథాకళీ
విరగ్గొట్టేయ్ నీ పాళీ

Bhãskar Rãmarãju - అబ్బే
నీ డప్పే
డల్ల మొప్పే
మ్రోతేలే దబ్బే
మ్రోగించాలి మ్రోతబ్బే

muralidhar namala - బజ్జులో కాళుడ నేనే
భరతం పడతారోయ్
కవితా భూతం నేనే
నీఅంతం చుస్తారోయ్

బెజవాడ గుడివాడ
గుంటూరు ఏలూరు
వైజాగ్ ఈజీనరం
భూతాన్ని సాతాన్ని నేనే

జెర్మన్ను లండన్ను
న్యూజెర్సీ షికాగో
దుబాయి మలేషియా
కాష్మోరా కాద్రాని నేనే

Bhãskar Rãmarãju - ఇంత సేపు టయంతో
ఈ కవితా వ్రాసేది
కవితలతో భరతం
పడతావని అనుకుంటే
నలుగంటే నాలుగే
పన్నాలతో తుఱ్ఱున
నీళ్ళు పోసి
ఇదే కాద్రా ఇదే
ఇదే కాష్మోరా ఇదే
అంటావేంటి

Bhãskar Rãmarãju - విరామం
ఇప్పుడే వస్తా
బేగి వస్తా
పెన్నులో ఇంకు పోస్కు వస్తా
నీ భరతం పట్టేందుకు వస్తా
చూస్తూండు వస్తా

Bhãskar Rãmarãju - తెలుఁగు ప్రేక్షకులు
మరీ ప్రేక్షకులై
చడీ చప్పుడు చేకుండా
మన కవితావేశపు
వరదలో
ప్రేక్షకులై
స్థాణువులై
అణువులై
శిల్పాలై
ప్రతిమలై
ఇలా చూస్తున్నారేంటీ
ఒక్క జై లేదు
ఒక్క మాట లేదు
ఒక్క ఉలుకు లేదు
ఒక్క పలుకు లేదు
బాగుందని లేదు
బాలేదని లేదు
చప్పట్లు లేవు
అసలు చేతులే లేవు.................................
[నిరసిస్తూ]

muralidhar namala - రామునితోక
గరుక్మంతుని ఈకా......

శేబ్బాసు రెండోసారి బాబు అందరూ కోరస్ ఇవ్వాలి.

రామునితోక
గరుక్మంతుని ఈకా......

ద్రౌపదికోక అద్గదీ
ద్రౌపదికోక

నే జంధ్యాల వారి మేకా ఆఆఆఆ.....

Bhãskar Rãmarãju - రామునితో ఇక
గరుత్మంతుని ఈక
గూర్చి నే మాట్టాడనిక
ఏవైతే అదైతుంది ఆనక
నేనేం చెప్పనిక

muralidhar namala - నేనుకూడా నిరసిస్తూ నీరసిస్తూ

kumar n - హ హ హ హ హాహ్ AWESOME!!! :-)))))))))))))))))))))
మైండ్ కొందరికే దొబ్బిందనుకున్నాను నిన్నటి వరకీ, ఈ దెబ్బతో అందరికీ మోతెత్తి పోవాల,
రండి రండి అందరూ, ఈ గోలలోమ్ మోతలొ ఊగిపోదాం :-)

Venu Srikanth Darla - కుమార్న్ గారు తగునా మీకిది.. ఇలా ఉసిగొల్పడమ్ న్యాయమేనా మీకిది తగునా అని ప్రశ్నిస్తున్నానధ్యక్షా....

Bhãskar Rãmarãju - ఏవిటయ్యా ఇది ముర్లీ
ఎక్కుడన్నారు ప్రేక్షకులు దొర్లి
కవితా వానలో తడిసి ముద్దై
ఆ వానటిలో పొర్లి!!

Venu Srikanth Darla - Jokes apart.. you aguys are awesome :-)))))))))

muralidhar namala - కవి కోరుకునేది చిటికెడు పసుపు డబ్బాడు కుంకుమా కాదన్నయ్యా.. నాలుగు చప్పట్లు రెండంటే రెండే ఈలలు

Bhãskar Rãmarãju - హహహ
Venu Srikanth Darla - అవి కోరుకునేది కవి కదా మురళి గారు.. మీకెందుకు దిగులు :-P :-)))

Bhãskar Rãmarãju - ముర్లి!!
విన్నావా వేణూ మాట
అదే అన్నాను ఆ పూట
వినకు వేణు మాట
అన్నానా పూట
వినలేదు నువ్వు నా మాట
ఇప్పుడు చూడు వారి మాట
నీది కవిత మాట
కాదట నీ మాట
ఒట్టి మూట అట నీ మాట

muralidhar namala - ఎంత మాటన్నారు వేణుగారు హమ్మా

ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జుగోళంలో

మేళాలు లేవు
తాళాలు లేవు
ఈ చర్చల్లో

కలాలు విరిగి
గళాలు కరిగి
తరాలుగా నినదిస్తున్నా

ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జుగోళంలో

Venu Srikanth Darla - అసలే గేయపు గాయలతో గిల గిల లాడుతున్నాం మీరు మరీ చెరోవైపునుండి ఇలా బాదేస్తే ఇంకేమంటాం.. మీరు కత్తి..సుత్తి.. తురుం.. ఎట్సె... చెలరేగిపోండి అంతే అడ్డేలేదు :-)

Bhãskar Rãmarãju - ఈలలు లేవు
గోలలు లేవు
ఈ బజ్జు కీకారణ్యంలో
చప్పట్లు లేవు
అరుపులు లేవు
ఈ కవితార్ణవంలో
*రగ్గుల్లేవు
బొగ్గుల్లేవు* [కీ.శే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలతో, వారి స్పూర్తితో]
ఈ నిశీధి నిద్రారణ్యంలో

muralidhar namala - నేను కవిని కాదంటే
అదరను బెదరను
నేను కవిని కాదంటే
అరవను కరవను

కవితలతో పొంగి
గేయాలుగా కురుస్తా
గుండెల్లోకి ఇంకి
గాయాలుగా నిలుస్తా.

Bhãskar Rãmarãju - అడ్డులేదంటూ
అడ్డులేడంటూ
అడ్డు తొలిగవా నేస్తం

నా కవితకు అడ్డే లేదంటూ
నా కవితకు అడ్డే లేడంటూ
నా కవితకు అడ్డు తొలిగావా నేస్తం

కానీ నా కవితకు అడ్డం
ఆ అడ్డు కాదు నేస్తం
నా కవితకు అడ్డం
పోత్సాహం లేకపోవడం నేస్తం

Bhãskar Rãmarãju - ఏంటి ముర్లీ
ఈ బజ్జేంటీ ఇలా ఉందీ?
ఏంటీ ఇంత నిశ్శబ్దంగా ఉందీ?
అమావాశ్య అర్థరాత్రిలా ఉందీ?
చిమ్మచీకట్లో గుమ్మనంగా పడుకున్నట్టుందీ?
రోహిణీకార్తె మిట్ట మధ్యాహ్నంలా ఉందీ?
దుప్పట్లో ముసుగుతన్ని నిద్రిస్తున్నట్టుందీ?
ఏంటి ముర్లీ?
ఈ బజ్జేంటీ ఇలా ఉందీ?

muralidhar namala - కవికి మనుజులెల్ల తోడురాకపోవు గాక
కవితకు జేజేలు లేకపోవుగాక
రావిగాంచని చోటు కవిగాంచు
చూచి ఊరకుండ శోధించు
శోధించి చేధించి కవితలుగా గర్జించు
ఎవ్వరాపగలరూ ఈ కవితా కంచు ఊఊఊ..

[కుమార్ గార్కి, మురళీధర్ నామాల గార్కి, వేణు శ్రీకాంత్ గార్కీ కృతజ్ఞతలతో]

Jun 22, 2011

వీడియో గేమింగులో క్రొత్త ఒరవడి

ఈ మధ్య ఓ మితృడి ఇంటికి వెళ్ళినప్పుడు, వారి పిల్లాడు సూరిగాడు కల్సి ఓ ఆటఆడుతుంటే చూట్టానికి నేనూ వెళ్ళాను. నన్నాశ్చర్యపరచిందా ఆట. బౌలింగ్ ఆట అది. ఆశ్చర్యపరచటాకి కారణాలు ఇవి -
ఇంతక మునుపు నేను ఆడిన చూసిన ఆటలన్నీ ఓ కుర్చీలోనో సోఫాలోనో కదలకుండా కూర్చుని, ఆట్టానికి రిమోటు చేతిలో పెట్టుకుని రిమోటుని మాత్రమే వాడుతూ ఆటలోని కారెక్టర్లను కదలించటం జఱుగుతుండేది. కానీ ఇక్కడ, ఓ చిన్న సెన్సర్ ఉంది ఓ మూల, అది మన కదలికలను పట్టి, ఆ ఆటలోని ఓ కారెక్టరుకి ఆపాదిస్తుంది. వావ్!! భేషైన ఆలోచన అనుకున్నాను. ఆశ్చర్యపోయాను. ఆ సెన్సరుని ఎక్సుబాక్సు వాడు కినెక్ట్ అంటాడు. ఆవేళ వాళ్ళు ఆడింది ఎక్సుబాక్సులో కినెక్టు ద్వారా బ్రున్స్విక్ ప్రొ బౌలింగ్. చాలా బాగా నచ్చింది నాకు. సూరిగాడిక్కూడా బాగా నచ్చింది.

ఇంటికి వచ్చాక, మరి మనవద్ద పి.యస్ త్రీ కదా ఉంది, దానిక్కూడా ఇలాంటి ఇంటరాక్టివ్ గేమింగ్ టూల్స్ ఏవన్నా ఉన్నయా అని కొట్టాను గూగుల్లో.
ప్లేస్టేషన్ త్రీ కోఱకు , మరియూ మూవ్ మోషన్ కంట్రోలర్ అని ఒక సెట్టు కనిపించింది.
PlayStation_Eye.png
PSMove.png
 ఇదేదో బాగుందే అనుకుని వెతగ్గా వెతగ్గా ఓ బండిల్ దొరికింది అమెజాన్లో. పియస్ త్రీ మూవ్ + ఐ + స్పోర్ట్స్ ఛాంపియన్స్ బండిల్. సామ్స్ క్లబ్బులో ఏదోక డీల్ ఉంటే కొట్టేసా మొత్తానికి. ఇంటికెత్తుకెళ్ళంగనే టివీ మీద ఇ ని పెట్టా. స్పోర్ట్స్ ఛాంపియన్స్ గేమ్ డివిడి పీయస్ త్రీలో పెట్టా. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్కుంది. ఆట్టం మొదలెట్టా.
ఈ స్పోర్ట్స్ ఛాంపియన్సులో మొత్తం ఆర్ ఆటలు ఉన్నాయి.
255px-Sports_Champions.png
టేబుల్ టెన్నిస్ (పింగ్ పాంగ్)
బీచ్ వాలీబాల్
గ్లాడియేటర్
డిస్క్ గోల్ఫ్
బాచి
ఆర్చెరి

టెబుల్ టెన్నిస్ నన్ను భలే ఆకట్టుకుంది. ఎంత ఇంటరాక్టివ్ అంటే అంత. నిజ్జంగా టిటి ఆడిన ఫీలింగ్ వచ్చింది. మరోమాట, చెమటలు కక్కేలా ఆడుతున్నా. అదీ ముఖ్యమైన విషయం.
ఇక బీచ్ వాలీబాల్ కూడా చాలా బాగుంది. అనఘ నేనాడతా నేనాడతా అని దూకుతున్నది.
సూరిగాడికి ఫ్రిస్బి డిస్క్ గోల్ఫ్ బాగా నచ్చింది. తెగ ఆడ్డుతున్నాడు.
ఇక ఆర్చెరి భలే ఇంటరెస్టింగా ఉంది. ఐతే ఆర్చెరి ఆట్టానికి రెండు మోషన్ కంట్రోలర్స్ కావాలి. ఒకటి సంధించేది, రెండోది ఎక్కుపెట్టేది. సూరిగాడికి ఇదికూడా నచ్చింది. ఐతే ఇంకాస్త పెద్దైతేగానీ పూర్తిగా అర్థం అవ్వదు+కంట్రోల్ రాదు.
గ్లాడియేటర్ ఆట
Sports_Champions_Gameplay.jpg
గ్లాడియేటర్ అంటే కత్తి యుద్ధ వీరుడు అనగా కత్తుల కాంతారావ్ అన్నమాట. ఈ ఆటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆడితే చక్కటి కార్డియో గేం అవుతుంది.

వీడియో గేమ్స్, పొట్టకదల్దు ఇత్యాదివి అనుకునేవారు ఈ ఆటని తప్పక ప్రయత్నించాలి.

Jun 16, 2011

ఆమరణదీక్షలో అమరుడైన ఓ స్వామిజీ

ఆమరణదీక్షలో అమరుడై!
గంగను కాపాడే పోరాటంలో

114వ రోజు కన్నుమూసిన స్వామిజీ

డెహ్రాడూన్‌, న్యూఢిల్లీ
భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగానదిని కలుషితం చేస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని, కుంభమేళా జరిగే ప్రాంతంలో నెలకొల్పిన కంకర మిల్లులను తరలించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరాంచల్‌లోని హరిద్వార్‌లో నాలుగు నెలల క్రితం ఆమరణదీక్షకు దిగిన స్వామి నిగమానంద్‌ డెహ్రాడూన్‌లోని హిమాలయన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం 114వ రోజు మరణించారు. నల్లధనంపై ఆమరణదీక్షతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబా రామ్‌దేవ్‌ ఇదే ఆస్పత్రిలో దీక్ష విరమించారు. రామ్‌దేవ్‌ దీక్షకు అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశం నలుమూలల నుంచి ప్రముఖులను పిలిపించి దీక్ష విరమింపజేసిన ఉత్తరాంచల్‌ ప్రభుత్వం నాలుగు నెలలుగా నిరాహారదీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో అదే ఆసుపత్రిలో చేరిన నిగమానంద్‌ను పట్టించుకోలేదన్న విమర్శకు గురైంది.







రాజకీయ సన్నాసుల్ని, రాజకీయ స్వామీజీలనూ పొడవలేని పక్షులు ఏంజేస్తయి? సన్నాసులు స్వామీజీలు అంటూ అందర్నీ ఒకేదాటన కట్టేసి, ముక్కుతో పొడుస్తయి. అసుమంటి పక్షులు/ ఆ పక్షి రెట్టలు ఏరుకుని నెత్తినేస్కునే కుంకలూ ఈ వార్తజూసి ఏడ్చుకోవచ్చు. దమ్ములుంటే, అంత నీతీ నిజాయితీ ఇంటే వాళ్ళూ అంతర్జాలంలో విషాన్ని చిమ్మటం ఆపి, దేశానికి మేలు చేసే దిశలో ఏదోక సాంఘీకాంశంపై నిరాహార దీక్షబూని మమ్మల్ని(సాధారణ జనాల్ను) దేశాన్ని ఉద్ధరించాలని సవాలు చేస్తున్నాను.

ప్రతీ త్యాగాన్ని, ప్రతీ పోరాటాన్నీ రాజకీయం చేసే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం, మనబ్రతుకులు ఇంతేనని గుర్తించేలేని జనాన్ని చూసి బాధగా ఉంది. ఉలుకు పలుకు లేనందుకు కోపంగా ఉంది. కీ.శే నిగమానంద్ ఇలాంటి ఓ సత్యాగ్రహాన్ని మొదలెట్టారని సదరు ఈనాడు వారూ ఎక్కడా వార్తే వేయలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకేసారో నాకైతే అర్థం కాలేదు. పచ్చి స్వార్థపరులు బాబాయ్, పచ్చి స్వార్థపరులు. ఛీఛీ

Jun 14, 2011

తెలుగులో ప్రభుత్వ వెబ్‌సైట్లు

ఇకపై 'అంతర్జాలం'
తెలుగులో ప్రభుత్వ వెబ్‌సైట్లు
ఏక సంకేత లిపిలో సభ్యత్వం!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించనున్నారు. ఇక నుంచి ప్రతి వెబ్‌సైట్‌ ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు అంతర్జాలం (ఇంటర్నెట్‌) అమలు కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏక సంకేత లిపి (యూనీకోడ్‌)లో ఇప్పటికే ఎన్నో భాషలు సభ్యత్వం తీసుకున్నాయి. దేశంలో తమిళానికి సభ్యత్వం ఉంది. తాజాగా తెలుగు భాషకు ఏక సంకేత లిపి సమాఖ్య (యూనీకోడ్‌ అథారిటీ)లో సభ్యత్వం తీసుకునేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. దీంతో తెలుగు అక్షర, పదాలు, సంఖ్యలు, అర్థాలకు సంబంధించిన సంకేతాలు(కోడ్‌), అనువర్తనాలు (అప్లికేషన్లు) అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. ఏక సంకేత లిపి సమాఖ్య సమావేశాలకు రాష్ట్రం తరఫున హాజరయ్యే అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడుగా రాష్ట్రంలో వెబ్‌సైట్లకు ఒకే రకమైన ప్రమాణాలు రూపొందించనున్నారు. సెర్చింజన్‌లో తెలుగు భాషలోనూ వెబ్‌సైట్లు సెర్చ్‌ చేయడానికి వీలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బాగుంది. అత్భుతమ్. ఆహ్వానించతగ్గది. ఐతే, ఈ తెలుగీకరణ ప్రహసనంలో ఆంగ్లంనుండి తెలుగుని పుట్టించే ప్రమాదం లేకపోలేదు. అలా ఐతే, ఒక్క పదం కూడా అర్థం కాక జనాలు బుర్రలు నేలకేసి కొట్టుకునే ప్రమాదం ఉంది.
తెలుగు పదాలను ఉన్నవి ఉన్నట్టు వాడటం ఒకెత్తు, ఆంగ్లపదాలను తెలుగులోకి మార్చటం మరో ఎత్తు.
అనువర్తనాలు = అప్లికేషనులు.
బ్రౌన్ నిఘంటువులో అనువర్తనము అంటే -
అనువర్తించు (p. 0057) [ anuvartiñcu ] anu-vartinṭsu. [Skt.] v. a. To attend on, serve, follow, court one's favour. అనుసరించి నడచు. అనువర్తనము n. Serving or following another.
గ్విన్ నిఘంటువు ప్రకారం
anuwartanam

anuwartanam n. application

బూదరాజు గారి నిఘంటువులో
అనువర్తనము అంటే అప్లికేషన్ అని ఉన్నది.

సాధారణ వాడుకదారు నిఘంటువులను అనుక్షణమూ అందుబాటులో ఉంచుకోలేడు.
వెబ్సైట్లలోని పదాలను ఎవరు ఎలా స్టాండర్డైజ్ చేస్తారు? అనేది పెద్ద ప్రశ్నే అని నా అభిప్రాయం.

తెలుగు అంతర్జాల అమలు కోసం నియమింపబడ్డ కమిటీలో వీవెన్ గారికి చోటు దక్కటం గొప్ప విషయం వీవెన్ గారికి అభినందనలు. వారు శక్తికొద్దీ పనిచేసి చక్కటి ప్రమాణాలతో తెలుగు అంతర్జాలాన్ని అభివృద్ధి చేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారికి నాతరఫునుండి పూర్తి మద్దతుని బ్లాగ్ ముఖంగా ప్రకటిస్తున్నాను. వీవెన్ గారూ ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నన్ను సంప్రదింప వలసిందిగా కోఱుతున్నాను.

Jun 12, 2011

జ్ఞాపకాల దొంతర : జిందగీభీ ఏక్ నషాహై దోస్త్ జబ్

సోనీ టీవీలో ఎక్స్ ఫాక్టర్ అనే ఓ ప్రోగ్రాములో ఓ పెద్దాయన ఈ పాట పాడాడు.
din Dhal jaaye haay, raat naa jaay

    * Movie: Guide
    * Singer(s): Mohammad Rafi
    * Music Director: S D Burman
    * Lyricist: Shailendra Singh
    * Actors/Actresses: Waheeda Rehman, Dev Anand
    * Year/Decade: 1965, 1960s

Back to: main index
View: Plain Text, हिंदी Unicode, image


दिन ढल जाये हाय, रात ना जाय
तू तो न आए तेरी, याद सताये, दिन ढल जाये

प्यार में जिनके, सब जग छोड़ा, और हुए बदनाम
उनके ही हाथों, हाल हुआ ये, बैठे हैं दिल को थाम
अपने कभी थे, अब हैं पराये
दिन ढल जाये हाय ...

ऐसी ही रिम-झिम, ऐसी फ़ुवारें, ऐसी ही थी बरसात
खुद से जुदा और, जग से पराये, हम दोनों थे साथ
फिर से वो सावन, अब क्यूँ न आये
दिन ढल जाये हाय ...

दिल के मेरे तुम, पास हो कितनी, फिर भी हो कितनी दूर
तुम मुझ से मैं, दिल से परेशाँ, दोनों हैं मजबूर
ऐसे में किसको, कौन मनाये
दिन ढल जाये हाये ...

ఈ పాట నాకు భలే ఇష్టం. ఆరోజుల్లో రూములో ఉండేప్పుడు కీ.శే శ్రీ మహమ్మద్ రఫీ గారి పాటలు అలా పెట్టుకుని, కోరస్లో పాడుతూ, డిమ్ము లైటులో ఆనందించేవాళ్ళం నేనూ నా మిత్రుడు నరేంద్ర. జ్ఞాపకాలను తాజా చేసిందీ పాట
జిందగీభీ ఏక్ నషాహై దోస్త్ జబ్ ఛడ్ తాహై తో పూఛో మత్ క్యా ఆలమ్ రెహతాహై, లేకిన్ జబ్ ఉతర్ తా హై.............
ఈ పాటకి ముందు దేవానంద్ గారి చాలా ఖ్యాతి పొందిన డైలాగులు పైవి.
ఇక్కడ చూడచ్చు ఈ పాటని
http://youtu.be/xJuK5K0zCa0

Jun 10, 2011

రాందేవ్‌ ఆస్తి ఎంతా?

రాందేవ్‌ ఆస్తి రూ.1100 కోట్లు
వెల్లడించిన బాబా సహాయకుడు
క్షీణిస్తున్న యోగాగురువు ఆరోగ్యం
హరిద్వార్‌: బాబా రాందేవ్‌ నెలకొల్పిన నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్లపైనే ఉంది. వీటిలో దివ్యయోగ మందిర్‌ ట్రస్టు రూ.249.63 కోట్లు, పతంజలి యోగపీఠ్‌ ట్రస్టు రూ.164.80 కోట్లు, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు రూ.9.97 కోట్లు, ఆచార్యకుల్‌శిక్ష సంస్థాన్‌ రూ.1.79 కోట్ల మూలధనాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు ఏర్పాటైనప్పటి నుంచి అయిన వ్యయం రూ.751.02 కోట్లు. మొత్తమ్మీద ఈ నాలుగు ట్రస్టుల విలువ రూ.1100 కోట్ల పైనే. బాబా సహాయకుడు బాలకృష్ణ గురువారం ఈ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 'మేము పనిలోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకతను పాటిస్తాం. ఆదాయం ఎంత? ఖర్చు ఎంత అయింది? ఎలా అయింది? వంటి వివరాలన్నీ కచ్చితంగా నమోదు చేస్తాం' అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము పన్ను కడతామని, తమ అనుబంధ సంస్థల వివరాలను కంపెనీల రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తీసుకోవచ్చన్నారు. పన్ను వివరాలు, ట్రస్టుల బ్యాలెన్స్‌ షీట్లను తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేశామన్నారు. బాబారాందేవ్‌ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించారు.

నాదొక ప్రశ్న -
ఈ వార్తాశీర్షిక *రాందేవ్ ఆస్తి* అని వ్రాసారు. వార్తలోకి వెళ్తే, ఆయన ట్రస్టుల ఆస్తులు అంటున్నారు. ఏవిటీ ఇదీ? ఆయన ఆస్తి వేరే ఆయన ట్రస్టు ఆస్తి వేరే కాదా?

Jun 1, 2011

పోరాడాలె, నిజ్జం! పోరాడకపోతే మెత్కుదొర్కని దినాలు!

ఒక ప్రసంగం
ఒక మాట
ఒక పాట
ఒక బాట
మడుసుల్ని గుడ్డోళ్ళను సేస్తాయంటే
నే నమ్మలా
తెలంగాణా వచ్చుడుకీ
పంట బీడుపోటానికీ
మోకాలుకీ
బోడిగుండుకీ
యాడా సంబందం?
పోరాడాలె
నిజ్జం
పోరాడకపోతే
మెత్కుదొర్కని
దినాలు
ఆ మెత్కులు
దోసే రాజకీయ నాయకులు
రాజకీయ నాకొడ్కులు
నిన్ను కరెంటు బుగ్గకి
ఏల్లాడదీస్చాన్నారు
రాజకీయ బలిమితో
రాజకీయ సొర్థంతో
రాజకీయ కుట్రలతో
రాజకీయం కోసరం
ఆవేశపు
ప్రసంగం
మాట
పాట
బాట
రాపిస్చన్నారు
లెగు లెగు, పోరాడు
సొర్థపు రాజకీయ నాకొడుకుని
సంపేసేయ్
నీలోని
సమాజామ్లోని
మడిసిలోని
సోర్థపు రాజకీయనాయకున్ని
సంపేసేయ్
వెయ్యి తెలంగాణాలు ఒస్తై
వెయ్యి భారతదేశాలు ఒస్తై
అవే ఒస్తై
ఏ తమ్ముళ్ళానూ బలిచ్చే పనిలా
ఏ అన్నలనూ సంపేసే పనిలా
ఏ బస్సులనూ తగలనూకే పనిలా
ఏ జీవితాలనూ కాలరాచే పనిలా
లెగు లెగు.......

May 26, 2011

ఈ వార్త చూసారా?

వార్త అటుంచితే, ఆ బొమ్మమాత్రం నన్ను కదిపేసింది. భారతదేశం కర్మభూమి, అదీ ఇదీ అని చెప్పుకోటానికే అని మరోమారు రుజువైంది.

ఆడపిల్లా.. అంతుచూస్తారు!
ఏ మాత్రం తగ్గని భ్రూణ హత్యలు
గర్భస్రావాలతో కడతేరుస్తున్న వైనం..
సంపన్నులు, విద్యావంతుల్లోనే ఎక్కువ
2011 లెక్కల్లో తగ్గిన బాలికలు
న్యూఢిల్లీ
డుపులో పడిన నలుసు ఆడపిల్లని తేలితే చాలు.. మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఈ దురాచారం మరింతగా పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య క్రమంగా దక్షిణ భారత్‌లోనూ అదేస్థాయిలో విస్తరిస్తున్నట్లు వెల్లడైంది. ఆడపిల్ల అనే కారణంతో దేశంలో గత మూడు దశాబ్దాల కాలంలో 42 లక్షల నుంచి 1.21 కోట్ల గర్భస్రావాలు జరిగినట్లు తేలింది. తొలి సంతానంగా ఆడపిల్లను కలిగిన సంపన్నులు, విద్యావంతులు సైతం.. రెండోసారి గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు గుర్తిస్తే గర్భస్రావం చేయించుకున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ తరహా గర్భస్రావాలు 1980 నుంచి 2010 వరకూ 42 లక్షల నుంచి 1.21 కోట్ల దాకా జరిగి ఉంటాయని 'లాన్సెట్‌'లో ప్రచురించిన అధ్యయనంలో వివరించారు. బాలురు, బాలికల నిష్పత్తిలో సైతం గణనీయ మార్పులు వచ్చినట్లు నిర్ధరించారు. ఇలాంటి గర్భస్రావాలు సర్వసాధారణంగా జరిగే రాష్ట్రాల్లోనే దేశ జనాభా ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని టొరంటో విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రభాత్‌ఝా తెలిపారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు జనగణన, జాతీయ సర్వేలను పరిశీలించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఆరేళ్లలోపు చిన్నారుల్లో బాలురతో పోలిస్తే 71 లక్షల బాలికలు తక్కువగా ఉన్నారు. 2001 జనాభా లెక్కల్లో 60 లక్షల మందే తక్కువగా ఉండగా తేడా గణనీయంగా పెరిగింది. కుమారుడే ఉండాలనే నిర్ణయం వల్లే ఇలా స్త్రీ పురుష నిష్పత్తిలో భారీ తేడాకు కారణమవుతోందని వివరించారు. అల్ట్రాసౌండ్‌ సౌకర్యాలు అందుబాటులోకి రావడం, ఖర్చుపెట్టే సామర్థ్యం పెరగడం వంటివి ఇలాంటి గర్భస్రావాలకు కారణమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

అమెరికాలోనూ మారని మనవాళ్లు..
బోస్టన్‌: అమెరికాలో ప్రవాస భారతీయ మహిళలు సైతం.. కడుపులో ఆడపిల్ల ఉన్నట్లు తేలితే గర్భస్రావాలు చేయించుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించారు. కుటుంబ ఒత్తిడుల కారణంగానే ఈ పనికి ఒడిగడుతున్నట్లు తేలింది. భారత్‌లో మాదిరిగా కాకుండా లింగనిర్ధరణ పరీక్షలు అమెరికాలో చట్టబద్ధం కావడంతో ఈ పని మరింత తేలికవుతోంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 2004 నుంచి 2009 వరకు ఈ పరిశీలన చేపట్టారు. గర్భంలో ఆడబిడ్డ ఉన్నట్లు నిర్ధరణ జరిగినప్పుడు 40 శాతం మంది మహిళలు గర్భస్రావం చేయించుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ మహిళల్లో సగం మందికి ఉద్యోగాలు ఉండగా, చాలామంది ఉన్నత విద్యావంతులేనని తేలింది. గర్భంలో ఆడపిల్లను మోసే మహిళలు ఇళ్లలో తిట్లు, దెబ్బలకు గురవుతున్నట్లు గుర్తించారు. అత్త, భర్తల నుంచే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశీలించిన మహిళల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చినవారూ ఉన్నారు.



May 10, 2011

పాప్ అప్ పుస్తకాలు

ఎప్పుడు గ్రంథాలయానికి వెళ్ళినా నాన్నా పాప్ అప్ పుస్తకాలు నాన్నా తీస్కుందాం నాన్నా అంటుంటాడు సూర్య. వద్దులేరా నాన్నా చెల్లి లాగేసి చింపేస్తే కష్టం కదా అని వారిస్తుంటాను. నిన్నటి వారాంతం గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు, పద నాన్నా ప్లీజ్ అన్నాడు. సరేరా పదా అని పాప్ అప్ పుస్తకాల గదికి వెళ్ళాం.
అక్కడి లైబ్రేరియన్
"ఏం కావాలయ్యా"
"పాప్ అప్ పుస్తకాలు కావాల"
"తప్పకుండా. మావద్ద ఓ యాభై దాకా ఉన్నాయి పాప్ అప్ పుస్తకాలు"
"ఓహో ఏవిటీ మీ పాలసీ"
"ఇక్కడ కూర్చుని చక్కగా చూస్కుని తిరిగి ఇచ్చేసి వెళ్ళటమే పాలసి"
"ఓహ్ అలాగా"
సూరిగాడితో
"అరేయ్ ఇంటికి ఇవవ్వరుట, ఇక్కడే చూసి ఇచ్చేయాలట సరేనా"
ఆమెతో "హ్మ్ బాగుంది ఐతే ఏవేం పుస్తకాలున్నాయో చూపండి"
ఆమె పుస్తకాల గదికి దారితీసింది, వెనకాతలే మేమూ వెళ్ళాం
పాప్ అప్ పుస్తకాలు ఒక నిర్బంధ గదిలో ఉన్నాయి. తాళం తీసి లోపలకి ఆహ్వానించింది. ఒక అల్మరా మొత్తం అవే.
మనవాడి కళ్ళు మరి దేవుళ్ళాడే కళ్ళు కదా [సెర్చింగ్ ఐస్] వెనువెంటనే ఓ రెండు పుస్తకాలను ఇట్టే పట్టేసాడు. డైనోసరస్ పాప్ అప్ పుస్తకం, మరియూ అండర్ వాటర్ పాప్ అప్ పుస్తకం.
అన్న రెచ్చిపోతే చెల్లి వెనకడుగు వేస్తాయ్? నెవ్వర్
తింకబెల్ తింకబెల్ అన్నది. లైబ్రేరియన్ వెంటనే ఏదో ప్రిన్సెస్ పాప్ అప్ పుస్తకం ఇచ్చింది.
ఏమాటకామాట, పాప్ అప్ పుస్తకాలు తయ్యారు చేయటం అంత సుళువు కాదు. ఎంతో కళాత్మకత ఓర్పు అవసరం. వాడివద్ద రెండు మూడు పుస్తకాలు ఇంతక ముందే ఉన్నా ఇప్పుడు చూసినవి మాత్రం అత్భుతమైనవిలా తోచాయి
వాడి రెండు పుస్తకాలు కేరింతలు కొడుతూ చూసాడు. అయ్యాక ఇచ్చేసి పిల్లలపుస్తకాల గదివైపుకి నడిచాం అందరం
కొన్ని ఫోటోలు ఇవిగో

May 4, 2011

ఏవిటో ఈ వార్తలు, వార్తాపత్రికలు

నిన్న ఈనాడులో ఈవార్త నన్నాశ్చర్యపరిచింది. లాడేన్ని మట్టుబెట్టారన్న వార్తాపరంపరలో, అమెరికాలోని అందరూ పాకిస్థాన్నీ, పాకిస్థాన్లో లాడెన్ దొరకటాన్నీ ప్రశ్నిస్తుంటే, అలానే ఫరీద్ జకారియాని కూడా డిస్కషన్ లోకి లాగి ప్రశ్నిస్తుంటే ఈనాడు వాడేవిట్రా ఇలా రాసాడు అనుకున్నాను.

ఇక ఈరోజు వార్త
ల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌లాడెన్‌ పాకిస్థాన్‌ గడ్డపై హతమవడంతో ఇప్పుడు అందరి చూపులూ ఆ దేశంపైకే మరలాయి. అమెరికా సైతం అనుమానంగానే చూస్తోంది


ఏవిటీ ఈ వార్తాశ్రవంతులు? ఏవిటీ వీరి లక్ష్యాలు?
మొన్నటికి మొన్న ఇలా వేసాడు
అక్బరుద్దీన్‌ దాడిని ఖండించిన చంద్రబాబు
కడప: ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న అక్బరుద్దీన్‌పై దుండగులు దాడి జరపడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఒవైసీపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

రెండు విభిన్న అర్థాలు ఒకే వార్తలో
From May 1, 2011

May 3, 2011

లాడెన్ వీరికి వేగుచుక్క

తెగిపడిన నా దేశపౌరుల దేహాలు
జివ్వున ఎగసి పడిన నిస్సహాయ కాయపు రగతం
ఏమి జఱుగుతుందో కూడా ఏమాత్రమూ ఎఱుగని అమాకయ ప్రాణులు
అమాయక ప్రాణుల ప్రాణాలు
మీ కంతలు బూడ్చుకోండిరా కొడకల్లారా అని
బిలియను డాలర్లు ఏడాదికి ఉచితింగా అందిస్తుంటే
బొక్కి తిని
కసాయి వనాల్ని పెంచుకుని
అమాయకుల్ని కొని
వారికి తర్ఫీదులిచ్చి
దొరికిన నావలల్లోకి ఎక్కించి
చేతికో తుపాకినిచ్చి
కనిపించిన అమాయకులను తూట్లు తూట్లుగా
తునాతునకులుగా కాల్చేయమని
బాంబులతో పేల్చేయమని
ఇదే అల్లాకి సేవయని
ఇదేరా బిడ్డా అల్లాకి సేవయని
కల్లబొల్లి కబుర్లతో
లేత ఆవేశాలను అల్లకల్లోలానికి గురిచేసి
భరతమాత గుండెల్లోకి చొచ్చుకొచ్చిన
భరమాత బిడ్డలను కొన్న
అల్ ఖైయిదా సంస్థ పెద్ద
ఒసామా బిన్ లాడెన్
కొందరికి ముద్దుబిడ్డ
కొందరికి వేగు చుక్క
నా దేశ పౌరుల రక్త సాక్షిగా
ఈ కుక్క, నా దేశపు కొందరికి వేగుచుక్క
రేపొద్దున కసబ్ వీరికి వేగుచుక్క
వ్రేళ్ళాడదీయండీ నా దేశపు విలువలను
సెక్యులర్ భూతాలను
తలక్రిందులుగా వ్రేళ్ళాడ దీయండీ
వెన్నుముక విరిగిన నా దేశ ప్రజల్ని
తునాతునకులుగా నరికి
తూట్లుతూట్లుగా కాల్చి
తలక్రిందులుగా వ్రేళ్ళాడ దీయండీ
ఈ వెన్నెముక లేని నా జనాన్ని

Apr 28, 2011

ఆఫీసు కబుర్లు

మా డెవలప్మెంట్ లీడ్ బాబ్ గాడు నా సీటు దగ్గర ఆగి -
"భాస్కర్ ఈ బ్లూబెర్రి పై తింటావా"
"ఏం బెర్రీ? బులుగు బెర్రీయా?"
"ఔను భాస్కర్! బులుగు బెర్రీనే. రెండు ముక్కలే మిగిలాయి. మరింక నీ ఇష్టం"
అంతలో గస్ అగాడు నా సీటు దగ్గర
"బాగుంది బాబ్ పై"
"నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటివి చేస్తుంటుంది. తనకు ఆటిజం ADHD - Attention deficit hyperactivity disorder. తనని తాను బిజీగా ఉంచుకోటం కోసం ఇలా"
"ఇవ్వు నాకూ ఓ ముక్క బాబ్" [నేను]
ఓ కాయితపు సిబ్బిరేకులో పెట్టి ఇచ్చాడు
అందరూ ఎవరి సీట్ల దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయారు.
రుచి చూద్దాం అని నేనూ ఓ ముక్కని నోట్లో వేస్కున్న.
బాగనే ఉంది.
ఆటిజం ఉన్న అతని స్నేహితురాలు నిజీగా ఉంటంకోసం ఇలా వంటలు గట్రాలతో బిజీగా ఉంటున్నది. హ్మ్. ఇంటరెస్టింగ్ అనుకున్నాను.


గస్ అనేవాడికి మొన్న మోకలికి ఏదో చిన్న సర్జరి అయ్యింది. ఈవేళనే వచ్చాడు ఆఫీసుకి పునఃప్రవేశం అన్నమాట. మరి వెళ్ళి పలుకరించాలి కదా? వెళ్ళాను. అడిగాను. ఏవిటి తాతయ్యా ఎలా ఉన్నావూ అని. బాగనే ఉంది అని తతంగం ఎలా జరిగిందీ ఏవిటీ చెప్పకొచ్చాడు. మాటల మధ్యలో నీ లాస్ట్ నేం ఎలా పలకాలీ అన్నాడు. గస్ అంటే వాడు మెహీకన్ అన్నమాట, ఇస్పాన్యుల్. వాళ్ళకి జ=హ అన్నమాట. Jose అంటే హొసె అని. San Jose సాన్ హొసె అని. రామరాహు అనుకుంటున్నాడు పాపం తాతయ్య. కాదయ్యా, మీకులాగా మాకు ఇలా జ ని హ అనటాలు ఉండవు. మా భాష ఇండో యూరోపియన్ భాషలకు మూల భాష అయిన సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది. మకు యాభైఆరు అక్షరాలు ఉన్నాయీ, క్రిస్టల్ క్లియర్ గా ప్రతీ మాటా పల్కుతామూ అని చెప్పకొచ్చాను. రామరాజు అని సుస్పష్టంగా చెప్పాను. మరి మన ఆఫీసులో రాజ్ ఉన్నాడుకదా అతని లాస్ట్ నేం నాకు నోరు నో తిరుగ్స్ అన్నాడు. అతని లాస్ట్ నేం సోమసుందరం అని చెప్పి, తతయ్యా, అతను తమిళ్స్. నేను తెలుగ్స్. మావి పక్క పక్క రాష్ట్రాలు. మాకు యాభైఆరు అచ్చరాలుంటే వాళ్ళకి పట్టుపని ముఫై కూడా లేవు (మొత్తం ముఫై ఒకటి అనుకుంటా). వాళ్ళు మా రాష్ట్రం వస్తే జుట్స్ పీక్స్. మేము వారి రాష్ట్రం వెళ్తే జుట్టు పీక్స్. ఒక్క ముక్క కూడా అర్థం కాదయ్యా అంటే ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాడు. లాస్ట్ నేం పోర్వోత్తరాలు ట్రడిషన్ని బట్టి మారుతుంటాయబ్బా అని చెప్పుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ నేం అనేది మగపిల్లవాడికి స్టాటిక్ అంటే మారదు. కానీ తమిళులకు తండ్రిపేరు లాస్ట్ నేం అవుతుంది నాయనా అని చెప్పాను. అలానే, భారత దేశంలో కులాలను కూడా పేర్లో పెట్టుకుంటారు అని చెప్పకొచ్చాను. ఈ కులాల గొడవేందిరో అన్నాడు పాపం తాతయ్య కదా. తెలియదు కదా. వృత్తుల్ని బట్టి ఏనాడో జరిగిన కేటగొరైజేషన్ అని చెప్పి, అయ్యా, మనుషులు కోతుల జాతికదా. మంకీయింగ్ చేసేసారులే నాయనా అని కూడా చెప్పాను.
కులాలు వర్గీకరణ వాటిపై సరైన అవగాహన లేకుండా వికీలోనో లేక ఏ తెల్ల తొండయ్యో నల్ల నండయ్యో తెలిసీ తెలియకుండా రాసిన సో కాల్డ్ చరిత్రని చదివి మీరు ఇల అటకదా మీరు అలా అట కదా అని కొన్ని రకాల కళ్ళద్దాలతో కొన్నిరకాల ఇజాలను తలకెక్కించుకుని చూస్తారు మాట్లాడతారు చాలా మంది. అలాంటివారు ఇజాలతో మాత్రమే చరిత్రను చూస్తారు. అందుకని చివరికి అతినికి ఇలా చెప్పా చివరికి -
చరిత్రని సాధ్యమైనంత న్యూట్రల్ దృష్టితో చదవాలి. ఏ చరిత్రనైనా. బైయాస్డ్ గా చదివితే చరిత్రలో చదివేవాడి ఇజపు కోణమే కనిపిస్తుంది. ఉదాహరణకు, నిన్న రాత్రి పిబియస్ ఛానల్లో నాజ్సిల యూదు ఊచకోత చూపించాడు. వెర్బ్ మరియూ వెట్జలర్ అనే స్లొవక్ యూదులు నాజ్సిల Auschwitz death camp నుండి ఎలా తప్పించుకున్నారో చూపించాడు. ఆ గాస్ ఛాంబర్స్, వాటిలో చూపిన శవాల గుట్టలు, స్లావెక్ నుండి వచ్చే యూదులను అట్నుండి అటే గాస్ ఛాంబర్లోకి తరలించి మట్టుపెట్టటం ఇట్లాంటివి చూపించాడు. ఐదేళ్ళలో ౫.౬ మిలియన్ అంటే యాభైఆరు లక్షల మంది యూదులను మసిచెసారు నాజ్సీలి.
బయాస్డ్ గా చదివితే జర్మనులను కనీసం స్పృశించను కూడా స్పృశించలేము. వారు చేసిన దమనకాండకు వారితో కనీసం మాట్లాడలేము.  సో, చరిత్రని చూసేప్పుడు యూదుల కళ్ళద్దాలు పెట్టుకు చూస్తే చరిత్ర చదవగలమా? సానుభూతి వేరే. ఏ ఇజమూ లేకుండా చదవాలి అని చెప్పుకొచ్చాను. ఆ మాటకొస్తే అమెరికన్లు చేసిన దమన కాండని కూడా ఉటంకించాను. ఈవేళ అమెరికన్ జనాభాలెక్కల్లో ఒక్కశాతానికి పడిపొయ్యారు నేటివ్ అమెరికన్స్ అని చెప్పకొచ్చాను. అలానే మా హిందూ జాతి, అధోపాతాళంలోకి నెట్టబడింది. కనీసం యూదు ఊచకోత కనుచూపుమేర చరిత్రలో జరిగింది. లెక్కా పత్రం అంటూ పుటల్లోకి ఎక్కించారు. వెయ్యేళ్ళనాడు మాపై దండెత్తిన ఛంఘీజ్ ఖాన్ సంతతి ఎన్ని తలలను కొట్టేసిందో ఎన్ని ప్రాణాలను బలి తీస్కుందో ఎందరు పొయ్యరో ఎన్ని దోపిడీలు జరిగాయో ఎక్కడా ఏ చరిత్రలోనూ లేదు, లిఖింపబడలేదు, లిఖించేవారే లేరు, లిఖించటానికి పుస్తకాలు లేవు. అంతే కాదయ్యా తాతయ్య ఆతర్వాతి బ్రిటీషువారు ఏమాత్రమూ తక్కువకాదు బాబూ. అని చెప్పకొచ్చాను.

అదన్నమాట.

Apr 26, 2011

బఱువు తగ్గటం ఎలా?

బఱువు తగ్గటం ఎలా?
భలే ప్రశ్న కదూ?
బఱువు తగ్గటం ఎలా అనే ప్రశ్నకన్నా ముందు, అసలు బఱువు ఎందుకు తగ్గాలనుకుంటన్నా? అనేది కూడా మాంచి ప్రశ్నే.
బఱువు తగ్గటానికి ముందు ఎందుకు తగ్గాలి ఎంత తగ్గాలి అనేవి తెల్సుకోవాలని నా అభిప్రాయం. దానికొఱకు నువ్వు ఏ బ్రాకెట్లో ఉన్నావో లేక ఏ కేటగిరీలో ఉన్నావో తెలుసుకోవాలి. అంటే అధిక బఱువా? సన్నవా? లావా? ఇట్టాంటివి.
ముందు ఎందుకు తగ్గాలి అనేది ప్రశ్న.
ఎందుకూ అంటే -
ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే డేంజరు అని తెలుసుకోవాలి. సరదాగా గూగుల్ని అడుగినా *బఱువెందుకు తగ్గాలా?* అని. ఎంటనే ఈ లింకు కొట్టింది గూగులు - http://www.americanheart.org/presenter.jhtml?identifier=3040449
ఎందుకు బఱువు తగ్గాలా అంటే అందంగా కనిపిచ్చటం కోసం కాదట గురూ, కానీ ఆరోగ్యం కోసమట.
బఱువు పెరగటం వల్ల సావుని తెచ్చిపెట్టుకున్నట్టేట.
౩౦-౬౦ మధ్యన ఉన్నవాళ్ళలో రెండు మూడు కిలోల అధిక బఱువు కూడా ఒక్కోసారి డేంజరపాయంట.
ముఖ్యంగా, మూడు-తొమ్మిది కిలోల అధికబఱువు వెనువెంటనే టైప్-౨ మధుమేహానికి దారితీస్తుందట.
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎనభైశాతం మంది అధికబఱువుతో ఉన్నవారేట.
---------------ఇంకచాలు. రాస్కుంట పోతే పేజీలు సాలవు.
కాబట్టి, బఱువు తగ్గాల.
ఇప్పుడు తర్వాతి ప్రశ్న, ఎంత తగ్గాలా?
దానికీ ఓ లెక్క ఉంది. అదేంటంటే బాడీ మాస్ ఇండెక్స్.
What is the body mass index (BMI)?

Body mass index assesses your body weight relative to height. It's a useful, indirect measure of body composition because it correlates highly with body fat in most people. Weight in kilograms is divided by height in meters squared (kg/m2). In studies by the National Center for Health Statistics,

  • BMI values less than 18.5 are considered underweight.
  • BMI values from 18.5 to 24.9 are healthy.
  • Overweight is defined as a body mass index of 25.0 to less than 30.0. A BMI of about 25 kg/m2 corresponds to about 10 percent over ideal body weight. People with BMIs in this range have an increased risk of heart and blood vessel disease.
  • Obesity is defined as a BMI of 30.0 or greater (based on NIH guidelines) — about 30 pounds or more overweight. People with BMIs of 30 or more are at higher risk of cardiovascular disease.
  • Extreme obesity is defined as a BMI of 40 or greater.
నీ బాడీ మాస్ ఇన్డెక్స్ ఎలా తెలుసుకోవటం? గూగుల్ ఉందిగా. కొట్టటమే. బి.యం.ఐ కాల్క్యులేటర్ అని కొట్టటమే. ఉదాహరణకి ఈ క్రింది లింకు.
http://www.bmi-calculator.net/
మీ బి.యం.ఐ తెలుసుకోవాలంటే కావాల్సింది, మీ ఎత్తు, మరియూ బఱువు పై కాల్క్యులేటరుకిస్తే వెంటనే మీ రెంజ్ ఏంటో చెప్తుంది.
నా ఎత్తు, ప్రస్తుత బఱువు ప్రకారం నేను ఓవర్ వెయిట్. అధికబఱువు కిందకి వస్చా.

ఇక హిప్పుడు ముఖ్యమైన/అసలు ప్రశ్న, బఱువు తగ్గటం ఎలా?
అన్నగారు ఇలా చెప్పారు *You are what you eat అని ఆంగ్లోక్తి. అందులో కొంచెం కూడా అతిశయోక్తి లేదు.* http://kottapali.blogspot.com/2010/10/26.html
నిజమే. నీ తిండినిబట్టే నువ్వు. కబట్టి, బఱువుతగ్గాలంటే నీలోకి నువ్వు చూస్కోవాలి. నువ్వేంచేస్తున్నావో చూస్కోవాలి. నీ శరీరానికి ఏం కావాలో ఏం అఖర్లేదో చూస్కోవాలి.
వెనువెంటనే మొదలుపెట్టగలిగేది - నీళ్ళు తాగటం. ఎంత నీళ్ళు తాగితే అంత మంచిది. వెనువెంటనే ఆపగలిగేది ఉత్తిపుణ్యానికి కాఫీలో టీలు కుమ్మటం. అతిగా నూనె పదార్థాలు అంటే రోజూ ఓ గంపెడు బజ్జీలు పునుగులు, మా౨క్ లాంటివి కుమ్మటం.
బఱువుతగ్గాలంటే ముఖ్యంగా కావాల్సింది - ఓ గోల్. సెట్ యువర్ గోల్. ఇంత తగ్గాలి అనిపెట్టుకోవాలి. ఐతే, రియలిస్టిక్ గోల్ ఐతే రీచ్ కావచ్చుకానీ అన్ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుని నడుములు ఇరగ్గొట్టుకుని జీవితాన్ని నాశనం చేకోకూడదు.
నీ గోల్ పది పౌండ్లు తగ్గుట అనుకుందాం. ఎన్ని రోజుల్లో అనేది ప్లాన్ ని బట్టి నిర్ణయించుకోవాలి. ఇది ఎలా? ప్లాన్ అంటే ఏంటి ఇక్కడ?
బఱువు తగ్గాలంటే డయట్ మార్చడమో, వ్యాయామం చేయడమో ఏదోకటి చేయాలిగా? ఏవీ చేయకుండా ఉత్తిగా పదిహేను రోజుల్లో పదిహేను పౌండ్లు తగ్గుతా అనుకునేసి ముసుగుతన్ని బబ్బుంటే ఎలా తగ్గుతా? ప్లాన్ ఎలా చేస్కోవాలీ అంటే -
౧. తినే కేలరీస్‌ని ఎంతో చూస్కోవాలి.
౨. వాటిని ఖర్చుపెట్టే విధానం చూస్కోవాలి.

What It Takes to Lose a Pound

Diet and Weight Loss Tutorial

Unit of Weight Approximate Calories Approximate Kilojoules
Pound 3,500 14,644
Kilogram 7,716 32,284

A pound of body fat equates to approximately 3500 calories. So if you have a calorie deficit of 500 calories (meaning that you burn 500 calories more than you eat each day) you would lose approximately one pound per week:

500 x 7 = 3,500

రోజుకి 500 కేలరీస్ ఖర్చుపెడితే వారానికి 3,500 ఖర్చుచేసినట్టైతుంది, అంటే ఒక పౌండు తగ్గినట్టు. అదీ కథ. రోజుకి 500అనే ఓ మార్కుని సెట్ చేస్కుంటే, ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఆలోచించొచ్చు.
ఇలా చేయచ్చు
౧. నడక
౨. సైకిల్ తొక్కుట
౩. పరిగెత్తుట
౪. ఎరోబిక్స్ చేయుట
౫. ఈత కొట్టుట
౬. బఱువులు ఎత్తుట

బఱువు తగ్గాలంటే మీ దినచర్యలో మార్పులు తెచ్చుకోవాలి. ఏదోకపనిలో పడేలా చేస్కోవాలి. యాక్టివిటీ పెంచుకోవాలి. ఎక్కువ కేలరీలు ఖర్చైయ్యేలా చూస్కోవాలి. ఎన్ని కేలరీలు తీస్కుంటున్నారూ ఎంత ఖర్చు పెడుతున్నారూ అనేది గమనించాలి.

బఱువు తగ్గటానికి నడక - రోజుకి ౩౦-౬౦ నిమిషాల నడక క్రొవ్వుని కరిగిస్తుంది, మెటబాలిజాన్ని పెంచే కండరాలను బిల్డ్ చేస్తుంది. రోజుకి గంట నడిస్తే హృద్యోగం, బ్రెస్ట్ కాన్సర్, కాలన్ కాన్సర్, మధుమేహం, పక్షవాతం లాంటి వాటి బారిన పడే రిస్కుని తగ్గిస్తుంది.

Calories burned per mile by walking
Speed/Pounds 100 lb 120 lb 140 lb 160 lb 180 lb 200 lb 220 lb 250 lb 275 lb 300 lb
2.0mph 57 68 80 91 102 114 125 142 156 170
2.5mph 55 65 76 87 98 109 120 136 150 164
3.0mph 53 64 74 85 95 106 117 133 146 159
3.5mph 52 62 73 83 94 104 114 130 143 156
4.0mph 57 68 80 91 102 114 125 142 156 170
4.5mph 64 76 89 102 115 127 140 159 175 191
5.0mph 73 87 102 116 131 145 160 182 200 218

కార్డియో చేయటం మంచిది. దాని గురించి మరోటపాలో...

చివరాకరి చెప్పేదేందయ్యా అంటే
బఱువు తగ్గాలంటే - వ్యాయామం అంటే నడక ఇత్యాదివి చెయ్యాలి. ఏం తింటున్నామో చూస్కుని తినాలి. హోల్ ఫుడ్స్ తినాలి. చెత్త మానేయాలి. లో కాలరీస్, లో కార్బొహైడ్రేట్స్ అనేది మంత్రం. అమ్తే కాక హై ప్రొటీన్ కూడా ముఖ్యమే.
ఒకానొక సీజన్లో నేను దదాపు పదహారు పౌండ్లు తగ్గాను.
ఎలా?
ప్రతీరోజూ గంట నడిచాను. తెల్ల బియ్యం మానేసాను. మధ్యాహ్నం భోజనం రొట్టెలు, రాత్రి భోజనం రాగి జావలో రెండు గుప్పెళ్ళు దంపుడు బియ్యం. ఇలా నాల్గు నెలలు చేసాను. పదహారు పౌండ్లు తగ్గాను.
ఇప్పుడు కొంత పెరిగాను మళ్ళీ. వాతావరణం మారుతోందిగా, మళ్ళా నడక మొదలెట్టబోటున్నాను.

Apr 21, 2011

ఎన్ని కత్తులు ఎన్ని మెడలు

పాఠశాలలో టీచర్‌ హత్య
విశాఖపట్నం జిల్లాలో దారుణం
విద్యార్థుల ఎదుటే ప్రేమోన్మాది ఘాతుకం
అరకులోయ - న్యూస్‌టుడే
విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలం ఆర్‌.డుంబ్రిగుడ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లొక్కోయి సుందరమ్మ(27) బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. మధ్యాహ్నం ఆమె పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలసి భోజనం చేస్తుండగా కొర్రా గ్రామానికి చెందిన తాంగుల సుబ్బారావు(29) కత్తితో ఆమె మెడ కోసి హత్య చేశాడు. సుందరమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.


ఎన్ని కత్తులు
ఎన్ని మెడలు
ఎన్ని ప్రభుత్వాలు
ఎన్ని కోర్టులు
ఎన్ని చట్టాలు
ఎన్ని అడ్వకేటు గుమ్మాలు
ఎన్ని పోలీసు ఠాణాలు
ఎన్ని పోలీసు టోపీలు
రాలిపోతున్న మగువ ప్రాణాలు

ఆపలేవా ఈ ఘోరకలులు

యాపిల్ వివాదం

యాపిల్ని తెలుగులో ఏవంటారూ?
ఇదో పెద్ద ప్రశ్న ఏమాత్రమూ కాదు. యాపిల్ని తెలుగులో యాప్లీసు కాయా అంటారు అనుకోవచ్చు.
బ్రౌను నిఘంటువులో ఇలా ఉంది -
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=apple&table=brown
అనాస (p. 0051) [ anāsa ] anāsa. [Tel.] n. Ananas sativa or the Pine Apple, Or, Bromelia saliva.
ఉమ్మెత్త (p. 0167) [ ummetta ] or ఉమ్మెత ummetta. [Tel.] n. The thorn apple (Datura) a Indian night shade; దుత్తూరము.
కపిత్థము (p. 0244) [ kapitthamu ] kapiththamu. [Skt.] n. The wood apple. Fcronia elephantum (Roxb.) వెలగవండు.
An apple రేగుపండు.
చీకివెలగ (p. 0423) [ cīkivelaga ] chīki-velaga. [Tel.] n. The thorny wood apple tree. వెలగ.
జంబునేరేడు the roseapple
పాపర (p. 0745) [ pāpara ] pāpara. [Tel.] n. The bitter apple, or colocynth (coloquintida), విశాలా, ఇంద్ర వారుణి.
The pineapple, అనాసచెట్టు
రామఫలము or రామాఫలము rāma-phalamu. n. The great red custard apple called Bullock's Heart or Sweet sop, Anona reticulata
కర్పూరవంకాయ the plant called a love apple.
http://dsal.uchicago.edu/cgi-bin/philologic/search3advanced?dbname=gwynn&query=apple&matchtype=exact&display=utf8
gwynn వారి నిఘంటువు ప్రకారం -
వెలక్కాయ అంటే వుడ్ యాపిల్, సీతాఫలము అంటే కస్టర్డ్ యాపిల్ అని ఉంది
ఇక బూదరాజు వారి నిఘంటువు ప్రకారము -
వుడ్ యాపిల్ = వెలక్కాయ
కస్టర్డ్ యాపిల్ = సీతాఫలము
యాపిల్ అంటే మాత్రం దొరకల్యా
లిటిల్ మాష్టర్స్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరి (వెంకటాచార్యులు) వారి ప్రకారం -
apple :(n)  ఆపిల్ పండు అన్నారు, అంతటితో ఆక్కుండా,
ఫ్రూట్స్ అనే ఓ విభాగంలో
Apple: సీమరేగుపండు అన్నారు
నాకు తెలిసినంతలో సీమరేగ్గాయ అంటే పియర్. పియర్ అనేకానేక సార్లు తిన్నాను. దేశంలో సీమరేగ్గాయ అనేకానేక సార్లు తిన్నాను. రోజూ యాపిల్ తింటుంటాను. నా ఎరుకలో యాపిల్ సీమరేగ్గాయ ఒకటి కాదని నా వాదన.

యాపిల్ని కాశ్మీరు ఫలం అంటారని కొందరు సూచించారు.
పియర్ అంటే బేరీపండు అని డా। కౌటిల్య బల్లగుద్దిమరీ చెప్పారు.
నేనైతే బేరీపండు అనే పేరుని మొట్టమొదటిసారి వింటున్నాను.

సీమరేగ్గాయే యాపిలా? బేరీపండు పియరా? పియరే సీమరేగ్గాయా? నా తలకాయా? ఎలా తెలిసేదీ?
పియర్ -
pear-d%27anjou.jpg


యాపిల్ -
apple.jpg

Apr 15, 2011

మా నాయన జిమ్ముకెళ్ళినాడహో

సూరిగాడి బళ్ళో ఓ కాయితకం ఇచ్చి ఓ బొమ్మేసి, దాన్ని గూర్చి ఓ రెండు మాటలు సొంతగా ఊహంచి రాయమంటారట.
ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది నాకు. అలా ఎలా చేయగలరూ అని. స్పెల్లింగులు ఏవీ చెప్పరట. పిల్లకాయలే ఊహించుకుని రాయాలట.
నిన్న సూరిగాడు ఇలా తెచ్చాడు.
My dad went to the jim. My dad ran and punched the bean bag.

నా మనసులో ఎన్నో కోఱికలు

నా మనసులో ఎన్నో కోఱికలు
మరెన్నో తపనలు
ఏవేవో వ్రాయాలని కలలు
ఎంతో వ్రాయాలని ఆశలు
కానీ కలం పెగలటంలేదు
కానీ కలం కదలటంలేదు
మాటలు చాలటంలేదు
పదాలు దొర్లటంలేదు
నాకలలు పండించుకోవాలంటే
ఎన్నో గ్రంధాలు చదవాలి
నా కలంలో కాలం ఇంకు నింపాలి
ఆ కలాన్ని కాలంతో నృత్యం చేయించాలి
ఆలోచనావేశాలను కాలచక్రంలో
వెనక్కి పయనింజేయాలి
ఆశలను చారిత్రాత్మక ఐతిహాసాలపై
విహరించజేయాలి
కానీ అందుకు సమయం లేదు
ఆ సౌకర్యమూ లేదు.
అక్కడున్నప్పుడు ఈ యావలేదు
ఇటొచ్చాక ఆ సంపదలేదు

Apr 2, 2011

33 రన్లు 34 బంతుల్లో

రండి రండి రండి






కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని
బాట వేసిన గంభీర్
సహకరించిన కోహ్లి
స్పూర్తినిచ్చిన సచిన్
వెన్నెముక యువి
వెరసి కప్పు

కాయ్ రాజా కాయ్ - లైవ్ బ్లాగింగ్

కాయ్ రాజా కాయ్
రండి రండి బెట్టింగ్ బంగార్రాజులందరూ రండి

ఎవురు గెలుస్తారూ?
274 సేజ్ సేయగల్రా మనాళ్ళూ?