1. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని తాము పని చేస్తున్న పాఠశాలలోనే చదివిస్తున్నారు?
2. ఎందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?
3. ఎందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?
4. ఎందరు ప్రభుత్వ పాలకులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తున్నారూ?
5. మీలో ఎందమంది మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశలకి పంపిస్తున్నారూ?
6. మీలో ఎందరు పపిద్దాం అనుకుంటున్నారూ?
అనుబంధ ప్రశ్నలు:
ప్రభుత్వ పాఠశాలకి పంపిద్దాం అనుకుంటే - ఎందుకు అనుకునే దగ్గరే ఆగిపోయారూ?
పంపించమూ అంటే - పంపించకపోటానికి ప్రతిబంధకాలు ఏవిటీ?
ఇవే ప్రశ్నలు నన్ను అడిగితే - నా సమాధానాలు/ఆలోచనలు -
నేను జిల్లాపరిషత్ ప్రధమికోన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య అయ్యాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశలలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేస్కున్నాను.
మా నాన్న పని చేసిన స్కూల్లో చదువుకునే అవకాశం కలిగింది. లెక్కలకు ఆంగ్లానికి మా నాన్నే వచ్చేవారు.
అయితే ఇప్పుడు, ఒకవేళ నేను భారతదేశంలో ఉండి ఉంటే మా పిల్లల్ని జిల్లా పరిషత్ పాఠశాలకి పంపించుండేవాడినా అని అడిగితే పంపించుండేవాడ్ని కాదేమో.
ఎందుకుటా అంటే మాధ్యమాం అని చెప్పక తప్పదు.
నావరకు నాకు కేవలం మాధ్యమం అనేదే ప్రతిబంధకం.
ప్రభుత్వపాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు. క్వాలిఫైడ్ విద్యావిధానం ఉంటుంది. వ్యక్తిత్వ వికాశం ఉంటుంది. ఆట స్థలం ఉంటుంది. డ్రిల్ మాష్టారు ఉంటారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో కుక్కి కూర్చోబెడతారు. వ్యక్తిత్వ వికాశం ఉండదు. మార్కులే గీటురాళ్ళు. ఆట స్థలం మృగ్యం. ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ అవునా కాదా చెప్పలేం. విద్యావిధానం ఎవరు నిర్ణయిస్తారో తెలియదు.
బాడ్ యాపిల్స్ ఎక్కడైనా ఉంటాయి. వాటిని పక్కన పెడితే, నాణ్యమైన విద్య అనేది ప్రభుత్వ పాఠశలల్లోనే అని నా ప్రగాఢ విశ్వాసం. ఇది నేను ఒక జిల్లాపరిషత్ పాఠశాలలో పని చేసిన ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా చెబుతున్నా.
ఇప్పట్లోకి వస్తే - నా పిల్లల్ని తెలుగు మీడియంకి పంపలేను. ప్రభుత్వ పాఠశలలో ఆంగ్ల మీడియం ఉంటే పంపించటానికి నాకేమాత్రం సంశయం లేదు.
అమెరికా లాంటి దేశాలల్లో ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్య ప్రైవేటు పాఠశాలకి వెళ్ళే వారి సంఖ్యతో పోలిస్తే పదిరెట్లకన్న ఎక్కువ.
అమెరికాలో 46 మిలియన్ పిల్లలు పబ్లిక్ విద్యావిధానంలో ఉండగా 4 మిలియన్ విద్యార్థులు మాత్రమే ప్రైవేటు విద్యావిధానంలో ఉన్నారు
భారత దేశంలో ప్రైవేటు పాఠశాలలకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నదని నా అభిప్రాయం.
మౌళిక ప్రశ్న ఈ విషయానికి సంబంధించి -
ప్రభుత్వ పాఠశలలని పునరుద్ధరించాలంటే ప్రభుతం ఏం చేయాలీ?
ప్రజలు ఏంచేయాలీ?
ప్రభుత్వం పాఠశాల వ్యవస్థని పునరుద్ధరించాలి. గట్టి చేయాలి. జెడ్.పి.టి.సి లాంటి రాజకీయ వ్యవస్థని పాఠశల నుంచి వేరు చేయాలి. ఉపాధ్యాయులని ప్రేరేపించాలి. జవజీవాల్ని నింపాలి.
ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం మత్రమే అనే నిర్ణయం సరైంది కాకపోవచ్చు కానీ ఆంగ్ల మాధ్యమం అనేది తప్పుకాదు.
వ్యవస్థని ప్రక్షాళన చేయకుండా వ్యవస్థని పునర్మించకుండా గుడ్డిగా ఆంగ్లమాధ్యమం అనటం సరైంది కాదని న అభిప్రాయం.
ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో కూడా కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని నా అభిప్రాయం





